< Psalms 86 >
1 A Prayer. Of David. Let your ears be open to my voice, O Lord, and give me an answer; for I am poor and in need.
౧దావీదు ప్రార్థన. యెహోవా, నేను పేదవాణ్ణి. నన్ను అణిచి వేశారు. నా మాట విని నాకు జవాబివ్వు.
2 Keep my soul, for I am true to you; O my God, give salvation to your servant, whose hope is in you.
౨నేను నీ విధేయుణ్ణి. నన్ను కాపాడు. నా దేవా, నిన్ను నమ్ముకున్న నీ సేవకుణ్ణి రక్షించు.
3 Have mercy on me, O Lord; for my cry goes up to you all the day.
౩ప్రభూ, రోజంతా నీకు మొరపెడుతున్నాను, నన్ను కనికరించు.
4 Make glad the soul of your servant; for it is lifted up to you, O Lord.
౪ప్రభూ, నా ఆత్మ నీ వైపు ఎత్తుతున్నాను. నీ సేవకుడు సంతోషించేలా చెయ్యి.
5 You are good, O Lord, and full of forgiveness; your mercy is great to all who make their cry to you.
౫ప్రభూ, నువ్వు మంచివాడివి. క్షమించడానికి సిద్ధంగా ఉంటావు. నీకు మొరపెట్టే వారందరినీ అమితంగా కనికరిస్తావు.
6 O Lord, give ear to my prayer; and take note of the sound of my requests.
౬యెహోవా, నా ప్రార్థన విను. నా విన్నపాల శబ్దం ఆలకించు.
7 In the day of my trouble I send up my cry to you; for you will give me an answer.
౭నా కష్టాల్లో నేను నీకు మొరపెడతాను. నువ్వు నాకు జవాబిస్తావు.
8 There is no god like you, O Lord; there are no works like your works.
౮ప్రభూ, దేవుళ్ళలో నీకు సాటి ఎవరూ లేరు. నీ పనులకు సాటి ఏదీ లేదు.
9 Let all the nations whom you have made come and give worship to you, O Lord, giving glory to your name.
౯ప్రభూ, నువ్వు సృజించిన రాజ్యాలన్నీ వచ్చి నీ ఎదుట ప్రణమిల్లుతారు. వాళ్ళు నీ నామాన్ని గొప్ప చేస్తారు.
10 For you are great, and do great works of wonder; you only are God.
౧౦నువ్వు గొప్ప వాడివి. ఆశ్చర్యమైన పనులు చేస్తావు. నీవొక్కడివే దేవుడివి.
11 Make your way clear to me, O Lord; I will go on my way in your faith: let my heart be glad in the fear of your name.
౧౧యెహోవా, నీ పద్ధతులు నాకు బోధించు. అప్పుడు నేను నీ సత్యంలో నడుస్తాను. నిన్ను గౌరవించేలా నా హృదయాన్ని ఏక భావంగలదిగా చెయ్యి.
12 I will give you praise, O Lord my God, with all my heart; I will give glory to your name for ever.
౧౨ప్రభూ, నా దేవా, నా హృదయమంతటితో నేను నిన్ను స్తుతిస్తాను. నీ నామాన్ని శాశ్వతకాలం గొప్ప చేస్తాను.
13 For your mercy to me is great; you have taken my soul up from the deep places of the underworld. (Sheol )
౧౩నా పట్ల నీ కృప ఎంతో గొప్పది. చచ్చిన వాళ్ళుండే అగాధం నుంచి నా ప్రాణాన్ని తప్పించావు. (Sheol )
14 O God, men of pride have come up against me, and the army of violent men would take my life; they have not put you before them.
౧౪దేవా, గర్విష్ఠులు నా మీదికి ఎగబడ్డారు. దుర్మార్గులు నా ప్రాణం తీయాలని చూస్తున్నారు. నువ్వంటే వాళ్ళకు లెక్క లేదు.
15 But you, O Lord, are a God full of pity and forgiveness, slow to get angry, great in mercy and wisdom.
౧౫అయితే ప్రభూ, నువ్వు కృపా కనికరాలు గల దేవుడివి. కోపించడానికి నిదానించే వాడివి. అత్యంత కృపగల వాడివి. నమ్మదగిన వాడివి.
16 O be turned to me and have mercy on me: give your strength to your servant, and your salvation to the son of her who is your servant.
౧౬నావైపు తిరిగి నన్ను కనికరించు, నీ సేవకుడికి నీ బలం ఇవ్వు. నీ సేవకురాలి కొడుకును కాపాడు.
17 Give me a sign for good; so that my haters may see it and be shamed; because you, Lord, have been my help and comfort.
౧౭యెహోవా, నీ ఆదరణ గుర్తు నాకు చూపించు. అప్పుడు నన్ను ద్వేషించే వాళ్ళు అది చూచి సిగ్గుపాలవుతారు. ఎందుకంటే నువ్వు నాకు సాయం చేసి నన్ను ఆదరించావు.