< Deuteronomy 2 >
1 Then we went back, journeying into the waste land by the way to the Red Sea, as the Lord had said to me: and we were a long time going round Mount Seir.
౧అప్పుడు యెహోవా నాతో చెప్పిన విధంగా మనం తిరిగి ఎర్రసముద్రం దారిలో ఎడారి గుండా చాలా రోజులు శేయీరు కొండ చుట్టూ తిరిగాం.
2 And the Lord said to me,
౨యెహోవా నాకు ఇలా చెప్పాడు. “మీరు ఈ కొండ చుట్టూ తిరిగింది చాలు,
3 You have been journeying round this mountain long enough: now go to the north;
౩ఉత్తరం వైపుకు వెళ్ళండి. నువ్వు ప్రజలతో ఇలా చెప్పు.
4 And give the people orders, saying, You are about to go through the land of your brothers, the children of Esau, who are living in Seir; and they will have fear of you; so take care what you do:
౪‘శేయీరులో నివసించే ఏశావు సంతానమైన మీ సోదరుల సరిహద్దులు దాటి వెళ్లబోతున్నారు, వారు మీకు భయపడతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి.
5 Make no attack on them, for I will not give you any of their land, not even space enough for a man's foot: because I have given Mount Seir to Esau for his heritage.
౫వారితో కలహం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఏశావుకు శేయీరును స్వాస్థ్యంగా ఇచ్చింది నేనే. వారి భూమిలోనిది ఒక్క అడుగైనా మీకియ్యను.
6 You may get food for your needs from them for a price, and water for drinking.
౬మీరు డబ్బులిచ్చి వారి దగ్గర ఆహారం కొని తినవచ్చు. డబ్బులిచ్చి నీళ్లు కొని తాగవచ్చు.’
7 For the blessing of the Lord your God has been on you in all the work of your hands: he has knowledge of your wanderings through this great waste: these forty years the Lord your God has been with you, and you have been short of nothing.
౭ఎందుకంటే మీ చేతి పని అంతటినీ మీ యెహోవా దేవుడు ఆశీర్వదించాడు. ఈ గొప్ప ఎడారిలో నువ్వు ఈ నలభై సంవత్సరాలు తిరిగిన సంగతి ఆయనకు తెలుసు. ఆయన మీకు తోడుగా ఉన్నాడు, మీకేమీ తక్కువ కాదు.”
8 So we went on past our brothers, the children of Esau, living in Seir, by the road through the Arabah, from Elath and Ezion-geber. And turning, we went by the road through the waste land of Moab.
౮అప్పుడు శేయీరులో నివసించే ఏశావు సంతానమైన మన సోదరులను విడిచి, ఏలతు, ఎసోన్గెబెరు, అరాబా దారిలో మనం ప్రయాణించాం.
9 And the Lord said to me, Make no attack on Moab and do not go to war with them, for I will not give you any of his land: because I have given Ar to the children of Lot for their heritage.
౯మనం తిరిగి మోయాబు ఎడారి మార్గంలో వెళుతుండగా యెహోవా నాతో ఇలా అన్నాడు. “మోయాబీయులను బాధ పెట్టవద్దు. వారితో యుద్ధం చేయొద్దు. లోతు సంతానానికి ఆర్ దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాను. వారి భూమిలో దేనినీ నీ స్వంతానికి ఇవ్వను.”
10 (In the past the Emim were living there; a great people, equal in numbers to the Anakim and as tall;
౧౦గతంలో ఏమీయులు ఆ ప్రాంతాల్లో ఉండేవారు. వారు అనాకీయుల్లాగా పొడవైనవారు, బలవంతులైన గొప్ప ప్రజ. అనాకీయుల్లాగా వారిని కూడా “రెఫాయీయులు” అని పిలిచారు.
11 They are numbered among the Rephaim, like the Anakim; but are named Emim by the Moabites.
౧౧మోయాబీయులు వారికి “ఏమీయులు” పేరు పెట్టారు.
12 And the Horites in earlier times were living in Seir, but the children of Esau took their place; they sent destruction on them and took their land for themselves, as Israel did to the land of his heritage which the Lord gave them.)
౧౨పూర్వకాలంలో హోరీయులు శేయీరులో నివసించారు. ఇశ్రాయేలీయులు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశంలో చేసినట్టు ఏశావు సంతానం హోరీయుల దేశాన్ని స్వాధీనం చేసుకుని వారిని చంపి వారి దేశంలో నివసించారు.
