< Jeremiah 5 >
1 “Travel the streets of Jerusalem; and gaze, and consider, and seek, in its wide streets. If you can find a man exercising judgment and seeking faith, then I will be forgiving to them.
౧యెహోవా చెప్పేదేమంటే “యెరూషలేము వీధుల్లో అటూ ఇటూ తిరుగుతూ గమనించండి. దాని రాజవీధుల్లో విచారించండి. న్యాయం జరిగిస్తూ నమ్మకంగా ఉండాలని ప్రయత్నం చేసే ఒక్కడు మీకు కనిపించినా సరే, నేను దాన్ని క్షమిస్తాను.
2 For even though they say, ‘As the Lord lives,’ in this, too, they swear falsely.”
౨యెహోవా మీద ఒట్టు అని పలికినప్పటికీ వారు చేసే ప్రమాణం మోసమే.”
3 O Lord, your eyes look with favor upon faith. You have struck them, and they have not grieved. You have bruised them, and they have refused to accept discipline. They have hardened their faces more than rock, and they are not willing to return.
౩యెహోవా, యథార్థత చూడాలని కదా నీ కోరిక? నువ్వు వారిని కొట్టావు కానీ వారు లెక్క చేయలేదు. వారిని క్షీణింప జేశావు గానీ వారు శిక్షను అంగీకరించలేదు. రాతికంటే తమ ముఖాలు కఠినం చేసుకుని నీ వైపు తిరగడానికి ఒప్పుకోలేదు.
4 But I said: Perhaps these are the poor and the senseless, who are ignorant of the way of the Lord, of the judgment of their God.
౪నేనిలా అనుకున్నాను “వీరు కేవలం బీదవారు. యెహోవా మార్గాలు, తమ దేవుని న్యాయవిధులు తెలియని బుద్ధిహీనులు.
5 Therefore, I will go to great men, and I will speak with them. For they have known the way of the Lord, the judgment of their God. And behold, these ones have broken the yoke all the more; they have torn apart the bonds.
౫కాబట్టి నేను ప్రముఖుల దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడతాను. వారికి యెహోవా మార్గాలు, తమ దేవుని న్యాయవిధులు తెలిసి ఉంటాయి గదా.” అయితే వారందరూ కాడిని విరిచేవారే, దేవునితో అంటుకట్టిన కట్లను తెంపుకొన్న వారే.
6 For this reason, a lion from the forest has struck them down, a wolf toward evening has laid waste to them, a leopard lies in wait over their cities. All who go out from there will be taken. For their transgressions have been multiplied; their rebellions have been strengthened.
౬అరణ్యం నుండి వచ్చిన సింహం వారిని చంపుతుంది. అడవి తోడేలు వారిని నాశనం చేస్తుంది. చిరుతపులి వారి పట్టణాల దగ్గర కాచుకుని వాటిలోనుండి బయటకు వచ్చిన ప్రతివాణ్ణీ చీల్చివేస్తుంది. ఎందుకంటే వారి అక్రమాలు మితిమీరిపోయాయి. వారు విశ్వాసఘాతకులయ్యారు.
7 “Over which things am I able to be merciful to you? Your sons have forsaken me, and they swear by those who are not gods. I gave them everything, and they committed adultery, and they indulged themselves in the house of the harlot.
౭నీ పిల్లలు నన్ను విడిచి, దేవుళ్ళు కాని వారి పేరున ప్రమాణం చేస్తారు. నేను వారిని సమృద్ధిగా పోషించాను కానీ వారు వ్యభిచారం చేస్తూ వేశ్యల ఇళ్ళలో సమావేశం అవుతారు. వారిని నేనెందుకు క్షమించాలి?
8 They have become like wild horses in heat; each one was neighing after his neighbor’s wife.
౮బాగా బలిసిన గుర్రాల్లాగా వారిలో ప్రతి ఒక్కడూ ఇటూ అటూ తిరుగుతూ తన పొరుగువాని భార్యను చూసి సకిలిస్తాడు.
9 Shall I not visit against these things, says the Lord? And shall my soul not take vengeance on a nation such as this?
౯అలాంటి పనుల కారణంగా నేను వారిని దండించకుండా ఉంటానా? అలాటి ప్రజల మీద నా కోపం చూపకూడదా? ఇదే యెహోవా వాక్కు.
10 Scale its walls and tear them down. But do not be willing to bring about its very end. Take away its plantings, for they are not the Lord’s.
