< Obdias 1 >

1 The vision of Obdias. Thus says the Lord God to Idumea; I have heard a report from the Lord, and he has sent forth a message to the nations.
ఓబద్యా దర్శనం. ఎదోము గురించి యెహోవా ప్రభువు ఈ విషయం చెబుతున్నాడు. యెహోవా నుంచి మేము ఒక నివేదిక విన్నాం. “లెండి. ఎదోము మీద యుద్ధం చేయడానికి కదలండి” అని దేవుడు ఒక రాయబారిని రాజ్యాలకు పంపాడు.
2 Arise you, and let us rise up against her to war.
నేను ఇతర రాజ్యాల్లో నిన్ను తక్కువ చేస్తాను. వాళ్ళు నిన్ను ద్వేషిస్తారు.
3 Behold, I have made you small amongst the Gentiles: you are greatly dishonoured. The pride of your heart has elated you, dwelling [as you do] in the holes of the rocks, [as one that] exalts his habitation, saying in his heart, Who will bring me down to the ground?
నీ హృదయ గర్వం నిన్ను మోసం చేసింది. కొండ సందుల్లో ఎత్తయిన ఇంట్లో నివసించే నువ్వు “నన్నెవడు కింద పడేస్తాడు?” అని నీ మనస్సులో అనుకుంటున్నావు.
4 If you should mount up as the eagle, and if you should make your nest amongst the stars, thence will I bring you down, says the Lord.
గద్దలా నువ్వు పై పైకి ఎగిరినా నక్షత్రాల్లో గూడు కట్టుకున్నా అక్కడనుంచి నిన్ను కింద పడేస్తాను, అని యెహోవా చెబుతున్నాడు.
5 If thieves came in to you, or robbers by night, where would you have been cast away? would they not have stolen [just] enough for themselves? and if grape gatherers went in to you, would they not leave a gleaning?
దొంగలు నీ దగ్గరికి వస్తే, వాళ్ళు రాత్రి పూట వచ్చి తమకు కావలసినంత వరకే దోచుకుంటారు గదా. ద్రాక్ష పండ్లు పోగు చేసే వాళ్ళు నీ దగ్గరికి వస్తే కొన్ని పళ్ళు విడిచి పెడతారు గదా. అయితే, అయ్యో! నువ్వు బొత్తిగా నాశనమైపోయావు.
6 How has Esau been searched out, and [how] have his hidden things been detected?
ఏశావు వంశం వారిని పూర్తిగా దోచుకోవడం జరుగుతుంది. వాళ్ళు దాచిపెట్టిన ధనమంతా దోపిడీ అవుతుంది.
7 They sent you to your coasts: all the men of your covenant have withstood you; your allies have prevailed against you, they have set snares under you: they have no understanding.
నీతో సంధి చేసినవారు నిన్ను తమ సరిహద్దు వరకూ పంపేస్తారు. నీతో సమాధానంగా ఉన్నవాళ్ళు నిన్ను మోసగించి ఓడిస్తారు. నీ అన్నం తిన్నవాళ్ళు నిన్ను పట్టుకోడానికి వల వేస్తారు. ఎదోము అర్థం చేసుకోలేడు.
8 In that day, says the Lord, I will destroy the wise men out of Idumea, and understanding out of the mount of Esau.
ఆ రోజు నేను ఏశావు పర్వతాల్లో తెలివి లేకుండా చేయనా? ఎదోములోని జ్ఞానులను నాశనం చేయనా? అని యెహోవా చెబుతున్నాడు.
9 And your warriors from Thaeman shall be dismayed, to the end that man may be cut off from the mount of Esau.
తేమానూ, నీ శక్తిమంతులకు భయం వేస్తుంది. అందుచేత ఏశావు పర్వతాల్లో నివసించేవారంతా హతమవుతారు.
10 Because of the slaughter and the sin [committed against] your brother Jacob, shame shall cover you, and you shall be cut off for ever.
౧౦నీ సోదరుడు యాకోబుకు నువ్వు చేసిన దౌర్జన్యానికి నీకు అవమానం కలుగుతుంది. ఇక ఎప్పటికీ లేకుండా నువ్వు నిర్మూలమైపోతావు.
11 From the day that you stood in opposition [to him], in the days when foreigners were taking captive his forces, and strangers entered into his gates, and cast lots on Jerusalem, you also was as one of them.
౧౧నువ్వు దూరంగా నిల్చున్న రోజున, వేరే దేశం వాళ్ళు అతని ఆస్తిని తీసుకుపోయిన రోజున, విదేశీయులు అతని గుమ్మాల్లోకి వచ్చి యెరూషలేము మీద చీట్లు వేసిన రోజున నువ్వు కూడా వారిలో ఒకడిగా ఉన్నావు.
12 And you should not have looked on the day of your brother in the day of strangers; nor should you have rejoiced against the children of Juda in the day of their destruction; neither should you have boasted in the day of [their] affliction.
