< Ezekiel 47 >
1 And he took me back to the door of the house; and I saw that waters were flowing out from under the doorstep of the house on the east, for the house was facing east: and the waters came down from under, from the right side of the house, on the south side of the altar.
౧ఆయన నన్ను మందిరపు గుమ్మానికి తోడుకుని వచ్చాడు. మందిరం తూర్పు వైపుకు తిరిగి ఉంది. నేను చూసినపుడు మందిరం గడప కింద నుండి నీళ్లు ఉబికి తూర్పు వైపుకు పారుతున్నాయి. ఆ నీళ్లు బలిపీఠానికి దక్షిణ దిశగా మందిరం కుడిపక్కన కింద నుండి పారుతున్నాయి.
2 And he took me out by the north doorway, and made me go round to the outside of the doorway looking to the east; and I saw waters running slowly out on the south side.
౨తరవాత ఆయన ఉత్తరపు గుమ్మం మార్గంలో నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పుకు పోయే దారిలో బయటి గుమ్మానికి తోడుకుని వచ్చాడు. నేను చూసినప్పుడు అక్కడ గుమ్మపు కుడిపక్కన నీళ్లు ఉబికి పారుతున్నాయి.
3 And the man went out to the east with the line in his hand, and after measuring a thousand cubits, he made me go through the waters, which came over my feet.
౩ఆ వ్యక్తి కొలనూలు చేత పట్టుకుని తూర్పు వైపుకు వెళ్లి 540 మీటర్లు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపించినపుడు ఆ నీళ్లు చీలమండ లోతు వచ్చాయి.
4 And again, measuring a thousand cubits, he made me go through the waters which came up to my knees. Again, measuring a thousand, he made me go through the waters up to the middle of my body.
౪ఆయన ఇంకో 540 మీటర్లు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపించినపుడు నీళ్లు మోకాళ్ల లోతు వచ్చాయి. ఇంకా ఆయన 540 మీటర్లు కొలిచి నీళ్లగుండా నన్ను నడిపించినపుడు నీళ్లు మొల లోతుకు వచ్చాయి.
5 Again, after his measuring a thousand, it became a river which it was not possible to go through: for the waters had become deep enough for swimming, a river it was not possible to go through.
౫ఆయన ఇంకా 540 మీటర్లు కొలిచాడు. అప్పుడు ఆ నీళ్లు చాల లోతుగా మారి నేను దాటలేనంత నది కనబడింది. దాటడానికి వీలులేకుండ ఈదాల్సినంత నీటితో ఉన్న నదిగా మారింది.
6 And he said to me, Son of man, have you seen this? Then he took me to the river's edge.
౬అప్పుడాయన నాతో “నరపుత్రుడా, నీవు చూశావు గదా” అని చెప్పి నన్ను మళ్ళీ నది ఇవతలికి తీసుకుని వచ్చాడు.
7 And he took me back, and I saw at the edge of the river a very great number of trees on this side and on that.
౭నేను వెనక్కి వస్తుండగా నదీతీరాన రెండు వైపులా చెట్లు విస్తారంగా కనబడ్డాయి.
8 And he said to me, These waters are flowing out to the east part of the land and down into the Arabah; and they will go to the sea, and the waters will be made sweet.
౮అప్పుడాయన నాతో ఇలా అన్నాడు. “ఈ నీళ్లు ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశానికి ప్రవహించి అరబాలోకి దిగి సముద్రంలో పడుతుంది. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్లుగా మారిపోతాయి.
9 And it will come about that every living and moving thing, wherever their streams come, will have life; and there will be very much fish because these waters have come there and have been made sweet: and everything wherever the river comes will have life.
౯ఈ నది ప్రవహించే చోటల్లా జలచరాలన్నీ బతుకుతాయి. ఈ నీళ్లు అక్కడికి రావడం వలన ఆ నీళ్ళు మంచి నీళ్ళు అవుతాయి కాబట్టి చేపలు విస్తారంగా పెరుగుతాయి. ఈ నది ఎక్కడికి ప్రవహిస్తుందో అక్కడ సమస్తం బతుకుతాయి.
10 And fishermen will take up their places by it: from En-gedi as far as En-eglaim will be a place for the stretching out of nets; the fish will be of every sort, like the fish of the Great Sea, a very great number.
౧౦ఏన్గెదీ పట్టణం మొదలుకుని ఏనెగ్లాయీము పట్టణం వరకూ చేపలు పట్టేవారు దాని ఒడ్డున నిలిచి వలలు వేస్తారు. మహా సముద్రంలో ఉన్నట్టు అన్ని రకాల జాతుల చేపలు దానిలో బహు విస్తారంగా ఉంటాయి.
11 The wet places and the pools will not be made sweet; they will be given up to salt.
౧౧అయితే ఆ సముద్రంలోని బురద స్థలాలు, ఊబి తావులు బాగవ్వక ఉప్పును అందిస్తూ ఉంటాయి.
12 And by the edge of the river, on this side and on that, will come up every tree used for food, whose leaves will ever be green and its fruit will not come to an end: it will have new fruit every month, because its waters come out from the holy place: the fruit will be for food and the leaf will make well those who are ill.
