< Jongʼad Bura 14 >
1 Samson nodhi Timna kendo noneno nyako ma pod tin ma nyar jo-Filistia.
౧సంసోను తిమ్నాతుకు వెళ్ళాడు. అక్కడ ఒక ఫిలిష్తీ యువతిని చూశాడు.
2 Kane odwogo to ne onyiso wuon-gi gi min-gi niya, “Aseneno nyar jo-Filistia modak Timna; omiyo koro kelnagouru obed chiega.”
౨అతడు ఇంటికి తిరిగి వచ్చి “తిమ్నాతులో ఒక ఫిలిష్తీ అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయిని నాకిచ్చి పెళ్ళి చేయండి” అని తన తల్లిదండ్రులను అడిగాడు.
3 Wuon-gi gi min-gi nodwoke niya, “Donge nitiere nyako modimbore kuom wedeni kata kuom jowa duto? Ochuno ni nyaka idhi ir jo-Filistia ma ok oter nyangu mondo iyude dhako?” To Samson nowachone wuon-gi niya, “Miya gouru. En ema owinjore koda.”
౩వారు “నీ బంధువుల్లో గానీ మన సొంత జాతిలో గానీ అమ్మాయిలు లేరనా సున్నతి సంస్కారం లేని ఫిలిష్తీయుల్లో నుండి అమ్మాయిని భార్యగా తెచ్చుకోడానికి వెళ్తున్నావు?” అని అతణ్ణి అడిగారు. అందుకు సంసోను “ఆమె నాకు నచ్చింది. నా కోసం ఆమెను తెప్పించు” అని తన తండ్రితో అన్నాడు.
4 Jonywolne ne ok ongʼeyo ni ma en dwaro Jehova Nyasaye, mondo omi giyud thuolo mar kedo gi jo-Filistia; nimar e kindeno jo-Israel ne ni e bwo lochgi.
౪అయితే ఫిలిష్తీయులకు కీడు చేయడానికి యెహోవాయే అతణ్ణి పురిగొల్పుతున్నాడని అతని తల్లిదండ్రులు తెలుసుకోలేదు. ఆ రోజుల్లో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను పరిపాలిస్తున్నారు.
5 Samson nodhi Timna kaachiel gi wuon-gi kod min-gi. Kane gichiegni chopo e puoth mzabibu mar Timna, apoya nono nyathi sibuor nowuok karuto kochome tir.
౫తరువాత సంసోను తన తల్లిదండ్రులతో కలసి తిమ్నాతుకు వెళ్ళాడు. తిమ్నాతు ద్రాక్ష తోటల దగ్గరికి వచ్చినప్పుడు ఒక కొదమ సింహం భీకరంగా గర్జిస్తూ అతని మీదికి వచ్చింది.
6 Roho mar Jehova Nyasaye nobiro kuome giteko mane oyiecho sibuor koni gi koni gi lwete nono mana kaka onyalo yiecho nyadiel. To ne ok onyiso wuon mare kata min mare gima ne osetimo.
౬యెహోవా ఆత్మ అకస్మాత్తుగా అతణ్ణి ఆవరించాడు. దాంతో చేతిలో ఏమీ లేక పోయినా ఒక మేకపిల్లను చీల్చినట్టు అతడు దాన్ని చీల్చి వేశాడు. కాని తాను చేసినదాన్ని తన తండ్రికి గానీ తల్లికి గానీ చెప్పలేదు.
7 Eka nodhi mi owuoyo gi nyakono, kendo nohere.
౭అతడు అక్కడికి వెళ్లి ఆ స్త్రీతో మాట్లాడాడు. ఆమె అతనికి నచ్చింది.
8 Bangʼe achien, kane odhi mondo onywome, nolokore mondo one choke sibuor motho. E ringrene kanyo nopo koneno kich mochiek kochokore kuome,
౮కొంతకాలం గడచిన తరువాత ఆమెను తీసుకుని రావడానికి తిరిగి ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ సింహం కళేబరం చూడడానికి పక్కకు తిరిగాడు. ఆ సింహపు అస్థిపంజరంలో అతనికి ఒక తేనెటీగల గుంపూ తేనే కనిపించాయి.
