< Leviticus 12 >

1 And the Lord said to Moses,
యెహోవా మోషేతో ఇలా చెప్పాడు.
2 Say to the children of Israel, If a woman is with child and gives birth to a male child, she will be unclean for seven days, as when she is unwell.
“నువ్వు ఇశ్రాయేలు ప్రజలకి ఇలా చెప్పు. ఒక స్త్రీ గర్భవతిగా ఉండి ఒక మగ పిల్లాణ్ణి కంటే ఆమె ఏడు రోజులు అశుద్ధంగా ఉంటుంది. తాను బహిష్టు రోజుల్లో ఉన్నట్టే అశుద్ధంగా ఉంటుంది.
3 And on the eighth day let him be given circumcision.
ఎనిమిదో రోజున ఆ పిల్లాడికి సున్నతి చేయించాలి.
4 And she will be unclean for thirty-three days till the flow of her blood is stopped; no holy thing may be touched by her, and she may not come into the holy place, till the days for making her clean are ended.
ఆమె తన రక్తస్రావం నుండి శుద్ధి జరగడానికి ముప్ఫై మూడు రోజులు పడుతుంది. తన రక్తశుద్ధి రోజులు పూర్తయే వరకూ ఆమె పరిశుద్ధమైన దాన్ని దేన్నీ ముట్టుకోకూడదు. పరిశుద్ధ స్థలం లో ప్రవేశింపకూడదు.
5 But if she gives birth to a female child, then she will be unclean for two weeks, as when she is unwell; and she will not be completely clean for sixty-six days.
ఆమె ఒకవేళ ఆడపిల్లని కంటే ఆమె రెండు వారాలు అశుద్ధంగా ఉంటుంది. తాను బహిష్టు రోజుల్లో ఉన్నట్టే అశుద్ధంగా ఉంటుంది. ఆమె రక్తశుద్ధికి అరవై ఆరు రోజులు పడుతుంది.
6 And when the days are ended for making her clean for a son or a daughter, let her take to the priest at the door of the Tent of meeting, a lamb of the first year for a burned offering and a young pigeon or a dove for a sin-offering:
కొడుకైనా, కూతురైనా వాళ్ళ కోసం ఆమె శుద్ధి రోజులు పూర్తయ్యాక ఆమె ఒక సంవత్సరం వయస్సున్న గొర్రె పిల్లని దహనబలిగా తీసుకురావాలి. అలాగే పాపం కోసం అర్పణగా ఒక గువ్వనుగానీ, ఒక తెల్ల పావురం పిల్లని గానీ తీసుకు రావాలి. వీటిని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరికి తెచ్చి యాజకుడికి ఇవ్వాలి.
7 And the priest is to make an offering of it before the Lord and take away her sin, and she will be made clean from the flow of her blood. This is the law for a woman who gives birth to a male or a female.
అప్పుడు అతడు యెహోవా సమక్షంలో వాటిని అర్పించి ఆమె కోసం పరిహారం చేస్తాడు. అప్పుడామె తన రక్తస్రావం విషయంలో ఆమెకు శుద్ధి కలుగుతుంది. ఇది మగపిల్లాణ్ణి గానీ ఆడ పిల్లను గానీ కనినప్పుడు స్త్రీ విషయంలో విధించిన చట్టం.
8 And if she has not money enough for a lamb, then let her take two doves or two young pigeons, one for a burned offering and the other for a sin-offering, and the priest will take away her sin and she will be clean,
ఆమెకు ఒకవేళ గొర్రె పిల్లని తీసుకువచ్చే స్తోమత లేకపోతే, ఆమె రెండు తెల్ల గువ్వలనైనా రెండు పావురం పిల్లలనైనా తీసుకు రావాలి. వాటిలో ఒకటి దహనబలిగా, మరొకటి పాపంకోసం బలి అర్పణగా తీసుకు రావాలి. యాజకుడు ఆమె కోసం పరిహారం చేస్తాడు. అప్పుడామె శుద్ధురాలు అవుతుంది.”

< Leviticus 12 >