< Zechariah 13 >
1 In that day there will be a fountain open to the family of David and to the people of Jerusalem, for sin and for that which is unclean.
౧ఆ రోజున పాపాలను, అపవిత్రతను పరిహరించడానికి దావీదు వంశీకుల కోసం, యెరూషలేము నివాసుల కోసం ఒక ఊట తెరవబడుతుంది.
2 And it will come about on that day, says the Lord of armies, that I will have the names of the images cut off out of the land, and there will be no more memory of them: and I will send all the prophets and the unclean spirit away from the land.
౨ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు. ఆ రోజున దేశంలో ఇకపై మరెన్నడూ గుర్తుకు రాకుండా విగ్రహాల నామరూపాలు లేకుండా వాటన్నిటినీ ధ్వంసం చేస్తాను. అన్య దేవుళ్ళ ప్రవక్తలను, అపవిత్రాత్మను దేశంలో లేకుండ చేస్తాను.
3 And if anyone goes on acting as a prophet, then his father and his mother who gave him life will say to him, You may not go on living, for you are saying what is false in the name of the Lord; and his father and his mother will put a sword through him when he does so.
౩ఇక ఎవడైనా ఆత్మ పూని ప్రవచనం చెప్పడానికి ప్రయత్నిస్తే వాడి తలిదండ్రులు “నువ్వు యెహోవా నామం పేరట అబద్ధం చెప్తున్నావు కనుక నువ్వు తప్పక చావాలి” అని చెప్పాలి. వాడు ప్రవచనం పలికినప్పుడు వాడి తల్లిదండ్రులే వాణ్ణి పొడిచి చంపాలి.
4 And it will come about in that day that the prophets will be shamed, every man on account of his vision, when he is talking as a prophet; and they will not put on a robe of hair for purposes of deceit:
౪ఆ కాలంలో ప్రతి ప్రవక్త తాము పలికిన ప్రవచనాలను బట్టి, తమకు కలిగిన దర్శనాన్ని బట్టి సిగ్గుపడతారు. ఇకపై ఇతరులను మోసం చేయడానికి గొంగళి ధరించడం మానివేస్తారు.
5 But he will say, I am no prophet, but a worker on the land; for I have been an owner of land from the time when I was young.
౫వాడు “నేను ప్రవక్తను కాను, వ్యవసాయం చేసేవాణ్ణి, చిన్నప్పటి నుంచి నన్ను కొన్న ఒకడి దగ్గర పొలం పని చేసేవాడిగా ఉన్నాను” అంటాడు.
6 And if anyone says to him, What are these wounds between your hands? then he will say, Those with which I was wounded in the house of my friends.
౬“నీ చేతులకు ఉన్న గాయాలు ఏమిటి?” అని ఎవరైనా వాణ్ణి అడిగితే “ఇవి నా స్నేహితుల ఇంట్లో ఉన్నప్పుడు నాకు తగిలిన దెబ్బలు” అని వాడు చెబుతాడు.
7 Awake! O sword, against the keeper of my flock, and against him who is with me, says the Lord of armies: put to death the keeper of the sheep, and the sheep will go in flight: and my hand will be turned against the little ones.
౭ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీదా, నా సన్నిహితుడి మీదా పడు. గొర్రెలు చెదరిపోయేలా వాటి కాపరిని సంహరించు. బలహీనుల మీద నేను నా చెయ్యి ఉంచుతాను. ఇది యెహోవా వాక్కు.
8 And it will come about that in all the land, says the Lord, two parts of it will be cut off and come to an end; but the third will be still living there.
౮దేశమంతటిలో మూడింట రెండు వంతులవారు నశిస్తారు. మూడవ భాగం మిగిలి ఉంటారు.
9 And I will make the third part go through the fire, cleaning them as silver is made clean, and testing them as gold is tested: and they will make their prayer to me and I will give them an answer: I will say, It is my people; and they will say, The Lord is my God.
౯ఆ మూడవ భాగాన్ని నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుభ్రపరచినట్టు శుద్ధి చేస్తాను. బంగారాన్ని పరీక్షించినట్టు వారిని పరీక్షిస్తాను. వారు నా నామాన్నిబట్టి మొరపెట్టినప్పుడు నేను వారి మొర ఆలకిస్తాను. “వీరు నా ప్రజలు” అని నేనంటాను. “యెహోవా మా దేవుడు” అని వారు అంటారు.