< Genesis 34 >
1 Now Dinah, the daughter Leah had borne to Jacob, went out to visit the daughters of the land.
౧యాకోబుకు లేయా ద్వారా పుట్టిన కూతురు దీనా. ఆమె ఆ దేశపు యువతులను చూడడానికి బయటికి వెళ్ళింది.
2 When Shechem son of Hamor the Hivite, the prince of the region, saw her, he took her and lay with her by force.
౨ఆ దేశపు రాజు, హివ్వీయుడైన హమోరు కుమారుడు షెకెము ఆమెను చూసి ఆమెను పట్టుకుని, బలాత్కారం చేసి చెరిచాడు.
3 And his soul was drawn to Dinah, the daughter of Jacob. He loved the young girl and spoke to her tenderly.
౩అయితే అతడు ఆమెపై మనసు పడ్డాడు. ఆమెని ప్రేమించి ఆమెతో ఇష్టంగా మాట్లాడాడు.
4 So Shechem told his father Hamor, “Get me this girl as a wife.”
౪షెకెము తన తండ్రి హమోరును “ఈ అమ్మాయిని నాకిచ్చి పెళ్ళి చెయ్యి” అని అడిగాడు.
5 Jacob heard that Shechem had defiled his daughter Dinah, but since his sons were with his livestock in the field, he remained silent about it until they returned.
౫అతడు తన కూతురిని చెరిచిన సంగతి యాకోబు విన్నాడు. తన కుమారులు పశువులతో పొలంలో ఉండడం వలన వారు వచ్చే వరకూ నెమ్మదిగా ఉన్నాడు.
6 Meanwhile, Shechem’s father Hamor came to speak with Jacob.
౬షెకెము తండ్రి హమోరు యాకోబుతో మాట్లాడడానికి అతని దగ్గరికి వచ్చాడు.
7 When Jacob’s sons heard what had happened, they returned from the field. They were filled with grief and fury, because Shechem had committed an outrage in Israel by lying with Jacob’s daughter—a thing that should not be done.
౭యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలం నుండి తిరిగి వచ్చారు. అతడు యాకోబు కూతురును మానభంగం చేసి ఇశ్రాయేలు ప్రజలను కించపరిచాడు. అది చేయకూడని పని కాబట్టి అది వారికి చాలా అవమానకరంగా ఉంది. వారికి చాలా కోపం వచ్చింది.
8 But Hamor said to them, “My son Shechem longs for your daughter. Please give her to him as his wife.
౮అప్పుడు హమోరు వారితో “షెకెము అనే నా కొడుకు మీ కూతురిపై మనసు పడ్డాడు. దయచేసి ఆమెను అతనికిచ్చి పెళ్ళి చేయండి.
9 Intermarry with us; give us your daughters, and take our daughters for yourselves.
౯మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకుని మాతో వియ్యం కలుపుకుని మా మధ్య నివసించండి.
10 You may settle among us, and the land will be open to you. Live here, move about freely, and acquire your own property.”
౧౦ఈ దేశం మీ ఎదుట ఉంది. మీరు ఇందులో నివసించి వ్యాపారాలు చేసి ఆస్తి సంపాదించుకోండి” అని చెప్పాడు.
11 Then Shechem said to Dinah’s father and brothers, “Grant me this favor, and I will give you whatever you ask.
౧౧అతడింకా “నామీద దయ చూపండి. మీరేమి అడుగుతారో దాన్ని నేనిస్తాను.
12 Demand a high dowry and an expensive gift, and I will give you whatever you ask. Only give me the girl as my wife!”
౧౨ఓలి గానీ, కట్నం గానీ ఎంతైనా అడగండి. మీరు అడిగినంతా ఇస్తాను. ఆ యువతిని మాత్రం నాకు ఇవ్వండి” అని ఆమె తండ్రితో, సోదరులతో చెప్పాడు.
13 But because Shechem had defiled their sister Dinah, Jacob’s sons answered him and his father Hamor deceitfully.
౧౩అయితే తమ సోదరి అయిన దీనాను అతడు చెరిచినందుకు యాకోబు కుమారులు షెకెముతో, అతని తండ్రి హమోరుతో కపటంగా జవాబిచ్చారు.
14 “We cannot do such a thing,” they said. “To give our sister to an uncircumcised man would be a disgrace to us.
౧౪వారు “మేము ఈ పనికి అంగీకరించలేం. సున్నతి చేయించుకోని వాడికి మా సోదరిని ఇయ్యలేము. ఎందుకంటే అది మాకు అవమానకరం.
15 We will consent to this on one condition, that you become circumcised like us—every one of your males.
౧౫అయితే మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మాలాగా ఉండే పక్షంలో మాత్రమే మేము దీనికి అంగీకరించగలం.
16 Then we will give you our daughters and take your daughters for ourselves. We will dwell among you and become one people.
౧౬ఆ ఒక్క షరతుతో మీ మాటకు ఒప్పుకుని, మా పిల్లలను మీ కిచ్చి మీ పిల్లలను మేము చేసుకుని, మీ మధ్య నివసిస్తాం. అప్పుడు మనమంతా ఒకే జనంగా ఉంటాం.
17 But if you will not agree to be circumcised, then we will take our sister and go.”
౧౭మీరు మా మాట విని సున్నతి పొందకపోతే మా అమ్మాయిని తీసుకు వెళ్ళిపోతాం” అన్నారు.
