< Genesis 44 >
1 Then Joseph instructed his steward: “Fill the men’s sacks with as much food as they can carry, and put each one’s silver in the mouth of his sack.
౧యోసేపు “వారు మోసికెళ్ళినంత ఆహారాన్ని వారి సంచుల్లో నింపి ఎవరి డబ్బు వారి సంచి మూతిలో పెట్టు,
2 Put my cup, the silver one, in the mouth of the youngest one’s sack, along with the silver for his grain.” So the steward did as Joseph had instructed.
౨చివరివాడి సంచి మూతిలో నా వెండి గిన్నె, అతని ధాన్యపు డబ్బు పెట్టు” అని తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపించగా, యోసేపు చెప్పినట్టు అతడు చేశాడు.
3 At daybreak, the men were sent on their way with their donkeys.
౩తెల్లవారినప్పుడు ఆ మనుషులను తమ గాడిదలతో పాటు పంపి వేశారు.
4 They had not gone far from the city when Joseph told his steward, “Pursue the men at once, and when you overtake them, ask, ‘Why have you repaid good with evil?
౪వారు ఆ పట్టణం నుండి బయలుదేరి ఎంతో దూరం వెళ్ళక ముందే, యోసేపు తన గృహనిర్వాహకునితో “నువ్వు లేచి ఆ మనుష్యుల వెంబడించి వెళ్ళి వారిని కలుసుకుని, ‘మీరు మేలుకు ప్రతిగా కీడు చేశారేమిటి?
5 Is this not the cup my master drinks from and uses for divination? What you have done is wicked!’”
౫నా యజమాని తాగే గిన్నె, శకునాలు చూసే గిన్నె యిదే కదా? మీరు చేసిన ఈ పని చాలా దుర్మార్గం’ అని వారితో చెప్పు” అన్నాడు.
6 When the steward overtook them, he relayed these words to them.
౬అతడు వారిని కలుసుకుని ఆ మాటలు వారితో చెప్పాడు.
7 “Why does my lord say these things?” they asked. “Your servants could not possibly do such a thing.
౭వారు “మా ప్రభువు ఇలాంటి మాటలు చెప్పడం ఎందుకు? మీ దాసులైన మేము ఇలాంటి పని చేయము.
8 We even brought back to you from the land of Canaan the silver we found in the mouths of our sacks. Why would we steal silver or gold from your master’s house?
౮చూడండి, మా సంచుల మూతుల్లో మాకు దొరికిన డబ్బును కనాను దేశంలో నుండి తిరిగి తీసుకు వచ్చాము. నీ ప్రభువు ఇంట్లో నుంచి మేము వెండి గానీ బంగారం గానీ ఎలా దొంగిలిస్తాము?
9 If any of your servants is found to have it, he must die, and the rest will become slaves of my lord.”
౯నీ దాసుల్లో ఎవరి దగ్గర అది దొరుకుతుందో వాడు చస్తాడు గాక. మేము మా ప్రభువుకు దాసులమవుతాం” అని అతనితో అన్నారు.
10 “As you say,” replied the steward. “But only the one who is found with the cup will be my slave, and the rest of you shall be free of blame.”
౧౦గృహ నిర్వాహకుడు “మంచిది, మీరు చెప్పినట్టే చేయండి. ఎవరి దగ్గర ఆ గిన్నె దొరుకుతుందో అతడే నాకు బానిస ఆవుతాడు. మిగతా వారు నిర్దోషులు” అని చెప్పాడు.
11 So each one quickly lowered his sack to the ground and opened it.
౧౧అప్పుడు ప్రతివాడూ గబగబా తన సంచిని దించి దాన్ని విప్పాడు.
12 The steward searched, beginning with the oldest and ending with the youngest—and the cup was found in Benjamin’s sack.
౧౨ఆ గృహ నిర్వాహకుడు పెద్దవాడి సంచితో మొదలు పెట్టి చిన్నవాడి సంచి వరకూ వెతికాడు. ఆ గిన్నె బెన్యామీను సంచిలో దొరికింది.
13 Then they all tore their clothes, loaded their donkeys, and returned to the city.
౧౩వారు తమ బట్టలు చింపుకున్నారు. అందరూ గాడిదల మీద సంచులు ఎక్కించుకుని పట్టణానికి తిరిగి వచ్చారు.
