< Fweny 9 >
1 Eka malaika mar abich nogoyo turumbete, mine aneno sulwe moro mane oselwar e piny koa e polo. Sulweno ne omi kifungu mar bur matut maonge gikone. (Abyssos )
౧ఇక ఐదవ దూత బాకా ఊదాడు. అప్పుడు ఆకాశం నుండి భూమిపై పడిన ఒక నక్షత్రాన్ని చూశాను. అడుగు లేని అగాధం తాళం చెవులు ఆ నక్షత్రానికి ఇవ్వడం జరిగింది. (Abyssos )
2 Kane oyawo burno, iro nowuokie machalo gi ich mach maduongʼ. Iro moa e burno noimo chiengʼ kod boche polo molokore maratengʼ. (Abyssos )
౨అతడు లోతైన, అంతు లేని ఆ అగాధాన్ని తెరిచాడు. బ్రహ్మాండమైన కొలిమిలో నుండి లేచినట్టు దట్టమైన పొగ ఆ అగాధంలో నుండి లేచింది. ఆ పొగ వల్ల సూర్యగోళం నల్లబడి చీకటి కమ్మింది. గాలి కూడా నల్లబడింది. (Abyssos )
3 Kendo bonyo nowuok e yirono mopiyo e piny, to nomigi teko machalo gi teko thomoni manie piny.
౩ఆ పొగలో నుండి మిడతల దండు భూమి మీదికి వచ్చి పడింది. భూమిపైన ఉండే తేళ్ళకు ఉన్న శక్తిలాంటి శక్తి వాటికి ఇవ్వడం జరిగింది.
4 To nokwergi ni kik giketh lum manie piny kata gimoro mangʼich kata yien, to ginyalo mana hinyo jogo maonge gi kido mar Nyasaye e lela wengegi.
౪నుదుటి మీద దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి పైన గడ్డికి గానీ, మొక్కలకు గానీ, చెట్లకు గానీ ఎలాంటి హని చేయకూడదని వాటికి ఆజ్ఞ ఉంది.
5 Ne ok omigi teko mar negogi to nomigi thuolo mar sandogi kuom dweche abich. To rem mane jogo oyudo ne chalgi mano miyudo ka thomoni okayo dhano.
౫ఆ మిడతలకు ఐదు నెలల వరకూ వేధించడానికి అధికారం ఇచ్చారు. కానీ చంపడానికి మాత్రం వాటికి అధికారం లేదు. వాటి వల్ల కలిగే నొప్పి తేలు కుట్టినపుడు కలిగే నొప్పిలాగా ఉంటుంది.
6 E ndalogo ji nodwar tho, to ok giniyude; ginigomb mondo githo to tho noring-gi aringa.
౬ఆ రోజుల్లో మనుషులు చావుకోసం వెతుకుతారు కానీ అది వారికి దొరకదు. చావాలని కోరుకుంటారు గానీ మరణం వారి దగ్గరనుంచి పారిపోతుంది.
7 Bonyogo ne chalo gi farese moikore ni lweny. E wigi negirwako gik machalo gi osimbo mag dhahabu, to lend wangʼ-gi ne chalo gi lela wangʼ dhano.
౭ఆ మిడతలు చూడడానికి యుద్ధానికి సన్నద్ధమైన గుర్రాల్లా ఉన్నాయి. వాటి తలలపై బంగారు కిరీటాల్లాంటివి మెరుస్తూ ఉన్నాయి. వాటి ముఖాలు మనుషుల ముఖాల్లాంటివి.
8 Yie wigi ne chalo gi yie wi mon, kendo lekegi ne chalo gi leke sibuoche.
౮వాటికి వెంట్రుకలున్నాయి. అవి స్త్రీల తలవెంట్రుకల్లా ఉన్నాయి. వాటి పళ్ళు సింహం కోరల్లా ఉన్నాయి.
9 Negirwako gige lweny mag akor machalo gi akor mar nyinyo, to bwombegi ne goyo koko mana ka farese mangʼeny kendo ka geche miywayo kadhi e lweny.
౯ఇనప కవచం లాంటి ఛాతీ కవచాలు వాటికి ఉన్నాయి. అసంఖ్యాకమైన గుర్రాలూ, రథాలూ యుద్ధానికి పరిగెడుతుంటే వినిపించే ధ్వనిలా వాటి రెక్కల చప్పుడు వినిపిస్తుంది.
10 Ne gin gi iwgi makecho kaka thomoni kecho, to e iwgigo ne gin gi teko mar sando kagikayogo ji kuom dweche abich.
౧౦ప్రతిదానికీ తేళ్ళకు ఉన్నట్టు తోకా, కొండీ ఉన్నాయి. తమ తోకలతో ఐదు నెలల వరకూ మనుషులకు హని చేయడానికి వాటికి అధికారం ఉంది.
