< Ezekiel 27 >
1 The word of the Lord came to me again, saying,
౧యెహోవా నాకు ఈ విషయం మళ్ళీ తెలియజేశాడు.
2 And you, son of man, make a song of grief for Tyre;
౨నరపుత్రుడా, తూరు పట్టణం గురించి శోకగీతం మొదలు పెట్టి దానికిలా చెప్పు.
3 And say to Tyre, O you who are seated at the doorway of the sea, trading for the peoples with the great sea-lands, these are the words of the Lord: You, O Tyre, have said, I am a ship completely beautiful.
౩సముద్రపు రేవుల మధ్య నువ్వు నివసిస్తున్నావు. అనేక తీరప్రాంతాల ప్రజలతో నువ్వు వ్యాపారం చేస్తున్నావు. యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, తూరూ “నేను అతిలోక సుందరిని” అని నువ్వనుకుంటున్నావు.
4 Your builders have made your outlines in the heart of the seas, they have made you completely beautiful.
౪నీ సరిహద్దులు సముద్రంలో ఉన్నాయి. నీ భవన నిర్మాతలు నీ అందాన్ని లోపరహితంగా చేశారు.
5 They have made all your boards of fir-trees from Senir: they have taken cedars from Lebanon to make the supports for your sails.
౫నీ ఓడలను హెర్మోను పర్వత సరళ వృక్షం కలపతో కట్టారు. లెబానోను దేవదారు మ్రాను తెప్పించి నీ ఓడ దూలం చేశారు.
6 Of oak-trees from Bashan they have made your driving blades; they have made your floors of ivory and boxwood from the sea-lands of Kittim.
౬బాషాను సింధూర చెక్కతో నీ తెడ్లు చేశారు. కుప్ర ద్వీపం నుంచి వచ్చిన కలపతో దంతపు పని పొదిగిన నీ ఓడ పైభాగం చేశారు.
7 The best linen with needlework from Egypt was your sail, stretched out to be a flag for you; blue and purple from the sea-lands of Elishah gave you shade.
౭నీకు జెండాలుగా ఉండడానికి నీ తెరచాపలు ఐగుప్తులో తయారై బుట్టా వేసిన శ్రేష్ఠమైన నారతో చేశారు!
8 The people of Zidon and Arvad were your boatmen; the wise men of Zemer were in you; they were guiding your ships;
౮సీదోను నివాసులు, అర్వదు నివాసులు నీ తెడ్లు వేసేవాళ్ళు. నీ పౌరుల్లో ఆరితేరినవాళ్ళు నీకు ఓడ నాయకులుగా ఉన్నారు.
9 The responsible men of Gebal and its wise men were in you, making your boards watertight: all the ships of the sea with their seamen were in you trading in your goods.
౯బిబ్లోసుకు చెందిన నిపుణులు నీ ఓడలను బాగుచేసేవాళ్ళు. సముద్రంలో నీ సరకులు కొనడానికి సముద్ర ప్రయాణం చేసే నావికుల ఓడలన్నీ నీ రేవుల్లో ఉన్నాయి.
10 Cush and Lud and Put were in your army, your men of war, hanging up their body-covers and head-dresses of war in you: they gave you your glory.
౧౦పారసీక దేశస్థులు, లూదు వాళ్ళు, పూతు వాళ్ళు నీ సైన్యంలో చేరి నీకు సిపాయిలుగా ఉన్నారు. వాళ్ళు నీ డాళ్లనూ శిరస్త్రాణాలనూ నీలో వేలాడదీశారు. వాళ్ళు నీకు శోభ తెచ్చారు.
11 The men of Arvad in your army were on your walls, and were watchmen in your towers, hanging up their arms on your walls round about; they made you completely beautiful.
౧౧అర్వదు వాళ్ళు, హెలెక్ వాళ్ళు, నీ సైన్యంలో చేరి అన్ని వైపులా నీ గోడల మీద ఉన్నారు. గమ్మాదు వాళ్ళు నీ ప్రాకారాల్లో ఉన్నారు. వీరంతా తమ డాళ్లు నీ గోడల మీద, చుట్టూ తగిలించారు. నీ సౌందర్యాన్ని లోపం లేనిదిగా చేశారు.
12 Tarshish did business with you because of the great amount of your wealth; they gave silver, iron, tin, and lead for your goods.
౧౨రకరకాల సరకులు నీ దగ్గర చాలా ఎక్కువగా ఉండడం వలన తర్షీషు వాళ్ళు నీతో వ్యాపారం చేశారు. వెండి, ఇనుము, తగరం, సీసం ఇచ్చి నీ సరకులు కొన్నారు.
