< Isaiah 60 >
1 Rise up to be illuminated, O Jerusalem! For your light has arrived, and the glory of the Lord has risen over you.
౧లే, ప్రకాశించు! నీకు వెలుగు వచ్చింది. యెహోవా మహిమ నీ మీద ఉదయించింది.
2 For behold, darkness will cover the earth, and thick darkness will cover the peoples. Then the Lord will rise above you, and his glory will be seen in you.
౨భూమిని చీకటి కమ్మినా కటిక చీకటి రాజ్యాలను కమ్మినా యెహోవా నీ మీద ఉదయిస్తాడు. ఆయన మహిమ నీ మీద కనబడుతుంది.
3 And the nations will walk in your light, and the kings will walk by the splendor of your rising.
౩రాజ్యాలు నీ వెలుగుకు వస్తారు. రాజులు నీ ఉదయకాంతికి వస్తారు.
4 Lift up your eyes all around and see! All these have been gathered together; they have arrived before you. Your sons will arrive from far away, and your daughters will rise up from your side.
౪తలెత్తి చుట్టూ చూడు. వీళ్ళంతా మూకుమ్మడిగా నీ దగ్గరికి వస్తున్నారు. నీ కొడుకులు దూరంనుంచి వస్తారు. నీ కూతుళ్ళు చంకనెక్కి వస్తున్నారు.
5 Then you will see, and you will overflow, and your heart will be amazed and expanded. When the multitude of the sea will have been converted to you, the strength of the nations will approach you.
౫నువ్వు చూసి ప్రకాశిస్తావు. నీ హృదయం ఆనందిస్తూ ఉప్పొంగుతుంది. సముద్ర సమృద్ధి నీ మీద కుమ్మరించడం జరుగుతుంది. రాజ్యాల ఐశ్వర్యం నీ దగ్గరికి వస్తుంది.
6 A multitude of camels will inundate you: the dromedaries from Midian and Ephah. All those from Sheba will arrive, carrying gold and frankincense, and announcing praise to the Lord.
౬ఒంటెల గుంపులూ మిద్యాను ఏఫాల నుంచి వచ్చిన పిల్ల ఒంటెలూ నీ దేశమంతటా వ్యాపిస్తాయి. వారంతా షేబ నుంచి వస్తారు. బంగారం, ధూపద్రవ్యం తీసుకువస్తారు. యెహోవా కీర్తిని ప్రకటిస్తూ ఉంటారు.
7 All the flocks of Kedar will be gathered together before you; the rams of Nebaioth will minister to you. They will be offered upon my pleasing altar, and I will glorify the house of my majesty.
౭నీ కోసం కేదారు గొర్రెమందలన్నీ సమకూడతాయి. నెబాయోతు పొట్లేళ్లు నీ సేవలో ఉపయోగపడతాయి. అవి నా బలిపీఠం మీద బలులుగా అంగీకారమవుతాయి. నా గొప్ప మందిరాన్ని నేను అందంగా అలంకరిస్తాను.
8 Who are these ones, who fly like the clouds and like doves to their windows?
౮మబ్బులాగా గువ్వలలాగా తమ గూటికి ఎగిరి వచ్చే వీళ్ళెవరు?
9 For the islands await me, and the ships of the sea in the beginning, so that I may lead your sons from far away, their silver and their gold with them, to the name of the Lord your God and to the Holy One of Israel. For he has glorified you.
౯నీ దేవుడు యెహోవా పేరునుబట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని పేరును బట్టి ఆయన నిన్ను ఘనపర్చాడు, కాబట్టి నీ కొడుకులను, తమ వెండి బంగారాలను తీసుకురావడానికి, ద్వీపవాసులు నా కోసం చూస్తారు. తర్షీషు ఓడలు మొదట వస్తాయి.
10 And the sons of sojourners will build up your walls, and their kings will minister to you. For in my wrath, I have struck you. And in my reconciliation, I have taken pity on you.
౧౦విదేశీయులు నీ గోడలు కడతారు. వారి రాజులు నీకు సేవ చేస్తారు. ఎందుకంటే నేను ఆగ్రహంతో నిన్ను కొట్టినా అనుగ్రహంతో నీ మీద జాలిపడతాను.
11 And your gates will be open continually. They will not be closed day or night, so that the strength of the nations may be brought before you, and their kings may be lead in.
౧౧రాజ్యాల సంపద నీదగ్గరికి తెచ్చేలా నీ ద్వారం తలుపులు రాత్రింబగళ్లు మూసివేయడం జరగదు. ఆ ప్రజల ఊరేగింపులో వారి రాజులు ఉంటారు.
12 For the nation and the kingdom that will not serve you will perish. And the Gentiles will be devastated by solitude.
౧౨నిన్ను సేవించడానికి నిరాకరించే ప్రజలు గానీ రాజ్యం గానీ నాశనం అవుతుంది. ఆ రాజ్యాలు తప్పకుండా నాశనం అవుతాయి.
