< Genesis 47 >
1 And so Joseph entered and reported to Pharaoh, saying: “My father and brothers, their sheep and herds, and everything that they possess, have arrived from the land of Canaan. And behold, they stand together in the land of Goshen.”
౧యోసేపు వెళ్ళి ఫరోతో “మా నాన్న, నా అన్నలు వారి గొర్రెల మందలతో వారి పశువులతో వారికి కలిగినదంతటితో కనాను దేశం నుండి వచ్చి గోషెనులో ఉన్నారు” అని తెలియచేసి,
2 Likewise, he stood in the sight of the king five men, the last of his brothers.
౨తన సోదరుల్లో ఐదు గురిని వెంటబెట్టుకుని వెళ్లి వారిని ఫరో ముందు నిలబెట్టాడు.
3 And he questioned them, “What do you have for work?” They responded: “Your servants are pastors of sheep, both we and our fathers.
౩ఫరో, అతని సోదరులను చూసి “మీ వృత్తి ఏంటి?” అని అడిగితే వారు “నీ దాసులమైన మేమూ మా పూర్వికులు, గొర్రెల కాపరులం” అని ఫరోతో చెప్పారు.
4 We came to sojourn in your land, because there is no grass for the flocks of your servants, the famine being very grievous in the land of Canaan. And we petition you that you may order us, your servants, to be in the land of Goshen.”
౪వారు “కనాను దేశంలో కరువు తీవ్రంగా ఉంది. నీ దాసుల మందలకు మేత లేదు కాబట్టి ఈ దేశంలో కొంత కాలముండడానికి వచ్చాము. గోషెను ప్రాంతంలో నీ దాసులు నివసించడానికి సెలవు ఇప్పించండి” అని ఫరోతో అన్నారు.
5 And so the king said to Joseph: “Your father and brothers have come to you.
౫ఫరో యోసేపును చూసి “మీ నాన్న, నీ సోదరులు నీ దగ్గరికి వచ్చారు.
6 The land of Egypt is in your sight. Cause them to live in the best place, and deliver to them the land of Goshen. And if you know there to be industrious men among them, appoint these as foremen over my cattle.”
౬ఐగుప్తు దేశం నీ ఎదుట ఉంది. ఈ దేశంలోని మంచి ప్రాంతంలో మీ నాన్న, నీ సోదరులూ నివసించేలా చెయ్యి. గోషెను ప్రాంతంలో వారు నివసించవచ్చు. వారిలో ఎవరైనా సమర్ధులని నీకు అనిపిస్తే నా మందల మీద వారిని అధిపతులుగా నియమించు” అని చెప్పాడు.
7 After this, Joseph brought in his father to the king, and he stood him in his sight. He blessed him,
౭యోసేపు తన తండ్రి యాకోబును లోపలికి తీసుకు వచ్చి ఫరో ముందు నిలబెట్టినప్పుడు, యాకోబు ఫరోను దీవించాడు.
8 and he questioned him: “How many are the days of the years of your life?”
౮ఫరో “నీ వయసెంత?” అని యాకోబును అడిగాడు.
9 He responded, “The days of my sojourn are one hundred and thirty years, few and unworthy, and they do not reach even to the days of the sojourning of my fathers.”
౯యాకోబు “నేను ప్రయాణాలు చేసినవి 130 ఏళ్ళు. నా జీవించిన దినాలు కొద్డిగానూ బాధాకరమైనవిగానూ ఉన్నాయి. అవి నా పూర్వీకులు యాత్ర చేసిన సంవత్సరాలన్ని కాలేదు” అని ఫరోతో చెప్పి,
10 And blessing the king, he went outside.
౧౦ఫరోను దీవించి వెళ్ళిపోయాడు.
11 Truly, Joseph gave his father and brothers a possession in Egypt, in the best place of the land, in Rameses, as Pharaoh had instructed.
౧౧ఫరో ఆజ్ఞ ఇచ్చినట్లే, యోసేపు తన తండ్రికీ తన సోదరులకూ ఐగుప్తు దేశంలో రామెసేసు అనే మంచి ప్రదేశంలో స్వాస్థ్యం ఇచ్చాడు.
