< Jonah 1 >
1 And the word of the Lord came to Jonah the son of Amittai, saying:
౧యెహోవా వాక్కు అమిత్తయి కొడుకు యోనాకు ప్రత్యక్షమై ఇలా తెలియజేశాడు.
2 Rise and go to Nineveh, the great city, and preach in it. For its malice has ascended before my eyes.
౨“నువ్వు లేచి నీనెవె మహాపట్టణానికి వెళ్లి దానికి వ్యతిరేకంగా ప్రకటన చెయ్యి. ఆ నగరవాసుల దుర్మార్గం నా దృష్టికి ఘోరంగా ఉంది.”
3 And Jonah rose in order to flee from the face of the Lord to Tarshish. And he went down to Joppa and found a ship bound for Tarshish. And he paid its fare, and he went down into it, in order to go with them to Tarshish from the face of the Lord.
౩కానీ యోనా యెహోవా సన్నిధినుంచి పారిపోయి తర్షీషు పట్టణానికి వెళ్ళాలనుకున్నాడు. యొప్పేకు వెళ్లి తర్షీషుకు వెళ్ళే ఒక ఓడ చూశాడు. ప్రయాణానికి డబ్బులిచ్చి, యెహోవా సన్నిధినుంచి దూరంగా తర్షీషు వెళ్లి పోవడానికి ఆ ఓడ ఎక్కాడు.
4 But the Lord sent a great wind into the sea. And a great tempest took place in the sea, and the ship was in danger of being crushed.
౪అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి వీచేలా చేశాడు. అది సముద్రంలో గొప్ప తుఫానుగా మారింది. ఓడ బద్దలైపోయేలా ఉంది.
5 And the mariners were afraid, and the men cried out to their god. And they threw the containers that were in the ship into the sea in order to lighten it of them. And Jonah went down into the interior of the ship, and he fell into a painful deep sleep.
౫అప్పుడు ఆ ఓడ నావికులు చాలా భయపడ్డారు. ప్రతి ఒక్కడూ తన దేవునికి మొర్రపెట్టాడు. ఓడ తేలిక చేయడానికి అందులో ఉన్న సరకులను సముద్రంలో పారేశారు. అయితే యోనా ఓడ లోపలి భాగానికి వెళ్లి పడుకుని గాఢ నిద్రపోతున్నాడు.
6 And the helmsman approached him, and he said to him, “Why are you weighed down with sleep? Rise, call upon your God, so perhaps God will be mindful of us and we might not perish.”
౬అప్పుడు ఓడ నాయకుడు అతని దగ్గరికి వచ్చి “నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు! ఒకవేళ నీ దేవుడు మనలను గమనించి మనం నాశనం కాకుండా చూస్తాడేమో” అన్నాడు.
7 And a man said to his shipmate, “Come, and let us cast lots, so that we may know why this disaster is upon us.” And they cast lots, and the lot fell upon Jonah.
౭అంతలో నావికులు “ఎవర్ని బట్టి ఇంత కీడు మనకు వచ్చిందో తెలుసుకోడానికి మనం చీట్లు వేద్దాం రండి” అని ఒకరితో ఒకరు చెప్పుకుని, చీట్లు వేశారు. చీటీ యోనా పేరున వచ్చింది.
8 And they said to him: “Explain to us what is the reason that this disaster is upon us. What is your work? Which is your country? And where are you going? Or which people are you from?”
౮కాబట్టి వాళ్ళు “ఎవరి కారణంగా ఈ కీడు మనకు వచ్చిందో మాకు చెప్పు. నీ ఉద్యోగం ఏంటి? నువ్వెక్కడనుంచి వచ్చావు? నీది ఏ దేశం? ఏ జనం నుంచి వచ్చావు?” అని యోనాని అడిగారు.
9 And he said to them, “I am Hebrew, and I fear the Lord God of heaven, who made the sea and the dry land.”
౯అతడు వాళ్ళతో ఇలా అన్నాడు. “నేను హెబ్రీయుణ్ణి. సముద్రానికీ భూమికీ సృష్టికర్త, ఆకాశంలో ఉన్న దేవుడు అయిన యెహోవా పట్ల భయభక్తులు కలిగినవాణ్ణి.”
10 And the men were greatly afraid, and they said to him, “Why have you done this?” (For the men knew that he was fleeing from the face of the Lord, because he had told them.)
౧౦వాళ్ళు మరింత భయపడి అతనితో “నువ్వు చేసిన పని ఏమిటి?” అన్నారు. ఎందుకంటే తాను యెహోవా సన్నిధినుంచి పారిపోతున్నట్టు అతడు వాళ్లకు చెప్పాడు.
11 And they said to him, “What are we to do with you, so that the sea will cease for us?” For the sea flowed and swelled.
౧౧అప్పుడు వాళ్ళు యోనాతో “సముద్రం మాకోసం నిమ్మళించేలా మేము నీకేం చెయ్యాలి?” అని అడిగారు. ఎందుకంటే సముద్రం ఇంకా భీకరమౌతూ ఉంది.
12 And he said to them, “Take me, and cast me into the sea, and the sea will cease for you. For I know that it is because of me that this great tempest has come upon you.”
౧౨యోనా “నా కారణంగానే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చిందని నాకు తెలుసు. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, అప్పుడు సముద్రం మీ మీదికి రాకుండా నిమ్మళిస్తుంది” అని వాళ్లకు జవాబిచ్చాడు.
13 And the men were rowing, so as to return to dry land, but they did not succeed. For the sea flowed and swelled against them.
౧౩అయినా వాళ్ళు ఓడను సముద్రం ఒడ్డుకు చేర్చడానికి తెడ్లు చాలా బలంగా వేశారు. సముద్రం ఇంకా చెలరేగుతూ ఉండడం వలన అలా చెయ్య లేకపోయారు.
14 And they cried out to the Lord, and they said, “We beseech you, Lord, do not let us perish for this man’s life, and do not attribute to us innocent blood. For you, Lord, have done just as it pleased you.”
౧౪కాబట్టి వాళ్ళు యెహోవాకు ఇలా మొర్రపెట్టారు. “ఈ మనిషిని బట్టి మమ్మల్ని నాశనం చెయ్యవద్దు. అతని చావుకు మా మీద దోషం మోప వద్దు. ఎందుకంటే యెహోవా, నువ్వే నీ ఇష్టప్రకారం ఇలా జరిగించావు.”
15 And they took Jonah and cast him into the sea. And the sea was stilled from its fury.
౧౫ఇలా అని వాళ్ళు యోనాను ఎత్తి సముద్రంలో పడేశారు. పడేయగానే సముద్రం పొంగకుండా ఆగిపోయింది.
16 And the men feared the Lord greatly, and they sacrificed victims to the Lord, and they made vows.
౧౬అప్పుడు వాళ్ళు యెహోవాకు ఎంతో భయపడి, ఆయనకు బలులు అర్పించి మొక్కుబళ్లు చేశారు.
17 And the Lord prepared a great fish to swallow Jonah. And Jonah was in the belly of the fish for three days and three nights.
౧౭ఒక పెద్ద చేప యోనాను మింగడానికి యెహోవా నియమించాడు. యోనా మూడు రోజులు, మూడు రాత్రులు ఆ చేప కడుపులో ఉన్నాడు.