< 1 Kings 5 >

1 When Hiram king of Tyre heard that Solomon had been anointed king to succeed his father, he sent ambassadors to Solomon because Hiram had always been David's friend.
తరవాత, తన తండ్రికి బదులుగా సొలొమోనుకు పట్టాభిషేకం జరిగిందని తూరు రాజు హీరాము విని తన సేవకులను సొలొమోను దగ్గరకి పంపాడు. ఎందుకంటే హీరాము దావీదుకు మంచి స్నేహితుడు.
2 So Solomon sent this message back to Hiram,
అప్పుడు సొలొమోను హీరాముకు ఈ సందేశం పంపించాడు.
3 “As you know, my father David was not able to build a Temple to honor the Lord his God because of the wars fought against him from every direction, until the Lord had conquered his enemies.
“యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదాల కింద అణచివేసే వరకూ అన్ని వైపులా అతనికి యుధ్ధాలు ఉన్నాయి.
4 But now the Lord my God has given me peace all around—no enemies, no bad things happening.
తన దేవుడు యెహోవా నామ ఘనతకు అతడు ఒక మందిరం కట్టించడానికి వీలు లేకపోయింది. ఈ సంగతి మీకు తెలుసు. ఇప్పుడైతే శత్రువులెవరూ లేకుండా, ఏ అపాయమూ కలగకుండా నా దేవుడు యెహోవా నలుదిక్కులా శాంతి నెలకొల్పాడు.
5 So I plan to build a Temple to honor the Lord my God, as the Lord told my father David. He said to him, ‘Your son whom I will place on your throne to succeed you will build the Temple to honor me.’
కాబట్టి ‘నీ సింహాసనం మీద నీకు బదులుగా నేను నిలిపే నీ కొడుకు నా నామ ఘనత కోసం ఒక మందిరం కట్టిస్తాడు’ అని యెహోవా నా తండ్రి దావీదుకు మాట ఇచ్చిన విధంగా నేను నా దేవుడు యెహోవా నామ ఘనత కోసం ఒక మందిరం కట్టించడానికి నిర్ణయించాను.
6 So please order some cedars of Lebanon to be cut down for me. My workers will assist your workers, and I will pay your workers at the rate that you decide, for you know that we don't have anyone who knows how to cut timber like the Sidonians.”
లెబానోనులో నా కోసం దేవదారు మానులను నరికించడానికి అనుమతి ఇవ్వండి. నా సేవకులు మీ సేవకులతో కలిసి పని చేస్తారు. ఎందుకంటే మానులు నరకడంలో సీదోనీయులకు సాటి మాలో ఎవరూ లేరు అని మీకు తెలుసు గదా.
7 When Hiram heard Solomon's message, he was very happy and said, “Praise the Lord today, for he has given David a wise son to lead this great nation!”
మీరు నిర్ణయించిన విధంగా నేను మీ సేవకులకు జీతం ఇస్తాను” అన్నాడు. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని చాలా సంతోషపడి “ఇంత గొప్ప జాతిగా విస్తరించిన ప్రజానీకాన్ని పాలించడానికి జ్ఞానవంతుడైన కొడుకుని దావీదుకు దయచేసిన యెహోవాకు ఈ రోజున స్తుతి కలుగు గాక” అన్నాడు.
8 Hiram sent this reply to Solomon: “Thank you for your message. As for the cedar and cypress timber, I will do everything you want.
అతడు సొలొమోనుకు జవాబు పంపుతూ “నీవు నాకు పంపిన సందేశాన్ని నేను అంగీకరించాను. దేవదారు, సరళ మానులను గురించి నీవు కోరినట్టే చేయిస్తాను.
9 My workers will bring the logs down from Lebanon to the sea, and I will have them floated in rafts by sea to wherever you decide. I will have the rafts broken apart there, and you can take the logs away. In return I would like you to provide food for my household.”
నా సేవకులు వాటిని లెబానోను నుండి సముద్రం దగ్గరకి తెస్తారు. అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు చెప్పిన చోటికి సముద్రం మీద చేరేలా చేసి, అక్కడ వాటిని నీకు అప్పగించే ఏర్పాటు నేను చేస్తాను. నీవు వాటిని తీసుకోవచ్చు. ఇందుకు బదులుగా నీవు నా సేవకుల పోషణ కోసం ఆహారం పంపించు” అన్నాడు.
10 So Hiram provided Solomon with as much cedar and cypress timber that he wanted,
౧౦హీరాము సొలొమోను కోరినన్ని దేవదారు, సరళ మానులను పంపించాడు.
11 Solomon gave Hiram 20,000 cors of wheat for food and 20,000 cors of olive oil for his household. Solomon provided this to Hiram every year.
౧౧సొలొమోను హీరాముకూ అతని పరివారం పోషణకు 2,00,000 తూముల గోదుమలు, 4, 16, 350 లీటర్ల స్వచ్ఛమైన నూనె పంపించాడు. ఈ విధంగా సొలొమోను ప్రతి సంవత్సరం హీరాముకు ఇస్తూ వచ్చాడు.
12 The Lord gave Solomon wisdom just as he had promised him. Hiram and Solomon had a good relationship and they made a peace treaty with each other.
౧౨యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానం ప్రకారం అతనికి జ్ఞానం ప్రసాదించాడు. హీరాము, సొలొమోను సంధి చేసుకున్నారు, వారిద్దరి మధ్య శాంతి నెలకొంది.
13 King Solomon drafted a labor force of 30,000 from all of Israel.
౧౩సొలొమోను రాజు ఇశ్రాయేలీయులందరి చేతా బలవంతంగా వెట్టి పని చేయించాడు. వారిలో 30,000 మంది వెట్టి చాకిరీ చేసే వారయ్యారు.
14 He sent them in shifts of 10,000 each month to Lebanon, so that they were one month in Lebanon and two months at home, Adoniram was in charge of the labor force.
౧౪అతడు వంతుల ప్రకారం వీరిని నెలకు 10,000 మందిని లెబానోనుకు పంపించాడు. వారు ఒక నెల లెబానోనులో, రెండు నెలలు ఇంటి దగ్గరా ఉండేవారు. ఆ వెట్టివారి మీద అదోనీరాము అధికారిగా ఉన్నాడు.
15 Solomon had 70,000 porters and 80,000 stonecutters in the hill country,
౧౫అంతేగాక, సొలొమోనుకి బరువులు మోసేవారు 70,000 మందీ పర్వతాల్లో మానులు నరికే వారు 80,000 మందీ ఉన్నారు.
16 as well as 3,300 foremen he placed in charge of the workers.
౧౬వీరంతా కాక సొలొమోను పనివారిపై 3, 300 మంది అధికారులు అజమాయిషీ చేస్తుండేవారు.
17 Following the king's orders, they quarried large blocks of stone that were expensive to produce, and laid these dressed stones as the foundation for the Temple.
౧౭రాజు ఆజ్ఞ ప్రకారం వారు మందిర పునాదిని చెక్కిన రాళ్లతో వేయడానికి గొప్పవి, చాలా విలువైనవి అయిన రాళ్ళు గనుల్లో నుండి తవ్వి తెప్పించారు.
18 So Solomon's and Hiram's builders, together with the Gebalites, cut the stone. They prepared the timber and stone to build the Temple.
౧౮ఈ విధంగా సొలొమోను పంపిన శిల్పకారులు, గిబ్లీయులు, హీరాము శిల్పకారులు మానులు నరికి రాళ్లను మలిచి మందిరం కట్టడానికి వాటిని సిద్ధపరిచారు.

< 1 Kings 5 >