12 And he fed them, along with all his father’s house, providing portions of food to each one.
౧౨యోసేపు తన తండ్రినీ తన సోదరులనూ తన తండ్రి కుటుంబం వారినందరినీ పోషిస్తూ వారి పిల్లల లెక్క ప్రకారం ఆహారమిచ్చి సంరక్షించాడు.
13 For in the whole world there was a lack of bread, and a famine had oppressed the land, most of all Egypt and Canaan,
౧౩కరువు చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ఆ దేశమంతటా ఆహారం లేదు. కరువుతో ఐగుప్తు దేశం, కనాను దేశం దుర్బలమైన స్థితికి వచ్చాయి.
14 from which he gathered together all the money for the grain that they bought, and he took it into the treasury of the king.
౧౪యోసేపు ప్రజలకు ధాన్యం అమ్ముతూ ఐగుప్తు దేశంలోనూ కనాను దేశంలోనూ ఉన్న డబ్బంతా పోగుచేశాడు. ఆ డబ్బంతా, ఫరో భవనంలోకి యోసేపు తెప్పించాడు.
15 And when the buyers had run out of money, all Egypt came to Joseph, saying: “Give us bread. Why should we die in your sight, lacking money?”
౧౫ఐగుప్తు దేశంలో కనాను దేశంలో డబ్బు అయిపోయిన తరువాత ఐగుప్తీయులంతా యోసేపు దగ్గరికి వచ్చి “మాకు ఆహారం ఇప్పించు. నీ ముందు మేమెందుకు చావాలి? మా డబ్బంతా అయిపోయింది” అన్నారు.
16 And he responded to them: “Bring me your cattle, and I will give food to you in exchange for them, if you do not have money.”
౧౬అందుకు యోసేపు “మీ పశువులు ఇవ్వండి, మీ డబ్బులు అయిపోతే మీ పశువులకు బదులు నేను మీకు ధాన్యమిస్తాను” అని చెప్పాడు.
17 And when they had brought them, he gave them food for their horses, and sheep, and oxen, and donkeys. And he sustained them in that year in exchange for their cattle.
౧౭కాబట్టి వారు తమ పశువులను యోసేపు దగ్గరికి తెచ్చారు. ఆ సంవత్సరం, వారి మందలన్నిటికి బదులుగా అతడు వారికి ఆహారమిచ్చి వారిని పోషించాడు.
18 Likewise, they came the second year, and they said to him: “We will not conceal from our lord that our money is gone; likewise our cattle are gone. Neither are you unaware that we have nothing left but our bodies and our land.
౧౮ఆ సంవత్సరం గడిచాక, తరువాత సంవత్సరం వారు అతని దగ్గరికి వచ్చి “మా డబ్బంతా అయిపోయింది. ఆ సంగతి మా యజమానులైన మీ దగ్గర దాచలేము. మా పశువుల మందలన్నీ మా యజమానులైన మీ వశమయ్యాయి. మా శరీరాలూ మా భూములూ తప్ప ఇంకేమీ మాకు మిగలలేదు.
19 Therefore, why should you watch us die? Both we and our land will be yours. Buy us into royal servitude, but provide seed, lest by the dying off of cultivators the land be reduced to a wilderness.”
౧౯మీ కళ్ళముందు మేమూ మా పొలాలు ఎందుకు నశించాలి? ఆహారమిచ్చి మమ్మల్నీ మా పొలాలనూ కొనండి. మా పొలాలతో పాటు మేము ఫరోకు దాసులమవుతాం. మేము చావకుండా బతికేలా, పొలాలు పాడైపోకుండా మాకు విత్తనాలివ్వండి” అని అడిగారు.
20 Therefore, Joseph bought all the land of Egypt, each one selling his possessions because of the magnitude of the famine. And he subjected it to Pharaoh,
౨౦ఆవిధంగా, యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ ఫరో కోసం కొన్నాడు. కరువు ఇగుప్తు వారిపాలిట తీవ్రంగా ఉండడం వలన వారంతా తమ పొలాలను అమ్మేశారు కాబట్టి, భూమి ఫరోది అయింది.
21 along with all of its people, from the newest borders of Egypt, even to its furthest limits,
౨౧అతడు ఐగుప్తు పొలిమేరల ఈ చివరనుండి ఆ చివర వరకూ ప్రజలను దాసులుగా చేశాడు.