13 Get up now, and go over the stream Zered. So we went over the stream Zered.
౧౩“ఇప్పుడు మీరు లేచి జెరెదు వాగు దాటండి” అని యెహోవా ఆజ్ఞాపించగా మనం జెరెదు వాగు దాటాం.
14 Thirty-eight years had gone by from the time when we came away from Kadesh-barnea till we went over the stream Zered; by that time all the generation of the men of war among us were dead, as the Lord had said.
౧౪మనం కాదేషు బర్నేయ నుండి బయలుదేరి జెరెదు వాగు దాటే వరకూ మనం ప్రయాణించిన కాలం 38 సంవత్సరాలు. యెహోవా వారితో శపథం చేసినట్టు అప్పటికి ఆ తరంలో యుద్ధం చేయగల మనుషులందరూ గతించిపోయారు.
15 For the hand of the Lord was against them, working their destruction, till all were dead.
౧౫అంతే కాదు, వారు గతించే వరకూ ఆ తరం వారిని చంపడానికి యెహోవా హస్తం వారికి విరోధంగా ఉంది.
16 So when death had overtaken all the men of war among the people,
౧౬ఈ విధంగా సైనికులైన వారంతా చనిపోయి గతించిన తరువాత యెహోవా నాకు ఇలా చెప్పాడు,
17 The word of the Lord came to me, saying,
౧౭“ఈ రోజు నువ్వు మోయాబుకు సరిహద్దుగా ఉన్న ఆర్ దేశాన్ని దాటబోతున్నావు.
18 You are about to go by Ar, the limit of the country of Moab;
౧౮అమ్మోనీయుల పక్కగా వెళ్ళేటప్పుడు వారిని బాధించవద్దు.
19 And when you come near the land of the children of Ammon, give them no cause of trouble and do not make war on them, for I will not give you any of the land of the children of Ammon for your heritage: because I have given it to the children of Lot.
౧౯వారితో యుద్ధం చేయొద్దు. ఎందుకంటే లోతు సంతానానికి దాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాను. కాబట్టి వారి దేశంలో భూమిని నీకు ఏ మాత్రం ఇవ్వను.”
20 (That land is said to have been a land of the Rephaim, for Rephaim had been living there in earlier times, but they were named Zamzummim by the Ammonites;
౨౦దాన్ని కూడా రెఫాయీయుల దేశం అని పిలిచారు. పూర్వం రెఫాయీయులు అందులో నివసించారు. అమ్మోనీయులు వారిని “జంజుమీయులు” అనేవారు.
21 They were a great people, tall as the Anakim, and equal to them in number; but the Lord sent destruction on them and the children of Ammon took their place, living in their land;
౨౧వారు అనాకీయుల్లాగా పొడవైన వారు, బలవంతులైన గొప్ప ప్రజలు. అయితే యెహోవా అమ్మోనీయుల ఎదుట నుండి వారిని వెళ్లగొట్టడం వలన అమ్మోనీయులు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుని అక్కడ నివసించారు.
22 As he did for the children of Esau living in Seir, when he sent destruction on the Horites before them, and they took their land where they are living to this day:
౨౨ఆయన శేయీరులో నివసించే ఏశావు సంతానం కోసం వారి ఎదుట నుండి హోరీయులను నశింపజేశాడు కాబట్టి వారు హోరీయుల దేశాన్ని స్వాధీనం చేసుకుని ఈ రోజు వరకూ అక్కడ నివసిస్తున్నారు.
23 And the Avvim, living in the small towns as far as Gaza, came to destruction by the hands of the Caphtorim who came out from Caphtor and took their land.)
౨౩గాజా వరకూ ఉన్న గ్రామాల్లో నివసించిన ఆవీయులను కఫ్తోరు నుండి వచ్చిన కఫ్తోరీయులు నాశనం చేసి అక్కడ నివసించారు.
24 Get up now, and go on your journey, crossing over the valley of the Arnon: see, I have given into your hands Sihon, the Amorite, king of Heshbon, and all his land: go forward to make it yours, and make war on him,
౨౪“మీరు బయలుదేరి అర్నోను లోయ దాటండి. ఇదిగో అమోరీయుడు, హెష్బోను రాజు అయిన సీహోనునూ అతని దేశాన్నీ మీ చేతికి అప్పగించాను. అతనితో యుద్ధం చేసి దాన్ని ఆక్రమించుకోండి.
25 From now on I will put the fear of you in all peoples under heaven, who, hearing of you, will be shaking with fear and grief of heart because of you.
౨౫ఈ రోజు ఆకాశం కింద ఉన్న జాతుల ప్రజలందరికీ నువ్వంటే భయం పుట్టించడం మొదలు పెడుతున్నాను. వారు మీ గురించిన సమాచారం విని నీ ఎదుట వణకి, కలవరపడతారు” అని యెహోవా నాతో చెప్పాడు.