13 The glory of Lebanon will arrive before you, the fir tree and the box tree and the pine tree together, to adorn the place of my sanctification. And I will glorify the place of my feet.
౧౩నా పరిశుద్ధాలయపు అలంకారం కోసం లెబానోను శ్రేష్ఠమైన దేవదారు వృక్షాలూ సరళవృక్షాలూ గొంజిచెట్లూ నీ దగ్గరికి తెస్తారు. నేను నా పాదాలు పెట్టుకునే స్థలాన్ని ఘనంగా చేస్తాను.
14 And the sons of those who humiliate you will approach and will bow down before you. And all who detract you will reverence the path of your feet. And they will call you the City of the Lord, the Zion of the Holy One of Israel.
౧౪నిన్ను బాధించినవారి కొడుకులు నీ ఎదుటికి వచ్చి సాగిలపడతారు. నిన్ను తృణీకరించినవారంతా వచ్చి నీ పాదాల మీద పడతారు. యెహోవా పట్టణం అనీ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోను అనీ నీకు పేరు పెడతారు.
15 For though you were forsaken, and held in hatred, and there was no one who would pass near you, I will establish you as an everlasting glory, as a gladness from generation to generation.
౧౫నిన్ను విడిచి పెట్టకుండా ఎవరూ నిన్ను ద్వేషించకుండా నీ ద్వారా ఎవరూ వెళ్ళకుండా ఉండడానికి బదులు నిన్ను ఎప్పటికీ హుందాగా ఉండేలా తరతరాలకు సంతోష కారణంగా చేస్తాను.
16 And you will drink the milk of the Gentiles, and you will be nursed at the breasts of kings, and you will know that I am the Lord, your Savior and your Redeemer, the Strong One of Jacob.
౧౬రాజ్యాల పాలుకూడా నువ్వు తాగుతావు. రాజుల చనుపాలు తాగుతావు. యెహోవానైన నేను నీ రక్షకుడిననీ యాకోబు బలవంతుడైన దేవుడిననీ నీ విమోచకుడిననీ నువ్వు తెలుసుకుంటావు.
17 In exchange for brass, I will bring gold; and in exchange for iron, I will bring silver; and for wood, brass; and for stones, iron. And I will make your visitation into peace, and your leaders into justice.
౧౭నేను కంచుకు బదులు బంగారాన్నీ ఇనుముకు బదులు వెండినీ చెక్కకు బదులు ఇత్తడినీ రాళ్ళకు బదులు ఇనుమునూ తెస్తాను. శాంతిని నీకు అధికారులుగా న్యాయాన్ని నీకు పరిపాలకులుగా నియమిస్తాను.
18 Iniquity will no longer be heard in your land, nor devastation and destruction in your borders. And salvation will occupy your walls, and praise will occupy your gates.
౧౮ఇకనుంచి నీ దేశంలో దుర్మార్గం అనే మాట వినబడదు. నీ సరిహద్దుల్లో నాశనం, ధ్వంసం అనే మాటలు వినబడవు. నీ గోడలను విడుదల అనీ నీ ద్వారాలను స్తుతి అనీ అంటావు.
19 The sun will no longer be your light by day, nor will the brightness of the moon illuminate you. Instead, the Lord will be an everlasting light for you, and your God will be your glory.
౧౯ఇక మీదట పగటివేళ సూర్య కాంతి నీకు వెలుగుగా ఉండదు. వెన్నెల నీ మీద ప్రకాశింపదు. యెహోవాయే నీకు ఎప్పటికీ నిలిచిపోయే కాంతి. నీ దేవుడు నీకు శోభ.
20 Your sun will no longer set, and your moon will not diminish. For the Lord will be an everlasting light for you, and the days of your mourning will be completed.
౨౦నీ సూర్యుడు ఇక ఎన్నటికీ అస్తమించడు. నీ వెన్నెల తగ్గదు. యెహోవాయే నీకు ఎప్పటికీ నిలిచిపోయే కాంతి. నీ దుఃఖదినాలు అంతం అవుతాయి.
21 And your people will all be just. They will inherit the earth in perpetuity, the seedling of my planting, the work of my hand, so as to glorify me.
౨౧నీ ప్రజలంతా నీతిమంతులుగా ఉంటారు. దేశం ఎప్పటికీ వారి స్వాధీనంలో ఉంటుంది. వారు నా ఘనత కోసం నేను నాటిన కొమ్మ. నేను చేసిన పని.
22 The least will become a thousand, and a little one will become a very strong nation. I, the Lord, will accomplish this, suddenly, in its time.
౨౨అల్పుడు వేయిమంది అవుతాడు. చిన్నవాడు బలమైన జనం అవుతాడు. నేను యెహోవాను. తగిన కాలంలో వీటిని త్వరగా జరిగిస్తాను.