< Job 8 >
1 Then Bildad the Shuhite replied:
౧అప్పుడు షూహీయుడు బిల్దదు ఇలా అన్నాడు.
2 “How long will you go on saying such things? The words of your mouth are a blustering wind.
౨నువ్వు ఇలాంటి మాటలు ఎంతసేపు మాట్లాడతావు? నీ మాటలు సుడిగాలిలాగా బయటకు వస్తున్నాయి.
3 Does God pervert justice? Does the Almighty pervert what is right?
౩దేవుడు తన చట్టాలను రద్దు చేస్తాడా? సర్వశక్తుడైన దేవుడు న్యాయం జరిగించకుండా ఉంటాడా?
4 When your children sinned against Him, He gave them over to their rebellion.
౪ఒకవేళ నీ కొడుకులు ఆయన దృష్టిలో ఏదైనా పాపం చేశారేమో. వాళ్ళు జరిగించిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని శిక్షకు అప్పగించాడేమో.
5 But if you would earnestly seek God and ask the Almighty for mercy,
౫నువ్వు జాగ్రత్తగా దేవుని కోసం కనిపెట్టు. సర్వశక్తుడైన దేవుణ్ణి వేడుకో.
6 if you are pure and upright, even now He will rouse Himself on your behalf and restore your righteous estate.
౬నువ్వు పవిత్రుడివీ నిజాయితీపరుడివీ అయితే ఆయన తప్పకుండా నిన్ను పట్టించుకుంటాడు. నీ ప్రవర్తనకు తగినట్టుగా నీకున్న పూర్వస్థితి తిరిగి కలిగిస్తాడు.
7 Though your beginnings were modest, your latter days will flourish.
౭నీ స్థితి మొదట్లో కొద్దిగా ఉన్నప్పటికీ చివరకు ఎంతో గొప్పగా వృద్ధి చెందుతుంది.
8 Please inquire of past generations and consider the discoveries of their fathers.
౮మనం నిన్నటి మనుషులం. మనకు ఏమీ తెలియదు. భూమిపై మనం జీవించిన రోజులు నీడలాగా ఉన్నాయి.
9 For we were born yesterday and know nothing; our days on earth are but a shadow.
౯గడిచిన తరాల గురించి ఆలోచించు. వాళ్ళ పూర్వికులు పరిశోధించి తెలుసుకున్న విషయాలు జాగ్రత్తగా తెలుసుకో.
10 Will they not teach you and tell you, and speak from their understanding?
౧౦వాళ్ళు తమ అనుభవాలను బట్టి నీకు ఉపదేశిస్తారు గదా. అన్ని విషయాలు నీకు చెబుతారు గదా.
11 Does papyrus grow where there is no marsh? Do reeds flourish without water?
౧౧బురద లేకుండా జమ్ము గడ్డి పెరుగుతుందా? నీళ్లు లేకుండా రెల్లు మొలుస్తుందా?
12 While the shoots are still uncut, they dry up quicker than grass.
౧౨దాన్ని కోయకముందు ఎంతో పచ్చగా కనిపిస్తుంది. అయితే ఇతర మొక్కలతో పోల్చితే అది తొందరగా వాడిపోతుంది.
13 Such is the destiny of all who forget God; so the hope of the godless will perish.
౧౩దేవుణ్ణి నిర్లక్ష్యం చేసేవాళ్ళ స్థితి అలాగే ఉంటుంది. భక్తిహీనుల కోరికలు నిరర్థకమౌతాయి. వాళ్ళ కోరికలు తీరక భంగపడతారు.
14 His confidence is fragile; his security is in a spider’s web.
౧౪ఎందుకంటే వాళ్ళు ఆశ్రయించినది సాలెపురుగు గూడు వంటిది.
15 He leans on his web, but it gives way; he holds fast, but it does not endure.
౧౫అతడు దాని మీద ఆధారపడినప్పుడు అది పడిపోతుంది. దాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు అది విడిపోతుంది.
16 He is a well-watered plant in the sunshine, spreading its shoots over the garden.
౧౬భక్తిహీనుడు ఎండాకాలంలో పచ్చగా ఉండే మొక్కలాంటివాడు. అతని తీగెలు అతని తోట మీద పాకుతూ అల్లుకుంటాయి.
17 His roots wrap around the rock heap; he looks for a home among the stones.
౧౭అతని వేళ్లు గట్టు చుట్టూ ఆవరిస్తాయి. రాళ్లు ఉన్న భూమిలోకి పాతుకుపోవాలని అతడు ప్రయత్నిస్తూ ఉంటాడు.
18 If he is uprooted from his place, it will disown him, saying, ‘I never saw you.’
౧౮అతడున్న ప్రాంతం నుండి దేవుడు అతణ్ణి పెరికివేసినప్పుడు ఆ స్థలం అతనితో “నువ్వు నాకు తెలియదు, నేను నిన్ను ఎన్నడూ చూడలేదు” అంటుంది.
19 Surely this is the joy of his way; yet others will spring from the dust.
౧౯అతని సంతోషకరమైన స్థితికి అంతం ఇలాగే ఉంటుంది. ఆ ప్రాంతంలో భూమిలో నుండి వేరే మొక్కలు మొలుస్తాయి.
20 Behold, God does not reject the blameless, nor will He strengthen the hand of evildoers.
౨౦ఆలోచించు, దేవుడు యథార్థవంతునికి అన్యాయం చేయడు. అలానే దుర్మార్గుల చెయ్యి అందుకోడు.
21 He will yet fill your mouth with laughter, and your lips with a shout of joy.
౨౧ఇక నుండి ఆయన నీ నోటిని నవ్వుతో నింపుతాడు. నీ పెదవులపై కేరింతలు ఉంచుతాడు.
22 Your enemies will be clothed in shame, and the tent of the wicked will be no more.”
౨౨నీపై పగ పెంచుకునే వాళ్ళు అవమానం పాలవుతారు. దుష్టుల గుడారాలు లేకుండా పోతాయి.