< 1 Corinthians 14 >

1 Pursue charity. Be zealous for spiritual things, but only so that you may prophesy.
ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆత్మ సంబంధమైన వరాలను ఆసక్తితో కోరుకోండి. ముఖ్యంగా దైవసందేశం ప్రకటించగలిగే వరం కోరుకోండి.
2 For whoever speaks in tongues, speaks not to men, but to God. For no one understands. Yet by the Spirit, he speaks mysteries.
ఎందుకంటే తెలియని భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు. అతడు పలికేది ఎవరికీ అర్థం కాదు. అతడు ఆత్మ ద్వారా రహస్య సత్యాలను పలుకుతున్నాడు.
3 But whoever prophesies speaks to men for edification and exhortation and consolation.
అయితే దైవసందేశం ప్రకటించేవాడు వినేవారికి క్షేమాభివృద్ధి, ఆదరణ, ఓదార్పు కలిగే విధంగా మనుషులతో మాట్లాడుతున్నాడు.
4 Whoever speaks in tongues edifies himself. But whoever prophesies edifies the Church.
భాషతో మాట్లాడేవాడు తనకు మాత్రం మేలు చేసుకుంటాడు గాని దైవసందేశం ప్రకటించేవాడు ఆదరణ, ఓదార్పు కలిగిస్తూ సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేస్తాడు.
5 Now I want you all to speak in tongues, but more so to prophesy. For he who prophesies is greater than he who speaks in tongues, unless perhaps he interprets, so that the Church may receive edification.
మీరంతా తెలియని భాషలతో మాట్లాడాలని నేను కోరుతున్నాను గాని, మీరు దైవసందేశం ప్రకటించేవారుగా ఉండాలని మరెక్కువగా కోరుతున్నాను. సంఘం అభివృద్ధి చెందడానికి భాషలతో మాట్లాడే వాడి కంటే (అర్థం చెబితే తప్ప) దేవుని పక్షంగా దేవుడు తెలియ చేసిన సందేశాన్ని ప్రకటించే వాడే గొప్పవాడు.
6 But now, brothers, if I were to come to you speaking in tongues, how would it benefit you, unless instead I speak to you in revelation, or in knowledge, or in prophecy, or in doctrine?
సోదరులారా, ఆలోచించండి. నేను మీ దగ్గరికి భాషలతో మాట్లాడుతూ వచ్చాననుకోండి. నా మాటలు మీకు అర్థం కాక, వాటిలో దేవుడు బయలు పరచిన విషయాలను గానీ, జ్ఞానం గానీ, దేవుడు చెప్పమన్న సందేశం గానీ, లేక ఎదైనా ఉపదేశం గానీ లేకుండా ఉంటే నా వలన మీకు ప్రయోజనమేమిటి?
7 Even those things that are without a soul can make sounds, whether it is a wind or a stringed instrument. But unless they present a distinction within the sounds, how will it be known which is from the pipe and which is from the string?
నిర్జీవమైన వస్తువులైన వేణువు ఊదినా, వీణ వాయించినా, అవి వేరు వేరు స్వరాలు పలకకపోతే, వాడిన వాయిద్యమేదో ఎలా తెలుస్తుంది?
8 For example, if the trumpet made an uncertain sound, who would prepare himself for battle?
బాకా స్పష్టంగా వినిపించకపోతే యుద్ధానికి ఎవరు సిద్ధపడతారు?
9 So it is with you also, for unless you utter with the tongue in plain speech, how will it be known what is said? For then you would be speaking into the air.
అలాగే మీ నాలుకతో స్పష్టమైన మాటలు పలకకపోతే వినేవారికి ఏం అర్థమౌతుంది? అది మీరు గాలితో మాట్లాడుతున్నట్టే ఉంటుంది కదా!
10 Consider that there are so many different kinds of languages in this world, and yet none is without a voice.
౧౦లోకంలో ఎన్నో భాషలున్నా, వాటన్నిటికీ స్పష్టమైన అర్థాలు ఉంటాయి.
11 Therefore, if I do not understand the nature of the voice, then I shall be like a foreigner to the one with whom I am speaking; and he who is speaking will be like a foreigner to me.
౧౧మాటల అర్థం నాకు తెలియకపోతే మాట్లాడేవాడు నాకూ, నాకు అతడూ పరాయివారంగా ఉంటాం.
12 So it is with you also. And since you are zealous for what is spiritual, seek the edification of the Church, so that you may abound.
౧౨మీరు ఆత్మ సంబంధమైన వరాల విషయంలో ఆసక్తిగలవారు గనుక సంఘాన్ని అభివృద్ధి పరిచే వరాలను కోరుకుని వాటిలో అమితంగా అభివృద్ధి చెందండి.
