< Mathayo 3 >

1 E ndalogo Johana ja-Batiso nobiro, koyalo e thim mar Judea,
ఆ రోజుల్లో బాప్తిసమిచ్చే యోహాను వచ్చి యూదయ అరణ్యంలో
2 kowacho niya, “Weuru richo, nikech pinyruodh polo ni machiegni.”
“పరలోక రాజ్యం దగ్గర పడింది. పశ్చాత్తాప పడండి” అని బోధిస్తూ ఉన్నాడు.
3 Ma e jalno mane owuo kuome gi dho janabi Isaya niya, “Ngʼat moro kok e thim ni, ‘Losuru yo ne Jehova Nyasaye, losneuru yore moriere tir.’”
పూర్వం యెషయా ప్రవక్త, అరణ్యంలో ఒకడి స్వరం ఇలా బిగ్గరగా పిలుస్తూ ఉంది. ప్రభువు కోసం దారి సిద్ధం చేయండి. ఆయన దారులు తిన్నగా చేయండి, అని చెప్పింది ఇతని గురించే.
4 Lep Johana nochwe gi yie ngamia, kendo notweyo kamba mar pien e nungone. Chiembe ne gin bonyo gi mor kich mag bungu.
ఈ యోహాను ఒంటె వెంట్రుకలతో నేసిన బట్టలూ నడుముకు తోలు నడికట్టు కట్టుకునేవాడు. అతని ఆహారం మిడతలు, అడవి తేనె.
5 Ji nowuok odhi ire koa Jerusalem gi Judea duto koda ka gwengʼ Jordan duto.
యెరూషలేము, యూదయ ప్రాంతం, యొర్దాను నదీ ప్రాంతాల వారంతా అతని దగ్గరికి వచ్చి,
6 Kane gihulo richogi, ne obatisogi e Aora Jordan.
తమ పాపాలు ఒప్పుకొంటూ యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుతూ ఉన్నారు.
7 To kane oneno jo-Farisai gi jo-Sadukai ka biro kama ne obatisoe ji, nowachonegi niya, “Un koth thuondegi! En ngʼa mane onyisou mondo uring utony ne mirima mager mabiro?
చాలామంది పరిసయ్యులూ సద్దూకయ్యులూ బాప్తిసం పొందడానికి రావడం చూసి అతడు, “విషసర్పాల పిల్లలారా, రాబోయే దేవుని ఆగ్రహాన్ని తప్పించుకోమని మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు?
8 Nyaguru olemo manyiso ni uselokoru uweyo richo.
పశ్చాత్తాపానికి తగిన ఫలాలు ఫలించండి.
9 Kendo kik upar e kindu uwegi ni, ‘Wan gi Ibrahim kaka wuonwa.’ Awachonu ni kata mana kuom kitegi Nyasaye nyalo loko nyithind Ibrahim.
‘అబ్రాహాము మా తండ్రి’ అని మీలో మీరు అనుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల నుంచి అబ్రాహాముకు పిల్లలను పుట్టించగలడని మీతో చెబుతున్నాను.
10 Le oseketi e tiend yiende kendo yien ka yien ma ok nyag olemo mabeyo ibiro tongʼ mi go piny kendo witi e mach.
౧౦ఇప్పటికే గొడ్డలి చెట్ల వేరుకు ఆనించి ఉంది. మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో పడేస్తారు.
11 “An abatisou gi pi mondo omi ulokru uwe richou. To ngʼato biro bangʼa ma oloya gi duongʼ, ma kata akande ok awinjora tingʼo. En obiro batisou gi Roho Maler kod mach.
౧౧పశ్చాత్తాపానికి అనుగుణంగా నేను నీళ్లతో మీకు బాప్తిసమిస్తూ ఉన్నాను. కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు. ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను తగను. ఆయన పరిశుద్ధాత్మతో, అగ్నితో మీకు బాప్తిసమిస్తాడు.
12 Odheru mare mar piedho cham ni e lwete, kendo obiro yweyo maler kare mar dino cham, kochoko ngano mage okano e dero, to mihudhi to owangʼo gi mach ma ok nyal negi.”
౧౨తూర్పారబట్టే చేట ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళం బాగా శుభ్రం చేసి తన గోదుమలు గిడ్డంగిలో పోస్తాడు. పొట్టును ఆరిపోని మంటల్లో కాల్చివేస్తాడు” అని చెప్పాడు.
13 Eka Yesu nobiro koa e piny Galili nyaka e aora Jordan mondo Johana obatise.
౧౩ఆ సమయాన యోహాను చేత బాప్తిసం పొందడానికి యేసు గలిలయ ప్రాంతం నుండి యొర్దాను నది దగ్గరికి వచ్చాడు.
14 To Johana notemo tame, kawacho niya, “Ibiro ira nade to an ema adwaro mondo ibatisa?”
౧౪అయితే యోహాను, “నేను నీచేత బాప్తిసం పొందవలసి ఉండగా, నీవు నా దగ్గరికి వస్తున్నావా?” అని ఆయనను నివారింపజూశాడు.
15 Yesu nodwoko niya, “We otimre kamano sani; en gima ber ne an kodi mondo watim ma, eka wachop tim makare duto.” Eka Johana noyie.
౧౫కానీ యేసు, “ఇప్పటికి కానివ్వు. నీతి అంతా ఇలా నెరవేర్చడం మనకు సబబే” అని అతనికి జవాబిచ్చాడు, కాబట్టి అతడు ఆ విధంగా చేశాడు.
16 Kane osebatiso Yesu to nowuok oa ei pi. To gisano polo noyawore kendo noneno Roho mar Nyasaye kalor e kido mar akuru, kendo piyo kuome.
౧౬యేసు బాప్తిసం పొంది నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాడు. వెంటనే ఆకాశం తెరుచుకుంది. దేవుని ఆత్మ పావురంలాగా దిగి తన మీద వాలడం ఆయన చూశాడు.
17 To dwol moro moa e polo nowacho niya, “Ma en wuoda, ma ahero, kendo chunya mor kode.”
౧౭“ఇదిగో చూడండి, ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయనంటే నాకెంతో ఆనందం” అని ఒక స్వరం ఆకాశం నుండి వినిపించింది.

< Mathayo 3 >