11 Ruodhgi motelo nigi en malaika mar bur matut maonge gikone ma nyinge miluongego gi dho jo-Hibrania en Abadon, to gi dho jo-Yunani en Apoluon (tiende ni Ngʼat maketho gik moko). (Abyssos )
౧౧వాటి పైన ఒక రాజు ఉన్నాడు. వాడు లోతైన అగాధ దూత. వాడి పేరు హీబ్రూ భాషలో అబద్దోను. గ్రీకు భాషలో అపొల్యోను (‘విధ్వంసకుడు’ అని ఈ పేరుకి అర్థం). (Abyssos )
12 Masira mokwongo osekadho, to masiche ariyo mamoko pod biro.
౧౨మొదటి యాతన ముగిసింది. చూడు, ఈ విషయాలు జరిగిన తరువాత మరో రెండు యాతనలు కలుగుతాయి.
13 Bangʼ mano malaika mar auchiel nogoyo turumbetene, mi nawinjo dwol moa e tunge mag kendo mar misango mar dhahabu manie nyim Nyasaye.
౧౩ఆరవ దూత బాకా ఊదాడు. అప్పుడు దేవుని ముందు ఉన్న బంగారు బలిపీఠం కొమ్ముల నుండి ఒక స్వరం వినిపించింది.
14 Eka dwolno nowacho ni malaika mar auchiel man-gi turumbete niya, “Gony malaike angʼwen motwe gibed thuolo gia e aora maduongʼ mar Yufrate.”
౧౪ఆ స్వరం “మహా నది యూఫ్రటీసు దగ్గర బంధించిన నలుగురు దూతలను విడిచి పెట్టు” అని బాకా పట్టుకుని ఉన్న ఆరవ దూతతో చెప్పడం విన్నాను.
15 To nogony malaike angʼwen-go mane oseiki ni sa-no gi odiechiengno kod dweno gi higano, mondo gineg achiel kuom adek mar ji duto.
౧౫మనుషుల్లో మూడవ భాగాన్ని చంపివేయడానికి ఆ గంట కోసం, ఆ రోజు కోసం, ఆ నెల కోసం, ఆ సంవత్సరం కోసం సిద్ధపరచిన ఆ నలుగురు దూతలను విడిచిపెట్టారు.
16 Kwan mar jolweny moidho farese ne oromo tara mia ariyo. Ne awinjo kar kwan-gi.
౧౬సైన్యంలో అశ్విక దళం సంఖ్య ఇరవై కోట్లు. వారి సంఖ్య ఇది అని నేను విన్నాను.
17 To farese gi joithgi mane aneno e fwenynano ne chalo kama: Joma noidhogi norwakore gi akor mag nyinyo makwar ka mach, kendo marambulu molil, kod ratongʼ gweno. Wi faresego ne chalo gi wi sibuoche, to mach gi yiro kod pilni mach ne wuok e dhogi.
౧౭నా దర్శనంలో ఈ గుర్రాలను గూర్చీ, వాటి పైన ఉన్న సైనిక దళం గూర్చీ నేనేం చూశానంటే, గుర్రాలూ, సైనికులూ ధరించిన కవచాలు నిప్పులాటి ఎరుపూ, చిక్కటి నీలం, గంధకంలాటి పసుపు రంగుల్లో ఉన్నాయి. గుర్రాల తలలు సింహాల తలల్లా ఉన్నాయి. అవి తమ నోళ్ళలో నుండి అగ్ని, పొగ, గంధకం వెళ్ళగక్కుతున్నాయి.
18 Masiche adekgo mag mach, yiro kod pilni mag mach mane wuok e dho faresego nonego achiel kuom adek mar kwan ji duto.
౧౮వాటి నోళ్లలో నుండి బయటకు వస్తున్న అగ్ని, పొగ, గంధకం అనే మూడు అనర్థాల వలన మనుషుల్లో మూడవ వంతు జనాభా చనిపోయారు.
19 Teko mane faresego nigo ne ni e dhogi kendo e iwgi nikech iwgi mane nigi wigi ne chalo gi thuonde man-gi wiye ma gikechogo ka gihinyogo ji.
౧౯ఆ గుర్రాల బలం వాటి నోళ్ళలోనూ తోకల్లోనూ ఉంది. ఎందుకంటే ఆ తోకలు తలలున్న పాముల్లా ఉన్నాయి. అవి వాటితో మనుషులను గాయపరుస్తాయి.
20 To joma odongʼ mane masichego ok onego pod ne ok oweyo richo mar lamo gik mane giloso kendo gichweyo gi lwetgi; kendo ok giweyo lamo jochiende gi nyiseche manono molos gi dhahabu gi fedha kod mula gi kidi kod bao, ma gin gik ma ok nen bende ma ok winj wach, kendo ok wuothi.
౨౦ఈ కీడుల చేత చావకుండా మిగిలిన మానవాళి పశ్చాత్తాపపడలేదు. వారు దయ్యాలను పూజించడం, తమ చేతులతో చేసిన చూడటానికీ, వినడానికీ, నడవడానికీ శక్తి లేని బంగారంతో, వెండితో, కంచుతో, రాయితో, కర్రతో చేసిన విగ్రహాలను పూజించడం మానలేదు.
21 Bende ne ok gilokore giweyo richo mar nego ji, kata timbe jwok kata terruok kata kuo mane gibedo ka gitimo.
౨౧అలాగే వారు సాగిస్తున్న నరహత్యలనూ, మాయమంత్రాలనూ, వ్యభిచారాలనూ, దొంగతనాలనూ విడిచిపెట్టి పశ్చాత్తాపపడలేదు.