౧౦దాని ద్రాక్షతోటల్లోకి వెళ్ళి నాశనం చేయండి. అయితే వాటిని పూర్తిగా అంతం చేయవద్దు. దాని కొమ్మలను నరికి వేయండి. ఎందుకంటే అవి యెహోవా నుండి వచ్చినవి కావు.
11 For the house of Israel and the house of Judah have greatly transgressed against me, says the Lord.
౧౧ఇశ్రాయేలు, యూదా ప్రజలు నాకు పూర్తిగా ద్రోహం చేశారు. ఇదే యెహోవా వాక్కు.
12 They have denied the Lord, and they have said, ‘It is not him,’ and, ‘Evil will not overwhelm us. We will not see famine and the sword.’
౧౨వారు నన్ను తోసిపుచ్చి “యెహోవా నిజమైనవాడు కాదు. మనపైకి ఏ కీడు గానీ ఖడ్గం గానీ కరువు గానీ రాదు.
13 The prophets have spoken into the wind, and there was no answer with them. Therefore, these things will happen to them.”
౧౩ప్రవక్తలు చెప్పేవన్నీ గాలి మాటలు. యెహోవా మాటలు పలికేవాడు వారిలో లేడు. వారు చెప్పింది వారికే జరుగుతుంది” అని చెబుతారు.
14 Thus says the Lord, the God of hosts: “Since you have spoken this word, behold, I will make my words in your mouth like fire and this people like wood, and it will devour them.
౧౪కాబట్టి సేనల అధిపతీ, దేవుడూ అయిన యెహోవా చెప్పేదేమంటే, వారు ఆ విధంగా పలికారు కాబట్టి నా వాక్కు వారిని కాల్చేలా దాన్ని నీ నోట అగ్నిగా ఉంచుతాను. ఈ ప్రజలను కట్టెలుగా చేస్తాను. ఇదే యెహోవా వాక్కు.
15 Behold, O house of Israel, I will lead over you a far away nation, says the Lord, a robust nation, an ancient nation, a nation whose language you will not know, nor will you understand what they are saying.
౧౫ఇశ్రాయేలు ప్రజలారా, వినండి, దూరం నుండి మీ మీదికి ఒక జనాన్ని రప్పిస్తాను. అది చాలా పురాతనమైన జనం. దాని భాష నీకు రాదు. ఆ జనం పలికే మాటలు నీకు అర్థం కావు.
16 Their quiver is like an open sepulcher. They are all strong.
౧౬వారి అమ్ముల పొది తెరచిన సమాధిలాంటిది. వారంతా గొప్ప యోధులు.
17 And they will consume your grain fields and your bread. They will devour your sons and your daughters. They will consume your flocks and your herds. They will consume your vineyards and your figs. And with the sword, they will crush your fortified cities, in which you have placed your trust.
౧౭నీ పంట, నీ ఆహారం వారి చేతిలో నాశనం అవుతుంది. నీ కొడుకులనూ, కూతుళ్ళనూ, నీ గొర్రెలనూ, నీ పశువులనూ నాశనం చేస్తారు. నీ ద్రాక్షచెట్ల, అంజూరు చెట్ల ఫలాన్ని నాశనం చేస్తారు. నీవు ఆశ్రయంగా భావించిన ప్రాకారాలుగల పట్టణాలను వారు కత్తి చేత కూలదోస్తారు.
18 Yet truly, in those days, says the Lord, I will not bring the consummation over you.
౧౮అయినా ఆ రోజుల్లో నేను మిమ్మల్ని పూర్తిగా నాశనం చెయ్యను. ఇదే యెహోవా వాక్కు.
19 And if they say, ‘Why has the Lord our God done all these things to us?’ You shall say to them: ‘Just as you have abandoned me and have served a strange god in your own land, so will you serve strangers in a land not your own.’
౧౯“మన దేవుడు యెహోవా మనకెందుకు ఇలా చేశాడు?” అని అడిగినప్పుడు నువ్వు వారితో ఇలా చెప్పు. మీరు నన్ను విసర్జించి మీ స్వదేశంలో అన్య దేవుళ్ళను పూజించారు కాబట్టి మీది కాని దేశంలో మీరు అన్య ప్రజలకు సేవ చేస్తారు అని యెహోవా సెలవిస్తున్నాడు.
