< Psalms 57 >

1 For the choirmaster. To the tune of “Do Not Destroy.” A Miktam of David, when he fled from Saul into the cave. Have mercy on me, O God, have mercy, for in You my soul takes refuge. In the shadow of Your wings I will take shelter until the danger has passed.
ప్రధాన సంగీతకారుని కోసం. అల్ తశ్హేత్ అనే రాగంతో పాడేది. సౌలు దగ్గర నుండి పారిపోయి గుహలో చేరినప్పుడు దావీదు రాసిన మిఖ్తీమ్ (రసిక కావ్యం). దేవా, నన్ను కరుణించు. నన్ను కరుణించు. ఈ ఆపదలు తొలగిపోయే వరకూ నా ప్రాణం నీ రెక్కల నీడలో ఆశ్రయం కోరుతున్నది.
2 I cry out to God Most High, to God who fulfills His purpose for me.
మహోన్నతుడైన దేవునికి, నా పనులు సఫలం చేసే దేవునికి నేను మొరపెడుతున్నాను.
3 He reaches down from heaven and saves me; He rebukes those who trample me. (Selah) God sends forth His loving devotion and His truth.
ఆయన ఆకాశం నుండి సహాయం పంపి నన్ను రక్షిస్తాడు. నన్ను మింగివేయాలని చూసేవారు నాపై దూషణ మాటలు పలికినప్పుడు దేవుడు తన నిబంధన నమ్మకత్వంతో తన కృపాసత్యాలను పంపుతాడు. (సెలా)
4 My soul is among the lions; I lie down with ravenous beasts— with men whose teeth are spears and arrows, whose tongues are sharp swords.
నా ప్రాణం సింహాల మధ్య ఉంది. ఆగ్రహంతో ఊగిపోతున్న వారి మధ్య నేను పండుకుని ఉన్నాను. వారి పళ్ళు శూలాలు, బాణాలు. వారి నాలుకలు పదునైన కత్తులు.
5 Be exalted, O God, above the heavens; may Your glory cover all the earth.
దేవా, ఆకాశంకంటే అత్యున్నతుడవుగా నిన్ను నీవు కనపరచుకో. నీ ప్రభావం భూమి అంతటి మీద కనబడనివ్వు.
6 They spread a net for my feet; my soul was despondent. They dug a pit before me, but they themselves have fallen into it!
నా అడుగులను పట్టుకోడానికి వారు వల పన్నారు. నా ప్రాణం క్రుంగిపోయింది. వారు నా కోసం ఒక గుంట తవ్వారుగానీ దానిలో వారే పడ్డారు. (సెలా)
7 My heart is steadfast, O God, my heart is steadfast. I will sing and make music.
నా హృదయం నిశ్చింతగా ఉంది. దేవా, నా హృదయం నిశ్చింతగా ఉంది. నేను పాడతాను, అవును, నేను స్తుతిగానం చేస్తాను.
8 Awake, my glory! Awake, O harp and lyre! I will awaken the dawn.
నా ప్రాణమా, మేలుకో. స్వరమండలమా, సితారా, మేలుకోండి. నేను వేకువనే నిద్ర లేస్తాను.
9 I will praise You, O Lord, among the nations; I will sing Your praises among the peoples.
ప్రభూ, జాతుల్లో నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తాను. ప్రజల్లో నిన్ను కీర్తిస్తాను.
10 For Your loving devotion reaches to the heavens, and Your faithfulness to the clouds.
౧౦ఎందుకంటే, నీ కృప ఆకాశం కంటే ఎత్తుగా ఉంది, నీ సత్యం మేఘమండలం వరకూ వ్యాపించి ఉంది.
11 Be exalted, O God, above the heavens; may Your glory cover all the earth.
౧౧దేవా, ఆకాశం కంటే ఉన్నతుడవుగా నిన్ను నీవు కనపరచుకో. నీ ప్రభావం ఈ భూమి అంతటి మీదా ఉన్నతంగా కనిపిస్తుంది గాక.

< Psalms 57 >