< Isaiah 13 >
1 The burden of Babylon which Isaiah, the son of Amoz, saw.
౧బబులోనును గూర్చి ఆమోజు కొడుకు యెషయా స్వీకరించిన ప్రకటన.
2 Over the foggy mountain lift up a sign! Raise the voice, lift up the hand, and let the rulers enter through the gates!
౨చెట్లు లేని కొండ మీద గుర్తు కోసం ఒక జెండా పాతండి. ప్రజలు ప్రధానుల ద్వారాల్లో ప్రవేశించమని కేకపెట్టి వాళ్ళను పిలిచి, చెయ్యి ఊపి సైగ చెయ్యండి.
3 In my wrath, I commanded my sanctified ones, and I called my strong ones, those who exult in my glory.
౩నాకు ప్రతిష్ఠితులైన వాళ్లకు నేను ఆజ్ఞ ఇచ్చాను. నా కోపం అమలు చెయ్యమని నా శూరులను పిలిచాను. నా ప్రభావాన్నిబట్టి ఆనందించే వాళ్ళను పిలిపించాను.
4 On the mountains, there is the voice of a multitude, as if of a numerous people, a voice with the sound of kings, of nations gathered together. For the Lord of hosts has given orders to soldiers of war,
౪కొండల్లో ఒక పెద్ద జనసమూహం ఉన్నట్టు వినిపిస్తున్న ఆ శబ్దం వినండి. సమకూడుతున్న రాజ్యాల ప్రజలు చేసే అల్లరి శబ్దం వినండి. సైన్యాలకు అధిపతి అయిన యెహోవా యుద్ధం కోసం తన సైన్యాన్ని సిద్ధం చేస్తున్నాడు.
5 to those who are arriving from a far off land, from the heights of the heavens. It is the Lord and the instruments of his fury, so that he may bring ruin to all the earth.
౫సర్వలోకాన్ని పాడు చెయ్యడానికి దూర దేశం నుంచీ, ఆకాశపు అంచుల నుంచీ యెహోవా, ఆయన తీర్పు అమలు చేసే సాధనాలు వస్తున్నారు.
6 Wail aloud! For the day of the Lord draws near! It will arrive like a devastation from the Lord.
౬బిగ్గరగా అరవండి, ఎందుకంటే, యెహోవా దినం దగ్గరపడింది. అది సర్వశక్తుడైన దేవుని దగ్గర నుండి విధ్వంసం తెస్తుంది.
7 Because of it, every hand will fail, and every heart of man will waste away and be crushed.
౭అందువలన చేతులన్నీ బలహీనమై వేలాడతాయి, ప్రతివాడి గుండె కరిగిపోతుంది.
8 Writhing and pain will seize them. They will be in pain, like a woman in labor. Each one will appear stupefied to his neighbor. Their countenances will be like faces which have been burned up.
౮ప్రజలు భయభ్రాంతులౌతారు. పురిటినొప్పులు పడే స్త్రీలాగా వాళ్లకు వేదనలు, దుఃఖాలు కలుగుతాయి. ఒకరినొకరు విస్తుపోయి చూసుకుంటారు. వాళ్ళ ముఖాలు మండిపోతూ ఉంటాయి.
9 Behold, the day of the Lord approaches: a cruel day, full of indignation and wrath and fury, which will place the earth in solitude and crush the sinners from it.
౯యెహోవా దినం వస్తోంది. దేశాన్ని పాడు చెయ్యడానికీ, పాపులు దానిలో ఉండకుండా పూర్తిగా నాశనం చెయ్యడానికీ క్రూరమైన ఉగ్రతతో, ప్రచండమైన కోపంతో అది వస్తోంది.
10 For the stars of the heavens, in their splendor, will not display their light. The sun will be obscured at its rising, and the moon will not shine in her brightness.
౧౦ఆకాశ నక్షత్రాలు, నక్షత్రరాసులు తమ వెలుగును ఇయ్యవు. ఉదయం నుంచే సూర్యుణ్ణి చీకటి కమ్ముతుంది. చంద్రుడు ప్రకాశించడు.
11 And I will act against the evils of the world, and against the impious for their iniquity. And I will cause the pride of the unfaithful to cease, and I will bring down the arrogance of the strong.
౧౧చెడుతనాన్ని బట్టి ఈ లోకాన్నీ, తమ దోషాన్ని బట్టి దుష్టులనూ శిక్షిస్తాను. గర్విష్టుల అహంకారం అంతమొందిస్తాను. క్రూరుల అహంకారం అణిచివేస్తాను.
