< 2 Samuel 14 >
1 Now it was clear to Joab, the son of Zeruiah, that the king's heart was turning to Absalom.
౧రాజు తన మనస్సు అబ్షాలోము పైనే పెట్టుకుని ఉన్నాడని సెరూయా కుమారుడు యోవాబు గ్రహించాడు.
2 And Joab sent to Tekoa and got from there a wise woman, and said to her, Now make yourself seem like one given up to grief, and put on the clothing of sorrow, not using any sweet oil for your body, but looking like one who for a long time has been weeping for the dead:
౨తెకోవ పట్టణం నుండి ఒక తెలివిగల స్త్రీని పిలిపించాడు. ఆమెతో “చాలాకాలం నుండి ఏడుస్తూ ఉన్నట్టు నటించు, విలాప దుస్తులు వేసుకో. నూనె రాసుకోకుండా ఎంతోకాలంగా విచారంగా ఉన్నట్టు నటిస్తూ
3 And come to the king and say these words to him. So Joab gave her words to say.
౩నీవు రాజు దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన విధంగా రాజును వేడుకో” అని చెప్పాడు.
4 And the woman of Tekoa came to the king, and falling on her face, gave him honour and said, Give me help, O king.
౪అప్పుడు ఆ తెకోవ స్త్రీ రాజు దగ్గరికి వచ్చింది. రాజుకు సాగిలపడి సమస్కారం చేసి “రాజా, నన్ను కాపాడు” అంది.
5 And the king said to her, What is your trouble? And her answer was, Truly I am a widow, and my husband is dead.
౫రాజు “నీకేం ఇబ్బంది కలిగింది?” అని అడిగాడు. ఆమె “నా భర్త చనిపోయాడు. విధవరాలిని.
6 And I had two sons, and the two of them had a fight in the field, and there was no one to come between them, and one with a blow put the other to death.
౬నీ దాసిని, నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారు పొలంలో వాదులాడుకుని కొట్టుకున్నారు. వారిని విడదీసేవారు ఎవ్వరూ లేకపోవడంతో వారిలో ఒకడు రెండవవాణ్ణి కొట్టి చంపాడు.
7 And now all the family is turned against me, your servant, saying, Give up him who was the cause of his brother's death, so that we may put him to death in payment for the life of his brother, whose life he took; and we will put an end to the one who will get the heritage: so they will put out my last burning coal, and my husband will have no name or offspring on the face of the earth.
౭నా రక్త సంబంధులందరూ నీ దాసిని నామీదికి వచ్చి, ‘తన సోదరుణ్ణి చంపినవాణ్ణి అప్పగించు. వాడు తన సోదరుని ప్రాణం తీసినందుకు మేము వాణ్ణి చంపి వాడికి హక్కు లేకుండా చేస్తాము’ అంటున్నారు. ఈ విధంగా వారు నా భర్త పేరట భూమిపై ఉన్న హక్కును, కుటుంబ వారసత్వాన్ని లేకుండా చేయబోతున్నారు” అని రాజుతో చెప్పింది.
8 And the king said to the woman, Go to your house and I will give orders about this.
౮అప్పుడు రాజు “నువ్వు నీ ఇంటికి వెళ్ళు. నీ గురించి ఆజ్ఞ జారీ చేస్తాను” అని చెప్పాడు.
9 And the woman of Tekoa said to the king, My lord, O king, may the sin be on me and on my family, and may the king and the seat of his kingdom be clear of sin!
౯అప్పుడు ఆ తెకోవ స్త్రీ “నా యజమానివైన రాజా, ఈ విషయంలో రాజుకు, రాజు సింహాసనానికి ఎలాంటి దోషం తగలకూడదు, అది నామీదా, నా కుటుంబం మీదా ఉండుగాక” అని రాజుతో అన్నది. అప్పుడు
10 And the king said, If anyone says anything to you, make him come to me, and he will do you no more damage.
౧౦రాజు “ఎవడైనా ఈ విషయంలో నీకేమైనా ఇబ్బంది కలిగిస్తే వాణ్ణి నా దగ్గరికి తీసుకురా. ఇక వాడు నీకు అడ్డు రాడు” అని ఆమెతో చెప్పాడు.
11 Then she said, Let the king keep in mind the Lord your God, so that he who gives punishment for blood may be kept back from further destruction and that no one may send death on my son. And he said, By the living Lord, not a hair of your son's head will come to the earth.
౧౧అప్పుడు ఆమె “హత్యకు ప్రతిగా హత్య చేసేవాడు నా కుమారుడికి ఏ హానీ తలపెట్టకుండా ఉండేలా రాజవైన నువ్వు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించు” అని మనవి చేసింది. అప్పుడు రాజు “యెహోవా మీద ఒట్టు, నీ కొడుకు తలవెంట్రుకల్లో ఒక్కటి కూడా నేలపై పడదు” అని చెప్పాడు.
