< 2 Samuel 13 >

1 And it came to pass after this, that Absalom the son of David having a beautiful sister, whose name was Tamar, Amnon the son of David loved her.
దావీదు కొడుకు, అబ్షాలోముకు తామారు అనే ఒక అందమైన సోదరి ఉంది. దావీదు కొడుకు, అమ్నోను ఆమెపై కోరిక పెంచుకున్నాడు.
2 And Amnon was so vexed, that he fell sick for his sister Tamar; for she was a virgin; and it seemed difficult for Amnon to do the least thing to her.
తామారు అవివాహిత కావడంవల్ల ఆమెను ఏమీ చేయలేని స్థితిలో ఉన్న అమ్నోను దిగులు పెంచుకుని తామారును బట్టి చిక్కిపోసాగాడు.
3 And Amnon had a friend whose name was Jonadab, the son of Shimeah David's brother; and Jonadab was a very shrewd man.
అమ్నోనుకు ఒక స్నేహితుడు ఉన్నాడు. అతడు దావీదు సోదరుడు షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు ఎంతో కుటిలమైన బుద్ది గలవాడు. అతడు అమ్నోనుతో,
4 And he said to him, Why dost thou, the king's son, get thinner from morning to morning? Wilt thou not tell me? And Amnon said to him, I love Tamar, my brother Absalom's sister.
“రాజ కుమారుడవైన నువ్వు రోజురోజుకీ చిక్కిపోడానికి కారణం ఏమిటి? విషయం ఏమిటో నాకు చెప్పవా?” అని అడిగాడు. అమ్నోను “నా సోదరుడైన అబ్షాలోము సోదరి తామారుపై కోరిక కలిగి ఉన్నాను” అని చెప్పాడు.
5 And Jonadab said to him, Lay thee down on thy bed and feign thyself sick; and when thy father comes to see thee, say to him, I pray thee, let my sister Tamar come, and give me food, and dress the food in my sight, that I may see it, and eat it from her hand.
అప్పుడు యెహోనాదాబు­ “నీకు జబ్బు చేసినట్టు నటించి నీ మంచం మీద పండుకుని ఉండు. నీ తండ్రి నిన్ను చూడడానికి వచ్చినప్పుడు నువ్వు, ‘నా సోదరి తామారు చేతి వంట నేను తినేలా ఆమె వచ్చి నేను చూస్తుండగా వండి నాకు పెట్టేలా ఆమెతో చెప్పు’ అని రాజును అడుగు” అని సలహా ఇచ్చాడు. అమ్నోను జబ్బు చేసినట్టు నటిస్తూ పడక మీద పండుకున్నాడు.
6 So Amnon lay down and feigned himself sick; and the king came to see him, and Amnon said to the king, I pray thee, let Tamar my sister come, and make a couple of cakes in my sight, that I may eat from her hand.
అమ్నోను జబ్బు పడ్డాడని రాజుకు తెలిసి, అతణ్ణి పరామర్శించేందుకు వచ్చాడు. అప్పుడు అమ్నోను “నా సోదరి తామారు చేతి వంట నేను తినేలా ఆమె వచ్చి నేను చూస్తుండగా నా కోసం రెండు రొట్టెలు చేయమని చెప్పు” అని రాజును అడిగాడు.
7 And David sent home to Tamar, saying, Go, I pray thee, to thy brother Amnon's house, and dress him food.
దావీదు “నీ సోదరుడు అమ్నోను ఇంటికి వెళ్లి అతని కోసం భోజనం తయారుచెయ్యి” అని తామారు ఇంటికి కబురు పంపాడు.
8 And Tamar went to her brother Amnon's house; and he had lain down. And she took flour and kneaded it, and made cakes in his sight, and baked the cakes.
తామారు, అమ్నోను ఇంటికి వెళ్ళింది.
9 And she took the pan, and poured them out before him; but he refused to eat. And Amnon said, Put every man out from me. And they went out every man from him.
అతడు పండుకుని ఉన్నప్పుడు ఆమె పిండి తీసుకు కలిపి అతని ముందు రొట్టెలు చేసి వాటిని కాల్చి గిన్నెలో పెట్టి వాటిని అతనికి వడ్డించబోయింది. అతడు “నాకు వద్దు” అని చెప్పి, అక్కడ ఉన్నవారితో “ఇక్కడున్న వారంతా నా దగ్గర నుండి బయటకు వెళ్ళండి” అని చెప్పాడు.