14 When Judah and his brothers arrived at Joseph’s house, he was still there, and they fell to the ground before him.
౧౪అప్పుడు యూదా, అతని సోదరులు యోసేపు ఇంటికి వచ్చారు. అతడింకా అక్కడే ఉన్నాడు, వారు అతని ముందు నేలమీద సాగిలపడ్డారు.
15 “What is this deed you have done?” Joseph declared. “Do you not know that a man like me can surely divine the truth?”
౧౫అప్పుడు యోసేపు “మీరు చేసిన ఈ పని ఏమిటి? నాలాటి మనిషి శకునం చూసి తెలుసుకుంటాడని మీకు తెలియదా” అని వారితో అన్నాడు.
16 “What can we say to my lord?” Judah replied. “How can we plead? How can we justify ourselves? God has exposed the iniquity of your servants. We are now my lord’s slaves—both we and the one who was found with the cup.”
౧౬యూదా “మా యజమానులైన మీతో ఏమి చెప్పగలం? ఏమనగలం? మేము నిర్దోషులమని ఎలా రుజువు చేయగలం? దేవుడే నీ దాసుల అపరాధం కనుగొన్నాడు. ఇదిగో, మేమూ ఎవని దగ్గర ఆ గిన్నె దొరికిందో వాడూ మా యజమానులైన మీకు దాసులమవుతాం” అన్నాడు.
17 But Joseph replied, “Far be it from me to do this. The man who was found with the cup will be my slave. The rest of you may return to your father in peace.”
౧౭యోసేపు “అలా చేయడం నాకు దూరమౌతుంది గాక. ఎవరి దగ్గర ఆ గిన్నె దొరికిందో వాడే నాకు దాసుడుగా ఉంటాడు. మీరు మీ తండ్రి దగ్గరికి సమాధానంగా వెళ్ళండి” అని చెప్పాడు.
18 Then Judah approached Joseph and said, “Sir, please let your servant speak personally to my lord. Do not be angry with your servant, for you are equal to Pharaoh himself.
౧౮యూదా అతని సమీపించి “ప్రభూ, ఒక మనవి. ఒక మాట రహస్యంగా నా యజమానులైన మీతో మీ దాసుడైన నన్ను చెప్పుకోనివ్వండి. తమ కోపం తమ దాసుని మీద రగులుకోనివ్వకండి. తమరు ఫరో అంతవారు గదా.
19 My lord asked his servants, ‘Do you have a father or a brother?’
౧౯నా యజమానులైన మీరు, ‘మీకు తండ్రి అయినా తమ్ముడైనా ఉన్నాడా?’ అని తమ దాసులను అడిగారు.
20 And we answered, ‘We have an elderly father and a younger brother, the child of his old age. The boy’s brother is dead. He is the only one of his mother’s sons left, and his father loves him.’
౨౦అందుకు మేము, ‘మాకు ముసలి వాడైన తండ్రి, అతని ముసలితనంలో పుట్టిన ఒక చిన్నవాడు ఉన్నారు. వాని అన్న చనిపోయాడు. వాడి తల్లికి వాడొక్కడే మిగిలాడు. అతని తండ్రి అతన్ని ఎంతో ప్రేమిస్తాడు’ అన్నాము.
21 Then you told your servants, ‘Bring him down to me so that I can see him for myself.’
౨౧అప్పుడు తమరు, ‘నేనతన్ని చూడడానికి అతన్ని నా దగ్గరికి తీసుకు రండి’ అని తమ దాసులతో చెప్పారు.
22 So we said to my lord, ‘The boy cannot leave his father. If he were to leave, his father would die.’
౨౨అందుకు మేము, ‘ఆ చిన్నవాడు తన తండ్రిని వదిలి ఉండలేడు. వాడు తన తండ్రిని విడిచి పోతే వాడి తండ్రి చనిపోతాడు’ అని నా యజమానులైన మీతో చెప్పాము.
23 But you said to your servants, ‘Unless your younger brother comes down with you, you will not see my face again.’
౨౩అందుకు తమరు, ‘మీ తమ్ముడు మీతో రాకపోతే మీరు మళ్లీ నా ముఖం చూడకూడదు’ అని తమ దాసులతో చెప్పారు.