13 For this reason, too, whoever speaks in tongues, let him pray for the interpretation.
౧౩కాబట్టి తెలియని భాషతో మాట్లాడేవాడు దానికి అర్థం చెప్పే సామర్ధ్యం కోసం ప్రార్థన చేయాలి.
14 So, if I pray in tongues, my spirit prays, but my mind is without fruit.
౧౪నేను తెలియని భాషతో ప్రార్థన చేసినపుడు నా ఆత్మ ప్రార్థన చేస్తుంది గాని నా మనసు చురుకుగా ఉండదు.
15 What is next? I should pray with the spirit, and also pray with the mind. I should sing psalms with the spirit, and also recite psalms with the mind.
౧౫కాబట్టి నేనేం చెయ్యాలి? నా ఆత్మతో ప్రార్ధిస్తాను, మనసుతో కూడా ప్రార్ధిస్తాను. ఆత్మతో పాడతాను, మనసుతో కూడా పాడతాను.
16 Otherwise, if you have blessed only with the spirit, how can someone, in a state of ignorance, add an “Amen” to your blessing? For he does not know what you are saying.
౧౬అలా కాకుండా, నీవు ఆత్మతో మాత్రమే స్తుతులు చెల్లిస్తే నీవు పలికిన దాన్ని గ్రహించలేని వ్యక్తి నీవు చెప్పిన కృతజ్ఞతలకు, “ఆమేన్‌” అని చెప్పలేడు కదా!
17 In this case, certainly, you give thanks well, but the other person is not edified.
౧౭నీకై నీవు బాగానే స్తుతులు చెల్లిస్తావు గానీ ఎదుటి వ్యక్తికి మేలు కలగదు.
18 I thank my God that I speak in tongues for all of you.
౧౮దేవునికి స్తుతులు! నేను మీ అందరికంటే ఎక్కువగా తెలియని భాషలతో మాట్లాడతాను.
19 But in the Church, I prefer to speak five words from my mind, so that I may instruct others also, rather than ten thousand words in tongues.
౧౯అయినా సంఘంలో తెలియని భాషతో పదివేల మాటలు పలకడం కంటే, ఇతరులకు ఉపదేశం దొరికేలా నా మనసుతో ఐదు మాటలు చెప్పడం మంచిది.
20 Brothers, do not choose to have the minds of children. Instead, be free of malice like infants, but be mature in your minds.
౨౦సోదరులారా, ఆలోచనలో చిన్న పిల్లల్లాగా ఉండవద్దు. చెడు విషయంలో పసివారిలాగా ఉండండి గానీ ఆలోచించడంలో పరిణతి చెందినవారుగా ఉండండి.
21 It is written in the law: “I will speak to this people with other tongues and other lips, and even so, they will not heed me, says the Lord.”
౨౧ధర్మశాస్త్రంలో ఇలా రాసి ఉంది, “తెలియని భాషలు మాట్లాడే ప్రజల ద్వారా, తెలియని మనుషుల పెదవుల ద్వారా, ఈ ప్రజలతో మాట్లాడతాను. అయినప్పటికీ వారు నా మాట వినరు అని ప్రభువు చెబుతున్నాడు.”
22 And so, tongues are a sign, not for believers, but for unbelievers; and prophecies are not for unbelievers, but for believers.
౨౨కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచన. దేవుడిచ్చిన సందేశాన్ని ప్రకటించడం అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచన.
23 If then, the entire Church were to gather together as one, and if all were to speak in tongues, and then ignorant or unbelieving persons were to enter, would they not say that you were insane?
౨౩సంఘమంతా ఒకేసారి తెలియని భాషలతో మాట్లాడుతున్నప్పుడు, బయటి వ్యక్తులు లేక అవిశ్వాసులు లోపలికి వచ్చి చూస్తే మిమ్మల్ని వెర్రివారు అని చెప్పుకొంటారు కదా?
24 But if everyone prophesies, and one who is ignorant or unbelieving enters, he may be convinced by it all, because he understands it all.
౨౪అయితే అందరూ దేవుడిచ్చిన సందేశాన్ని ప్రకటిస్తూ ఉంటే బయటి వ్యక్తి లేక అవిశ్వాసి లోపలికి వచ్చి చూస్తే మీ అందరి ఉపదేశం వలన తాను పాపినని గ్రహిస్తాడు, అందరి మూలంగా అతనికి ఒప్పుదల కలుగుతుంది.
25 The secrets of his heart are then made manifest. And so, falling to his face, he would adore God, proclaiming that God is truly among you.
౨౫అప్పుడతని హృదయ రహస్యాలు బయలుపడతాయి. అప్పుడతడు సాగిలపడి దేవుణ్ణి ఆరాధించి, దేవుడు నిజంగా మీలో ఉన్నాడని ప్రకటిస్తాడు.
26 What is next, brothers? When you gather together, each one of you may have a psalm, or a doctrine, or a revelation, or a language, or an interpretation, but let everything be done for edification.