12 A man will be more precious than gold, and mankind will become like pure refined gold.
౧౨బంగారం కన్నా మనుషులనూ, ఓఫీరు దేశపు సువర్ణం కన్నా మానవజాతినీ అరుదుగా ఉండేలా చేస్తాను.
13 For this purpose, I will stir up heaven, and the earth will be moved from its place, because of the indignation of the Lord of hosts, because of the day of his furious wrath.
౧౩సైన్యాలకు అధిపతి అయిన యెహోవా కోపాగ్ని కురిసే రోజున, ఆయన ఉగ్రతకు ఆకాశం వణికేలా, భూమి తన స్థానం తప్పేలా నేను చేస్తాను.
14 And they will be like a doe fleeing away, or like sheep; and there will be no one who may gather them together. Each one will turn to his own people, and every one will flee to his own land.
౧౪అప్పుడు వేటకు గురైన జింకలాగా, పోగుచెయ్యని గొర్రెల్లాగా ప్రజలు తమ తమ స్వజాతి వైపు తిరుగుతారు. తమ స్వదేశాలకు పారిపోతారు.
15 All who are found will be killed, and all who are caught unaware will fall by the sword.
౧౫దొరికిన ప్రతివాడూ కత్తివాత కూలుతాడు. బందీగా దొరికిన ప్రతివాడూ ఖడ్గంతో చనిపోతాడు.
16 Their infants will be thrown down violently before their eyes. Their houses will be plundered, and their wives will be violated.
౧౬వాళ్ళు చూస్తూ ఉండగా వాళ్ళ పసిపిల్లలను విసిరి కొట్టినప్పుడు ముక్కలౌతారు. వాళ్ళ ఇళ్ళు దోపిడీ అవుతాయి. వాళ్ళ భార్యలు అత్యాచారానికి గురౌతారు.
17 Behold, I will stir up the Medes against them. They will not seek silver, nor desire gold.
౧౭చూడు, వాళ్ళ మీద దాడి చెయ్యడానికి నేను మాదీయులను రేపడానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు వెండిని పట్టించుకోరు. బంగారం కూడా వాళ్ళకు ఆనందం కలిగించదు.
18 Instead, with their arrows, they will put the little children to death, and they will take no pity on breastfeeding women, and their eye will not spare their children.
౧౮వాళ్ళ బాణాలు యువకులను చీలుస్తాయి. దూసుకుపోతాయి. వాళ్ళు పిల్లలను విడిచిపెట్టరు, పసిపిల్లల మీద దయ చూపించరు.
19 And then Babylon, the glorious one among kingdoms, that famous pride of the Chaldeans, will be destroyed, even as the Lord destroyed Sodom and Gomorrah.
౧౯అప్పుడు రాజ్యాల్లో గొప్పదిగా, కల్దీయుల శోభకూ, అతిశయానికీ కారణమైన బబులోను, దేవుడు పాడుచేసిన సొదొమ గొమొర్రాల్లాగా అవుతుంది.
20 It will not be inhabited, even unto the end, and it will not be reestablished, even from generation to generation. The Arab will not pitch his tents there, nor will the shepherds take rest there.
౨౦అది ఇంకెన్నడూ నివాసస్థలంగా ఉండదు. తరతరాల్లో ఇంక దానిలో ఎవడూ కాపురం ఉండడు. అరబీయుడు అక్కడ తన గుడారం వెయ్యడు. గొర్రెల కాపరులు తమ మందలను అక్కడ విశ్రాంతి తీసుకోనివ్వరు.
21 Instead, the wild beasts will rest there, and their houses will be filled with serpents, and ostriches will live there, and the hairy ones will leap about there.
౨౧ఎడారి మృగాలు అక్కడ ఉంటాయి. వాళ్ళ ఇళ్ళ నిండా గుడ్లగూబలు, నిప్పుకోళ్ళూ ఉంటాయి. కొండమేకలు అక్కడ గంతులు వేస్తాయి.
22 And the tawny owls will answer one another there, in its buildings, and the Sirens in its shrines of pleasure.
౨౨వాళ్ళ కోటల్లో అడవి కుక్కలూ, వాళ్ళ అందమైన రాజమందిరాల్లో నక్కలూ అరుస్తాయి. దాని కాలం దగ్గరపడింది. దాని రోజులు ఇక ఆలస్యం కావు.