< Proverbs 29 >
1 He who, being often reproved, hardens his neck shall suddenly be destroyed, and that without remedy.
౧చాలా గద్దింపులు వచ్చినా తలబిరుసుగా ఉండిపోయేవాడు ఇక స్వస్థత అనేది లేకుండా హఠాత్తుగా విరిగి పోతాడు.
2 When the righteous are increased, the people rejoice, but when a wicked man bears rule, the people sigh.
౨మంచి చేసే వారు ఎక్కువ మంది అయినప్పుడు ప్రజలు సంతోషిస్తారు. దుష్టుడు ఏలుతున్నప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుస్తారు.
3 He who loves wisdom delights his father, but he who keeps company with harlots wastes his substance.
౩జ్ఞానాన్ని ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపెడతాడు. వేశ్యలతో సాంగత్యం చేసేవాడు అతని ఆస్తిని పాడుచేస్తాడు.
4 By justice the king establishes the land, but he who exacts gifts overthrows it.
౪న్యాయం మూలంగా రాజు దేశానికి క్షేమం కలగజేస్తాడు. లంచాలు పుచ్చుకొనేవాడు దేశాన్ని పాడుచేస్తాడు.
5 A man who flatters his neighbor spreads a net for his steps.
౫తన పొరుగువాడితో ముఖ స్తుతి మాటలు చెప్పేవాడు అతణ్ణి చిక్కించు కోడానికి వలవేసేవాడు.
6 In the transgression of an evil man there is a snare, but a righteous man sings and rejoices.
౬దుష్టుడు తన స్వయంకృతాపరాధం వల్ల బోనులో చిక్కుకుంటాడు. మంచి చేసేవాడు పాటలుపాడుతూ సంతోషంగా ఉంటాడు.
7 A righteous man takes knowledge of the cause of the poor. A wicked man has no such understanding to know.
౭మంచి మనిషి పేదల పక్షంగా వాదిస్తాడు. పాతకుడికి అలాటి జ్ఞానం లేదు.
8 Scoffers set a city in a flame, but wise men turn away wrath.
౮అపహాసకులు ఊరిని తగల బెడతారు. జ్ఞానులు కోపం చల్లారుస్తారు.
9 If a wise man has a controversy with a foolish man, whether he be angry or laugh, there will be no rest.
౯జ్ఞాని మూర్ఖనితో వాదించేటప్పుడు వాడు రెచ్చిపోతుంటాడు, నవ్వుతుంటాడు. నెమ్మది ఉండదు.
10 Bloodthirsty men hate him who is perfect, but the upright seek his soul.
౧౦రక్తపిపాసులు నిర్దోషులను ద్వేషిస్తారు. వారు నీతిపరుల ప్రాణాలు తీయాలని చూస్తుంటారు.
11 A fool utters all his anger, but a wise man keeps it back and calms it.
౧౧బుద్ధిహీనుడు తన కోపమంతా వెళ్ళగక్కుతాడు. జ్ఞానం గలవాడు కోపం అణచుకుంటాడు.
12 If a ruler hearkens to falsehood, all his servants are wicked.
౧౨రాజు గనక అబద్ధాలు నమ్ముతూ ఉంటే అతని ఉద్యోగులు దుష్టులుగా ఉంటారు.
13 The poor man and the oppressor meet together. Jehovah enlightens the eyes of them both.
౧౩పేదలు, వడ్డీ వ్యాపారులు కలుసుకుంటారు. ఉభయుల కళ్ళకు వెలుగిచ్చేవాడు యెహోవాయే.
14 The king who faithfully judges the poor, his throne shall be established forever.
౧౪ఏ రాజు దరిద్రులకు సత్యంతో న్యాయం తీరుస్తాడో ఆ రాజు సింహాసనం శాశ్వతంగా ఉంటుంది.
15 The rod and reproof give wisdom, but a child left to himself causes shame to his mother.
౧౫బెత్తం, గద్దింపు జ్ఞానం కలిగిస్తుంది. అదుపులేని పిల్లవాడు తన తల్లికి అవమానం తెస్తాడు.
16 When the wicked are increased, transgression increases, but the righteous shall look upon their fall.
౧౬దుష్టులు ప్రబలినప్పుడు దుర్మార్గత ప్రబలుతుంది. వారి పతనాన్ని నీతిపరులు కళ్లారా చూస్తారు.
17 Correct thy son, and he will give thee rest, yea, he will give delight to thy soul.
౧౭నీ కొడుకును శిక్షించినట్టయితే అతడు నీకు విశ్రాంతినిస్తాడు. నీ మనస్సుకు ఆనందం కలిగిస్తాడు.
18 Where there is no vision, the people cast off restraint, but he who keeps the law, happy is he.
౧౮ప్రవచన దర్శనం లేకపోతే ప్రజలు విచ్చలవిడిగా ఉంటారు. ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉండే వాడు ధన్యుడు.
19 A servant will not be corrected by words, for though he understands, he will not give heed.
౧౯సేవకుడు మందలిస్తే బుద్ధి తెచ్చుకోడు. వాడికి విషయం అర్థం అయినా వాడు లోబడడు.
20 See thou a man who is hasty in his words? There is more hope for a fool than for him.
౨౦తొందరపడి మాట్లాడే వాణ్ణి చూసావా? వాడికంటే మూర్ఖుడే సుళువుగా మారతాడు.
21 He who brings up his servant gently from childhood shall have him become a son at the last.
౨౧ఒకడు తన సేవకుణ్ణి చిన్నప్పటి నుండి గారాబంగా పెంచితే చివరకూ వాడి వలన ఇబ్బందులు వస్తాయి.
22 An angry man stirs up strife, and a wrathful man abounds in transgression.
౨౨కోపిష్టి కలహం రేపుతాడు. ముక్కోపి చాలా పాపాలు చేస్తాడు.
23 A man's pride shall bring him low, but he who is of a lowly spirit shall obtain honor.
౨౩ఎవరి అహం వాణ్ణి అణచి వేస్తుంది. వినయమనస్కుడు గౌరవానికి నోచుకుంటాడు.
24 He who is partner with a thief hates his own soul; he hears the adjuration and utters nothing.
౨౪దొంగతో చేతులు కలిపినవాడు తనకు తానే పగవాడు. అలాంటివాడు శాపపు మాటలు విని కూడా మిన్నకుంటాడు.
25 The fear of man brings a snare, but he who puts his trust in Jehovah shall be safe.
౨౫భయపడడం వల్ల మనుషులకు ఉరి వస్తుంది. యెహోవా పట్ల నమ్మకం ఉంచేవాడు సురక్షితంగా ఉంటాడు.
26 Many seek the ruler's favor, but a man's justice is from Jehovah.
౨౬పరిపాలకుని అనుగ్రహం కోరే వారు అసంఖ్యాకం. కానీ మనుష్యులకు న్యాయం తీర్చేది యెహోవాయే.
27 An unjust man is an abomination to the righteous, and he who is upright in the way is an abomination to a wicked man.
౨౭మంచి చేసే వారికీ దుర్మార్గుడు అంటే అసహ్యం. అలానే యథార్థవర్తనుడు భక్తిహీనుడికి హేయుడు.