< Deuteronomy 8 >
1 “All the commandments which I am entrusting to you this day, take care to observe them diligently, so that you may live and be multiplied, and so that, upon entering, you may possess the land, about which the Lord swore to your fathers.
౧“మీరు జీవించి, ఫలించి యెహోవా మీ పితరులకు వాగ్దానం చేసిన దేశంలో ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకునేలా ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని పాటించాలి.
2 And you shall remember the entire journey along which the Lord your God led you, for forty years through the desert, to afflict you, and to test you, and to make known the things that were turning in your soul, whether or not you would keep his commandments.
౨మీరు ఆయన ఆజ్ఞలను పాటిస్తారో లేదో మిమ్మల్ని పరీక్షించి మీ హృదయాన్ని తెలుసుకోడానికీ, మిమ్మల్ని లోబరచుకోడానికీ మీ యెహోవా దేవుడు అరణ్యంలో ఈ 40 సంవత్సరాలు మిమ్మల్ని నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి.
3 He afflicted you with need, and he gave you Manna as your food, which neither you nor your fathers knew, so as to reveal to you that it is not by bread alone that man lives, but by every word that goes forth from the mouth of God.
౩రొట్టె వలన మాత్రమే కాక యెహోవా పలికిన ప్రతి మాట వలన మనుషులు జీవిస్తారని మీకు తెలిసేలా చేయడానికి ఆయన మిమ్మల్ని అణగదొక్కి, మీకు ఆకలి కలిగించి, మీరు గాని, మీ పూర్వీకులు గాని ఎప్పుడూ చూడని మన్నాతో మిమ్మల్ని పోషించాడు.
4 Your garment, with which you were covered, has by no means decayed due to age, and your foot has not been worn down, even to this fortieth year,
౪ఈ 40 సంవత్సరాలు మీరు వేసుకున్న బట్టలు పాతబడిపోలేదు, మీ కాళ్ళు బరువెక్కలేదు.
5 so that you would recognize in your heart that, just as a man educates his son, so has the Lord your God educated you.
౫ఒక వ్యక్తి తన సొంత కొడుకుని ఏవిధంగా శిక్షిస్తాడో అదే విధంగా మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని శిక్షిస్తాడని మీరు తెలుసుకోవాలి.
6 So may you keep the commandments of the Lord your God, and walk in his ways, and fear him.
౬ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయనకు భయపడుతూ మీ యెహోవా దేవుని ఆజ్ఞలను పాటించాలి.
7 For the Lord your God will lead you into a good land: a land of brooks and waters and fountains, in which deep rivers burst forth from its plains and mountains,
౭ఆయన నిన్ను ప్రవేశపెడుతున్న ఈ మంచి దేశం నీటి వాగులు, లోయలు కొండల నుండి పారే ఊటలు, అగాధ జలాలు గల దేశం.
8 a land of crops, barley, and vineyards, in which fig and pomegranate and olive trees spring up, a land of oil and honey.
౮దానిలో గోదుమలు, బార్లీ, ద్రాక్షచెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు ఉంటాయి. అది ఒలీవ నూనె, తేనె లభించే దేశం.
9 In that place, without any need, you shall eat your bread and enjoy an abundance of all things: where the stones are like iron, and where ore for brass is dug out of its mountains.
౯మీరు తినడానికి ఆహారం పుష్కలంగా లభించే దేశం. అందులో మీకు దేనికీ కొదువ ఉండదు. అది ఇనపరాళ్లు గల దేశం. దాని కొండల్లో మీరు రాగిని తవ్వి తీయవచ్చు.
10 So then, when you have eaten and been satisfied, you should bless the Lord your God for the excellent land which he has given to you.
౧౦మీరు తిని తృప్తి పొంది మీ యెహోవా దేవుడు మీకిచ్చిన మంచి దేశాన్నిబట్టి ఆయన్ను స్తుతించాలి.
11 Be observant and cautious, lest at some time you may forget the Lord your God, and neglect his commandments, as well as the judgments and ceremonies, which I instruct to you this day.
౧౧ఈ రోజు నేను మీకాజ్ఞాపించే ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నిర్లక్ష్యం చేసి మీ దేవుడైన యెహోవాను మరచిపోకుండా జాగ్రత్త పడండి.
12 Otherwise, after you have eaten and been satisfied, and have built beautiful houses and have lived in them,
౧౨మీరు కడుపారా తిని, మంచి ఇళ్ళు కట్టించుకుని వాటిలో నివసిస్తారు.
13 and have obtained herds of oxen, and flocks of sheep, and a plentitude of gold and silver and all things,
౧౩మీ పశువులు, గొర్రెలు, మేకలు వృద్ధి చెంది, మీ వెండి బంగారాలు విస్తరించి, మీకు కలిగినదంతా వర్ధిల్లుతుంది.
14 your heart might be lifted up, and you might not remember the Lord your God, who led you away from the land of Egypt, from the house of servitude,
౧౪అప్పుడు మీ మనస్సు గర్వించి, బానిసల ఇల్లైన ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు యెహోవాను మరచిపోతారేమో.
15 and who was your leader in the great and terrible wilderness, in which there was the serpent with a burning breath, and the scorpion, and the snake of thirst, and no waters at all. He led streams out of the hardest rock,
౧౫బాధ కలిగించే పాములు, తేళ్లతో నిండి, నీళ్ళు లేని ఎడారిలాంటి భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన మిమ్మల్ని నడిపించాడు. రాతిబండ నుండి మీకు నీళ్లు రప్పించాడు.
16 and he nourished you in the wilderness with Manna, which your fathers had not known. And after he had afflicted and tested you, in the very end, he took pity on you.
౧౬చివరికి మీకు మేలు చేయాలని ఆయన మిమ్మల్ని అణగదొక్కి, మీకు ఆకలి కలిగించి, మీరు గాని మీ పూర్వీకులు గాని ఎప్పుడూ ఎరగని మన్నాతో మిమ్మల్ని పోషించాడు.
17 Otherwise, you might say in your heart: ‘My own strength, and the power of my own hand, have brought forth all these things for me.’
౧౭అయితే మీరు, ‘మా సామర్ధ్యం, మా బాహుబలమే మాకింత ఐశ్వర్యం కలిగించాయి’ అనుకుంటారేమో.
18 But remember the Lord your God, that he himself has provided you with strength, so that he may fulfill his covenant, about which he swore to your fathers, just as the present day reveals.
౧౮కాబట్టి మీరు దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే తాను మీ పూర్వీకులతో వాగ్దానం చేసినట్టు తన నిబంధనను ఈ రోజులాగా స్థాపించాలని మీరు ఐశ్వర్యం సంపాదించుకోడానికి మీకు సామర్ధ్యం కలిగించేవాడు ఆయనే.
19 But if you forget the Lord your God, so that you follow foreign gods, and serve and adore them: behold, I now foretell to you that you shall utterly perish.
౧౯మీరు మీ యెహోవా దేవుణ్ణి మరచిపోయి ఇతర దేవుళ్ళను అనుసరించి, వారిని పూజించి నమస్కరిస్తే మీరు తప్పకుండా నశించి పోతారని ఈ రోజు మీ విషయంలో నేను సాక్ష్యం పలుకుతున్నాను.
20 Just like the nations, which the Lord destroyed upon your arrival, so shall you also perish, if you have been disobedient to the voice of the Lord your God.”
౨౦యెహోవా మీ ఎదుట ఉండకుండా నాశనం చేస్తున్న ఇతర జాతుల ప్రజలు విననట్టు మీ దేవుడైన యెహోవా మాట వినకపోతే మీరు కూడా వారిలాగానే నాశనమౌతారు.”