< Luka 10 >

1 Bangʼ mano, Ruoth noyiero ji piero abiriyo gariyo mamoko, kendo noorogi ariyo, ariyo mondo otel nyime e mier duto kod kamoro amora mane obiro dhiyoe.
ఆ తరువాత ప్రభువు డెబ్భై మంది ఇతర శిష్యులను కూడా నియమించి తాను వెళ్ళబోయే ప్రతి ఊరికీ, ప్రతి చోటికీ ఇద్దరిద్దరిని తనకంటే ముందుగా పంపించాడు.
2 Nowachonegi niya, “Cham ochiek mathoth, to jotich nok kuom mano kwauru Ruodh keyo mondo oor jotich odhi e puothe mar keyo.
వారిని పంపిస్తూ ఆయన వారితో ఇలా అన్నాడు, “కోత ఎక్కువగా ఉంది. పనివారు తక్కువగా ఉన్నారు. కాబట్టి పనివారిని పంపమని కోత యజమానిని వేడుకోండి.
3 Dhiuru! Aorou mondo udhi mana kaka rombe e dier ondiegi.
మీరు వెళ్ళండి. ఇదిగో వినండి, తోడేళ్ళ మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను.
4 Kik utingʼ ofuku mar pesa, kata ofuku mar wuoth, kata mana opato, kendo kik umos ngʼato e yo.
మీరు డబ్బుగానీ సంచిగానీ చెప్పులుగానీ తీసుకువెళ్ళవద్దు. దారిలో ఎవరినీ పలకరించవద్దు.
5 “Ka udonjo e ot to wachuru mokwongo ni, ‘Kwe obedi e odni.’
మీరు ఏ ఇంట్లోనైనా ప్రవేశిస్తే, ముందుగా ‘ఈ ఇంటికి శాంతి కలుగు గాక,’ అని చెప్పండి.
6 Ka ngʼat kwe ni kanyo to kwe maru nobed kuome; to ka ok kamano, to kweuno noduognu.
శాంతికి అర్హుడు ఆ ఇంట్లో ఉంటే మీ శాంతి అతని మీద ఉంటుంది. లేకపోతే అది మీకు తిరిగి వస్తుంది.
7 Beduru e odno, ka uchamo kendo umadho gimoro amora ma gimiyou, nimar jatich owinjore gi pokne. Kik uwuothi ka ua e ot ka ot.
వారు మీకు పెట్టే పదార్థాలను తింటూ తాగుతూ ఆ ఇంట్లోనే ఉండండి. ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు. ఇంటింటికీ తిరగవద్దు.
8 “Ka udonjo e dala mi orwaku to chamuru gino ma oket e nyimu.
మీరు ఏదైనా ఊరిలో ప్రవేశించినప్పుడు అక్కడి వారు మిమ్మల్ని స్వీకరిస్తే వారు మీ ఎదుట పెట్టినవి తినండి.
9 Changuru joma tuo man kanyo kendo wachnegiuru ni, ‘Pinyruoth Nyasaye osekayo machiegni kodu.’
ఆ ఊరిలో ఉన్న రోగులను బాగు చేయండి. ‘దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చింది’ అని వారికి ప్రకటించండి.
10 To ka udonjo e dala moro to ok orwaku, dhiuru e akek yore kendo uwach niya,
౧౦ఒకవేళ ఏ ఊరి వారైనా మిమ్మల్ని స్వీకరించక పోతే,
11 ‘Kata mana buch dalau momoko e tiendewa watengʼo oko. To beduru kungʼeyo maler ni: Pinyruoth Nyasaye osekayo machiegni.’
౧౧మీరు ఆ ఊరి వీధుల్లోకి వెళ్ళి, ‘మా కాళ్ళకు అంటిన మీ పట్టణం దుమ్మును మీ ముందే దులిపి వేస్తున్నాం. అయినా దేవుని రాజ్యం సమీపించిందని తెలుసుకోండి’ అని చెప్పండి.
12 Awachonu ni nobed maber-ber ne Sodom maloyo dalano.
౧౨తీర్పు రోజున ఆ ఊరికి పట్టే గతి కంటే సొదొమ పట్టణానికి పట్టిన గతే ఓర్చుకోదగినది అవుతుందని మీతో చెబుతున్నాను.
