< Zechariah 7 >
1 And it happened, in the fourth year of king Darius, that the word of the Lord came to Zechariah, on the fourth day of the ninth month, which is Kislev.
౧రాజైన దర్యావేషు పరిపాలనలో నాలుగవ సంవత్సరం కిస్లేవు అనే తొమ్మిదవ నెల నాలుగవ దినాన యెహోవా వాక్కు జెకర్యాకు వచ్చింది.
2 And Sharezer and Regemmelech, and the men who were with them, sent to the house of God, to entreat the face of the Lord,
౨బేతేలువారు యెహోవాను బతిమాలుకోడానికి షెరెజెరును రెగెమ్మెలెకును వారితో బాటు వారి మనుషులను పంపించారు.
3 to speak to the priests of the house of the Lord of hosts and to the prophets, saying: “Must there be weeping with me in the fifth month, and must I sanctify myself, as I have now done for many years?”
౩మందిరం దగ్గరనున్న యాజకులతో ప్రవక్తలతో “ఇన్ని సంవత్సరాలుగా మేము దుఃఖించినట్టు ఐదవ నెలలో ఉపవాసం ఉండి దుఃఖించమంటారా” అని మనవి చేశారు.
4 And the word of the Lord of hosts came to me, saying:
౪సేనల ప్రభువు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై చెప్పినదేమిటంటే,
5 Speak to all the people of the land, and to the priests, saying: Although you may have fasted and mourned in the fifth and the seventh month for these seventy years, did you indeed keep a fast unto me?
౫“దేశప్రజలందరికీ, యాజకులకు నీవీ మాట తెలియజేయాలి. జరిగిన ఈ డెబ్భై సంవత్సరాలు ఏటేటా ఐదవ నెలలో ఏడవ నెలలో మీరు ఉపవాసం ఉండి దుఃఖపడుతూ వచ్చారుగదా? నా పట్ల భక్తితోనే ఉపవాసం ఉన్నారా?
6 And when you did eat and drink, did you not eat for yourselves, and drink only for yourselves?
౬మీరు ఆహారం తీసుకున్నప్పుడు స్వప్రయోజనానికే గదా తీసుకున్నారు? మీరు పానం చేసినప్పుడు స్వప్రయోజనానికే గదా పానం చేశారు?
7 Are not these the words that the Lord has spoken by the hand of the former prophets, when Jerusalem was still inhabited, so that it would prosper, itself and the cities around it, and those inhabitants towards the South and in the plains?
౭యెరూషలేములోనూ, దాని చుట్టూ ఉన్న పట్టణాల్లోనూ దక్షిణ దేశంలోనూ, పడమటి మైదాన భూముల్లోను ప్రజలు విస్తరించి క్షేమంగా ఉన్న కాలంలో పూర్వపు ప్రవక్తల ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీరు మనస్సుకు తెచ్చుకో లేదు గదా?”
8 And the word of the Lord came to Zechariah, saying:
౮యెహోవా వాక్కు జెకర్యాకు ప్రత్యక్షమై చెప్పినదేమిటంటే,
9 Thus says the Lord of hosts, saying: Judge with true judgment, and act with mercy and compassion, each and every one with his brother.
౯“సేనల ప్రభువైన యెహోవా ఇలా ఆజ్ఞ ఇచ్చాడు. సత్యాన్ననుసరించి తీర్పు తీర్చండి. ఒకరిపట్ల ఒకరు కరుణా వాత్సల్యం కనపరచుకోండి.
10 And do not find fault with the widow, and the orphan, and the newcomer, and the poor. And let not a man consider evil in his heart towards his brother.
౧౦వితంతువులను, తండ్రిలేని వారిని పరదేశులను దరిద్రులను బాధపెట్టకండి. మీ సోదరులకు హృదయంలో కీడు తలపెట్టకండి.”
11 But they were not willing to pay attention, and they turned aside their shoulder to depart, and they pressed upon their ears, so that they would not hear.
౧౧అయితే వారు మూర్ఖులై వినకుండా చెవులు మూసుకున్నారు.
12 And they set their heart like the hardest stone, so that they would not hear the law and the words that the Lord of hosts has sent with his Spirit by the hand of the former prophets. And so a great indignation came from Lord of hosts.
౧౨ధర్మశాస్త్రాన్ని గానీ, పూర్వికులైన ప్రవక్తల ద్వారా సేనల ప్రభువు యెహోవా తన ఆత్మ ప్రేరణచేత తెలియజేసిన మాటలను గానీ, వినకుండా హృదయాలను వజ్రాల వలె కఠిన పరచుకున్నారు. కనుక సేనల ప్రభువు యెహోవా దగ్గర నుండి మహోగ్రత వారి మీదికి వచ్చింది.
13 And it happened, just as he had spoken, and they did not pay attention. So then, they shall cry out, and I will not heed, says the Lord of hosts.
౧౩కనుక సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, “నేను పిలిచినప్పుడు వారు ఆలకించ లేదు గనక వారు పిలిచినప్పుడు నేను ఆలకించను.
14 And I dispersed them throughout all the kingdoms that they did not know. And the land was left desolate behind them, so that no one was passing through or returning. And they made the desirable land into a deserted place.
౧౪వారు ఎరుగని అన్య జనుల్లోకి నేను వారిని చెదరగొడతాను. వారు తమ దేశాన్ని విడిచిన తరువాత అందులో ఎవరూ సంచరించకుండా అది పాడైపోతుంది. ఈ విధంగా వారు మనోహరమైన తమ దేశానికి నాశనం తెచ్చి పెట్టుకున్నారు.”