< 1 Samuel 6 >
1 Now the ark of the Lord was in the region of the Philistines for seven months.
౧యెహోవా మందసం ఏడు నెలలపాటు ఫిలిష్తీయుల దేశంలో ఉంది.
2 And the Philistines called for the priests and the diviners, saying: “What shall we do with the ark of the Lord? Reveal to us in what manner we should send it back to its place.” And they said:
౨ఫిలిష్తీయులు యాజకులనూ శకునం చూసేవారిని పిలిపించి “యెహోవా మందసాన్ని ఏం చేద్దాం? అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడకి పంపడానికి ఏమి చేయాలో చెప్పండి” అని అడిగారు. అందుకు వారు,
3 “If you send back the ark of the God of Israel, do not choose to release it empty. Instead, repay to him what you owe because of sin. And then you will be cured. And you will know why his hand did not withdraw from you.”
౩“ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని పంపివేసే పక్షంలో ఉచితంగా పంపవద్దు. ఎలాగైనా ఆయనకు అపరాధ పరిహారం అర్పణంగా చెల్లించి పంపాలి. అప్పుడు మీరు బాగుపడి ఆయన కోపం మీ మీద నుండి ఇప్పటిదాకా ఎందుకు తొలగి పోలేదో తెలుసుకుంటారు” అని జవాబిచ్చారు.
4 And they said, “What is it that we ought to repay to him because of transgression?” And they responded:
౪ఫిలిష్తీయులు “మనం ఆయనకు పరిహారంగా చెల్లించాల్సిన అర్పణ ఏమిటి?” అని వారిని అడగగా వారు “మిమ్మలనూ మీ పెద్దలనూ పీడిస్తున్న తెగులు ఒక్కటే కాబట్టి ఫిలిష్తీయుల పెద్దల లెక్క ప్రకారం ఐదు బంగారపు గడ్డల రూపాలు, ఐదు బంగారపు పందికొక్కుల రూపాలు చెల్లించాలి.
5 “In accord with the number of the provinces of the Philistines, you shall fashion five gold cysts and five gold mice. For the same plague has been upon all of you and your princes. And you shall fashion a likeness of your cysts and a likeness of the mice, which have destroyed the land. And so shall you give glory to the God of Israel, so that perhaps he may lift off his hand from you, and from your gods, and from your land.
౫కాబట్టి మీకు వచ్చిన గడ్డలకూ భూమిని పాడు చేసే పందికొక్కులకూ సూచనగా ఉన్న ఈ గడ్డలను, పందికొక్కుల రూపాలను తయారుచేసి పంపించి ఇశ్రాయేలీయుల దేవునికి మహిమ కలిగించాలి. అప్పుడు మీకూ మీ దేవుళ్ళకూ మీ భూమికీ కీడు కలిగిస్తున్న ఆయన తన హస్తాన్ని తొలగించవచ్చు.
6 Why have you hardened your hearts, just as Egypt and Pharaoh hardened their hearts? After he was struck, did he not then release them, and they went away?
౬ఐగుప్తీయులు, ఫరో తమ హృదయాలను కఠినం చేసుకొన్నట్టు మీ మనసులను మీరెందుకు కఠినం చేసుకుంటారు? ఆయన వారి మధ్య అద్భుతాలు చేసినప్పుడు వారు ఈ ప్రజలను వెళ్ళనివ్వగా ఇశ్రాయేలీయులు వెళ్లిపోయారు కదా.
7 Now therefore, fashion and take a new cart, with two cows that have given birth, but on which no yoke has been imposed. And yoke them to the cart, but retain their calves at home.
౭కాబట్టి మీరు ఒక కొత్త బండి తయారు చేయించి, ఇంతవరకూ కాడి మోయని రెండు పాడి ఆవులను తెచ్చి, బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలివేసి,
8 And you shall take the ark of the Lord, and you shall place it upon the cart, with the articles of gold that you have paid to him on behalf of transgression. You shall place these in a little box at its side. And release it, so that it may go.
౮యెహోవా మందసాన్ని ఆ బండిమీద పెట్టి, పరిహారంగా ఆయనకు చెల్లించవలసిన బంగారపు వస్తువులను దాని పక్కనే చిన్న పెట్టెలో ఉంచి, ఆ బండి దాని దారిలో వెళ్ళేలా వదిలిపెట్టండి.
9 And you shall watch. And if, indeed, it ascends by the way of his own parts, toward Beth-shemesh, then he has done this great evil to us. But if not, then we shall know that it is by no means his hand that has touched us, but instead it happened by chance.”
౯అది బేత్షెమెషుకు వెళ్లే దారిలో ఈ దేశ సరిహద్దును దాటితే ఆయనే ఈ గొప్ప కీడు మనకు కలిగించాడని తెలుసుకోవచ్చు, ఆ దారిన వెళ్ళకపోతే ఆయన మనకి ఈ కీడు కలిగించలేదనీ, మన దురదృష్టం వల్లనే అది మనకు సంభవించిందనీ గ్రహించాలి” అన్నారు.
10 Therefore, they did it in this way. And taking two cows that were feeding calves, they yoked them to the cart, and they enclosed their calves at home.
౧౦ఆ విధంగా వారు రెండు పాడి ఆవులను తోలుకువచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంట్లో ఉంచి
11 And they placed the ark of God upon the cart, with the little box that held the gold mice and the likenesses of the cysts.