10 And Amnon said to Tamar, Bring the dish into the chamber, that I may eat of thy hand. And Tamar took the cakes that she had made, and brought them into the chamber to Amnon her brother.
౧౦వారంతా బయటికి వెళ్ళిన తరువాత అమ్నోను “నీ చేతి వంటకం నేను తినేలా దాన్ని నా గదిలోకి తీసుకురా” అని చెప్పాడు. తామారు తాను చేసిన రొట్టెలను తీసుకు గదిలో ఉన్న అమ్నోను దగ్గరికి వచ్చింది.
11 And she presented them to him to eat; and he took hold of her, and said to her, Come, lie with me, my sister.
౧౧అయితే అతడు ఆమెను పట్టుకుని “నా సోదరీ, రా, నాతో శయనించు” అన్నాడు.
12 And she said to him, No, my brother, do not humble me; for no such thing is done in Israel: do not this infamy.
౧౨ఆమె “అన్నయ్యా, నన్నిలా అవమానపరచొద్దు. ఇలా చేయడం ఇశ్రాయేలీయులకు న్యాయం కాదు. ఇలాంటి జారత్వం లోకి పడిపోవద్దు. ఈ అవమానం నేనెక్కడ దాచుకోగలను?
13 And I, whither shall I carry my reproach? and thou wouldest be as one of the infamous in Israel. And now, I pray thee, speak to the king; for he will not withhold me from thee.
౧౩నువ్వు కూడా ఇశ్రాయేలీయుల్లో దుర్మార్గుడిగా మారతావు. దీని గూర్చి రాజుతో మాట్లాడు. అతడు నన్ను నీకిచ్చి వివాహం చేయవచ్చు” అని చెప్పింది.
14 But he would not hearken to her voice, and was stronger than she, and humbled her and lay with her.
౧౪అయినా అతడు ఆమె మాట వినలేదు. పశుబలంతో ఆమెను మానభంగం చేసి అవమానించాడు.
15 And Amnon hated her with an exceeding great hatred, for the hatred with which he hated her was greater than the love with which he had loved her. And Amnon said to her, Arise, be gone.
౧౫అమ్నోను ఇలా చేసిన తరువాత ఆమెను ప్రేమించినంతకంటే ఎక్కువ ద్వేషం ఆమెపై పుట్టింది. ఆమెను “లేచి వెళ్ళిపో” అని చెప్పాడు.
16 And she said to him, There is no cause for this evil in sending me away, [which] is greater than the other that thou didst to me. But he would not hearken to her.
౧౬ఆమె “నన్ను బయటకు తోసివేయడం ద్వారా నాకు ఇప్పుడు చేసిన కీడు కంటే మరి ఎక్కువ కీడు చేసినవాడివి అవుతావు” అని చెప్పింది.
17 Then he called his young man that attended upon him, and said, Put now this [woman] out from me, and bolt the door after her.
౧౭అతడు ఆమె మాట వినిపించుకోలేదు. తన పనివాళ్ళలో ఒకణ్ణి పిలిచి “ఈమెను నా దగ్గర నుండి పంపివేసి తలుపులు వెయ్యి” అని చెప్పాడు.
18 Now she had a vest of many colours upon her; for so were the king's daughters that were virgins apparelled. And his attendant brought her out, and bolted the door after her.
౧౮వివాహం కాని రాజకుమార్తెలు రకరకాల రంగుల చీరలు ధరించేవారు. ఆమె అలాంటి చీర కట్టుకుని ఉన్నప్పటికీ ఆ పనివాడు ఆమెను బయటికి వెళ్లగొట్టి మళ్ళీ రాకుండా ఉండేలా తలుపుకు గడియ పెట్టాడు.
19 And Tamar put ashes on her head, and rent her vest of many colours which was on her, and laid her hand on her head, and went away, crying out as she went.
౧౯అప్పుడు తామారు తలమీద బూడిద పోసుకుని, కట్టుకొన్న రంగు రంగుల చీర చింపివేసి తలపై చేతులు పెట్టుకుని ఏడుస్తూ వెళ్ళిపోయింది.
20 And Absalom her brother said to her, Has Amnon thy brother been with thee? and now, my sister, be still: he is thy brother; take not this thing to heart. And Tamar remained, and [that] desolate, in her brother Absalom's house.