13 “Mano kaka unune malit un jo-Korazin! Mano kaka unune malit un jo-Bethsaida! Nimar ka dine honni motimnugi dinetim ne Turo gi Sidon to dine giseweyo richo chon ka girwakore gi lep gugru, kendo gibet ka gibukore gi buru.
౧౩“అయ్యో కొరాజీనూ, నీకు యాతన. అయ్యో బేత్సయిదా, నీకు యాతన. మీ మధ్య చేసిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో చేస్తే ఆ పట్టణాల్లోని వారు ముందే గోనె పట్ట కట్టుకుని బూడిదెలో కూర్చుని మనసు మార్చుకుని ఉండేవారు.
14 To enobed maber-ber ne Turo gi Sidon e ndalo mar ngʼado bura moloyo ne un.
౧౪అయినా తీర్పు రోజున మీ గతి కంటే తూరు, సీదోను పట్టణాల గతి ఓర్చుకోదగినదిగా ఉంటుంది.
15 To in Kapernaum bende ibiro tingʼori malo nyaka polo koso? Ooyo, ibiro lwar piny nyaka piny joma otho. (Hadēs g86)
౧౫కపెర్నహూమా, ఆకాశం వరకూ హెచ్చించుకున్నా నువ్వు పాతాళం వరకూ దిగిపోతావు. (Hadēs g86)
16 “Ngʼat ma winjou, winja, ngʼat modagiu odaga, kendo ngʼat modaga odagi jal ma noora.”
౧౬మీ మాట వినే వాడు నా మాటా వింటాడు. మిమ్మల్ని నిరాకరించే వాడు నన్నూ నిరాకరిస్తాడు. నన్ను నిరాకరించేవాడు నన్ను పంపిన వాణ్ణి నిరాకరిస్తాడు.”
17 Ji piero abiriyogo noduogo kod ilo mi giwacho niya, “Ruoth, nyaka jochiende bende winjowa ka wagologi e nyingi.”
౧౭ఆ డెబ్భై మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, “ప్రభూ, దయ్యాలు కూడా నీ పేరు చెబితే మాకు లోబడుతున్నాయి” అని చెప్పారు.
18 Nodwoko niya, “Ne aneno Satan kalor aa e polo mana ka mil polo.
౧౮అప్పుడు ఆయన, “సాతాను మెరుపులా ఆకాశం నుండి పడడం చూశాను.
19 Asemiyou loch mondo unyon thuonde gi thomoni kendo uloo teko duto mag jasigu bende onge gima nohinyu.
౧౯ఇదిగో వినండి, పాములనూ, తేళ్లనూ తొక్కడానికి శత్రువు బలమంతటి మీదా మీకు అధికారం ఇచ్చాను. మీకు ఏదీ ఏ మాత్రమూ హని చేయదు.
20 To kik ubed moil ni jochiende winjou, to beduru moil ni nyingu ondiki e polo.”
౨౦అయినా దయ్యాలు లోబడుతున్నాయని కాదు, మీ పేర్లు పరలోకంలో రాసి ఉన్నాయని సంతోషించండి” అని వారికి చెప్పాడు.
21 E sechego ka Roho Maler nomiyo Yesu opongʼ gi ilo, nowacho niya, “Apakoi, Wuonwa, Ruodh polo gi piny, nikech isepando gigi ne joma riek gi joma osomo, to isefwenyogi ne nyithindo matindo. Ee, Wuora, nimar mano ema ne berni kotimore.
౨౧ఆ సమయంలోనే యేసు పరిశుద్ధాత్మలో ఎంతో ఆనందించాడు. “తండ్రీ, ఆకాశానికీ భూమికీ ప్రభూ, నువ్వు ఈ సంగతులను జ్ఞానులకూ, తెలివైన వారికీ దాచిపెట్టి పసివారికి వెల్లడి పరిచావని నిన్ను కీర్తిస్తున్నాను. అవును తండ్రీ, అలా చేయడం నీకు అనుకూలం ఆయింది.”
22 “Wuonwa oseketo gik moko duto e lweta. To onge ngʼama ongʼeyo Wuowi makmana Wuoro kende, bende onge ngʼama ongʼeyo Wuoro makmana Wuowi kaachiel gi joma Wuowi oyiero mondo ofwenynegi.”
