< Acts 14 >
1 And it came to pass in Iconium that they entered together into the synagogue of the Jews, and so spake that a great multitude of both Jews and Greeks believed.
౧ఈకొనియలో ఏం జరిగిందంటే, పౌలు, బర్నబాలు యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి, ఎంత బాగా మాట్లాడారంటే చాలామంది యూదులూ గ్రీకులూ విశ్వసించారు.
2 But the Jews who did not believe stirred up the minds of [those of] the nations and made [them] evil-affected against the brethren.
౨అయితే అవిధేయులైన యూదులు యూదేతరులను రెచ్చగొట్టి వారి మనసుల్లో సోదరుల మీద ద్వేషం పుట్టించారు.
3 They stayed therefore a good while, speaking boldly, [confiding] in the Lord, who gave witness to the word of his grace, giving signs and wonders to be done by their hands.
౩పౌలు, బర్నబాలు ప్రభువు శక్తితో ధైర్యంగా మాటలాడుతూ అక్కడ చాలా కాలం గడిపారు. ప్రభువు వారిద్వారా సూచకక్రియలనూ మహత్కార్యాలనూ చేయించి తన కృపా సందేశాన్ని రుజువు చేశాడు.
4 And the multitude of the city was divided, and some were with the Jews and some with the apostles.
౪ఆ పట్టణంలోని జనసమూహంలో భేదాలు వచ్చి కొందరు యూదుల పక్షం, మరి కొందరు అపొస్తలుల పక్షం చేరారు.
5 And when an assault was making, both of [those of] the nations and [the] Jews with their rulers, to use [them] ill and stone them,
౫యూదేతరులూ యూదులూ తమ అధికారులతో కలిసి పౌలు బర్నబాలను బాధించి రాళ్ళు రువ్వి చంపాలని అనుకున్నారు.
6 they, being aware of it, fled to the cities of Lycaonia, Lystra and Derbe, and the surrounding country,
౬వారు ఆ సంగతి తెలుసుకుని లుకయోనియ ప్రాంతంలోని లుస్త్ర, దెర్బే పట్టణాలకూ చుట్టుపక్కల ప్రదేశానికీ పారిపోయి అక్కడ సువార్త ప్రకటించారు.
7 and there they were announcing the glad tidings.
౭లుస్త్రలో కాళ్ళు చచ్చుబడిన ఒకడున్నాడు.
8 And a certain man in Lystra, impotent in his feet, sat, [being] lame from his mother's womb, who had never walked.
౮అతడు పుట్టు కుంటివాడు, ఎన్నడూ నడవలేదు.
9 This [man] heard Paul speaking, who, fixing his eyes on him, and seeing that he had faith to be healed,
౯అతడు పౌలు మాటలాడుతుంటే విన్నాడు. పౌలు సూటిగా అతని వైపు చూసి, బాగుపడడానికి అతనికి విశ్వాసమున్నదని గమనించి,
10 said with a loud voice, Rise up straight upon thy feet: and he sprang up and walked.
౧౦“లేచి నిలబడు” అని బిగ్గరగా అనగానే అతడు ఒక్క ఉదుటున లేచి నడవసాగాడు.
11 But the crowds, who saw what Paul had done, lifted up their voices in Lycaonian, saying, The gods, having made themselves like men, are come down to us.
౧౧ప్రజలు పౌలు చేసిన దాన్ని చూసి, లుకయోనియ భాషలో, “దేవుళ్ళు మానవ రూపంలో మన దగ్గరికి వచ్చారు” అని కేకలు వేసి,
12 And they called Barnabas Jupiter, and Paul Mercury, because he took the lead in speaking.
౧౨బర్నబాకు జూస్ అనీ, పౌలు ముఖ్య ప్రసంగి కాబట్టి అతనికి హెర్మే అనీ పేర్లు పెట్టారు.
13 And the priest of Jupiter who was before the city, having brought bulls and garlands to the gates, would have done sacrifice along with the crowds.
౧౩పట్టణానికి ఎదురుగా ఉన్న జూస్ దేవుడి పూజారి, ఎడ్లనూ పూల దండలనూ పట్టణ ముఖద్వారం దగ్గరకి తీసుకుని వచ్చి సమూహంతో కలిసి, వారికి బలి అర్పించాలని చూశాడు.
