< Psalms 125 >
1 A song of ascents. Those who trust in the LORD are like Mount Zion. It cannot be moved; it abides forever.
౧యాత్రల కీర్తన యెహోవా మీద నమ్మకం ఉంచేవాళ్ళు సీయోను పర్వతంలాగా నిశ్చలంగా శాశ్వతంగా నిలిచి ఉంటారు.
2 As the mountains surround Jerusalem, so the LORD surrounds His people, both now and forevermore.
౨యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టు ఇప్పటినుండి యెహోవా తన ప్రజల చుట్టూ నిరంతరం ఉంటాడు.
3 For the scepter of the wicked will not rest upon the land allotted to the righteous, so that the righteous will not put forth their hands to injustice.
౩నీతిమంతులు పాపం చేయకుండా ఉండేలా నీతిమంతుల వారసత్వంపై దుష్టుల రాజదండం పెత్తనం చెయ్యదు.
4 Do good, O LORD, to those who are good, and to the upright in heart.
౪యెహోవా, మంచివారికి మంచి జరిగించు. యథార్థహృదయం గలవారికి శుభం కలిగించు.
5 But those who turn to crooked ways the LORD will banish with the evildoers. Peace be upon Israel.
౫తమ కుటిల మార్గాలకు తొలగిపోయిన వాళ్ళ విషయానికొస్తే ఆయన పాపం చేసేవాళ్ళను పారదోలేటప్పుడు వారిని దుర్మార్గులతో సహా వెళ్ళగొడతాడు. ఇశ్రాయేలు మీద శాంతి సమాధానాలు ఉండు గాక.