< Zephaniah 2 >
1 Assemble, be gathered together, O people not worthy to be loved.
౧సిగ్గుమాలిన ప్రజలారా, రండి. గాలికి పొట్టు ఎగిరిపోయినట్టు సమయం గతించిపోతోంది.
2 Until the decree settles accounts, the day like dust is passing away, before which the wrath of the fury of the Lord may overcome you, before which the day of the anger of the Lord may overcome you.
౨విధి నిర్ణయం కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాక మునుపే, మిమ్మల్ని శిక్షించడానికి యెహోవా ఉగ్రత దినం రాకమునుపే కూడి రండి.
3 Seek the Lord, all you meek of the earth; you who have been working are his judgment. Seek the just, seek the meek. So then, in some way, you might be hidden in the day of the fury of the Lord.
౩దేశంలో సాత్వికులై ఆయన న్యాయవిధులు అనుసరించే దీనులారా, యెహోవాను వెదకండి. మీరు వెతికి వినయంతో నీతిని అనుసరిస్తే ఒకవేళ ఆయన ఉగ్రత దినాన మీరు భద్రంగా ఉంటారేమో.
4 For Gaza will be destroyed, and Ashkelon will be in the desert; they will expel Ashdod at midday, and Ekron will be eradicated.
౪గాజా పట్టణం నిర్జనమై పోతుంది. అష్కెలోను పాడై పోతుంది. మధ్యాహ్నవేళలో అష్డోదువారిని బయటికి తరిమి వేయడం జరుగుతుంది. ఎక్రోను నగరాన్ని దున్నేస్తారు.
5 Woe to you who inhabit the coast of the sea, you people of perdition. The word of the Lord is over you, Canaan, the land of the Philistines, and I will disperse you, so that not one inhabitant will be left.
౫సముద్రప్రాంతాల్లో నివసించే కెరేతీయులారా, మీకు బాధ. ఫిలిష్తీయుల దేశమైన కనానూ, నిన్ను గూర్చి యెహోవా చెప్పేదేమిటంటే నీలో ఒక్కడూ కాపురం ఉండకుండా నేను నిన్ను లయం చేస్తాను.
6 And the coastline of the sea will be a resting place for shepherds and a fence line for cattle.
౬సముద్రప్రాంతం గొర్రెల కాపరులు విశ్రాంతి తీసుకునే మేత స్థలం అవుతుంది. మందలకు దొడ్లు అక్కడ ఉంటాయి.
7 And it will be the line of him who will remain from the house of Judah. There they will pasture. In the houses of Ashkelon, they will rest towards evening. For the Lord their God will visit them, and he will turn away their captivity.
౭తమ దేవుడైన యెహోవా యూదా వారిని కటాక్షించి వారిని చెరలో నుండి రప్పించగా, అక్కడ వారిలో శేషించిన వారికి ఒక స్థలం ఉంటుంది. వారు అక్కడ తమ మందలు మేపుతారు. చీకటి పడ్డాక వారు అష్కెలోను ఇళ్ళలో నిద్రపోతారు.
8 I have heard about the disgrace of Moab and the blasphemies of the sons of Ammon, by which they have defamed my people and have been magnified beyond their borders.
౮మోయాబువారు వేసిన నింద, అమ్మోనువారు పలికిన దూషణ మాటలు నాకు వినబడ్డాయి. వారు నా ప్రజల సరిహద్దుల్లో ప్రవేశించి అహంకారంగా వారిని దూషించారు.
9 Because of this, as I live, says the Lord of hosts, the God of Israel, Moab will be like Sodom, and the sons of Ammon like Gomorrah, like the dryness of thorns, and piles of salt, and a desert, all the way to eternity. The remnant of my people will despoil them, and the residue of my nation will possess them.
౯నా జీవం తోడు మోయాబు దేశం సొదొమ పట్టణం వలె, అమ్మోను దేశం గొమొర్రా పట్టణం వలె అవుతాయి. అవి ముళ్ళ చెట్లకు ఉప్పు గోతులకు స్థావరమై ఎప్పుడూ పాడుబడిపోయి ఉంటాయి. నా ప్రజల్లో శేషించినవారు ఆ దేశాలను దోచుకుంటారు. నా ప్రజల్లో శేషించినవారు వాటిని స్వతంత్రించుకుంటారు. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన సేనలప్రభువు యెహోవా వాక్కు ఇదే.
10 This will come upon them for their arrogance, because they have blasphemed and have been magnified over the people of the Lord of hosts.
౧౦వారు అతిశయపడి సేనల ప్రభువు అయిన యెహోవా ప్రజలను దూషించారు గనక వారి గర్వాన్నిబట్టి అది వారికి సంభవిస్తుంది.
11 The Lord will be a horror over them, and he will reduce all the gods of the earth. And they will adore him, each man from his own place, all the islands of the Gentiles.
౧౧ద్వీపాల్లో నివసించే వారంతా తమ స్థలాల నుండి తనకే నమస్కారం చేసేలా లోకంలోని దేవుళ్ళను ఆయన నిర్మూలం చేస్తాడు. యెహోవా వారికి భయంకరుడుగా ఉంటాడు.
12 Even so, you Ethiopians, you will be executed by my sword.
౧౨కూషీయులారా, మీరు కూడా నా ఖడ్గం చేత హతమైపోతారు.
13 And he will extend his hand over the North, and he will destroy Assur. And he will set the Beautiful in the wilderness, and in an impassable place, and like a desert.
౧౩ఆయన ఉత్తరదేశం మీద తన హస్తం చాపి అష్షూరు దేశాన్ని నాశనం చేస్తాడు. నీనెవె పట్టణాన్ని పాడు చేసి దాన్ని ఆరిపోయిన ఎడారిలాగా చేస్తాడు.
14 And flocks will lie down in its midst, all the beasts of the Gentiles. And the pelican and the hedgehog will stay at its threshold; the voice of the singing bird will be at the window, with the crow above its threshold, for I will diminish her strength.
౧౪దానిలో మందలు విశ్రమిస్తాయి. అన్ని జాతుల పశువులు మందలుగా కూడుతాయి. పక్షులు, గుడ్లగూబలు వారి ద్వారాల పైకమ్ముల మీద వాలుతాయి. పక్షుల శబ్దాలు కిటికీల్లో వినబడతాయి. గడపల మీద నాశనం కనిపిస్తుంది. వారు చేసికున్న దేవదారు కర్రపని అంతటిని యెహోవా నాశనం చేస్తాడు.
15 This is the glorious city, dwelling in trust, which said in her heart, “I am and there is no one other than me.” How has she become a lair for beasts in the desert? All who pass through her will hiss and wag their hand.
౧౫“నాలాంటి పట్టణం మరొకటి లేదని మురిసి పోతూ ఉత్సాహ పడుతూ నిశ్చింతగా ఉండిన పట్టణం ఇదే. అయ్యో, అది పాడైపోయింది. అడవి జంతువులు పడుకునే ఉనికిపట్టు అయింది.” అని దారిన పోయేవారంతా చెప్పుకుంటూ, ఈసడింపుగా దాని వైపు చెయ్యి ఆడిస్తారు.