< Numbers 9 >
1 And the Lord said to Moses, in the waste land of Sinai, in the first month of the second year after they had come out of the land of Egypt,
౧యెహోవా సీనాయి అరణ్యంలో మోషేతో మాట్లాడాడు. ఇది వారు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన రెండో సంవత్సరం మొదటి నెలలో జరిగింది. ఆయన ఇలా చెప్పాడు.
2 Let the children of Israel keep the Passover at its regular time.
౨“ప్రతి సంవత్సరం ఇశ్రాయేలు ప్రజలు పస్కా పండగను దానికి నిర్ధారించిన తేదీల్లో ఆచరించాలి.
3 In the fourteenth day of this month, at evening, you are to keep it at the regular time, and in the way ordered in the law.
౩దాన్ని నిర్ధారించిన కాలం ఈ నెల పద్నాలుగో రోజు. ఆ రోజు సాయంత్రం మీరు పస్కా జరుపుకోవాలి. దాన్ని ఆచరించాలి. దానికి సంబంధించిన నియమాలను, ఆదేశాలను తప్పక పాటించాలి.”
4 And Moses gave orders to the children of Israel to keep the Passover.
౪కాబట్టి మోషే పస్కా పండగను ఆచరించాలని ఇశ్రాయేలు ప్రజలకి చెప్పాడు.
5 So they kept the Passover in the first month, on the fourteenth day of the month, at evening, in the waste land of Sinai: as the Lord gave orders to Moses, so the children of Israel did.
౫దాంతో సీనాయి అరణ్యంలో ఆ మొదటి నెలలో పద్నాలుగో రోజు సాయంత్రం వారు పస్కా ఆచరించారు. యెహోవా మోషేకి ఆజ్ఞాపించిన వాటికి ఇశ్రాయేలు ప్రజలు విధేయులయ్యారు.
6 And there were certain men who were unclean because of a dead body, so that they were not able to keep the Passover on that day; and they came before Moses and before Aaron on that day:
౬కొంతమంది చనిపోయిన వ్యక్తి శరీరాన్ని తాకి అపవిత్రులయ్యారు. కాబట్టి ఆ రోజు వారు పస్కా ఆచరించలేక పోయారు.
7 And these men said to him, We have been made unclean by the dead body of a man; why may we not make the offering of the Lord at the regular time among the children of Israel?
౭ఆ వ్యక్తులు మోషే దగ్గరకి వచ్చి “మేము చనిపోయిన వ్యక్తి కారణంగానే కదా అపవిత్రులమయ్యాం. ఈ సంవత్సరంలో నిర్ధారించిన రోజున యెహోవాకు బలి అర్పించకుండా మమ్మల్ని ఎందుకు దూరం చేస్తున్నారు?” అని అడిగారు.
8 And Moses said to them, Do nothing till the Lord gives me directions about you.
౮దానికి మోషే “కాస్త ఆగండి. మీ గురించి యెహోవా ఏం చెబుతాడో విందాం.” అని జవాబిచ్చాడు.
9 And the Lord said to Moses,
౯అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు.
10 Say to the children of Israel, If any one of you or of your families is unclean because of a dead body, or is on a journey far away, still he is to keep the Passover to the Lord:
౧౦“నువ్వు ఇశ్రాయేలు ప్రజలకి ఇలా చెప్పు. ‘మీలో ఎవరైనా లేదా మీ సంతానంలో ఎవరైనా శవాన్ని తాకి అపవిత్రుడైనా, లేదా దూర ప్రయాణంలో ఉన్నా ఆ వ్యక్తి పస్కాను ఆచరించ వచ్చు.’
11 In the second month, on the fourteenth day, in the evening, they are to keep it, taking it with unleavened bread and bitter-tasting plants;
౧౧వారు రెండో నెల పద్నాలుగో రోజున సాయంత్రం పస్కా ఆచరించాలి. పొంగజేసే పదార్ధం లేకుండా చేసిన రొట్టెలు, చేదు ఆకు కూరలతో తినాలి.
12 Nothing of it is to be kept till the morning, and no bone of it is to be broken: they are to keep it by the rules of the Passover.
౧౨మర్నాటి ఉదయానికి దానిలో దేన్నీ మిగల్చకూడదు. దాని ఎముకల్లో దేన్నీ విరగ్గొట్టకూడదు. పస్కాకి సంబంధించిన నియమాలన్నిటినీ వారు పాటించాలి.
13 But the man who, not being unclean or on a journey, does not keep the Passover, will be cut off from his people: because he did not make the offering of the Lord at the regular time, his sin will be on him.
౧౩అయితే పవిత్రంగా ఉండీ, ప్రయాణమేదీ చేయని వాడు ఒకవేళ పస్కాను ఆచరించకపోతే ఆ వ్యక్తిని సమాజంలో లేకుండా చేయాలి. ఎందుకంటే ఆ వ్యక్తి సంవత్సరంలో నిర్ధారించిన రోజున యెహోవాకు అవసరమైన బలి అర్పణ అర్పించలేదు. ఆ వ్యక్తి తన పాపాన్ని భరించాల్సిందే.