౧౧యెహోవా మందసాన్ని, బంగారు గడ్డల రూపాలూ పందికొక్కు రూపాలూ ఉన్న ఆ చిన్న పెట్టెను బండిమీద పెట్టారు.
12 But the cows went directly along the way that leads to Beth-shemesh. And they advanced only in one direction, lowing as they went. And they did not turn aside, neither to the right, nor to the left. Moreover, the princes of the Philistines followed them, as far as the borders of Beth-shemesh.
౧౨ఆ ఆవులు రహదారి వెంబడి సాఫీగా వెళ్తూ, రంకెలు వేస్తూ, బేత్షెమెషుకు వెళ్లే దారిలో నడిచాయి. ఫిలిష్తీయుల పెద్దలు వాటిని వెంబడిస్తూ బేత్షెమెషు సరిహద్దు వరకూ వెళ్లారు.
13 Now the Beth-shemeshites were harvesting wheat in the valley. And lifting up their eyes, they saw the ark, and they were glad when they had seen it.
౧౩బేత్షెమెషు ప్రజలు పొలంలో తమ గోదుమ పంట కోస్తున్నారు. వారు కన్నులెత్తి చూసినప్పుడు మందసం కనబడింది. దాన్ని చూసి వారు సంతోషించారు.
14 And the cart went into the field of Joshua, a Beth-shemeshite, and it stood still there. Now in that place was a great stone, and so they cut up the wood of the cart, and they placed the cows upon it as a holocaust to the Lord.
౧౪ఆ బండి బేత్షెమెషుకు చెందిన యెహోషువ అనే వాడి పొలంలోకి వచ్చి అక్కడ ఉన్న ఒక పెద్ద రాయి దగ్గర నిలిచింది. వారు బండికి ఉన్న కర్రలను నరికి ఆవులను యెహోవాకు దహనబలిగా అర్పించారు.
15 But the Levites took down the ark of God, and the little box that was at its side, in which were the articles of gold, and they placed them upon the great stone. Then the men of Beth-shemesh offered holocausts and immolated victims, on that day, to the Lord.
౧౫లేవీయులు యెహోవా మందసాన్ని, బంగారపు వస్తువులు ఉన్న ఆ చిన్న పెట్టెను కిందికి దించి ఆ పెద్ద రాతిమీద పెట్టినప్పుడు ఆ రోజు బేత్షెమెషు ప్రజలు యెహోవాకు దహనబలులు చేసి బలులు అర్పించారు.
16 And the five princes of the Philistines saw, and they returned to Ekron on the same day.
౧౬ఫిలిష్తీయుల పెద్దలు ఐదుగురు జరిగినదంతా చూసి అదే రోజున ఎక్రోను చేరుకున్నారు.
17 Now these are the gold cysts, which the Philistines repaid to the Lord for transgression: for Ashdod one, for Gaza one, for Ashkelon one, for Gath one, for Ekron one.
౧౭పరిహార అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏమంటే, అష్డోదు, గాజా, అష్కెలోను, గాతు, ఎక్రోను-ఈ ఐదు పట్టణాల ప్రజల కోసం ఒక్కొక్కటి.
18 And there were gold mice, according to the number of the cities of the Philistines, of the five provinces, from the fortified city to the village that was without a wall, and even to the great stone upon which they placed the ark of the Lord, which was, at last in that day, in the field of Joshua, the Beth-shemeshite.
౧౮ప్రాకారాలు ఉన్న పట్టణాలు, పొలాల్లో ఉండే గ్రామాలవారు, ఫిలిష్తీయుల ఐదుగురు పెద్దల పట్టణాలు అన్నిటి లెక్క ప్రకారం బంగారపు పందికొక్కులను అర్పించారు. యెహోవా మందసాన్ని కిందికి దింపిన పెద్దరాయి దీనికి సాక్ష్యం. ఇప్పటివరకూ ఆ రాయి బేత్షెమెషు వాడైన యెహోషువ పొలంలో ఉంది.
19 Then he struck down some of the men of Beth-shemesh, because they had seen the ark of the Lord. And he struck down some of the people: seventy men, and fifty thousand of the common people. And the people lamented, because the Lord had struck the people with a great slaughter.
౧౯బేత్షెమెషు ప్రజలు యెహోవా మందసాన్ని తెరచి చూసినప్పుడు దేవుడు వారిలో 70 మందిని హతం చేశాడు. యెహోవా కోపంతో అనేకులను దెబ్బ కొట్టగా ప్రజలు దుఃఖాక్రాంతులయ్యారు.
20 And the men of Beth-shemesh said: “Who will be able to stand in the sight of the Lord, this holy God? And who will ascend to him from us?”
౨౦అప్పుడు బేత్షెమెషు ప్రజలు “పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిలో ఎవరు నిలబడగలరు? ఇక్కడి నుండి ఆయన ఎవరి దగ్గరికి పోవాలో” అనుకుని
21 And they sent messengers to the inhabitants of Kiriath-jearim, saying: “The Philistines have returned the ark of the Lord. Descend and lead it back to you.”
౨౧కిర్యత్యారీము ప్రజల దగ్గరికి మనుషులను పంపించి “ఫిలిష్తీయులు యెహోవా మందసాన్ని తిరిగి తీసుకు వచ్చారు, మీరు వచ్చి మీ దగ్గరకి దాన్ని తీసుకు వెళ్ళండి” అని కబురు పంపించారు.