౨౦ఆమె అన్న అబ్షాలోము ఆమెను చూసి “నీ అన్న అమ్నోను నీతో తన వాంఛ తీర్చుకున్నాడు గదా? నా సోదరీ, నువ్వు నెమ్మదిగా ఉండు. అతడు నీ అన్నే గదా, దీని విషయంలో బాధపడకు” అన్నాడు. మానం కోల్పోయిన తామారు అప్పటినుండి అబ్షాలోము ఇంట్లోనే ఉండిపోయింది.
21 And king David heard of all these things, and he was very angry.
౨౧ఈ సంగతి రాజైన దావీదుకు తెలిసింది. అతడు తీవ్రమైన కోపం తెచ్చుకున్నాడు.
22 And Absalom spoke to Amnon neither good nor bad; for Absalom hated Amnon, because he had humbled his sister Tamar.
౨౨అబ్షాలోము తన సోదరుడైన అమ్నోనుతో మంచిచెడ్డలేమీ మాటలాడకుండా మౌనంగా ఉన్నాడు. అయితే తన సోదరి తామారును మానభంగం చేసినందుకు అతనిపై పగ పెంచుకున్నాడు.
23 And it came to pass after two full years, that Absalom had sheepshearers in Baal-Hazor, which is beside Ephraim; and Absalom invited all the king's sons.
౨౩రెండేళ్ళ తరువాత అబ్షాలోముకు గొర్రెలబొచ్చు కత్తిరించే కాలం వచ్చింది. ఎఫ్రాయిముకు దగ్గర బయల్హాసోరులో అబ్షాలోము రాజకుమారులనందరినీ విందుకు పిలిచాడు.
24 And Absalom came to the king, and said, Behold, now, thy servant has sheepshearers; let the king, I pray thee, and his servants go with thy servant.
౨౪అబ్షాలోము రాజు దగ్గరికి వచ్చి “రాజా, వినండి. నీ దాసుడనైన నాకు గొర్రెల బొచ్చు కత్తిరించే సమయం వచ్చింది. రాజవైన నువ్వూ నీ సేవకులూ విందుకు రావాలని నీ దాసుడనైన నేను కోరుతున్నాను” అని మనవి చేసుకున్నాడు.
25 And the king said to Absalom, No, my son, let us not all go, lest we be burdensome to thee. And he urged him, but he would not go; and he blessed him.
౨౫అప్పుడు రాజు “నా కుమారా, మమ్మల్ని పిలవొద్దు. మేము రాకూడదు. మేమంతా వస్తే అదనపు భారంగా ఉంటాం” అని చెప్పాడు. రాజు అలా చెప్పినప్పటికీ అబ్షాలోము తప్పకుండా రావాలని రాజును బలవంతపెట్టాడు.
26 And Absalom said, If not, I pray thee, let my brother Amnon go with us. And the king said to him, Why should he go with thee?
౨౬అయితే దావీదు వెళ్లకుండా అబ్షాలోమును దీవించి పంపాడు. అప్పుడు అబ్షాలోము “నువ్వు రాలేకపోతే నా సోదరుడు అమ్నోను మాతో కలసి బయలుదేరేలా అనుమతి ఇవ్వు” అని రాజుకు మనవి చేశాడు. “అతడు నీ దగ్గరికి ఎందుకు రావాలి?” అని దావీదు అడిగాడు.
27 But Absalom pressed him; and he let Amnon and all the king's sons go with him.
౨౭అబ్షాలోము అతణ్ణి బతిమిలాడాడు. రాజు అమ్నోను, తన కొడుకులంతా అబ్షాలోము దగ్గరకు వెళ్ళవచ్చని అనుమతి ఇచ్చాడు.
28 And Absalom commanded his servants, saying, Mark ye now when Amnon's heart is merry with wine, and when I say to you, Smite Amnon; then slay him, fear not: have not I commanded you? be courageous, and be valiant.
౨౮ఈలోగా అబ్షాలోము తన పనివాళ్ళను పిలిచి “నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. అమ్నోను బాగా ద్రాక్షారసం తాగి మత్తెక్కి ఉన్న సమయంలో అతణ్ణి చంపమని నేను మీకు చెప్పినప్పుడు మీరు భయపడకుండా అతణ్ణి చంపివేయండి. ధైర్యం తెచ్చుకుని పౌరుషం చూపించండి” అని చెప్పాడు.