22 except the land of the priests, which had been delivered to them by the king. To these also a portion of food was supplied out of the public storehouses, and, for this reason, they were not compelled to sell their possessions.
౨౨యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు, యాజకులకు ఫరో భత్యం నియమించాడు. వారు ఫరో ఇచ్చిన ఆహారం తినే వారు కాబట్టి వారు తమ భూములను అమ్మలేదు.
23 Therefore, Joseph said to the people: “So, as you discern, both you and your lands are possessed by Pharaoh; take seed and sow the fields,
౨౩యోసేపు “ఇదిగో నేడు మిమ్మల్ని, మీ భూములను ఫరో కోసం కొన్నాను. మీకు విత్తనాలు ఇవిగో. పొలాల్లో చల్లండి.
24 so that you may be able to have grain. One fifth part you will give to the king; the remaining four I permit to you, as seed and as food for your families and children.
౨౪నాలుగు భాగాలు మీవి. పంటలో అయిదవ భాగం మీరు ఫరోకు ఇవ్వాలి. అది పొలాల్లో విత్తడానికీ మీ పిల్లలకూ మీ ఇంట్లోవారి ఆహారానికి” అని ప్రజలతో చెప్పాడు.
25 And they responded: “Our health is in your hand; only let our lord look kindly upon us, and we will serve the king with gladness.”
౨౫వారు “నువ్వు మా ప్రాణాలు నిలబెట్టావు. మాపై నీ దయ ఉండుగాక. మేము ఫరోకు బానిసలమవుతాం” అని చెప్పారు.
26 From that time, even to the present day, in the entire land of Egypt, the fifth part is turned over to the kings, and it has become like a law, except in the land of the priests, which was free from this condition.
౨౬అప్పుడు ఐదవ భాగం ఫరోది అని యోసేపు ఐగుప్తు వారికి చట్టం నియమించాడు. అది ఇప్పటివరకూ నిలిచి వుంది. యాజకుల భూములు మాత్రమే ఫరోవి కాలేదు.
27 And so, Israel lived in Egypt, that is, in the land of Goshen, and he possessed it. And he increased and was multiplied exceedingly.
౨౭ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలోని గోషెను ప్రాంతంలో నివసించారు. అందులో వారు ఆస్తి సంపాదించుకుని సంతానాభివృద్ధి పొంది చాలా విస్తరించారు.
28 And he lived in it seventeen years. And all the days of his life that passed were one hundred and forty-seven years.
౨౮యాకోబు ఐగుప్తుదేశంలో 17 ఏళ్ళు జీవించాడు. యాకోబు మొత్తం 147 ఏళ్ళు బతికాడు.
29 And when he discerned that the day of his death was approaching, he called his son Joseph, and he said to him: “If I have found favor in your sight, place your hand under my thigh. And you shall show me mercy and truth, not to bury me in Egypt.
౨౯ఇశ్రాయేలు అవసాన కాలం దగ్గర పడినప్పుడు అతడు తన కొడుకు యోసేపును పిలిపించి “నాపట్ల నీకు అభిమానం ఉంటే, నీ చెయ్యి నా తొడ కింద ఉంచి నాకు నమ్మకాన్నీ విశ్వాసాన్నీ కలిగించు. దయచేసి నన్ను ఐగుప్తులో పాతిపెట్టవద్దు.
30 But I shall sleep with my fathers, and you will carry me from this land and bury me in the sepulcher of my ancestors.” And Joseph answered him, “I will do what you have ordered.”
౩౦నేను నా పితరులతో నిద్రించినప్పుడు ఐగుప్తులో నుంచి నన్ను తీసుకెళ్ళి, వారి సమాధిలో నన్ను పాతిపెట్టు” అని అతనితో చెప్పాడు.
31 And he said, “Then swear it to me.” And as he was swearing, Israel adored God, turning to the head of his resting place.
౩౧అందుకు యోసేపు “నేను నీ మాట చొప్పున చేస్తాను” అన్నాడు. ఇశ్రాయేలు “నాతో ప్రమాణం చెయ్యి” అంటే, యోసేపు అతనితో ప్రమాణం చేశాడు. అప్పుడు ఇశ్రాయేలు తన పడక తలగడ దగ్గర వంగి నమస్కరించాడు.