౨౨“నా తండ్రి నాకు అన్నిటినీ అప్పగించాడు. కుమారుణ్ణి తండ్రి తప్ప మరెవరూ ఎరగరు. అలాగే తండ్రి ఎవరో కుమారుడూ, ఆ కుమారుడు ఎవరికి ఆయనను వెల్లడి చేయడానికి ఇష్టపడతాడో అతడూ తప్ప ఇంకెవరూ ఎరగరు.”
23 Eka nolokore ir jopuonjrene kendo nowachonegi kar kendgi niya, “Ogwedh wenge maneno gik munenogi.
౨౩అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి ఏకాంతంగా వారితో, “మీరు చూస్తున్న వాటిని చూసే కళ్ళు ధన్యమైనాయి.
24 Nimar awachonu ni jonabi kod ruodhi mangʼeny ne gombo neno gik munenogi, to ne ok gineno kendo winjo gik muwinjogi, to ne ok giwinjo.”
౨౪అనేకమంది ప్రవక్తలూ, రాజులూ మీరు చూస్తున్న వాటిని చూడాలని కోరుకున్నా చూడలేకపోయారు, వినాలని కోరుకున్నా వినలేక పోయారని మీతో చెబుతున్నాను” అని అన్నాడు.
25 Chiengʼ moro achiel, ngʼat moro molony e chik nochungʼ mondo otem Yesu, nopenjo niya, “Japuonj, en angʼo monego atim eka ayud ngima mochwere kaka girkeni mara?” (aiōnios g166)
౨౫ఒకసారి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి ఆయనను పరీక్షిస్తూ, “బోధకుడా, నిత్య జీవానికి వారసుణ్ణి కావాలంటే నేను ఏమి చేయాలి?” అని అడిగాడు. (aiōnios g166)
26 Nodwoko niya, “Angʼo mondiki e chik? Isome nade?”
౨౬అందుకాయన, “ధర్మశాస్త్రంలో ఏమని రాసి ఉంది? నువ్వు దానినెలా అర్థం చేసుకున్నావు?” అని అడిగాడు.
27 Nomedo dwoke niya, “‘Her Jehova Nyasaye ma Nyasachi gi chunyi duto gi paroni duto, gi tekoni duto kendo gi riekoni duto;’ kendo ni, ‘Her wadu kaka iherori iwuon.’”
౨౭అతడు, “నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ మనసుతోనూ ప్రేమించాలి. నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాణ్ణీ ప్రేమించాలి” అన్నాడు.
28 Yesu nodwoke niya, “Isedwoko kare, tim kamano, eka inibed mangima.”
౨౮దానికి ఆయన, “సరిగ్గా చెప్పావు. నువ్వూ అలా చెయ్యి, జీవిస్తావు” అన్నాడు.
29 To kaka nodwaro mondo onenre ngʼat mariek, nomedo penjo Yesu niya, “Nyawadwa to en ngʼa?”
౨౯అయితే తనను నీతిమంతుడిగా చూపించుకోడానికి అతడు, “అది సరే గానీ, నా పొరుగువాడు ఎవడు?” అని యేసును అడిగాడు.
30 Yesu nodwoke niya, “Ngʼat moro ne wuotho koa Jerusalem ka oridore Jeriko, kendo nopo kopodho e lwet jomecho. Ne gilonyo lepe, gigoye, kendo giweye kochiegni tho.
౩౦అందుకు యేసు, “ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ప్రయాణమై పోతూ దోపిడీ దొంగల చేతికి చిక్కాడు. వారు అతని బట్టలు దోచుకుని అతణ్ణి కొట్టి, కొన ప్రాణంతో విడిచి పెట్టారు.
31 To noyudo jadolo moro wuotho koluwo, yorno, to kane oneno ngʼatno, nobaro moluwo bath yo komachielo.
౩౧అప్పుడొక యాజకుడు ఆ దారినే వెళ్తూ అతణ్ణి చూసి పక్కగా వెళ్ళిపోయాడు.
32 Kamano bende, ja-Lawi moro kane ochopo kanyo monene nokadho gi komachielo.
౩౨ఆలాగే ఒక లేవీయుడు అటుగా వచ్చి అతణ్ణి చూసి పక్కగా వెళ్ళాడు.