12 Then the woman said, Will the king let his servant say one word more? And he said, Say on.
౧౨అప్పుడు ఆ స్త్రీ “నా యజమానివైన నీతో ఇంకొక మాట చెప్పుకోడానికి నీ దాసిని, నాకు దయచేసి అనుమతి ఇవ్వండి” అంది. రాజు “ఏమిటో చెప్పు” అన్నప్పుడు.
13 And the woman said, Why have you had such a thought about the people of God? (for in saying these very words the king has put himself in the wrong because he has not taken back the one whom he sent far away.)
౧౩ఆ స్త్రీ “రాజు తాను చెప్పిన మాట ప్రకారం తన సొంతమనిషినే తిరిగి రానివ్వకుండా దోషం చేసిన వాడవుతున్నాడు. దేవుని ప్రజలైన వారికి వ్యతిరేకంగా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు?
14 For death comes to us all, and we are like water drained out on the earth, which it is not possible to take up again; and God will not take away the life of the man whose purpose is that he who has been sent away may not be completely cut off from him.
౧౪మనమంతా చనిపోతాం, మనం నేలపై ఒలికిపోయి తిరిగి ఎత్తలేని నీళ్లలాగా ఉన్నాం. దేవుడు ప్రాణాలు తీయడు. వెళ్ళగొట్టిన వారు తనకు దూరంగా కాకుండా ఉండేలా ఆయన మార్గం చూపుతాడు.
15 And now it is my fear of the people which has made me come to say these words to my lord the king: and your servant said, I will put my cause before the king, and it may be that he will give effect to my request.
౧౫మావాళ్ళు నన్ను భయపెట్టారు కాబట్టి నేను దీన్ని గురించి నా ఏలికవైన నీతో మాట్లాడాలని వచ్చాను. రాజు తన దాసిని, నా విన్నపం ఆలకించి,
16 For the king will give ear, and take his servant out of the power of the man whose purpose is the destruction of me and my son together from the heritage of God.
౧౬దేవుని స్వాస్థ్యం అనుభవించకుండా నన్నూ, నా కొడుకునీ అంతం చేయాలని చూసేవారి చేతిలో నుండి నన్ను కాపాడతాడని అనుకొన్నాను.
17 Then your servant said, May the word of my lord the king give me peace! for my lord the king is as the angel of God in his hearing of good and bad: and may the Lord your God be with you!
౧౭నా ఏలికవైన నువ్వు చెప్పిన మాట నీ దాసినైన నాకు సమాధానకరంగా ఉంటుందని భావిస్తున్నాను. ఏలినవాడవైన నీకు నీ దేవుడైన యెహోవా తోడుగా ఉన్నాడు కనుక నువ్వు దేవదూత లాగా మంచి చెడులను వివేచించగలవు” అంది.
18 Then the king said to the woman, Now give me an answer to the question I am going to put to you; keep nothing back. And the woman said, Let my lord the king say on.
౧౮అప్పుడు రాజు “నేను నిన్ను అడిగే విషయం ఎంతమాత్రం దాచిపెట్టకుండా నాకు చెప్పు” అని ఆ స్త్రీతో అన్నాడు. ఆమె “నా యజమానివైన రాజా, ఏమిటో అడుగు” అంది.
19 And the king said, Is not the hand of Joab with you in all this? And the woman in answer said, By the life of your soul, my lord the king, it is not possible for anyone to go to the right hand or to the left from anything said by the king: your servant Joab gave me orders, and put all these words in my mouth:
౧౯రాజు “ఇదంతా యోవాబు నీకు చెప్పి పంపాడా?” అని అడిగాడు. అప్పుడు ఆమె ఇలా చెప్పింది “నా ఏలికవైన రాజా, నీ మీద ఒట్టు, చెప్పినదంతా తప్పకుండా గ్రహించడానికి నా యజమానివైన నీలాంటి రాజు తప్ప ఇంకెవ్వరూ లేరు. నీ సేవకుడు యోవాబు ఈ మాటలన్నిటినీ నీ దాసినైన నాకు నేర్పించాడు.
20 This he did, hoping that the face of this business might be changed: and my lord is wise, with the wisdom of the angel of God, having knowledge of everything on earth.
౨౦జరుగుతున్న పరిస్థితులను మార్చడానికి నీ సేవకుడు యోవాబు ఇలా చేశాడు. ఈ లోకంలో సమస్తాన్నీ గ్రహించడానికి నా రాజువైన నువ్వు దేవదూతలకుండే జ్ఞానం ఉన్నవాడవు.”
21 And the king said to Joab, See now, I will do this thing: go then and Come back with the young man Absalom.
౨౧అప్పుడు రాజు యోవాబును పిలిచి “విను, నువ్వు చెప్పినది నేను అంగీకరించాను” అని చెప్పి,
22 Then Joab, falling down on his face on the earth, gave the king honour and blessing; and Joab said, Today it is clear to your servant that I have grace in your eyes, my lord king, because the king has given effect to the request of his servant.
