< Psalms 142 >
1 Maschil. Of David. A prayer when he was in the hole of the rock. The sound of my cry went up to the Lord; with my voice I made my prayer for grace to the Lord.
౧దావీదు దైవధ్యానం. గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన నేను గొంతెత్తి యెహోవాకు మొరపెడుతున్నాను. ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకుంటున్నాను.
2 I put all my sorrows before him; and made clear to him all my trouble.
౨ఆయన సన్నిధిలో దీనంగా నేను వేడుకుంటున్నాను. నాకు కలిగిన బాధలన్నిటినీ ఆయనకు మనవి చేసుకుంటున్నాను.
3 When my spirit is overcome, your eyes are on my goings; nets have been secretly placed in the way in which I go.
౩నాలో నా ప్రాణం కృంగి ఉన్నప్పుడు నా స్థితి ఏమిటో నీకు తెలుసు. నన్ను బంధించడానికి నేను నడిచే దారుల్లో శత్రువులు దొంగచాటుగా వల పన్నుతున్నారు.
4 Looking to my right side, I saw no man who was my friend: I had no safe place; no one had any care for my soul.
౪నా కుడి పక్కన చూస్తే నన్ను ఆదరించేవాడు ఒక్కడు కూడా కనిపించలేదు. తప్పించుకునే దారి లేదు. నాప్రాణం గురించి పట్టించుకునే వాడే లేడు.
5 I have made my cry to you, O Lord; I have said, You are my safe place, and my heritage in the land of the living.
౫యెహోవా, నేను నీకే మొరపెడుతున్నాను. నన్ను ఆదుకునేది నువ్వే. సజీవులు నివసించే భూమి మీద నా భాగం నువ్వే అంటున్నాను.
6 Give ear to my cry, for I am made very low: take me out of the hands of my haters, for they are stronger than I.
౬నా ఆక్రందన ఆలకించు. నేను క్రుంగిపోయి ఉన్నాను. నన్ను తరుముతున్నవాళ్ళు నాకంటే బలవంతులు. వాళ్ళ చేతుల్లో పడకుండా నన్ను కాపాడు.
7 Take my soul out of prison, so that I may give praise to your name: the upright will give praise because of me; for you have given me a full reward.
౭నేను నీ నామాన్ని కీర్తించేలా చెరలోనుండి నా ప్రాణాన్ని తప్పించు. అప్పుడు నీవు నాకు చేసిన మహోపకారాన్ని బట్టి నీతిమంతులు నా చుట్టూ చేరి ఆనందిస్తారు.