౧౨నదీతీరాన రెండు వైపులా ఆహారమిచ్చే సకల జాతుల వృక్షాలు పెరుగుతాయి. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి ప్రవహిస్తున్నది కాబట్టి ఆ చెట్లు ప్రతి నెలా కాయలు కాస్తాయి. వాటి పండ్లు ఆహారానికీ వాటి ఆకులు ఔషధాలకు పని చేస్తాయి.”
13 This is what the Lord has said: These are the limits by which you will take up your heritage in the land among the twelve tribes of Israel: Joseph is to have two parts.
౧౩ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే “సరిహద్దులను బట్టి ఇశ్రాయేలీయుల 12 గోత్రాల ప్రకారం మీరు స్వాస్థ్యంగా పంచుకోవాల్సిన భూమి ఇది. యోసేపు సంతానానికి రెండు భాగాలియ్యాలి.
14 And you are to make an equal division of it; as I gave my oath to your fathers to give it to you: for this land is to be your heritage.
౧౪నేను ఈ దేశాన్ని ప్రమాణ పూర్వకంగా మీ పూర్వీకులకు ఈ దేశం ఇచ్చాను కాబట్టి భేదం ఏమీ లేకుండ మీలో ప్రతి ఒక్కరు దానిలో స్వాస్థ్యం పొందుతారు. ఆ విధంగా అది మీకు స్వాస్థ్యమవుతుంది.
15 And this is to be the limit of the land: on the north side, from the Great Sea, in the direction of Hethlon, as far as the way into Hamath;
౧౫ఉత్తరాన సెదాదుకు పోయే మార్గంలో మహా సముద్రం మొదలుకుని హెత్లోను వరకూ దేశానికి సరిహద్దు.
16 To Zedad, Berothah, Sibraim, which is between the limit of Damascus and the limit of Hazar-hatticon, which is on the limit of Hauran.
౧౬అది హమాతుకు, బేరోతాయుకు, దమస్కు సరిహద్దుకు, హమాతు సరిహద్దుకు మధ్య ఉన్న సిబ్రయీముకు, హవ్రాను సరిహద్దును ఆనుకుని ఉన్న మధ్యస్థలమైన హాజేరుకు వ్యాపిస్తుంది.
17 And this is the limit from the sea in the direction of Hazar-enon; and the limit of Damascus is to the north, and on the north is the limit of Hamath. This is the north side.
౧౭పడమటి సరిహద్దు హసరేనాను అనే దమస్కు సరిహద్దు పట్టణం, ఉత్తరపు సరిహద్దు హమాతు, ఇది మీకు ఉత్తరపు సరిహద్దు.
18 And the east side will be from Hazar-enon, which is between Hauran and Damascus; and between Gilead and the land of Israel the Jordan will be the limit, to the east sea, to Tamar. This is the east side.
౧౮తూర్పుదిక్కున హవ్రాను, దమస్కు, గిలాదులకు ఇశ్రాయేలీయుల దేశానికి మధ్య యొర్దానునది సరిహద్దుగా ఉంటుంది. సరిహద్దు మొదలుకొని తూర్పు సముద్రం వరకూ దాన్ని కొలవాలి. ఇది మీకు తూర్పు సరిహద్దు.
19 And the south side to the south will be from Tamar as far as the waters of Meribath-kadesh, to the stream of Egypt, to the Great Sea. This is the south side, on the south.
౧౯దక్షిణ దిక్కున తామారు మొదలుకుని కాదేషు దగ్గర ఉన్న మెరీబా ఊటల వరకూ నది దారిలో మహాసముద్రానికి మీ సరిహద్దు ఉంటుంది. ఇది మీకు దక్షిణపు సరిహద్దు.
20 And the west side will be the Great Sea, from the limit on the south to a point opposite the way into Hamath. This is the west side.
౨౦పశ్చిమ దిక్కున సరిహద్దు మొదలుకొని హమాతుకు పోయే మార్గం వరకూ మహాసముద్రం సరిహద్దుగా ఉంటుంది. ఇది మీకు పశ్చిమ దిక్కు సరిహద్దు.
21 You will make a division of the land among you, tribe by tribe.
౨౧ఇశ్రాయేలీయుల గోత్రాల ప్రకారం ఈ దేశాన్ని మీరు పంచుకోవాలి.
22 And you are to make a distribution of it, by the decision of the Lord, for a heritage to you and to the men from other lands who are living among you and who have children in your land: they will be the same to you as if they were Israelites by birth, they will have their heritage with you among the tribes of Israel.
౨౨మీరు చీట్లువేసి మీకూ మీలో నివసించి పిల్లలు కన్న పరదేశులకూ ఆస్తులను విభజించేటప్పుడు ఇశ్రాయేలీయుల దేశంలో పుట్టిన వారిగానే ఆ పరదేశులను మీరు ఎంచాలి. ఇశ్రాయేలు గోత్రికులతో పాటు తాము కూడా స్వాస్థ్యం పొందేలా మీలాగా వారు కూడా చీట్లు వేయాలి.
23 In whatever tribe the man from a strange land is living, there you are to give him his heritage, says the Lord.
౨౩ఏ గోత్రంలో పరదేశులు కాపురముంటారో ఆ గోత్ర భాగంలో మీరు వారికి స్వాస్థ్యం ఇవ్వాలి.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.