14 But the apostles Barnabas and Paul, having heard [it], rent their garments, and rushed out to the crowd, crying
౧౪అపొస్తలులు బర్నబా, పౌలు ఈ సంగతి విని, తమ బట్టలు చింపుకుని సమూహంలోకి చొరబడి
15 and saying, Men, why do ye these things? We also are men of like passions with you, preaching to you to turn from these vanities to the living God, who made the heaven, and the earth, and the sea, and all things in them;
౧౫“అయ్యలారా, మీరెందుకిలా చేస్తున్నారు? మేము కూడా మీలాంటి మానవమాత్రులమే. మీరు ఇలాంటి పనికిమాలిన వాటిని విడిచిపెట్టి, ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలో ఉండే సమస్తాన్నీ సృష్టించిన జీవంగల దేవుని వైపు తిరగాలని మీకు సువార్త ప్రకటిస్తున్నాం.
16 who in the past generations suffered all the nations to go in their own ways,
౧౬ఆయన గతించిన కాలాల్లో మనుషులందరినీ తమ సొంత మార్గాల్లో నడవనిచ్చాడు.
17 though indeed he did not leave himself without witness, doing good, and giving to you from heaven rain and fruitful seasons, filling your hearts with food and gladness.
౧౭అయినా ఆయన మేలు చేస్తూ ఆకాశం నుండి మీకు వర్షాన్నీ, ఫలవంతమైన రుతువులనూ దయచేస్తూ, ఆహారం అనుగ్రహిస్తూ, ఉల్లాసంతో మీ హృదయాలను నింపుతూ, తన గురించిన సాక్ష్యం నిలిపి ఉంచాడు.”
18 And saying these things, they with difficulty kept the crowds from sacrificing to them.
౧౮వారు ఆ విధంగా ఎంతగా చెప్పినా సరే, తమకు బలి అర్పించకుండా ఆ గుంపులను ఆపడం చాలా కష్టమయింది.
19 But there came Jews from Antioch and Iconium, and having persuaded the crowds and stoned Paul, drew him out of the city, supposing him to have died.
౧౯అంతియొకయ, ఈకొనియ నుండి యూదులు వచ్చి జనాన్ని తమ వైపు తిప్పుకుని, పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయాడనుకుని పట్టణం బయటికి అతనిని ఈడ్చివేశారు.
20 But while the disciples encircled him, he rose up and entered into the city. And on the morrow he went away with Barnabas to Derbe.
౨౦అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి, మరుసటి రోజు బర్నబాతో కూడ దెర్బేకు వెళ్ళిపోయాడు.
21 And having announced the glad tidings to that city, and having made many disciples, they returned to Lystra, and Iconium, and Antioch,
౨౧వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి చాలా మందిని శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకూ ఈకొనియకూ అంతియొకయకూ తిరిగి వచ్చారు.
22 establishing the souls of the disciples, exhorting them to abide in the faith, and that through many tribulations we must enter into the kingdom of God.
౨౨శిష్యుల మనసులను దృఢపరచి, విశ్వాసంలో నిలకడగా ఉండాలనీ, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అనేక హింసలు పొందాలనీ వారిని ప్రోత్సహించారు.
23 And having chosen them elders in each assembly, having prayed with fastings, they committed them to the Lord, on whom they had believed.
౨౩ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి, వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించారు.
24 And having passed through Pisidia they came to Pamphylia,
౨౪తరువాత పిసిదియ ప్రాంతమంతటా సంచరించి పంఫూలియ వచ్చారు.
25 and having spoken the word in Perga, they came down to Attalia;
౨౫వారు పెర్గేలో వాక్కు బోధించి, అత్తాలియ వెళ్ళారు.
26 and thence they sailed away to Antioch, whence they had been committed to the grace of God for the work which they had fulfilled.
౨౬అక్కడ నుండి ఓడ ఎక్కి, తాము నెరవేర్చిన పని నిమిత్తం మొదట దేవుని కృపకు అప్పగించుకుని, బయలుదేరిన అంతియొకయకు తిరిగి వచ్చారు.
27 And having arrived, and having brought together the assembly, they related to them all that God had done with them, and that he had opened a door of faith to the nations.
౨౭వారు వచ్చి సంఘాన్ని సమకూర్చి, దేవుడు తమకు తోడై చేసిన పనులన్నిటినీ, యూదేతరులు విశ్వసించడానికి ఆయన ద్వారం తెరచిన సంగతీ వివరించారు.
28 And they stayed no little time with the disciples.
౨౮ఆ తరువాత వారు శిష్యుల దగ్గర చాలాకాలం గడిపారు.