౨౨“యువకుడైన అబ్షాలోమును రప్పించండి” అని ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు యోవాబు సాష్టాంగపడి నమస్కారం చేసి రాజును కీర్తించాడు. “రాజువైన నువ్వు నీ దాసుడనైన నా మనవి అంగీకరించినందుకు నా ఏలికవైన నీ ద్వారా నేను అనుగ్రహం పొందానని నాకు తెలిసింది” అని చెప్పి, గెషూరుకు వెళ్లి
23 So Joab got up and went to Geshur and came back again to Jerusalem with Absalom.
౨౩అబ్షాలోమును యెరూషలేముకు వెంటబెట్టుకుని వచ్చాడు.
24 And the king said, Let him go to his house, but let him not see my face. So Absalom went back to his house and did not see the face of the king.
౨౪అయితే రాజు “అతడు నాకు ఎదుట పడక తన ఇంటికి వెళ్ళిపోవాలి” అని చెప్పాడు. అబ్షాలోము రాజుకు తన ముఖం చూపించకుండా తన ఇంటికి వెళ్ళిపోయాడు.
25 Now in all Israel there was no one so greatly to be praised for his beautiful form as Absalom: from his feet to the crown of his head he was completely beautiful.
౨౫ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోము అంతటి అందమైనవాడు ఎవ్వరూ లేరు. అరికాలు మొదలు నడినెత్తి వరకూ అతనిలో ఎలాంటి లోపమూ లేదు.
26 And when he had his hair cut, (which he did at the end of every year, because of the weight of his hair; ) the weight of the hair was two hundred shekels by the king's weight.
౨౬అతడు ఏడాదికొకసారి తన తలవెంట్రుకలు కత్తిరిస్తూ ఉంటాడు. ఆ వెంట్రుకల బరువు ఆనాటి కొలతను బట్టి దాదాపు రెండు కిలోగ్రాముల బరువు ఉండేది.
27 And Absalom was the father of three sons and of one daughter named Tamar, who was very beautiful.
౨౭అబ్షాలోముకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అతని కూతురి పేరు తామారు. ఆమె అత్యంత సౌందర్యవతి.
28 For two full years Absalom was living in Jerusalem without ever seeing the face of the king.
౨౮అబ్షాలోము రాజును చూడకుండా పూర్తిగా రెండేళ్ళు యెరూషలేములోనే ఉండిపోయాడు.
29 Then Absalom sent for Joab to send him to the king, but he would not come to him: and he sent again a second time, but he would not come.
౨౯రాజు దగ్గరికి యోవాబును పంపించడానికి అబ్షాలోము అతనికి కబురు పంపాడు. అయితే యోవాబు రాలేదు. రెండవసారి అతణ్ణి పిలిపించినప్పటికీ అతడు రాలేదు. అబ్షాలోముకు కోపం వచ్చింది.
30 So he said to his servants, See, Joab's field is near mine, and he has barley in it; go and put it on fire. And Absalom's servants put the field on fire.
౩౦తన పనివారిని పిలిచి “యోవాబు పొలం నా పొలం దగ్గరే ఉన్నది గదా. అతని పొలంలో యవల పంట కోతకు వచ్చి ఉంది. మీరు వెళ్లి ఆ పంటను తగలబెట్టండి” అని చెప్పాడు. అబ్షాలోము పనివాళ్ళు ఆ పంటలు తగలబెట్టారు.
31 Then Joab came to Absalom in his house and said to him, Why have your servants put my field on fire?
౩౧ఇది తెలిసిన యోవాబు అబ్షాలోము ఇంటికి వచ్చి “నీ పనివాళ్ళు నా పంటలు ఎందుకు తగలబెట్టారు?” అని అడిగాడు.
32 And Absalom's answer was, See, I sent to you saying, Come here, so that I may send you to the king to say, Why have I come back from Geshur? it would be better for me to be there still: let me now see the king's face, and if there is any sin in me, let him put me to death.
౩౨అబ్షాలోము యోవాబుతో ఇలా అన్నాడు “గెషూరు నుండి నేను రావడంవల్ల ఉపయోగం ఏమిటి? నేను అక్కడే ఉండడం మంచిదని నీ ద్వారా రాజుకు చెప్పించడానికి నీకు కబురు పంపాను. నేను రాజును కలుసుకోవాలి. నాలో ఏమైనా నేరం కనిపిస్తే రాజు నాకు మరణశిక్ష విధించవచ్చు” అన్నాడు.
33 So Joab went to the king and said these words to him: and when the king had sent for him, Absalom came, and went down on his face on the earth before the king: and the king gave him a kiss.
౩౩అప్పుడు యోవాబు రాజు దగ్గరికి వచ్చి ఆ విషయం రాజుకు చెప్పినప్పుడు, రాజు అబ్షాలోమును పిలిపించాడు. అతడు రాజు దగ్గరికి వచ్చి రాజు ముందు సాష్టాంగపడి నమస్కారం చేశాడు. రాజు అబ్షాలోమును దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు.