< 2 Timothy 3 >
1 And know this: that in the last days perilous times will press near.
౧చివరి దినాల్లో అపాయకరమైన రోజులు వస్తాయని నీవు గ్రహించాలి.
2 Men will be lovers of themselves, greedy, self-exalting, arrogant, blasphemers, disobedient to parents, ungrateful, wicked,
౨మనుషులు స్వార్థపరులుగా, ధనాశపరులుగా, గొప్పలు చెప్పుకొనేవారుగా ఉంటారు. వారు గర్విష్టులు, దైవ దూషణ చేసేవారు, కన్నవారికి అవిధేయులు, చేసిన మేలు మరిచేవారు, అపవిత్రులు,
3 without affection, without peace, false accusers, unchaste, cruel, without kindness,
౩బొత్తిగా సహజ ప్రేమ లేనివారు, ఇతరులతో సామరస్యంగా ఉండలేనివారు, దుర్భాషలాడేవారు, నిగ్రహం లేనివారు, క్రూరులు, మంచిని ద్వేషించేవారు.
4 traitorous, reckless, self-important, loving pleasure more than God,
౪వారు ద్రోహులు, తలబిరుసు మనుషులు, గర్వాంధులు, దేవునికంటే శరీర సౌఖ్యాన్నే ఎక్కువగా ప్రేమించేవారు.
5 even having the appearance of piety while rejecting its virtue. And so, avoid them.
౫వారు పైకి భక్తి గలవారిలా ఉంటారు గానీ దాని శక్తిపై ఆధారపడరు. వారికి దూరంగా ఉండు.
6 For among these are ones who penetrate houses and lead away, like captives, foolish women burdened with sins, who are led away by means of various desires,
౬ఇలాంటి వారు బలహీన మనస్తత్వం గల స్త్రీల ఇళ్ళలోకి చొరబడి వారిని వశం చేసుకుంటారు. ఈ స్త్రీలు అపరాధ భావనలతో కుంగిపోయి రకరకాల వాంఛలతో కొట్టుకు పోయేవారుగా ఉంటారు.
7 always learning, yet never achieving knowledge of the truth.
౭వాక్యాన్ని అస్తమానం నేర్చుకుంటూనే ఉన్నా వీరు సత్యం విషయమైన జ్ఞానాన్ని పొందలేరు.
8 And in the same manner that Jannes and Jambres resisted Moses, so also will these resist the truth, men corrupted in mind, reprobates from the faith.
౮యన్నే, యంబ్రే అనేవారు మోషేను ఎదిరించినట్టు వీరు కూడా చెడిపోయిన మనసు కలిగి విశ్వాసం విషయంలో భ్రష్టులై సత్యాన్ని ఎదిరిస్తారు.
9 But they will not advance beyond a certain point. For the folly of the latter shall be made manifest to all, just as that of the former.
౯అయితే వారిద్దరి అవివేకం ఏ విధంగా బయటపడిందో ఆలాగే వీరిది కూడా అందరికీ వెల్లడి అవుతుంది కాబట్టి వీరు ఇంకా ముందుకి సాగలేరు.
10 But you have fully comprehended my doctrine, instruction, purpose, faith, longsuffering, love, patience,
౧౦నీవు మాత్రం నా బోధనూ, ప్రవర్తననూ, ఉద్దేశాన్నీ, విశ్వాసాన్నీ, సహనాన్నీ, ప్రేమనూ, ఓర్పునూ అనుకరించావు.
11 persecutions, afflictions; such things as happened to me at Antioch, at Iconium, and at Lystra; how I endured persecutions, and how the Lord rescued me from everything.
౧౧అంతియొకయ, ఈకొనియ, లుస్త్ర అనే పట్టణాల్లో నేను అనుభవించిన హింసలనూ ప్రమాదాలనూ ఎరిగే నన్ను వెంబడించావు. అలాంటి హింసలు నేను సహించాను గాని, వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించాడు.
12 And all those who willingly live the piety in Christ Jesus will suffer persecution.
౧౨క్రీస్తు యేసులో సద్భక్తితో జీవించాలని కోరేవారంతా హింస పొందుతారు.
13 But evil men and deceivers will advance in evil, erring and sending into error.
౧౩అయితే చెడ్డ వారూ, వంచకులూ ఇతరులను మోసపరుస్తూ తాము కూడా మోసపోతూ అంతకంతకూ చెడిపోతారు.
14 Yet truly, you should remain in those things which you have learned and which have been entrusted to you. For you know from whom you have learned them.
౧౪కానీ నీవు మాత్రం కచ్చితంగా తెలుసుకున్న వాటిని ఎవరి ద్వారా నేర్చుకున్నావో గ్రహించి వాటిలో నిలకడగా సాగిపో.
15 And, from your infancy, you have known the Sacred Scriptures, which are able to instruct you toward salvation, through the faith which is in Christ Jesus.
౧౫ఎందుకంటే క్రీస్తు యేసులో విశ్వాసం ద్వారా పాప విముక్తినిచ్చే జ్ఞానాన్ని నీకు కలిగించే శక్తిగల పరిశుద్ధ లేఖనాలు బాల్యం నుండీ నీకు తెలుసు.
16 All Scripture, having been divinely inspired, is useful for teaching, for reproof, for correction, and for instruction in justice,
౧౬దేవుని సేవకుడు సిద్ధపడి ప్రతి మంచి పనినీ జరిగించడానికి పూర్తి సన్నాహంతో ఉండాలి. అందుకోసమే ప్రతి లేఖనం దైవావేశం వలన ఉనికిలోకి వచ్చింది. అది బోధించడానికీ, ఖండించడానికీ, తప్పు దిద్దడానికీ, నీతిలో శిక్షణ ఇవ్వడానికీ తోడ్పడుతుంది.
17 so that the man of God may be perfect, having been trained for every good work.
౧౭