< Judges 4 >
1 And the children of Israel again did evil in the eyes of the Lord when Ehud was dead.
౧ఏహూదు చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు మళ్ళీ యెహోవా దృష్టికి దోషులయ్యారు గనక
2 And the Lord gave them up into the hands of Jabin, king of Canaan, who was ruling in Hazor; the captain of his army was Sisera, who was living in Harosheth of the Gentiles.
౨హాసోరులో ఏలే కనాను రాజైన యాబీను చేతికి ఆయన వాళ్ళను అప్పగించాడు. అతని సేనాధిపతి పేరు సీసెరా. అతడు యూదేతరుల ప్రాంతం హరోషెతులో ఉంటున్నాడు.
3 Then the children of Israel made prayer to the Lord; for he had nine hundred iron war-carriages, and for twenty years he was very cruel to the children of Israel.
౩అతనికి తొమ్మిది వందల ఇనుప రథాలు ఉన్నాయి. అతడు ఇరవై సంవత్సరాలు ఇశ్రాయేలీయులను కఠినంగా హింసలపాలు చేసినప్పుడు ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టారు.
4 Now Deborah, a woman prophet, the wife of Lapidoth, was judge of Israel at that time.
౪ఆ రోజుల్లో లప్పీదోతు భార్య దెబోరా అనే ప్రవక్త్రి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండేది.
5 (And she had her seat under the palm-tree of Deborah between Ramah and Beth-el in the hill-country of Ephraim; and the children of Israel came up to her to be judged.)
౫ఆమె ఎఫ్రాయిమీయుల ఎడారిలో రమాకు బేతేలుకు మధ్య ఉన్న దెబోరా ఖర్జూర చెట్టు కింద తీర్పులు తీర్చడానికి కూర్చుని ఉండేది. తమ వివాదాలు పరిష్కరించుకోడానికి ఇశ్రాయేలీయులు ఆమె దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు.
6 And she sent for Barak, the son of Abinoam, from Kedesh-naphtali, and said to him, Has not the Lord, the God of Israel, given orders saying, Go and get your force into line in Mount Tabor, and take with you ten thousand men of the children of Naphtali and of the children of Zebulun?
౬ఆమె నఫ్తాలిలోని కెదెషులో నుంచి అబీనోయము కొడుకు బారాకును పిలిపించి అతనితో ఇలా అంది “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపిస్తున్నాడు, ‘నువ్వు వెళ్లి నఫ్తాలీయుల్లో, జెబూలూనీయుల్లో పదివేల మందిని తాబోరు కొండ దగ్గరికి రప్పించు.
7 And I will make Sisera, the captain of Jabin's army, with his war-carriages and his forces, come against you at the river Kishon, where I will give him into your hands.
౭యాబీను సేనాధిపతి సీసెరాను, అతని రథాలను, అతని సైన్యాన్ని, కీషోను నది దగ్గర చేర్చి, అక్కడ అతని మీద నీకు జయం అనుగ్రహిస్తాను.’”
8 And Barak said to her, If you will go with me then I will go; but if you will not go with me I will not go.
౮అప్పుడు బారాకు “నువ్వు నాతోబాటు వస్తేనే వెళ్తాను గాని నువ్వు నాతో రాకపోతే నేను వెళ్లను” అని ఆమెతో చెప్పాడు.
9 And she said, I will certainly go with you: though you will get no honour in your undertaking, for the Lord will give Sisera into the hands of a woman. So Deborah got up and went with Barak to Kedesh.
౯అప్పుడు ఆమె “నీతో నేను తప్పకుండా వస్తాను. అయితే, నువ్వు చేసే ఈ ప్రయాణంవల్ల నీకు ఘనత దొరకదు. ఒక స్త్రీ చాకచక్యం వలన యెహోవా సీసెరాను అప్పగిస్తాడు” అని చెప్పి, లేచి బారాకుతోబాటు కెదెషుకు వెళ్ళింది.
10 Then Barak sent for Zebulun and Naphtali to come to Kedesh; and ten thousand men went up after him, and Deborah went up with him.
౧౦బారాకు జెబూలూనీయులను, నఫ్తాలీయులను కెదెషుకు పిలిపించినప్పుడు పదివేలమంది మనుషులు అతనితో వెళ్ళారు.
11 Now Heber the Kenite, separating himself from the rest of the Kenites, from the children of Hobab, the brother-in-law of Moses, had put up his tent as far away as the oak-tree in Zaanannim, by Kedesh.
౧౧దెబోరా కూడా అతనితో వెళ్ళింది. ఈలోపు కయీనీయుడైన హెబెరు మోషే మామ హోబాబు సంతానం వారైన కయీనీయుల నుంచి వేరుపడి కెదెషు దగ్గర ఉన్న జయనన్నీములో ఉన్న మస్తకి చెట్టు దగ్గర తన గుడారం వేసుకుని ఉన్నాడు.
12 And word was given to Sisera that Barak, the son of Abinoam, had gone up to Mount Tabor.
౧౨అబీనోయము కొడుకైన బారాకు తాబోరు కొండపైకి వెళ్ళాడని సీసెరాకు తెలిసినప్పుడు సీసెరా తన రథాలన్నిటినీ, తన తొమ్మిదివందల ఇనుప రథాలను
13 So Sisera got together all his war-carriages, nine hundred war-carriages of iron, and all the people who were with him, from Harosheth of the Gentiles as far as the river Kishon.
