< Zaburi 5 >
1 Kuom jatend wende miwero gi asili. Zaburi Mar Daudi. Chik iti mondo iwinj wechena, yaye Jehova Nyasaye, para kuom pek manie chunya.
౧ప్రధాన సంగీతకారుని కోసం, వేణువులతో పాడవలసినది. దావీదు కీర్తన. యెహోవా, నా మొర విను. నా మూలుగుల గురించి ఆలోచించు.
2 Winj ywakna mar dwaro kony, Yaye Ruodha kendo Nyasacha, nikech in ema alami.
౨నా రాజా, నా దేవా, నా ఆర్తనాదం ఆలకించు, ఎందుకంటే నేను ప్రార్థన చేసేది నీకే.
3 Yie iwinj dwonda gokinyi, yaye Jehova Nyasaye; aketo kwayona e nyimi gokinyi, kendo arito dwoko ka an gi geno.
౩యెహోవా, ఉదయాన నా ఆర్తనాదం నువ్వు వింటావు. తెల్లవారే నా విన్నపం నీ దగ్గరికి తెచ్చి ఆశతో కనిపెట్టుకుని ఉంటాను.
4 Ok in Nyasaye mamor gi timbe maricho. Joma richo ok nyal dak kodi kanyachiel.
౪నువ్వు దుష్టత్వాన్ని సమర్ధించే దేవుడివి కాదు. చెడుతనం చేసే వాళ్ళు నీ అతిథులుగా ఉండరు.
5 Josunga ok nyal chungʼ e nyimi; imon gi ji duto matimo gik maricho.
౫దురహంకారులు నీ సన్నిధిలో నిలబడరు. దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్లను నువ్వు ద్వేషిస్తావు.
6 Itieko joma wacho miriambo; Jehova Nyasaye ok mor gi joma dwaro chwero remo, kod jo-miriambo.
౬అబద్ధమాడే వాళ్ళను నువ్వు నాశనం చేస్తావు. హింసించేవాళ్ళను, మోసగాళ్ళను యెహోవా ద్వేషిస్తాడు.
7 An to, nikech kechni maduongʼ, abiro donjo e odi; abiro kulora gi luor ka achomo hekalu mari maler.
౭నేనైతే నీ గొప్ప నిబంధన నమ్మకత్వాన్ని బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తాను. భయభక్తులు కలిగి నీ పవిత్రాలయం వైపు వంగి నమస్కరిస్తాను.
8 Telna, yaye Jehova Nyasaye, kuom adiera mari, nikech wasigu molwora, yie iriena yori tir e nyima.
౮యెహోవా, నా శత్రువులను బట్టి నీ నీతి మార్గంలో నన్ను నడిపించు. నా ఎదుట నీ మార్గం తిన్నగా చెయ్యి.
9 Kata wach achiel mowuok e dho jogi ok nyal gen; chunygi opongʼ gi kethruok. Dwondgi chalo gi liel mapok oum; lewgi olony e wacho miriambo.
౯వాళ్ళ నోట సత్యం లేదు. వాళ్ళ అంతరంగం దుర్మార్గం. వాళ్ళ కంఠం తెరిచిన సమాధి. వాళ్ళు తమ నాలుకతో ఇచ్చకాలు పలుకుతారు.
10 Kwan-gi kaka joketho, yaye Nyasaye! Ket obadho ma giketo ne ji ogajgi gin giwegi. Riembgi nikech richogi mathoth, nimar gisengʼanyoni.
౧౦దేవా, వాళ్ళను అపరాధులుగా ప్రకటించు. వాళ్ళ పథకాలే వాళ్ళ పతనానికి కారణం అగు గాక! అసంఖ్యాకమైన వారి అతిక్రమాలనుబట్టి వాళ్ళను తరిమి కొట్టు. ఎందుకంటే వాళ్ళు నీ మీద తిరుగుబాటు చేశారు.
11 We ji duto moketi kar pondo margi obed mamor; we gisiki ka giwer gimor. Umgi gi rit mari, mondo joma ohero nyingi omor kodi.
౧౧నీలో ఆశ్రయం కోరిన వాళ్ళు అందరూ సంతోషిస్తారు గాక. నువ్వు వారిని సంరక్షిస్తావు గనక వారు ఉప్పొంగిపోతారు గాక. నీ నామాన్ని ప్రేమించే వాళ్ళు నీలో ఆనందిస్తారు గాక.
12 Nikech igwedho joma kare adier, yaye Jehova Nyasaye; igengʼogi gi hapi mana ka okumba.
౧౨ఎందుకంటే యెహోవా, నువ్వు న్యాయవంతులను ఆశీర్వదిస్తావు. నీ డాలుతో కప్పినట్టు నువ్వు వాళ్ళను దయతో ఆవరిస్తావు.