< Ruth 3 >

1 And Naomi, her mother-in-law, said to her, My daughter, am I not to get you a resting-place where you may be in comfort?
తరువాత రూతుతో నయోమి ఇలా చెప్పింది. “అమ్మా, నువ్వు స్థిరపడేలా ఏదైనా ఏర్పాటు చెయ్యాలి కదా. నీకు క్షేమం చేకూరేలా నేను చూడాలి.
2 And now, is there not Boaz, our relation, with whose young women you were? See, tonight he is separating the grain from the waste in his grain-floor.
ఎవరి పనికత్తెల దగ్గర నువ్వు ఉన్నావో ఆ బోయజు మనకు బంధువు. విను, ఈ రాత్రి అతడు తన పొలంలో బార్లీ గింజలు తూర్పారబట్టబోతున్నాడు.
3 So take a bath, and, after rubbing your body with sweet oil, put on your best robe, and go down to the grain-floor; but do not let him see you till he has come to the end of his meal.
నువ్వు స్నానం చేసి సువాసన నూనె రాసుకుని బట్టలు మార్చుకుని ఆ పొలానికి ధాన్యం చెరిగించే కళ్లం దగ్గరికి వెళ్ళు. అతని భోజనం ముగించి నిద్రపోయేంత వరకూ అతనికి కనిపించవద్దు.
4 But see to it, when he goes to rest, that you take note of the place where he is sleeping, and go in there, and, uncovering his feet, take your place by him; and he will say what you are to do.
నిద్రపోయిన తరువాత ఎక్కడ పడుకున్నాడో చూడు. ఆ చోటికి నువ్వూ వెళ్ళగలిగేలా దాన్ని గుర్తు పెట్టుకో. తరువాత అక్కడికి వెళ్ళి అతని కాళ్ళపై ఉన్న దుప్పటి తీసి అక్కడ పడుకో. ఆ తరువాత జరగాల్సిందంతా అతనే చెబుతాడు.”
5 And she said, I will do all you say.
అప్పుడు రూతు “నువ్వు చెప్పినట్టే చేస్తాను” అంది.
6 So she went down to the grain-floor and did all her mother-in-law had said to her.
ఆమె ధాన్యం చెరిగించే కళ్లం దగ్గరికి వెళ్ళి తన అత్త తనకు చెప్పినట్లు చేసింది.
7 Now when Boaz had taken meat and drink, and his heart was glad, he went to take his rest at the end of the mass of grain; then she came softly and, uncovering his feet, went to rest.
బోయజు భోజనం చేసి ద్రాక్షారసం తాగి మనస్సులో ఉల్లాసంగా పోయి ధాన్యం కుప్ప దగ్గర పడుకున్నాడు. అప్పుడు రూతు నెమ్మదిగా వెళ్ళి అతని కాళ్ళ పైన ఉన్న దుప్పటి తీసి పడుకుంది.
8 Now in the middle of the night, the man awaking from his sleep in fear, and lifting himself up, saw a woman stretched at his feet.
అర్థరాత్రి సమయంలో బోయజు ఉలిక్కిపడి లేచి చూస్తే ఒక స్త్రీ తన కాళ్ళ దగ్గర పడుకుని ఉండటం కనిపించింది.
9 And he said, Who are you? And she answering said, I am your servant Ruth: take your servant as wife, for you are a near relation.
అతడు, “ఎవరు నువ్వు?” అని అడిగాడు. ఆమె “నేను రూతు అనే నీ దాసిని. నువ్వు నన్ను విడిపించగల సమీప బంధువువి. నాపై నీ కొంగు కప్పు” అంది.
10 And he said, May the Lord give you his blessing, my daughter: even better than what you did at the first is this last kind act you have done, in not going after young men, with or without wealth.