౧౩యూదేతరుల ప్రాంతమైన హరోషెతు నుంచి కీషోను నది వరకూ తన పక్షంగా ఉన్న ప్రజలందరినీ పిలిపించినప్పుడు
14 Then Deborah said to Barak, Up! for today the Lord has given Sisera into your hands: has not the Lord gone out before you? So Barak went down from Mount Tabor and ten thousand men after him.
౧౪దెబోరా “వెళ్ళు. యెహోవా సీసెరా మీద నీకు జయం ఇచ్చిన రోజు ఇదే. యెహోవా నిన్ను నడిపిస్తున్నాడు కదా” అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు ఆ పదివేలమంది మనుషులను వెంటబెట్టుకుని తాబోరు కొండ మీదినుంచి దిగి వచ్చాడు.
15 And the Lord sent fear on Sisera and all his war-carriages and all his army before Barak; and Sisera got down from his war-carriage and went in flight on foot.
౧౫బారాకు వాళ్ళను చంపడానికి వీలుగా యెహోవా సీసెరాను, అతని రథాలన్నిటినీ, అతని సైనికులను కలవరపరచినప్పుడు, సీసెరా తన రథం దిగి కాలినడకన పారిపోయాడు.
16 But Barak went after the war-carriages and the army as far as Harosheth of the Gentiles; and all Sisera's army was put to the sword; not a man got away.
౧౬బారాకు, ఆ రథాలను, సైన్యాన్ని యూదేతరుల ప్రాంతం హరోషెతు వరకూ తరిమినప్పుడు సీసెరా సైన్యమంతా కత్తివాత చేత కూలిపోయింది. ఒక్కడు కూడా బ్రతకలేదు.
17 But Sisera went in flight on foot to the tent of Jael, the wife of Heber the Kenite; for there was peace between Jabin, king of Hazor, and the family of Heber the Kenite.
౧౭హాసోరు రాజు యాబీనుకూ కయీనీయుడైన హెబెరు వంశస్థులకూ సంధి ఒప్పందం ఉంది గనుక సీసెరా కాలినడకన కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు గుడారానికి పారిపోయాడు.
18 And Jael went out to Sisera, and said to him, Come in, my lord, come in to me without fear. So he went into her tent, and she put a cover over him.
౧౮అప్పుడు యాయేలు సీసెరాను ఎదుర్కొని అతణ్ణి చూసి “ప్రభూ, ఇటు నా వైపుకి రండి, భయపడవద్దు” అని చెప్పింది. అప్పుడు అతడు ఆమె గుడారంలోకి వెళ్ళాడు.
19 Then he said to her, Give me now a little water, for I have need of a drink. And opening a skin of milk, she gave him drink, and put the cover over him again.
౧౯అప్పుడు ఆమె అతనిపై దుప్పటి కప్పింది. అతడు “దాహంగా ఉంది, దయచేసి నాకు కొంచెం నీళ్ళు ఇవ్వు” అని అడిగాడు. ఆమె తోలుతో చేసిన తిత్తి విప్పి అతనికి దాహానికి ఇచ్చి, అతనికి మళ్ళీ దుప్పటి కప్పే సమయంలో
20 And he said to her, Take your place at the door of the tent, and if anyone comes and says to you, Is there any man here, say, No.
౨౦అతడు “గుడారం ద్వారం దగ్గర నుండి ఎవరైనా లోపలికి వచ్చి, లోపల ఎవరైనా ఉన్నారా అని అడిగితే, ఎవరూ లేరని నువ్వు చెప్పాలి” అన్నాడు.
21 Then Jael, Heber's wife, took a tent-pin and a hammer and went up to him quietly, driving the pin into his head, and it went through his head into the earth, for he was in a deep sleep from weariness; and so he came to his end.
౨౧ఆ తరువాత హెబెరు భార్య యాయేలు గుడారానికి కొట్టే మేకు తీసుకుని ఒక సుత్తె చేత్తో పట్టుకుని మెల్లగా అతని దగ్గరికి వచ్చి, అలసిపోయి గాఢనిద్రలో ఉన్న అతని కణతలో ఆ మేకు దిగగొట్టగా అది అతని తలలో గుండా నేలలోకి దిగింది.
22 Then Jael went out, and meeting Barak going after Sisera, said to him, Come, and I will let you see the man you are searching for. So he came into her tent and saw, and there was Sisera stretched out dead with the tent-pin in his head.
౨౨అతడు చచ్చాడు. బారాకు సీసెరాను తరుముకుంటూ రాగా యాయేలు అతన్ని ఎదుర్కొని “నువ్వు వెతుకుతున్న మనిషిని నీకు చూపిస్తాను” అంది. అతడు వచ్చినప్పుడు సీసెరా చచ్చి పడి ఉన్నాడు. ఆ మేకు అతని కణతలో ఉంది.
23 So that day God overcame Jabin, king of Canaan, before the children of Israel.
౨౩ఆ రోజు దేవుడు ఇశ్రాయేలీయుల కోసం కనాను రాజు యాబీనును ఓడించాడు
24 And the power of the children of Israel went on increasing against Jabin, king of Canaan, till he was cut off.
౨౪తరువాత ఇశ్రాయేలీయుల కనాను రాజు యాబీనును చంపేవరకూ వారి బలం అంతకంతకూ పెరుగుతూ ఉంది.