13 Javan, Tubal, and Meshech were your traders; they gave living men and brass vessels for your goods.
౧౩యావాను, తుబాలు, మెషెకు ప్రాంతాలవాళ్ళు నీతో వ్యాపారం చేశారు. బానిసలనూ ఇత్తడి వస్తువులనూ ఇచ్చి నీ సరకులు కొన్నారు.
14 The people of Togarmah gave horses and war-horses and transport beasts for your goods.
౧౪బేత్ తోగర్మా వాళ్ళు గుర్రాలను యుద్ధాశ్వాలనూ కంచరగాడిదలనూ ఇచ్చి నీ సరకులు కొన్నారు.
15 The men of Rodan were your traders: a great number of sea-lands did business with you: they gave you horns of ivory and ebony as an offering.
౧౫దదాను వాళ్ళు నీతో వ్యాపారం చేశారు. అనేక సముద్ర తీరాల ప్రజలు నీ సరుకులు కొన్నారు. వాళ్ళు దంతం, నల్లచేవ మాను తెచ్చి ఇచ్చారు.
16 Edom did business with you because of the great number of things which you made; they gave emeralds, purple, and needlework, and the best linen and coral and rubies for your goods.
౧౬నువ్వు చేసిన వివిధ వస్తువులను కొనుక్కోడానికి సిరియనులు నీతో వ్యాపారం చేశారు. వాళ్ళు పచ్చలు, ఊదా రంగు, అద్దకం వేసిన బట్ట, నునుపైన బట్ట, ముత్యాలు, రత్నాలు ఇచ్చి నీ సరుకులు కొన్నారు.
17 Judah and the land of Israel were your traders; they gave grain of Minnith and sweet cakes and honey and oil and perfume for your goods.
౧౭యూదావారూ ఇశ్రాయేలు వారూ నీతో వ్యాపారం చేశారు. మిన్నీతు నుంచి గోదుమలు, చిరు ధాన్యాలు, తేనె, నూనె, గుగ్గిలం తెచ్చి నీ సరుకులు కొన్నారు.
18 Damascus did business with you because of the great amount of your wealth, with wine of Helbon and white wool.
౧౮దమస్కు వాళ్ళు హెల్బోను ద్రాక్షారసం, జహారు ప్రాంతం ఉన్ని తెచ్చి నీతో వ్యాపారం చేశారు.
19 ... for your goods: they gave polished iron and spices for your goods.
౧౯ఉజ్జాలు నుంచి దాను, యావాను వాళ్ళు ఇనప పనిముట్లు, దాల్చిన చెక్క, వాము తెచ్చి నీ సరుకులు కొన్నారు.
20 Dedan did trade with you in cloths for the backs of horses.
౨౦దెదాను వాళ్ళు గుర్రపు జీనుల కోసం వాడే బట్టలు తెచ్చి నీ సరుకులు కొన్నారు.
21 Arabia and all the rulers of Kedar did business with you; in lambs and sheep and goats, in these they did business with you.
౨౧అరేబియా వాళ్ళు, కేదారు నాయకులంతా నీతో వ్యాపారం చేశారు. వాళ్ళు గొర్రె పిల్లలను, పొట్టేళ్లను, మేకలను తెచ్చి నీ సరుకులు కొన్నారు.
22 The traders of Sheba and Raamah did trade with you; they gave the best of all sorts of spices and all sorts of stones of great price and gold for your goods.
౨౨షేబ వ్యాపారులు రమా వ్యాపారులు నీతో వ్యాపారం చేశారు. వాళ్ళు అతి ప్రశస్తమైన గంధవర్గాలనూ విలువగల నానా విధమైన రత్నాలనూ బంగారాన్నీ ఇచ్చి నీ సరుకులు కొనుక్కుంటారు.
23 Haran and Canneh and Eden, the traders of Asshur and all the Medes:
౨౩హారాను వాళ్ళు, కన్నే వాళ్ళు, ఏదెను వాళ్ళు, షేబ వ్యాపారులు, అష్షూరు వ్యాపారులు, కిల్మదు వ్యాపారులు నీతో వ్యాపారం చేశారు.
24 These were your traders in beautiful robes, in rolls of blue and needlework, and in chests of coloured cloth, corded with cords and made of cedar-wood, in them they did trade with you.
౨౪వీళ్ళు నీ బజారుల్లో అందమైన దుస్తులూ ఊదారంగు కుట్టుపనితో చేసిన బట్టలూ రంగు రంగుల తివాచీలు, గట్టిగా పేనిన తాళ్ళు తెచ్చి నీ సరుకులు కొన్నారు.