14 And if a man from another country is among you and has a desire to keep the Passover to the Lord, let him do as is ordered in the law of the Passover: there is to be the same rule for the man from another nation and for him who had his birth in the land.
౧౪మీ మధ్య నివసించే విదేశీయుడు ఎవరైనా యెహోవా గౌరవం కోసం పస్కాని ఆచరించాలనుకుంటే అతడు ఆయన ఆదేశాలను అనుసరించాలి. నియమాలను అనుసరించే పస్కా ఆచరించాలి. పస్కా అనుసరించే విషయంలో మీ దేశంలో పుట్టిన వాడికీ మీ మధ్య నివసించే విదేశీయుడికీ ఒకే విధానం ఉండాలి.”
15 And on the day when the House was put up, the cloud came down on it, on the Tent of witness; and in the evening there was a light like fire over the House till the morning.
౧౫మందిరాన్ని నిలబెట్టిన రోజున మేఘం నిబంధన శాసనాల గుడారాన్ని కమ్ముకుంది. సాయంత్రానికి మేఘం మందిరం పైగా కనిపించింది. అది మర్నాటి ఉదయం వరకూ అగ్నిలా కనిపించింది.
16 And so it was at all times: it was covered by the cloud, and by a light as of fire by night.
౧౬అది ఎల్లప్పుడూ అలాగే కనిపించింది. మేఘం మందిరాన్ని కమ్మి రాత్రిలో అగ్నిలా కనిపించింది.
17 And whenever the cloud was taken up from over the House, then the children of Israel went journeying on; and in the place where the cloud came to rest, there the children of Israel put up their tents.
౧౭గుడారం పైనుండి ఆ మేఘం పైకి వెళ్ళిపోయినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం సాగించేవారు. ఆ మేఘం ఆగినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు నిలిచి గుడారాలు వేసుకునేవారు.
18 At the order of the Lord the children of Israel went forward, and at the order of the Lord they put up their tents: as long as the cloud was resting on the House, they did not go away from that place.
౧౮యెహోవా ఆదేశాల ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం సాగించారు. ఆయన ఆదేశాల ప్రకారం గుడారాలు వేసుకుని నిలిచి పోయారు. మందిరం పైన మేఘం నిలిచినప్పుడు తమ శిబిరంలో ఉండే వారు.
19 When the cloud was resting on the House for a long time the children of Israel, waiting for the order of the Lord, did not go on.
౧౯ఆ మేఘం ఒకవేళ ఎక్కువ రోజులు మందిరం పైన ఉండిపోతే యెహోవా ఆదేశాలను బట్టి ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసేవారు కాదు.
20 Sometimes the cloud was resting on the House for two or three days; then, by the order of the Lord, they kept their tents in that place, and when the Lord gave the order they went on.
౨౦కొన్నిసార్లు మేఘం కొన్ని రోజులు మాత్రమే మందిరం పైన నిలిచి ఉంటే వారు కూడా నిలిచిపోయే వారు. యెహోవా ఆదేశాల మేరకు గుడారాలు వేసుకుని తిరిగి ఆయన ఆదేశాల ప్రకారం ప్రయాణమయ్యే వారు.
21 And sometimes the cloud was there only from evening to morning; and when the cloud was taken up in the morning they went on their journey again: or if it was resting there by day and by night, whenever the cloud was taken up they went forward.
౨౧కొన్నిసార్లు మేఘం సాయంత్రం నుండి మర్నాటి ఉదయం వరకూ ఉండేది. అప్పుడు ఉదయం మేఘం వెళ్ళగానే ప్రయాణం మొదలు పెట్టేవారు. ఒకవేళ మేఘం ఒక పగలూ ఒక రాత్రీ ఉంటే ఆ మేఘం వెళ్ళిన తరువాత మాత్రమే ప్రయాణం చేసేవారు.
22 Or if the cloud came to rest on the House for two days or a month or a year without moving, the children of Israel went on waiting there and did not go on; but whenever it was taken up they went forward on their journey.
౨౨ఆ మేఘం రెండు రోజులు గానీ, ఒక నెల గానీ, లేదా ఒక సంవత్సరం గానీ మందిరం పైన నిలిచి పొతే ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేయకుండా తమ గుడారాల్లో ఉండి పోయారు. ఆ మేఘం వెళ్లి పోయిన తరువాత మాత్రమే ప్రయాణం చేశారు.
23 At the word of the Lord they put up their tents, and at the word of the Lord they went forward on their journey: they kept the orders of the Lord as he gave them by Moses.
౨౩యెహోవా ఆదేశాలకు విధేయులై వారు తమ గుడారాలు వేసుకున్నారు. యెహోవా ఆదేశాలకు విధేయులై ప్రయాణం చేశారు. యెహోవా మోషే ద్వారా తమకిచ్చిన ఆదేశాలకు వారు విధేయులయ్యారు.