24 Now when we returned to your servant my father, we relayed your words to him.
౨౪కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని దగ్గరికి మేము వెళ్ళి, నా యజమానులైన మీ మాటలను అతనికి తెలియచేశాము.
25 Then our father said, ‘Go back and buy us some food.’
౨౫మా తండ్రి, ‘మీరు తిరిగి వెళ్ళి మన కోసం కొంచెం ఆహారం కొనుక్కుని రండి’ అని చెబితే
26 But we answered, ‘We cannot go down there unless our younger brother goes with us. So if our younger brother is not with us, we cannot see the man.’
౨౬‘మేము అక్కడికి వెళ్ళలేము, మా తమ్ముడు మాతో కూడా ఉంటేనే వెళ్తాము. మా తమ్ముడు మాతో ఉంటేనే గాని ఆయన ముఖం చూడలేము’ అని చెప్పాము.
27 And your servant my father said to us, ‘You know that my wife bore me two sons.
౨౭అందుకు తమ దాసుడైన నా తండ్రి, ‘నా భార్య నాకిద్దరిని కన్నదని మీకు తెలుసు.
28 When one of them was gone, I said: “Surely he has been torn to pieces.” And I have not seen him since.
౨౮వారిలో ఒకడు నాకు దూరమైపోయాడు. అతడు తప్పకుండా క్రూర మృగాల బారిన పడి ఉంటాడు. అప్పటినుంచి అతడు నాకు కనబడలేదు.
29 Now if you also take this one from me and harm comes to him, you will bring my gray hair down to Sheol in sorrow.’ (Sheol )
౨౯మీరు నా దగ్గరనుంచి ఇతన్ని కూడా తీసుకుపోతే, ఇతనికి ఏదైనా హాని జరిగితే, తల నెరిసిన నన్ను మృతుల లోకంలోకి దుఃఖంతో దిగిపోయేలా చేస్తారు’ అని మాతో చెప్పాడు. (Sheol )
30 So if the boy is not with us when I return to your servant, and if my father, whose life is wrapped up in the boy’s life,
౩౦కాబట్టి, తమ దాసుడైన నా తండ్రి దగ్గరికి నేను తిరిగి వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మాతో బాటు లేకపోతే
31 sees that the boy is not with us, he will die. Then your servants will have brought the gray hair of your servant our father down to Sheol in sorrow. (Sheol )
౩౧మా తండ్రి ప్రాణం ఇతని ప్రాణంతో పెనవేసుకుంది కాబట్టి ఈ చిన్నవాడు మాతో లేకపోవడం చూడగానే అతడు చచ్చిపోతాడు. అలా తమ దాసులమైన మేము తల నెరిసిన తమ సేవకుడైన మా తండ్రిని మృతుల లోకంలోకి దుఃఖంతో దిగిపోయేలా చేస్తాము. (Sheol )
32 Indeed, your servant guaranteed the boy’s safety to my father, saying, ‘If I do not return him to you, I will bear the guilt before you, my father, all my life.’
౩౨తమ సేవకుడినైన నేను, ‘ఈ బాలునికి జామీనుగా ఉండి, నీ దగ్గరికి నేనతని తీసుకు రాకపోతే మా నాన్న దృష్టిలో ఆ నింద నా మీద ఎప్పుడూ ఉంటుంది’ అని చెప్పాను.
33 Now please let your servant stay here as my lord’s slave in place of the boy. Let him return with his brothers.
౩౩కాబట్టి తమ దాసుడైన నన్ను ఈ అబ్బాయికి ప్రతిగా ఏలినవారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాణ్ణి తన సోదరులతో వెళ్ళనివ్వండి.
34 For how can I go back to my father without the boy? I could not bear to see the misery that would overwhelm him.”
౩౪ఈ చిన్నవాడు నాతో కూడ లేకపోతే మా నాన్న దగ్గరికి నేనెలా వెళ్ళగలను? ఒకవేళ వెళితే, మా నాన్నకు వచ్చే అపాయం చూడవలసి వస్తుంది” అని చెప్పాడు.