< Job 12 >
1 Then Job, answering, said:
౧అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు,
2 Are you, therefore, alone among men, and will wisdom die with you?
౨నిజంగా లోకంలో ఉన్న ప్రజలంతా మీరేనా? మీతోనే జ్ఞానం కడతేరి పోతుందా?
3 And I have a heart just as you also do, and I am not inferior to you. For who is ignorant of these things, which you know?
౩మీకున్నట్టు నాక్కూడా తెలివితేటలు ఉన్నాయి. నేను మీకంటే జ్ఞానం గలవాణ్ణి. మీరు చెప్పే విషయాలు ఎవరికి తెలియదు?
4 He who is mocked by his friends as I am, will call upon God, and he will listen to him because it is the sincerity of the just that is being mocked.
౪దేవుణ్ణి వేడుకుని ఈవులు పొందిన నేను ఇప్పుడు నా స్నేహితుని ఎదుట నవ్వులపాలు కావలసి వచ్చింది. నీతి నిజాయితీలు కలిగిన నేను ఇతరులు చేసే ఎగతాళి భరించాల్సి వస్తుంది.
5 The lamp that is despised in the thoughts of the rich is ready for the appointed time.
౫క్షేమస్థితిలో ఉన్నవాళ్ళు దుర్దశలో ఉన్న వాళ్ళను తృణీకరించడం మంచిదని భావిస్తారు. కాళ్ళు జారుతున్న వారికి మరింత దురదృష్టం జత చేసే మార్గాలు వారు వెతుకుతారు.
6 The tabernacles of robbers are numerous, and they provoke God boldly; whereas, it is he who has given all things into their hands.
౬దోపిడీ దొంగల నివాసాలు వర్ధిల్లుతాయి. దేవునికి కోపం పుట్టించేవాళ్ళు భయం లేకుండా సంచరిస్తారు. తమ శక్తి యుక్తులనే తమ దేవుళ్ళుగా భావించుకుంటారు.
7 In truth, ask the mules, and they will teach you, and the birds of the sky, and they will reveal to you.
౭అయితే, మృగాలను అడగండి, అవి మీకు బోధ చేస్తాయి. ఆకాశంలో పక్షులను అడగండి, అవి మీకు చెబుతాయి.
8 Speak with the earth, and it will respond to you, and the fish of the sea will explain.
౮భూమి గురించి ఆలోచిస్తే అది నీకు బోధిస్తుంది. సముద్రంలో ఉండే చేపలు కూడా నీకు ఉపదేశం చేస్తాయి.
9 Who is ignorant that the hand of the Lord has made all these things?
౯యెహోవా వీటన్నిటినీ తన చేతితో సృష్టించాడని గ్రహించలేని వాడెవడు?
10 In his hand is the soul of all the living and the spirit of all the flesh of mankind.
౧౦జీవం ఉన్న సమస్త ప్రాణులు, సమస్త మానవకోటి ఆత్మలు ఆయన ఆధీనంలో ఉన్నాయి.
11 Does not the ear perceive words, and the palate, when eating, perceive flavor?
౧౧నాలుక ఆహారాన్ని ఎలా రుచి చూస్తుందో అలాగే చెవి అది వినే మాటలను పరీక్షిస్తుంది గదా.
12 In old age is wisdom, and in length of days is prudence.
౧౨వృద్ధులు జ్ఞానులు. ఆయుష్షు పెరిగే కొద్దీ వివేకం పెరుగుతుంది.
13 With him is wisdom and strength, he has counsel and understanding.
౧౩అయితే దేవునికి జ్ఞానం, బల ప్రభావాలు ఉన్నాయి. ఆలోచనా, వివేకమూ ఆయనకు ఉన్నాయి.
14 If he tears down, there is no one who can build up; if he encloses a man, there is no one who can open.
౧౪ఆలోచించు, ఆయన పడగొట్టిన దాన్ని మళ్ళీ ఎవ్వరూ తిరిగి కట్టలేరు. ఒకవేళ ఆయన ఒకరిని చెరసాల్లో ఉంచితే దాన్ని తెరవడం ఎవరికీ సాధ్యం కాదు.
15 If he restrains the waters, everything will dry up; and if he sends them forth, they will subdue the land.
౧౫చూడండి, ఆయన ప్రవాహాలను కట్టడిచేస్తే అవి ఇంకిపోతాయి. వాటిని విడుదల చేస్తే అవి భూమిని ముంచివేస్తాయి.
16 With him is strength and wisdom; he knows both the deceiver and he who is deceived.
౧౬బలమూ, జ్ఞానమూ ఆయన గుణ లక్షణాలు. మోసగాళ్ళు, మోసపోయే వాళ్ళు ఆయన ఆధీనంలో ఉన్నారు.
17 He leads advisors to a foolish end and judges to stupidity.
౧౭ఆలోచనలు చెప్పేవాళ్ళను వస్త్రహీనులనుగా చేసి ఆయన వాళ్ళను బందీలుగా తీసుకువెళ్తాడు. న్యాయాధిపతులందరూ తెలివి లేనివాళ్ళని ఆయన రుజువు చేస్తాడు.
18 He removes the belt of kings and encircles their waist with a rope.
౧౮రాజుల అధికారాలను ఆయన రద్దు చేస్తాడు. వారి నడుములను సంకెళ్ళతో బంధిస్తాడు.
19 He leads away priests in dishonor and displaces nobles,
౧౯యాజకులను వస్త్రహీనులనుగా చేసి వాళ్ళను బందీలుగా తీసుకువెళ్తాడు. స్థిరంగా పాతుకుపోయి ఉన్నవాళ్ళను ఆయన కూలదోస్తాడు.
20 altering the lips of those who speak the truth and sweeping away the teaching of the aged.
౨౦వాక్చాతుర్యం గలవారు చెప్పే మాటలను ఆయన వ్యర్ధపరుస్తాడు. పెద్దమనుషులను తెలివితక్కువ వాళ్లనుగా చేస్తాడు.
21 He pours disdain upon the leaders, relieving those who had been oppressed.
౨౧పాలకులను ఆయన తిరస్కరిస్తాడు. బలవంతులను బలహీనులుగా చేస్తాడు.
22 He reveals the depths of the darkness, and he brings the shadow of death into the light.
౨౨చీకట్లోని లోతైన విషయాలను ఆయన బయలు పరుస్తాడు. మరణాంధకారంలోకి వెలుగు రప్పిస్తాడు.
23 He multiplies peoples, and destroys them, and, having been overthrown, he restores them anew.
౨౩ఆయన ప్రజలను వృద్ది పరుస్తాడు, అదే సమయంలో నాశనం చేస్తాడు. వాళ్ళ పొలిమేరలను విశాల పరుస్తాడు. వాళ్ళను ఖైదీలుగా కూడా తీసుకు పోతాడు.
24 He transforms the heart of the leaders of the people on earth, and misleads those who in vain advance upon the inviolable.
౨౪లోకంలోని ప్రజల, పాలకుల జ్ఞానాన్ని ఆయన వ్యర్థం చేస్తాడు. వాళ్ళు దారీతెన్నూ లేని ఎడారి ప్రాంతంలో సంచరించేలా చేస్తాడు.
25 They will grope as in the darkness, not the light, and he will make them stagger like drunkards.
౨౫వాళ్ళు వెలుగు లేనివారై చీకటిలో తడుముకుంటారు. మత్తులో ఉన్నవాడు తూలి పడినట్టు ఆయన వాళ్ళను తూలిపోయేలా చేస్తాడు.