25 Tarshish ships did business for you in your goods: and you were made full, and great was your glory in the heart of the seas.
౨౫తర్షీషు ఓడలు నీ సరుకులను వేర్వేరు స్థలాలకు తీసుకుపోయేవి. నువ్వు విస్తారమైన నీ సరుకులతో సముద్రం మధ్యలో కూర్చున్నావు.
26 Your boatmen have taken you into great waters: you have been broken by the east wind in the heart of the seas.
౨౬తెడ్లతో ఓడ నడిపేవాళ్ళు నిన్ను మహాసముద్రం లోకి తీసుకుపోయారు. అయితే తూర్పు గాలి సముద్ర మధ్యలో నీ మీద విరుచుకు పడింది.
27 Your wealth and your goods, the things in which you do trade, your seamen and those guiding your ships, those who make your boards watertight, and those who do business with your goods, and all your men of war who are in you, with all who have come together in you, will go down into the heart of the seas in the day of your downfall.
౨౭నువ్వు పతనమయ్యే రోజున నీ సంపద, నీ సరుకులు, నువ్వు మార్పిడి చేసుకునే వస్తువులు, నీ నావికులు, నీ ఓడ నాయకులు, నీ ఓడలు బాగు చేసే వాళ్ళు, నీతో వ్యాపారం చేసే వాళ్ళు, నీ సిపాయిలంతా, నీలో ఉన్న వాళ్ళంతా సముద్రం మధ్యలో మునిగిపోతారు.
28 At the sound of the cry of your ships' guides, the boards of the ship will be shaking.
౨౮నీ ఓడ నాయకులు వేసిన కేకల వలన సముద్ర తీర పట్టణాలు కంపిస్తాయి.
29 And all the boatmen, the seamen and those who are expert at guiding a ship through the sea, will come down from their ships and take their places on the land;
౨౯తెడ్లు పట్టుకునే వాళ్ళంతా తమ ఓడలనుంచి దిగిపోతారు. నావికులూ ఓడనాయకులూ ఒడ్డున నిలబడతారు.
30 And their voices will be sounding over you, and crying bitterly they will put dust on their heads, rolling themselves in the dust:
౩౦తమ స్వరం మీరు వినేలా చేసి, వెక్కి వెక్కి ఏడుస్తారు. తమ తలల మీద దుమ్ము పోసుకుని బూడిదలో పొర్లుతారు.
31 And they will have the hair of their heads cut off because of you, and will put haircloth on their bodies, weeping for you with bitter grief in their souls, even with bitter sorrow.
౩౧నీకోసం తమ తలలు బోడి చేసుకుని మొలకు గోనె పట్టా కట్టుకుని మనో వేదనతో నీ కోసం ఎంతో దుఖిస్తారు.
32 And in their weeping they will make a song of grief for you, sorrowing over you and saying, Who is like Tyre, who has come to an end in the deep sea?
౩౨వాళ్ళు నీ గురించి శోకగీతం మొదలుపెట్టి నీమీద మృత్యు గీతాలు ఇలా ఆలపిస్తారు, తూరు లాంటి పట్టణం ఎక్కడుంది? ఇప్పుడు సముద్రంలో మునిగిపోయి మౌనంగా ఉండిపోయింది.
33 When your goods went out over the seas, you made numbers of peoples full; the wealth of the kings of the earth was increased with your great wealth and all your goods.
౩౩సముద్రం మీద నీ సరుకులు తీసుకు పోతూ అది అనేకమందికి తృప్తినిచ్చింది. నీ గొప్ప సంపద, వ్యాపారంతో భూరాజులు ధనికులయ్యారు.
34 Now that you are broken by the seas in the deep waters, your goods and all your people will go down with you.
౩౪అయితే నువ్వు అగాధజలాల్లో మునిగి సముద్ర బలంతో బద్దలయ్యావు. నీ వ్యాపారం, నీ బలగమంతా మునిగిపోయింది.
35 All the people of the sea-lands are overcome with wonder at you, and their kings are full of fear, their faces are troubled.
౩౫నిన్ను బట్టి సముద్ర తీరప్రాంత ప్రజలంతా నిర్ఘాంతపోయారు. వాళ్ళ రాజులు భయాందోళనతో వణికారు. వాళ్ళ ముఖాలు చిన్నబోయాయి.
36 Those who do business among the peoples make sounds of surprise at you; you have become a thing of fear, you have come to an end for ever.
౩౬ప్రజల్లోని వ్యాపారులు నిన్నుహేళన చేస్తారు. నువ్వు భయభ్రాంతులు చెందావు. నీవిక ఎంత మాత్రం ఉనికిలో ఉండవు.