< John 16 >
1 These things have I spoken to you, that you may not be ensnared.
౧“మీరు తడబడకుండా ఉండాలని ఈ సంగతులు మీతో మాట్లాడాను.
2 They will put you out of the synagogues; indeed, the time is coming, when he that kills you, will think that he is offering service to God.
౨వారు మిమ్మల్ని సమాజ మందిరాల్లో నుండి బహిష్కరిస్తారు. మిమ్మల్ని చంపినవారు, దేవుని కోసం మంచి పని చేస్తున్నామని అనుకునే సమయం వస్తుంది.
3 And these things they will do, because they know neither the Father nor me.
౩నేను గాని, తండ్రి గాని వారికి తెలియదు కాబట్టి అలా చేస్తారు.
4 But these things I have told you, that, when the time has come, you may remember that I told you of them. But these things I did not tell you at the beginning, because I was with you.
౪అవి జరిగే సమయం వచ్చినప్పుడు, వాటిని గురించి నేను మీతో చెప్పినవి గుర్తు చేసుకోవాలని ఈ సంగతులు మీతో చెబుతున్నాను. నేను మీతో ఉన్నాను కాబట్టి మొదట్లో ఈ సంగతులు మీతో చెప్పలేదు.
5 And now I go to him that sent me, and no one of you asks me, Whither goest thou?
౫అయితే ఇప్పుడు నన్ను పంపినవాడి దగ్గరికి వెళ్తున్నాను. అయినా, ‘నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?’ అని మీలో ఎవ్వరూ నన్ను అడగడం లేదు.
6 But because I have spoken these things to you, sorrow has filled your heart.
౬నేను ఈ సంగతులు మీతో చెప్పినందుకు మీ హృదయం నిండా దుఃఖం ఉంది.
7 But yet I tell you the truth: it is profitable for you that I go away. For if I go not away, the Paraclete will not come to you. But if I go away, I will send him to you.
౭“అయినప్పటికీ, నేను మీతో సత్యం చెబుతున్నాను, నేను వెళ్ళిపోవడం మీకు మంచిదే. నేను వెళ్ళకపోతే, ఆదరణకర్త మీ దగ్గరికి రాడు. కాని నేను వెళ్తే, ఆయనను మీ దగ్గరికి పంపిస్తాను.
8 And when he has come, he will convince the world of sin, and of righteousness, and of judgment.
౮ఆదరణకర్త వచ్చినప్పుడు, పాపం గురించి, నీతి గురించి, తీర్పు గురించి లోకాన్ని ఒప్పిస్తాడు.
9 Of sin, because they believe not on me;
౯ప్రజలు నాలో నమ్మకం ఉంచలేదు గనక పాపం గురించి ఒప్పిస్తాడు.
10 of righteousness, because I go to my Father, and you see me no more;
౧౦నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మీరు ఇంక నన్ను ఎన్నడూ చూడరు గనక నీతిని గురించి ఒప్పిస్తాడు.
11 of judgment, because the prince of this world is judged.
౧౧ఈ లోకపాలకుడు తీర్పు పొందాడు గనక తీర్పును గురించి ఒప్పిస్తాడు.
12 I have yet many things to say to you; but you can not bear them now.
౧౨“నేను మీతో చెప్పే సంగతులు ఇంకా చాలా ఉన్నాయి గాని ఇప్పుడు మీరు వాటిని అర్థం చేసుకోలేరు.
13 But when he, the Spirit of the truth, has come, he will guide you into all the truth; for he will not speak of himself; but what he hears, that will he speak, and he will show you things to come.
౧౩అయితే ఆయన, సత్య ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సంపూర్ణ సత్యంలోకి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ మాట్లాడడు. ఏం వింటాడో అదే మాట్లాడతాడు. జరగబోయే వాటిని మీకు ప్రకటిస్తాడు.
14 He will glorify me; for he will take of mine, and show it to you.
౧౪ఆయన నా వాటిని తీసుకుని మీకు ప్రకటిస్తాడు కాబట్టి నాకు మహిమ కలిగిస్తాడు.
15 All things that the Father has are mine; for this reason I said, that he will take of mine, and show it to you.
౧౫నా తండ్రికి ఉన్నవన్నీ నావే, అందుచేత ఆ ఆత్మ నా వాటిని తీసుకుని మీకు ప్రకటిస్తాడని నేను చెప్పాను.
16 A little while, and you will not see me; and again, a little while, and you will see me, because I go to the Father.
౧౬“కొద్ది కాలం తరువాత మీరు నన్ను ఇక చూడరు. ఆ తరువాత మరి కొద్ది కాలానికి మీరు నన్ను చూస్తారు.”
17 Then some of his disciples said one to another: What is this that he says to us, A little while, and you will not see me; and again, a little while, and you will see me? and, Be cause I go to the Father?
౧౭ఆయన శిష్యుల్లో కొంతమంది “ఆయన కొద్ది కాలంలో మీరు నన్ను ఇక చూడరు. ఆ తరువాత కొద్ది కాలంలో మీరు నన్ను చూస్తారు, ఎందుకంటే నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, అంటున్నాడు. ఇది ఏమిటి? ఆయన మనతో ఏం చెబుతున్నాడు?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు,
18 Therefore they said: What is this that he says, The little while? We know not what he says.
౧౮కాబట్టి వారు, కొద్ది కాలం అంటే ఆయన ఉద్దేశం ఏమిటి? ఆయన ఏం చెబుతున్నాడో మనకు తెలియడం లేదు” అనుకున్నారు.
