< Isaiah 26 >
1 In that day shall this song be sung in the land of Judah: We have a strong city; salvation will he appoint for walls and bulwarks.
౧ఆ రోజున యూదా దేశంలో ఈ పాట పాడతారు. “మనకి ఒక బలమైన పట్టణం ఉంది. దేవుడు రక్షణను దాని గోడలుగానూ ప్రాకారాలుగానూ చేశాడు.
2 Open ye the gates, that the righteous nation which keepeth faith may enter in.
౨నీతిని పాటించే నమ్మకమైన జనం దానిలో ప్రవేశించేలా దాని తలుపులు తెరవండి.
3 Thou wilt keep [him] in perfect peace, [whose] mind [is] stayed [on thee]; because he trusteth in thee.
౩తన మనస్సును నీపై లగ్నం చేసిన వాడికి పూర్ణమైన శాంతిని అనుగ్రహిస్తావు. నీపై నమ్మకముంచాడు కాబట్టి నువ్వలా చేస్తావు.
4 Trust ye in Jehovah for ever; for in Jehovah, [even] Jehovah, is an everlasting rock.
౪నిత్యమూ యెహోవాపై నమ్మకముంచండి. ఎందుకంటే యెహోవా తానే శాశ్వతమైన ఆధారశిల!
5 For he hath brought down them that dwell on high, the lofty city: he layeth it low, he layeth it low even to the ground; he bringeth it even to the dust.
౫అలాగే ఆయన ఉన్నత స్థల నివాసులను, గర్వించే వాళ్ళనూ కిందకు లాగి పడవేస్తాడు. ఎత్తయిన ప్రాకారాలు గల పట్టణాన్ని కూలదోస్తాడు. ఆయన దాన్ని నేలమట్టం చేస్తాడు. దుమ్ముతో ధూళితో కలిపివేస్తాడు.
6 The foot shall tread it down; even the feet of the poor, and the steps of the needy.
౬పేదల, అవసరంలో ఉన్నవాళ్ళ కాళ్ళు దాన్ని తొక్కివేస్తాయి.
7 The way of the just is uprightness: thou that art upright dost direct the path of the just.
౭న్యాయవంతులు నడిచే దారి సమంగా ఉంటుంది. న్యాయ వంతుడా, నువ్వు న్యాయవంతులు దారిని తిన్నగా చేస్తావు.
8 Yea, in the way of thy judgments, O Jehovah, have we waited for thee; to thy name, even to thy memorial [name], is the desire of our soul.
౮న్యాయమైన నీ తీర్పుల బాటలో మేం నీ కోసం వేచి ఉన్నాము. నీ పేరు, నీ జ్ఞాపకాలే మా ప్రాణాలు కోరుకుంటున్నాయి.
9 With my soul have I desired thee in the night; yea, with my spirit within me will I seek thee earnestly: for when thy judgments are in the earth, the inhabitants of the world learn righteousness.
౯రాత్రివేళ నా ప్రాణం నిన్ను ఆశిస్తుంది. నాలోని ఆత్మలో చిత్తశుద్ధితో నిన్ను వెతుకుతూ ఉన్నాను. నీ తీర్పులు భూమిపై తెలిసినప్పుడు ఈ లోక నివాసులు నీతిని అభ్యాసం చేస్తారు.
10 Let favor be showed to the wicked, yet will he not learn righteousness; in the land of uprightness will he deal wrongfully, and will not behold the majesty of Jehovah.
౧౦దుర్మార్గుడికి నువ్వు దయ చూపినా వాడు మాత్రం నీ నీతిని నేర్చుకోడు. న్యాయబద్ధంగా జీవించే వారి మధ్యలో నివసించినా వాడు దుర్మార్గాన్నే అవలంబిస్తాడు. యెహోవా ఘనతా ప్రభావాలను వాడు పట్టించుకోడు.
11 Jehovah, thy hand is lifted up, yet they see not: but they shall see [thy] zeal for the people, and be put to shame; yea, fire shall devour thine adversaries.
౧౧యెహోవా, నువ్వు నీ చేతిని ఎత్తావు. కానీ వాళ్ళది గమనించలేదు. కానీ వాళ్ళు ప్రజల కొరకైన నీ ఆసక్తిని చూస్తారు. అప్పుడు వాళ్లకి అవమానం కలుగుతుంది. ఎందుకంటే నీ శత్రువుల కోసం మండే అగ్ని వాళ్ళని దహించి వేస్తుంది.
12 Jehovah, thou wilt ordain peace for us; for thou hast also wrought all our works for us.
౧౨యెహోవా, నువ్వు మాకు శాంతిని నెలకొల్పుతావు. నిజంగా మా కార్యాలన్నిటినీ నువ్వే మాకు సాధించిపెట్టావు.