౧౨నీ సోదరుని దినాన, అతని దురవస్థ దినాన నువ్వు ఆనందించవద్దు. యూదావారి నాశన దినాన వారి స్థితి చూసి సంతోషించ వద్దు. వారి ఆపద్దినాలో అతిశయించ వద్దు.
13 Neither should you have gone into the gates of the people in the day of their troubles; nor yet should you have looked upon their gathering in the day of their destruction, nor should you have attacked their host in the day of their perishing.
౧౩నా ప్రజల విపత్తు రోజున వారి గుమ్మాల్లో ప్రవేశించ వద్దు. వారి ఆపద్దినాలో సంతోషిస్తూ వారి బాధ చూడ వద్దు. వారి విపత్తు రోజున వారి ఆస్తిని దోచుకోవద్దు.
14 Neither should you have stood at the opening of their passages, to destroy utterly those of them that were escaping; neither should you have shut up his fugitives in the day of affliction.
౧౪వారిలో తప్పించుకున్న వారిని చంపేయడానికి అడ్డదారుల్లో నిలబడ వద్దు. ఆపద్దినాలో వారిలో మిగిలే వారిని శత్రువుల చేతికి అప్పగించవద్దు.
15 For the day of the Lord is near upon all the Gentiles: as you have done, so shall it be [done] to you: your recompense shall be returned on your [own] head.
౧౫రాజ్యాలకూ యెహోవా దినం దగ్గర పడింది. అప్పుడు నువ్వు చేసినట్టే నీకూ చేస్తారు. నువ్వు చేసిన పనులు నీ తల మీదికి తిరిగి వస్తాయి.
16 For as you have drunk upon my holy mountain, [so] shall all the nations drink wine; they shall drink, and go down, and be as if they were not.
౧౬మీరు నా పవిత్ర పర్వతం పై తాగినట్టు రాజ్యాలన్నీ ఎప్పుడూ తాగుతూ ఉంటాయి. తాము ఎన్నడూ ఉనికిలో లేని వారి లాగా ఉండి తాగుతుంటారు.
17 But on mount Sion there shall be deliverance, and there shall be a sanctuary; and the house of Jacob shall take for an inheritance those that took them for an inheritance.
౧౭అయితే సీయోను కొండ మీద తప్పించుకున్న వారు నివసిస్తారు. అది పవిత్రంగా ఉంటుంది. యాకోబు వంశం వాళ్ళు తమ వారసత్వం పొందుతారు.
18 And the house of Jacob shall be fire, and the house of Joseph a flame, and the house of Esau [shall be] for stubble; and [Israel] shall flame forth against them, and shall devour them, and there shall not be a corn-field [left] to the house of Esau; because the Lord has spoken.
౧౮యాకోబు వంశం వారు నిప్పులా, యోసేపు వంశం వారు మంటలా ఉంటారు. ఏశావు వంశం వారు ఎండు గడ్డిలా ఉంటారు. నిప్పు వారిని కాల్చేసి దహించేస్తుంది. ఏశావు వంశంలో ఎవరూ మిగలరు, అని యెహోవా చెప్పాడు.
19 And they [that dwell] in the south shall inherit the mount of Esau, and they in the plain the Philistines: and they shall inherit the mount of Ephraim, and the plain of Samaria, and Benjamin, and the land of Galaad.
౧౯దక్షిణ దిక్కున నివసించేవారు ఏశావు పర్వతాన్ని స్వాధీనం చేసుకుంటారు. మైదాన ప్రాంతాల్లో ఉండే వారు ఫిలిష్తీయుల దేశాన్నిస్వాధీనం చేసుకుంటారు. వాళ్ళు ఎఫ్రాయిం ప్రజల భూములనూ సమరయ ప్రజల భూములనూ స్వాధీనం చేసుకుంటారు. బెన్యామీను ప్రజలు గిలాదు ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటారు.
20 And this [shall be] the domain of the captivity of the children of Israel, the land of the Chananites as far as Sarepta; and the captives of Jerusalem [shall inherit] as far as Ephratha; they shall inherit the cities of the south.
౨౦ఇశ్రాయేలీయుల్లో బందీలుగా దేశాంతరం పోయినవారు సారెపతు వరకూ కనాను ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటారు. యెరూషలేము వారిలో బందీలుగా సెఫారాదుకు పోయిన వారు దక్షిణ ప్రాంత పట్టణాలను స్వాధీనం చేసుకుంటారు.
21 And they that escape shall come up from mount Sion, to take vengeance on the mount of Esau; and the kingdom shall be the Lord's.
౨౧ఏశావు పర్వతాన్ని శిక్షించడానికి రక్షకులు సీయోను పర్వతం ఎక్కుతారు. అప్పుడు రాజ్యం యెహోవాది అవుతుంది.

< Obdias 1 >