33 To ja-Samaria moro mane dhi wuoth nochopo kama ne ngʼatno nitie, kendo ka nonene, nokeche.
౩౩అయితే ఒక సమరయుడు ప్రయాణమై వెళ్తూ, అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు. అతణ్ణి చూసి జాలి పడ్డాడు.
34 Nodhi ire motweyo adhondene kooloe mo kod divai. Eka noketo ngʼatno e ngʼe pundane owuon kendo notere e od bworo kendo norite maber.
౩౪అతనిపై నూనే, ద్రాక్షారసం పోసి, గాయాలకు కట్లు కట్టి తన గాడిదపై ఎక్కించుకుని ఒక సత్రానికి తీసుకువెళ్ళి అతని బాగోగులు చూశాడు.
35 Kinyne nogolo pesa mamingli mag fedha ariyo nomiyo jarit odno. Nowachone ni, ‘Rite to ka aduogo abiro chuli nengo ma imedo ritego!’
౩౫మరుసటి రోజు అతడు రెండు వెండి నాణాలు తీసి ఆ సత్రం యజమానికిచ్చి, ‘ఇతణ్ణి జాగ్రత్తగా చూసుకో. ఇతనికి నువ్వు ఇంకేమైనా ఖర్చు చేస్తే ఈసారి నేను మళ్ళీ వచ్చినప్పుడు అది నీకు తీర్చేస్తాను’ అనిచెప్పి వెళ్ళిపోయాడు.
36 “Kuom ji adekgi ere miparo ni ne en wadgi ngʼat mane opodho e lwet jomechogo?”
౩౬అయితే ఇప్పుడు ఆ ముగ్గురిలో దొంగల చేతిలో చిక్కిన వాడికి పొరుగువాడు ఎవరని నీకు అనిపిస్తుంది?” అని అతనిని అడిగాడు.
37 Ngʼat molony gi chik nodwoko niya, “En ngʼat mane okeche.” Eka Yesu nowachone niya, “Dhi kendo itim kamano.”
౩౭దానికి అతడు, “అతని మీద జాలి చూపిన వాడే” అన్నాడు. యేసు, “నువ్వు కూడా వెళ్ళి అలాగే చెయ్యి” అని అతనితో చెప్పాడు.
38 Kane oyudo Yesu gi jopuonjrene ni e yo, nochopo gwengʼ kama dhako miluongo ni Maritha norwake e ode.
౩౮వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు. అక్కడ మార్త అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట్లోకి ఆహ్వానించింది.
39 Ne en gi nyamin mane iluongo ni Maria, mane obet piny, e tiend Ruoth kowinjo gima owacho.
౩౯ఆమెకు మరియ అనే సోదరి ఉంది. ఈమె యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన ఉపదేశం వింటూ ఉంది.
40 To Maritha nodich gi tich mangʼeny mane nyaka tim. Nodhi ire mopenjo niya, “Ruoth, ok idewo ni nyaminwa oweya atiyo mana kenda nyise mondo okonya!”
౪౦మార్త ఎన్నో పనులు పెట్టుకుని తొందరపడుతూ ఆయన దగ్గరికి వచ్చి, “ప్రభూ, నా సోదరి నన్ను విడిచి ఇక్కడ కూర్చుంది, ఒక్కదాన్నే పనులన్నీ చేసుకోవలసి వస్తున్నది. నీకేం పట్టదా? వచ్చి నాకు సాయం చేయమని ఆమెకు చెప్పు” అంది.
41 Ruoth nodwoke niya, “Maritha, Maritha, iparori kendo ithagori kuom gik mangʼeny kayiem,
౪౧అందుకు ప్రభువు, “మార్తా, మార్తా, నువ్వు బోలెడన్ని పనులను గురించి తొందర పడుతున్నావు. కానీ అవసరమైంది ఒక్కటే.
42 to gimoro achiel kende ema dwarore. Maria oseyiero gima ber moloyo kendo ok nomaye ngangʼ.”
౪౨మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. దాన్ని ఆమె దగ్గరనుంచి తీసివేయడం జరగదు” అని ఆమెతో చెప్పాడు.

< Luka 10 >