20 Announce this to the house of Jacob, and make it known in Judah, saying:
౨౦యాకోబు వంశ ప్రజలకు ఈ మాట చెప్పండి, యూదా వంశ ప్రజలకు ఈ సమాచారం చాటించండి.
21 Listen, O foolish people who have no heart! You have eyes, but you do not see, and ears, but you do not hear.
౨౧మీరు కళ్ళుండీ చూడడం లేదు, చెవులుండీ వినడం లేదు. మీరు తెలివి లేని మూర్ఖులు.
22 So then, will you not fear me, says the Lord. And will you not have sorrow before my face? I have placed the shore as a limit for the sea, as an everlasting precept that it will not transgress. And its waves will crash, but they will not prevail; and its waves will swell, but they will not go across.
౨౨యెహోవా చెప్పేదేమంటే, నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? నేను ఒక నిత్యమైన నిర్ణయం తీసుకుని సముద్రానికి ఒక సరిహద్దుగా ఇసుకను ఉంచాను. దాని అలలు ఎంత పైకి లేచినా అవి దాన్ని దాటలేవు. ఎంత ఘోష పెట్టినా దాన్ని జయించలేదు.
23 But the heart of this people has become incredulous and provocative; they have turned away and departed.
౨౩ఈ ప్రజలు తిరుగుబాటు, ద్రోహం చేసే మనస్సు గలవారు, వారు పక్కకు తొలగిపోతున్నారు.
24 And they have not said in their heart: ‘Let us dread the Lord our God, who gives us the timely and the late rains, in their proper time, who guards the full measure of the yearly harvest for us.’
౨౪వారు “రండి, మన దేవుడైన యెహోవా పట్ల భయభక్తులు చూపుదాం. తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని వాటి కాలంలో కురిపించేవాడు ఆయనే కదా. నిర్ణయించిన ప్రకారం కోతకాలపు వారాలను మనకు వచ్చేలా చేసేవాడు ఆయనే కదా” అని తమ మనస్సులో అనుకోరు.
25 Your iniquities have turned these things away, and your sins have held back good things from you.
౨౫అవి క్రమంగా రాకుండా చేసింది మీ దోషాలే. మీకు మేలు కలగక పోవడానికి కారణం మీ పాపాలే.
26 For the impious are found among my people; they lie in ambush like fowlers setting snares, for they set traps to catch men.
౨౬నా ప్రజల్లో దుర్మార్గులున్నారు, వేటగాళ్ళు పక్షుల కోసం పొంచి ఉన్నట్టు వారు పొంచి ఉంటారు. వారు వల పన్ని మనుషులను పట్టుకుంటారు.
27 Just as a snare is full of birds, so are their houses full of deceit. As a result, they have become exalted and enriched.
౨౭పంజరం నిండా పిట్టలు ఉన్నట్టు వారి ఇళ్ళు కపటంతో నిండి ఉన్నాయి. దానితోనే వారు గొప్పవారు, ధనవంతులు అవుతారు.
28 They have grown stout and fat. And they have transgressed my words most wickedly. They have not judged the case of the widow; they have not given guidance to the case of the orphan; and they have not judged a judgment for the poor.
౨౮వారు కొవ్వు పట్టి బాగా బలిసి ఉన్నారు. దుర్మార్గంలో వారు ఎంతో ముందుకు వెళ్ళారు. తండ్రి లేనివారు వ్యాజ్యంలో గెలవకుండేలా వారికి అన్యాయంగా తీర్పు తీరుస్తారు. బీదవారి వ్యాజ్యాల్లో సహకరించరు.
29 Shall I not visit against these things, says the Lord? Or shall my soul not take vengeance on a nation of this kind?
౨౯అలాటి వారిని నేను శిక్షించకూడదా? ఈ ప్రజలపై ప్రతీకారం తీర్చుకోకూడదా? ఇదే యెహోవా వాక్కు.
30 Astonishing and wondrous things have been done upon the earth.
౩౦ఘోరమైన అకృత్యాలు దేశంలో జరుగుతున్నాయి.
31 The prophets have prophesied lies, and the priests have applauded with their hands, and my people have loved these things. So then, what shall be done at the very end?”
౩౧ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు చెబుతారు. యాజకులు తమ స్వంత అధికారాన్ని చెలాయిస్తారు. అలా జరగడం నా ప్రజలకు కూడా ఇష్టమే. అయితే దాని అంతంలో జరగబోయే దానికి వారేం చేస్తారు?