18 Their offer seemed good to Hamor and his son Shechem.
౧౮వారి మాటలు హమోరుకూ అతని కుమారుడు షెకెముకూ ఇష్టంగా ఉన్నాయి.
19 The young man, who was the most respected of all his father’s household, did not hesitate to fulfill this request, because he was delighted with Jacob’s daughter.
౧౯ఆ యువకుడికి యాకోబు కూతురు అంటే ప్రేమ కాబట్టి అతడు ఆ పని చేయడానికి ఆలస్యం చేయలేదు. అతడు తన వంశం వారందరిలో పేరు పొందినవాడు.
20 So Hamor and his son Shechem went to the gate of their city and addressed the men of their city:
౨౦హమోరూ అతని కుమారుడు షెకెమూ ఆ ఊరి ద్వారం దగ్గరికి వచ్చి తమ ఊరి ప్రజలతో మాట్లాడుతూ,
21 “These men are at peace with us. Let them live and trade in our land; indeed, it is large enough for them. Let us take their daughters in marriage and give our daughters to them.
౨౧“ఈ మనుషులు మనతో సమాధానంగా ఉన్నారు కాబట్టి వారిని మన దేశంలో ఉండనిచ్చి దీనిలో వ్యాపారం చేసుకోనిద్దాం. ఈ భూమి వారికి కూడా చాలినంత విశాలంగా ఉంది కదా, మనం వారి పిల్లలను చేసుకుని మన పిల్లలను వారికి ఇద్దాం.
22 But only on this condition will the men agree to dwell with us and be one people: if all our men are circumcised as they are.
౨౨అయితే ఒక విషయం, ఆ మనుషులు సున్నతి పొందినట్టుగానే మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందితేనే వారు మన మాటకు ఒప్పుకుని మనలో నివసించి ఒకే జనంగా కలిసి ఉంటారు.
23 Will not their livestock, their possessions, and all their animals become ours? Only let us consent to them, and they will dwell among us.”
౨౩వారి మందలూ వారి ఆస్తీ వారి పశువులూ అన్నీ మనవవుతాయి కదా. ఎలాగైనా మనం వారి షరతుకు ఒప్పుకుందాం. అప్పుడు వారు మనలో నివసిస్తారు.”
24 All the men who went out of the city gate listened to Hamor and his son Shechem, and every male of the city was circumcised.
౨౪హమోరు, అతని కుమారుడు షెకెము చెప్పిన మాటలు ఆ ఊరి ద్వారం గుండా వెళ్ళేవారంతా విన్నారు. అప్పుడు ఆ ద్వారం గుండా వెళ్ళే వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందాడు.
25 Three days later, while they were still in pain, two of Jacob’s sons (Dinah’s brothers Simeon and Levi) took their swords, went into the unsuspecting city, and slaughtered every male.
౨౫మూడో రోజు వారంతా బాధపడుతూ ఉన్నప్పుడు యాకోబు కుమారుల్లో ఇద్దరు, అంటే దీనా సోదరులైన షిమ్యోను, లేవి, వారి కత్తులు తీసుకు అకస్మాత్తుగా ఆ ఊరిమీద పడి ప్రతి మగ వాణ్నీ చంపేశారు.
26 They killed Hamor and his son Shechem with their swords, took Dinah out of Shechem’s house, and went away.
౨౬వారు హమోరునీ అతని కొడుకు షెకెమునీ కత్తితో చంపి షెకెము ఇంట్లో నుండి దీనాను తీసుకెళ్ళిపోయారు.
27 Jacob’s other sons came upon the slaughter and looted the city, because their sister had been defiled.
౨౭తక్కిన యాకోబు కొడుకులు తమ సోదరిని చెరిపినందుకు చనిపోయిన వారు పడి ఉన్నచోటికి వచ్చి ఆ ఊరిపై పడి దోచుకున్నారు.
28 They took their flocks and herds and donkeys, and everything else in the city or in the field.
౨౮వారి గొర్రెలనూ పశువులనూ గాడిదలనూ ఊరిలో గానీ పొలంలో గానీ
29 They carried off all their possessions and women and children, and they plundered everything in their houses.
౨౯వారి ఆస్తి అంతా తీసుకు, వారి పిల్లలనూ స్త్రీలనూ చెరపట్టి, వారి ఇళ్ళలో ఉన్న వస్తువులు సైతం దోచుకున్నారు.
30 Then Jacob said to Simeon and Levi, “You have brought trouble upon me by making me a stench to the Canaanites and Perizzites, the people of this land. We are few in number; if they unite against me and attack me, I and my household will be destroyed.”
౩౦అప్పుడు యాకోబు షిమ్యోనునూ లేవినీ పిలిచి “మీరు ఈ దేశంలో నివసించే కనానీయులూ పెరిజ్జీయులూ నన్ను అసహ్యించుకొనేలా చేశారు. నా ప్రజల సంఖ్య తక్కువే. వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపుతారు. నేను, నా ఇంటివారు నాశనమవుతాం” అన్నాడు.
31 But they replied, “Should he have treated our sister like a prostitute?”
౩౧అందుకు వారు “మరి వేశ్య పట్ల చేసినట్టు మా చెల్లి పట్ల చేయవచ్చా?” అన్నారు.