26 Then from the waste land of Kedemoth I sent representatives to Sihon, king of Heshbon, with words of peace, saying,
౨౬అప్పుడు నేను కెదేమోతు ఎడారిలో నుండి హెష్బోను రాజు సీహోను దగ్గరికి దూతలను పంపి
27 Let me go through your land: I will keep to the highway, not turning to the right or to the left;
౨౭“మమ్మల్ని నీ దేశం గుండా వెళ్ళనివ్వు. కుడి, ఎడమలకు తిరగకుండా దారిలోనే నడిచిపోతాము.
28 Let me have food, at a price, for my needs, and water for drinking: only let me go through on foot;
౨౮నా దగ్గర సొమ్ము తీసుకుని తినడానికి ఆహార పదార్థాలు, తాగడానికి నీరు ఇవ్వు.
29 As the children of Esau did for me in Seir and the Moabites in Ar; till I have gone over Jordan into the land which the Lord our God is giving us.
౨౯శేయీరులో ఏశావు సంతానమూ ఆర్ లో మోయాబీయులూ నాకు చేసినట్టు, మా దేవుడు యెహోవా మాకిస్తున్న దేశానికి వెళ్ళడానికి యొర్దాను నది దాటేవరకూ కాలి నడకతోనే మమ్మల్ని వెళ్లనివ్వు” అని శాంతికరమైన మాటలు పలికించాను.
30 But Sihon, king of Heshbon, would not let us go through; for the Lord your God made his spirit hard and his heart strong, so that he might give him up into your hands as at this day.
౩౦అయితే హెష్బోను రాజు సీహోను మనం తన దేశం గుండా వెళ్లడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ రోజు జరిగినట్టుగా మన చేతికి అతణ్ణి అప్పగించడం కోసం మీ యెహోవా దేవుడు అతని మనస్సును కఠినపరచి అతని హృదయాన్ని బండబారిపోయేలా చేశాడు.
31 And the Lord said to me, See, from now on I have given Sihon and his land into your hands: go forward now to take his land and make it yours.
౩౧అప్పుడు యెహోవా “చూడు, సీహోనును అతని దేశాన్ని నీకు అప్పగిస్తున్నాను. అతని దేశాన్ని స్వాధీనం చేసుకోవడం మొదలు పెట్టు” అని నాతో చెప్పాడు.
32 Then Sihon came out against us with all his people, to make an attack on us at Jahaz.
౩౨సీహోనూ అతని ప్రజలంతా యాహసులో మనతో యుద్ధం చేయడానికి వచ్చారు.
33 And the Lord our God gave him into our hands; and we overcame him and his sons and all his people.
౩౩మన యెహోవా దేవుడు అతణ్ణి మనకప్పగించాడు కాబట్టి మనం అతన్నీ అతని కొడుకులనూ అతని ప్రజలందరినీ చంపివేశాం.
34 At that time we took all his towns, and gave them over to complete destruction, together with men, women, and children; we had no mercy on any:
౩౪అప్పుడున్న అతని పట్టణాలనూ, వాటిలోని స్త్రీ పురుషులనూ పిల్లలనూ ఏదీ మిగలకుండా నాశనం చేశాం.
35 Only the cattle we took for ourselves, with the goods from the towns we had taken.
౩౫కేవలం పశువులనూ ఆ పట్టణాల ఆస్తినీ దోచుకున్నాం.
36 From Aroer on the edge of the valley of the Arnon and from the town in the valley as far as Gilead, no town was strong enough to keep us out; the Lord our God gave them all into our hands:
౩౬అర్నోను ఏటిలోయ ఒడ్డున ఉన్న అరోయేరు, ఆ లోయలో ఉన్న పట్టణం మొదలుపెట్టి గిలాదు వరకూ మనకు లొంగిపోని పట్టణం ఒక్కటి కూడా లేదు. మన దేవుడు అన్నిటినీ మనకి అప్పగించాడు.
37 But you did not go near the land of the children of Ammon, that is, all the side of the river Jabbok or the towns of the hill-country, wherever the Lord our God had said we were not to go.
౩౭అయితే అమ్మోనీయుల దేశానికైనా, యబ్బోకు నది లోయలోని ఏ ప్రాంతానికైనా ఆ కొండప్రాంతంలోని పట్టణాలకైనా మన యెహోవా దేవుడు వెళ్ళవద్దని చెప్పిన మరే స్థలానికైనా మీరు వెళ్ళలేదు.