29 And the servants of Absalom did to Amnon as Absalom had commanded. Then all the king's sons arose, and they rode each upon his mule and fled.
౨౯అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం వారు అమ్నోనును చంపేశారు. రాజకుమారులంతా భయపడి లేచి తమ కంచరగాడిదెలు ఎక్కి పారిపోయారు.
30 And it came to pass, while they were in the way, that tidings came to David, saying, Absalom has smitten all the king's sons, and there is not one of them left.
౩౦వారు దారిలో ఉండగానే “ఒక్కడు కూడా మిగలకుండా రాజకుమారులందరినీ అబ్షాలోము చంపివేశాడు” అన్న వార్త దావీదుకు అందింది.
31 Then the king arose, and rent his garments, and lay on the earth; and all his servants stood by with their garments rent.
౩౧అతడు లేచి తన బట్టలు చించుకుని నేలపై పడి ఉన్నాడు. అతని సేవకులంతా తన బట్టలు చించుకుని రాజు దగ్గర నిలబడి ఉన్నారు.
32 And Jonadab, the son of Shimeah David's brother, answered and said, Let not my lord suppose that they have slain all the young men the king's sons; for Amnon only is dead; for by the appointment of Absalom this has been determined from the day that he humbled his sister Tamar.
౩౨దీని చూసిన దావీదు సోదరుడు షిమ్యా కొడుకు యెహోనాదాబు “రాజా, రాజకుమారులైన యువకులందరినీ వారు చంపారని నువ్వు అనుకోవద్దు. అమ్నోను ఒక్కడినే చంపారు. ఎందుకంటే, అతడు అబ్షాలోము సహోదరి తామారును మానభంగం చేసినప్పటి నుండి అతడు అమ్నోనును చంపాలన్న పగతో ఉన్నాడని అతని మాటలనుబట్టి గ్రహించవచ్చు.
33 And now let not my lord the king take the thing to heart, to say, All the king's sons are dead; for Amnon only is dead.
౩౩కాబట్టి మా రాజువైన నువ్వు నీ కొడుకులంతా చనిపోయారని భావించి విచారపడవద్దు. అమ్నోను మాత్రమే చనిపోయాడు” అని చెప్పాడు.
34 And Absalom fled. And the young man that watched lifted up his eyes and looked, and behold, there came much people from the way behind him, from the hill-side.
౩౪కాపలా కాసేవాడు ఎదురుచూస్తూ ఉన్నప్పుడు అతని వెనక, కొండ పక్కన దారిలో నుండి వస్తున్న చాలమంది కనబడ్డారు.
35 And Jonadab said to the king, Behold, the king's sons come: as thy servant said, so it is.
౩౫వారు పట్టణంలోకి రాగానే యెహోనాదాబు “అదిగో రాజకుమారులు వచ్చారు. నీ దాసుడనైన నేను చెప్పినట్టుగానే జరిగింది” అని రాజుతో అన్నాడు.
36 And as soon as he had ended speaking, behold, the king's sons came, and lifted up their voice and wept; and the king also and all his servants wept very bitterly.
౩౬అతడు తన మాటలు ముగించగానే రాజకుమారులు వచ్చి గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు. ఇది చూసి రాజు, అతని సేవకులంతా కూడా ఏడ్చారు.
37 And Absalom fled, and went to Talmai, the son of Ammihud, king of Geshur. And [David] mourned for his son every day.
౩౭ఇది జరిగిన తరువాత అబ్షాలోము అక్కడినుంచి పారిపోయి గెషూరు రాజు అమీహూదు కొడుకు తల్మయి దగ్గరికి చేరుకున్నాడు. దావీదు ప్రతిరోజూ తన కొడుకు కోసం శోకిస్తూ ఉండిపోయాడు.
38 Now Absalom fled, and went to Geshur, and was there three years.
౩౮అబ్షాలోము పారిపోయి గెషూరు వచ్చి అక్కడ మూడేళ్ళు గడిపాడు.
39 And king David longed to go forth to Absalom; for he was comforted concerning Amnon, seeing he was dead.
౩౯అమ్నోను ఇక చనిపోయాడు గదా అని రాజైన దావీదు అతని గూర్చి ఓదార్పు పొంది అబ్షాలోమును చంపాలన్న ఆలోచన మానుకున్నాడు.

< 2 Samuel 13 >