13 O Jehovah our God, other lords besides thee have had dominion over us; but by thee only will we make mention of thy name.
౧౩మా దేవుడివైన యెహోవా, నువ్వు కాకుండా ఇతర ప్రభువులు మాపై రాజ్యం చేశారు గానీ మేం నీ నామాన్ని మాత్రమే కీర్తిస్తాం.
14 [They are] dead, they shall not live; [they are] deceased, they shall not rise: therefore hast thou visited and destroyed them, and made all remembrance of them to perish.
౧౪వాళ్ళు చనిపోయారు. వాళ్ళిక మళ్ళీ బతకరు. వాళ్ళు మరణమయ్యారు. వాళ్ళిక తిరిగి లేవరు. నువ్వు తీర్పు తీర్చడానికి వచ్చి వాళ్ళని నిజంగా అంతం చేశావు. వాళ్ళ జ్ఞాపకాలన్నిటినీ తుడిచి పెట్టేశావు.
15 Thou hast increased the nation, O Jehovah, thou hast increased the nation; thou art glorified; thou hast enlarged all the borders of the land.
౧౫యెహోవా, నువ్వు జనాన్ని వృద్ధి చేశావు. నువ్వే గౌరవం పొందావు. దేశం సరిహద్దులను విశాలపరచావు.
16 Jehovah, in trouble have they visited thee; they poured out a prayer [when] thy chastening was upon them.
౧౬యెహోవా, కష్టాల్లో ఉన్నప్పుడు వారు నీ వైపు చూశారు. నువ్వు వాళ్లకి శిక్ష విధించినప్పుడు కీడుకువ్యతిరేకంగా నీకు ప్రార్థనలు వల్లించారు.
17 Like as a woman with child, that draweth near the time of her delivery, is in pain and crieth out in her pangs; so we have been before thee, O Jehovah.
౧౭బిడ్డని కనే సమయం దగ్గర పడినప్పుడు గర్భవతి వేదనతో కేకలు పెట్టినట్టుగానే ప్రభూ, మేం కూడా నీ సన్నిధిలో వేదన పడ్డాం.
18 We have been with child, we have been in pain, we have as it were brought forth wind; we have not wrought any deliverance in the earth; neither have the inhabitants of the world fallen.
౧౮మేం గర్భంతో ఉన్నాం. నొప్పులు కూడా అనుభవించాం. కానీ మా పరిస్టితి గాలికి జన్మనిచ్చినట్టు ఉంది. భూమికి రక్షణ తేలేక పోయాం. లోకంలో జనాలు పుట్టలేదు.
19 Thy dead shall live; my dead bodies shall arise. Awake and sing, ye that dwell in the dust; for thy dew is [as] the dew of herbs, and the earth shall cast forth the dead.
౧౯మరణమైన నీ వారు బతుకుతారు. మా వారి మృత దేహాలు తిరిగి సజీవంగా లేస్తాయి. మట్టిలో పడి ఉన్న వారు మేల్కొని ఆనందంగా పాడండి! ఉదయంలో కురిసే మంచులా నీ కాంతి ప్రకాశమానమై కురిసినప్పుడు భూమి తాను ఎరగా పట్టుకున్న తనలోని విగత జీవులను సజీవంగా అప్పగిస్తుంది.
20 Come, my people, enter thou into thy chambers, and shut thy doors about thee: hide thyself for a little moment, until the indignation be overpast.
౨౦నా ప్రజలారా, వెళ్ళండి! మీ గదుల్లో ప్రవేశించండి. తలుపులు మూసుకోండి. మహా కోపం తగ్గే వరకూ దాగి ఉండండి. ఇదిగో వారి దోషాన్ని బట్టి భూనివాసులను శిక్షించడానికి యెహోవా తన నివాసంలోనుండి బయలు దేరుతున్నాడు. భూమి తన మీద హతులైన వారిని ఇకపై కప్పకుండా తాను తాగిన రక్తాన్ని బయట పెడుతుంది.
21 For, behold, Jehovah cometh forth out of his place to punish the inhabitants of the earth for their iniquity: the earth also shall disclose her blood, and shall no more cover her slain.
౨౧ఎందుకంటే చూడండి! యెహోవా తన నివాసం నుండి రాబోతున్నాడు. భూమిపైన ప్రజలు చేసిన అపరాధాలకై వాళ్ళని శిక్షించడానికి వస్తున్నాడు. భూమి తనపై జరిగిన రక్తపాతాన్ని బహిర్గతం చేస్తుంది. వధకు గురైన వాళ్ళని ఇక దాచి పెట్టదు.”