19 Then Jesus knew that they wished to ask him; and he said to them: Are you inquiring of one another about this, because I said, A little while and you will not see me; and again, a little while, and you will see me?
౧౯వారు ఈ విషయం తనను అడగాలని ఆతురతతో ఉన్నారని యేసు గమనించి వారితో, “‘కొద్ది కాలం తరువాత మీరు నన్ను ఇక చూడరు. ఆ తరువాత మరి కొద్ది కాలానికి మీరు నన్ను చూస్తారు’ అని నేను అన్నదానికి అర్థం ఏమిటని ఆలోచిస్తున్నారా?
20 Verily, verily I say to you, you shall weep and lament, but the world will rejoice. You shall be sorrowful, but your sorrow shall be turned into joy.
౨౦నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను, మీరు శోకంతో ఏడుస్తారు, కాని ఈ లోకం ఆనందిస్తుంది. మీకు దుఃఖం కలుగుతుంది, కాని మీ దుఃఖం ఆనందంగా మారుతుంది.
21 A woman, when she is in labor, has sorrow, be cause her hour has come; but when the child is born, she no longer remembers the pain, for joy that a man is born into the world.
౨౧స్త్రీ ప్రసవించే సమయం వచ్చినప్పుడు ప్రసవ వేదన కలుగుతుంది. కాని, బిడ్డ పుట్టిన తరువాత ఆ బిడ్డ ఈ లోకం లోకి వచ్చిన ఆనందంలో ప్రసవంలో తాను పడిన బాధ ఆమెకు ఇక గుర్తు రాదు.
22 You, therefore, have sorrow now; but I shall see you again, and your heart will rejoice, and your joy no one takes from you.
౨౨“అలాగే, మీరు ఇప్పుడు దుఖపడుతున్నారు గాని, నేను మిమ్మల్ని మళ్ళీ చూస్తాను. అప్పుడు మీ హృదయం ఆనందిస్తుంది. మీ ఆనందం మీ దగ్గరనుంచి ఎవ్వరూ తీసివేయలేరు.
23 And in that day you shall ask nothing of me; verily, verily I say to you, whatever you ask of the Father in my name, he will give you.
౨౩ఆ రోజున మీరు నన్ను ఏ ప్రశ్నలూ అడగరు. నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను, మీరు తండ్రిని ఏది అడిగినా, నా పేరిట ఆయన మీకు అది ఇస్తాడు.
24 Till this time you have asked for nothing in my name; ask, and you shall receive, that your joy may be full.
౨౪ఇంతవరకూ నా పేరిట మీరు ఏమీ అడగలేదు. అడగండి, అప్పుడు మీ ఆనందం సంపూర్తి అయ్యేలా మీరు పొందుతారు.
25 These things I have spoken to you in parables; the time is coming when I will no longer speak to you in parables, but will teach you plainly concerning the Father.
౨౫ఈ సంగతులు ఇంతవరకూ తేలికగా అర్థం కాని భాషలో మీకు చెప్పాను. అయితే ఒక సమయం రాబోతుంది అప్పుడు తండ్రి గురించి స్పష్టంగా చెబుతాను.
26 In that day you shall ask in my name; and I say not to you, that I will ask the Father in your behalf;
౨౬ఆ రోజున మీరు నా పేరట అడుగుతారు. అయితే మీ కోసం నేను తండ్రికి ప్రార్థన చేస్తానని అనడం లేదు.
27 for the Father himself loves you, because you have loved me, and have believed that I came forth from God.
౨౭ఎందుకంటే మీరు నన్ను ప్రేమించి, నేను తండ్రి దగ్గర నుంచి వచ్చానని నమ్మారు కాబట్టి తండ్రే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు.
28 I came forth from the Father, and have come into the world: again I leave the world, and go to the Father.
౨౮నేను తండ్రి దగ్గరనుంచి ఈ లోకానికి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఈ లోకాన్ని విడిచి తండ్రి దగ్గరికి వెళ్తున్నాను” అన్నాడు.
29 His disciples said to him: Lo, now thou speakest plainly, and speakest no parable.
౨౯ఆయన శిష్యులు, “చూడు, ఇప్పుడు నువ్వు అర్థం కానట్టు కాకుండా, స్పష్టంగా మాట్లాడుతున్నావు.
30 Now we know that thou knowest all things, and hast no need that any one should ask thee. By this we believe that thou hast come forth from God.
౩౦నువ్వు అన్నీ తెలిసిన వాడివని, నిన్ను ఎవరూ ప్రశ్నలు అడగవలసిన అవసరం లేదని, ఇప్పుడు మేము తెలుసుకున్నాం. దీని వలన నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావని మేము నమ్ముతున్నాం” అన్నారు.
31 Jesus answered them: Do you now believe?
౩౧యేసు జవాబిస్తూ, “మీరు ఇప్పుడు నమ్ముతున్నారా?
32 Behold, the hour is coming, and has now come, in which you shall be scattered, each one to his own home, and shall leave me alone: and yet I am not alone, for the Father is with me.
౩౨మీరందరూ ఎవరి ఇంటికి వారు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టే సమయం రాబోతూ ఉంది. వచ్చేసింది కూడా. అయినప్పటికీ, నా తండ్రి నాతో ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిని కాదు.
33 These things I have spoken to you, that in me you may have peace. In the world you shall have affliction, but be of good courage; I have overcome the world.
౩౩నన్ను బట్టి మీకు శాంతి కలగాలని నేను ఈ సంగతులు మీతో చెప్పాను. ఈ లోకంలో మీకు బాధ ఉంది. కాని ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించాను” అన్నాడు.