౧౦అతడు “అమ్మాయీ, నిన్ను యెహోవా దీవించాడు. పేదవారు, ధనికులు అయిన యువకులపై నువ్వు మోజు పడలేదు. అందుకని గతంలో నీ ప్రవర్తన కంటే ఇప్పటి నీ ప్రవర్తన మరింత యోగ్యంగా ఉంది.
11 And now, my daughter, have no fear; I will do for you whatever you say: for it is clear to all my townspeople that you are a woman of virtue.
౧౧అమ్మాయీ, ఇప్పుడిక భయపడవద్దు. నీకు నేను చెప్పేదంతా తప్పక నెరవేరుస్తాను. నువ్వు చాలా యోగ్యురాలివి అని ప్రజలందరికీ తెలుసు.
12 Now it is true that I am a near relation: but there is a relation nearer than I.
౧౨నేను నిన్ను విడిపించగలను అనే మాట నిజమే. కానీ నీకు నాకంటే దగ్గర బంధువు ఒకడున్నాడు.
13 Take your rest here tonight; and in the morning, if he will do for you what it is right for a relation to do, very well, let him do so: but if he will not, then by the living Lord I myself will do so.
౧౩ఈ రాత్రి ఉండు. ఉదయాన్నే ఆ వ్యక్తి నీకు బంధువుగా ధర్మం జరిపి నిన్ను విడిపించవచ్చు. నీకు బంధువు ధర్మం జరపడం అతనికి ఇష్టం లేకపోతే నేనే బంధువుగా ఆ ధర్మాన్ని జరిగిస్తానని యెహోవా తోడుగా ప్రమాణం చేస్తున్నాను. తెల్లవారే వరకూ నిద్రపో” అన్నాడు.
14 And she took her rest at his feet till the morning: and she got up before it was light enough for one to see another. And he said, Let it not come to anyone's knowledge that the woman came to the grain-floor.
౧౪కాబట్టి ఆమె తెల్లారే వరకూ అతని కాళ్ళ దగ్గర పడుకుని ఇంకా తెల్లవారకముందే లేచింది. అప్పుడు అతడు “ఆమె ధాన్యం చెరిగించే కళ్ళం దగ్గరికి వచ్చిన విషయం ఎవరికీ చెప్పవద్దు” అని తన సేవకులకు చెప్పాడు.
15 And he said, Take your robe, stretching it out in your hands: and she did so, and he took six measures of grain and put them into it, and gave it her to take: and she went back to the town.
౧౫తరువాత అతడు “నువ్వు కప్పుకున్న దుప్పటి పట్టు” అనగా ఆమె దాన్ని పట్టింది. అతడు ఆరు కొలతల బార్లీ గింజలు కొలిచి ఆమె భుజానికెత్తాడు. ఆమె ఊళ్లోకి వెళ్ళిపోయింది.
16 And when she came back her mother-in-law said to her, How did it go with you, my daughter? And she gave her an account of all the man had done to her.
౧౬రూతు తన అత్త నయోమి దగ్గరికి వచ్చినప్పుడు నయోమి “అమ్మాయ్, ఏమైంది?” అని అడిగింది. రూతు అతడు తనకు చేసినదంతా వివరించింది.
17 And she said, He gave me these six measures of grain, saying, Do not go back to your mother-in-law with nothing in your hands.
౧౭“అతడు నువ్వు వట్టి చేతులతో మీ అత్త ఇంటికి వెళ్ళవద్దు అని ఈ ఆరు కొలతల బార్లీ గింజలు ఇచ్చాడు” అంది.
18 Then she said, Do nothing now, my daughter, till you see what will come of this; for the man will take no rest till he has put this thing through.
౧౮అప్పుడు ఆమె అత్త “అమ్మా, అతడు ఈ రోజే ఈ విషయం తేల్చేవరకూ ఊరుకోడు. కాబట్టి ఇది ఎలా జరుగుతుందో తెలిసేంత వరకూ ఇక్కడే ఉండు” అని చెప్పింది.

< Ruth 3 >