౨౬సోదరులారా, ఇప్పుడేం జరుగుతున్నది? మీరు సమావేశమైనప్పుడు ఒకడు ఒక కీర్తన పాడాలని, ఇంకొకడు దేవుని మాటలు ఉపదేశించాలని చూస్తున్నాడు, వేరొకడు దేవుడు తనకు బయలు పరచిన దాన్ని ప్రకటించాలని చూస్తున్నాడు. ఒకడు తెలియని భాషతో మాటలాడాలని చూస్తుండగా మరొకడు దానికి అర్థం చెప్పాలని కనిపెడుతున్నాడు. సరే, అంతటినీ సంఘాభివృద్ధి కోసం జరిగించండి.
27 If anyone is speaking in tongues, let there be only two, or at most three, and then in turn, and let someone interpret.
౨౭ఎవరైనా తెలియని భాషతో మాట్లాడితే, ఇద్దరు, అవసరమైతే ముగ్గురికి మించకుండా, ఒకరి తరువాత ఒకరు మాట్లాడాలి. ఒకరు దానికి అర్థం చెప్పాలి.
28 But if there is no one to interpret, he should remain silent in the church, then he may speak when he is alone with God.
౨౮అర్థం చెప్పేవాడు లేకపోతే అతడు సంఘంలో మౌనంగా ఉండాలి. అయితే అతడు తనతో, దేవునితో మాట్లాడుకోవచ్చు.
29 And let the prophets speak, two or three, and let the others discern.
౨౯ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాటలాడవచ్చు. మిగిలినవారు ఆ ఉపదేశాన్ని వివేచనాపూర్వకంగా వినాలి.
30 But then, if something is revealed to another who is sitting, let the first one become silent.
౩౦అయితే అక్కడ కూర్చున్న మరొకనికి ఏదైనా వెల్లడి అయితే మొదటివాడు మౌనంగా ఉండాలి.
31 For you are all able to prophesy one at a time, so that all may learn and all may be encouraged.
౩౧అందరూ నేర్చుకొనేలా, ప్రోత్సాహం పొందేలా మీరంతా ఒకడి తరవాత ఒకడు దేవుడిచ్చిన సందేశం ప్రకటించ వచ్చు.
32 For the spirits of the prophets are subject to the prophets.
౩౨ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి.
33 And God is not of dissension, but of peace, just as I also teach in all the churches of the saints.
౩౩ఎందుకంటే దేవుడు శాంతి సమాధానాలు కలిగించే వాడే గాని గందరగోళం కలిగించేవాడు కాడు. పరిశుద్ధుల సంఘాలన్నిటిలో
34 Women should be silent in the churches. For it is not permitted for them to speak; but instead, they should be subordinate, as the law also says.
౩౪స్త్రీలు సంఘ సమావేశాల్లో మౌనంగా ఉండాలి. వారు లోబడి ఉండవలసిందే. వారికి మాట్లాడేందుకు అనుమతి లేదు. ఇదే విషయాన్ని ధర్మశాస్త్రం కూడా చెబుతున్నది.
35 And if they want to learn anything, let them ask their husbands at home. For it is disgraceful for a woman to speak in church.
౩౫వారు దేనినైనా తెలుసుకోవాలంటే వారి ఇంట్లో తమ భర్తలను అడగాలి. సంఘంలో స్త్రీ మాట్లాడడం అవమానకరం.
36 So now, did the Word of God proceed from you? Or was it sent to you alone?
౩౬ఏం, దేవుని వాక్కు మీ నుండే బయలుదేరిందా? మీ దగ్గరికి మాత్రమే వచ్చిందా?
37 If anyone seems to be a prophet or a spiritual person, he should understand these things which I am writing to you, that these things are the commandments of the Lord.
౩౭ఎవరైనా తాను ప్రవక్తననీ లేక ఆత్మీయ వ్యక్తిననీ భావిస్తే ఇక్కడ నేను మీకు రాస్తున్నవి ప్రభువు చెప్పిన ఆజ్ఞలని అతడు కచ్చితంగా తెలుసుకోవాలి.
38 If anyone does not recognize these things, he should not be recognized.
౩౮ఎవరైనా దీన్ని పట్టించుకోక పొతే అ వ్యక్తిని పట్టించుకోకండి.
39 And so, brothers, be zealous to prophesy, and do not prohibit speaking in tongues.
౩౯కాబట్టి నా సోదరులారా, దేవుడిచ్చిన సందేశం ప్రకటించడం అనే వరాన్ని ఆసక్తితో కోరుకోండి. తెలియని భాషలతో మాట్లాడటాన్ని ఆపకండి.
40 But let everything be done respectfully and according to proper order.
౪౦అంతా మర్యాదగా, క్రమంగా జరగనీయండి.

< 1 Corinthians 14 >