< Proverbs 18 >
1 He who keeps himself separate for his private purpose goes against all good sense.
౧తనకు తానుగా ఉండే వాడు స్వార్థపరుడు. వాడు సరైన ఆలోచనకు వ్యతిరేకం.
2 A foolish man has no pleasure in good sense, but only to let what is in his heart come to light.
౨మూర్ఖుడికి విషయం అర్థం చేసుకోవాలని ఉండదు. తానేమి అనుకుంటున్నాడో అది చెప్పడమే అతనికి ఇష్టం.
3 When the evil-doer comes, a low opinion comes with him, and with the loss of honour comes shame.
౩దుర్మార్గుడు రాగానే ధిక్కారం వస్తుంది. అతడితో బాటే కళంకం, నింద వస్తాయి.
4 The words of a man's mouth are like deep waters: the fountain of wisdom is like a flowing stream.
౪మనిషి పలికే మాటలు లోతుగా ప్రవహించే ప్రవాహం వంటివి. జ్ఞానపు ఊటలో నుండి పారే సెలయేరు వంటివి.
5 To have respect for the person of the evil-doer is not good, or to give a wrong decision against the upright.
౫దుష్టుడి పట్ల పక్షపాతం చూపుడం, నిర్దోషులకు అన్యాయం చేయడం భావ్యం కాదు.
6 A foolish man's lips are a cause of fighting, and his mouth makes him open to blows.
౬బుద్ధి లేని వాడి పెదాలు కలహానికి కాచుకుని ఉంటాయి. వాడి మాటలు దెబ్బల కోసం వెంపర్లాతాయి.
7 The mouth of a foolish man is his destruction, and his lips are a net for his soul.
౭మూర్ఖుడి నోరు వాడికే నాశన హేతువు. అతని మాటలే అతనికి ఉరి.
8 The words of one who says evil of his neighbour secretly are like sweet food, and go down into the inner parts of the stomach.
౮కొండేలు చెప్పే వాడి మాటలు చవులూరించే భక్ష్యాలు. అవి హాయిగా కడుపులోకి దిగిపోతాయి.
9 He who does not give his mind to his work is brother to him who makes destruction.
౯పనిలో సోమరిగా ఉండేవాడు నష్టం కలిగించే వాడికి అన్న.
10 The name of the Lord is a strong tower: the upright man running into it is safe.
౧౦యెహోవా నామం బలమైన దుర్గం. నీతిపరుడు అందులో తలదాచుకుని సురక్షితంగా ఉంటాడు.
11 The property of a man of wealth is his strong town, and it is as a high wall in the thoughts of his heart.
౧౧ధనవంతుడి ఆస్తి అతనికి దిట్టమైన కోట. అది పటిష్టమైన ప్రాకారం అని అతని భ్రమ.
12 Before destruction the heart of man is full of pride, and before honour goes a gentle spirit.
౧౨విపత్తుకు ముందు మనిషి హృదయం అహంకార పూరితంగా ఉంటుంది. వినయం వల్ల గౌరవం కలుగుతుంది.
13 To give an answer before hearing is a foolish thing and a cause of shame.
౧౩సావధానంగా వినకుండానే జవాబిచ్చేవాడు తన తెలివి తక్కువతనాన్ని బయట పెట్టుకుంటాడు. సిగ్గు కొని తెచ్చుకుంటాడు.
14 The spirit of a man will be his support when he is ill; but how may a broken spirit be lifted up?
౧౪వ్యాధి కలిగినా మనిషి ఆత్మ వైపుకుని నిలబడుతుంది. ఆత్మే నలిగిపోతే భరించడమెలా?
15 The heart of the man of good sense gets knowledge; the ear of the wise is searching for knowledge.
౧౫తెలివి గలవారి హృదయం జ్ఞానాన్ని అన్వేషిస్తుంది. వివేకి అస్తమానం దాని పైనే గురి పెట్టుకుంటాడు.
16 A man's offering makes room for him, letting him come before great men.
౧౬ఒక మనిషి ఇచ్చే కానుక తలుపులు తెరుస్తుంది. దాని సాయంతో అతడు గొప్పవారిని కలుసుకుంటాడు.
17 The man who first puts his cause before the judge seems to be in the right; but then his neighbour comes and puts his cause in its true light.
౧౭వ్యాజ్యంలో మొదట మాట్లాడిన వాడి మాటలు సరైనవిగా కనిపిస్తాయి. అయితే అతని ప్రత్యర్థి వచ్చాక గానీ విషయం తేట పడదు.
18 The decision of chance puts an end to argument, parting the strong.
౧౮చీట్లు వేస్తే వివాదం సమసిపోతుంది. బలమైన వారిని అది ఊరుకోబెడుతుంది.
19 A brother wounded is like a strong town, and violent acts are like a locked tower.
౧౯పటిష్టమైన నగరాన్ని వశపరచుకోవడం కంటే అలిగిన సోదరుణ్ణి సముదాయించడం కష్టం. పోట్లాటలు కోట తలుపుల అడ్డగడియలంత గట్టివి.
20 With the fruit of a man's mouth his stomach will be full; the produce of his lips will be his in full measure.
౨౦ఒకడి కడుపు నిండడం అతని నోటి మాటలను బట్టే ఉంటుంది. తన పెదవుల పంట కోత మూలంగా అతడు తృప్తిచెందుతాడు.
21 Death and life are in the power of the tongue; and those to whom it is dear will have its fruit for their food.
౨౧జీవన్మరణాలు నాలుక వశం. దాన్ని ఇష్టపడే వారు దాని ఫలం అనుభవిస్తారు.
22 Whoever gets a wife gets a good thing, and has the approval of the Lord.
౨౨భార్య దొరికిన వాడికి మేలు దొరికింది. అతడు యెహోవా అనుగ్రహం పొందాడు.
23 The poor man makes requests for grace, but the man of wealth gives a rough answer.
౨౩నిరుపేద ఎంతో ప్రాధేయ పడతాడు. ధనవంతుడు దురుసుగా జవాబిస్తాడు.
24 There are friends who may be a man's destruction, but there is a lover who keeps nearer than a brother.
౨౪ఎక్కువ మంది స్నేహితులున్న వాడికి నష్టం. అయితే సోదరుని కన్నా సన్నిహితంగా ఉండే మిత్రులు కూడా ఉంటారు.