9 mi nowuodho pet kiny motimo mo, mi nochamo kodhi. Kane oriwore gi jonywolne kendo, nomiyogi matin, kendo gin bende negichamo. To ne ok onyisogi nine ogolo mor kichno e choke sibuor motho.
౯అతడు ఆ తేనె తీసి చేతిలో పట్టుకుని తింటూ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వారికీ కొంత తేనె ఇచ్చాడు. వారూ దాన్ని తిన్నారు. అయితే తాను ఆ తేనెను సింహం కళేబరం నుండి తీశానని వారికి చెప్పలేదు.
10 Wuon-gi nodhi mondo one nyakono. Kendo Samson noloso nyasi kanyo, nikech mano ema ne en kit wuowi madwaro nyombo.
౧౦సంసోను తండ్రి ఆ స్త్రీని చూడడానికి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. సంసోను అక్కడి సంప్రదాయం ప్రకారం ఒక విందు ఏర్పాటు చేశాడు.
11 Kane ochopo, to ne omiye jochungʼ piero adek.
౧౧ఆమె బంధువులు అతణ్ణి చూడగానే అతనితో ఉండటానికి ముప్ఫై మంది స్నేహితులను తీసుకుని వచ్చారు.
12 Samson nowachonegi niya, “We agonue ngero moro. Ka unyalo miya dwoko bangʼ ndalo abiriyo mar nyasini, to anamiu kandhe piero adek gi lewni mabeyo bende piero adek.”
౧౨అప్పుడు సంసోను వారితో “మీకిష్టమైతే మీకో పొడుపు కథ చెప్తాను. ఈ విందు జరిగే ఏడు రోజుల్లోగా మీలో ఎవరైనా ఈ పొడుపు కథ విప్పి నాకు చెప్పగలిగితే నేను ముప్ఫై సన్నటి నార వస్త్రాలూ, మరో ముప్ఫై జతల దుస్తులూ మీకు ఇస్తాను.
13 Ka ok unyal miya dwoko, to nyaka umiya kandhe piero adek gi lewni mabeyo bende piero adek. Negiwachone niya, “Nyiswa ngero mari mondo wawinji.”
౧౩ఒకవేళ మీరు ఆ పొడుపు కథ విప్పలేకపోతే ఆ ముప్ఫై సన్నటి నార వస్త్రాలూ, మరో ముప్ఫై జతల దుస్తులూ మీరు నాకు ఇవ్వాలి” అన్నాడు. దానికి వారు “ఆ పొడుపు కథ ఏమిటో చెప్పు. వింటాం.” అన్నారు.
14 Nodwoko niya, “Gima ichamo nowuok kuom jocham ji; gima mit nowuok kuom ratego.” Kuom ndalo adek ne ok ginyal chiwo dwoko.
౧౪అప్పుడు వారితో సంసోను ఇలా చెప్పాడు, “తినే దాంట్లోనుండి తిండి వచ్చింది. బలమైన దాంట్లోనుండి తీపి వచ్చింది.” అన్నాడు. అతని అతిథులు మూడు రోజులైనా ఆ పొడుపు కథ విప్పలేక పోయారు.
15 E odiechiengʼ mar angʼwen, neginyiso chi Samson niya, “Hoo chwori mondo onyiswa tiend ngerono, ka ok kamano, to wabiro wangʼi kaachiel gi od wuonu duto nyaka utho. Ne iluongowa kae mondo imawa?”
౧౫ఏడవ రోజున వాళ్ళు సంసోను భార్యతో “మమ్మల్ని నిరుపేదలుగా చేయడానికే ఆహ్వానించారా? ఎలాగైనా నీ భర్త దగ్గర ఈ పొడుపు కథ భావాన్ని రాబట్టి మాకు చెప్పు. లేకపోతే నిన్నూ నీ తండ్రి ఇంటి వాళ్ళనూ తగలబెట్టేస్తాం” అన్నారు.
16 Eka chi Samson nodirore kuome, koywak, “Ok idwara! Ok ihera. Isemiyo joga ngero, to pod ok inyisa tiende.” Samson nodwoke niya, Wachni pod ok anyiso wuonwa kata minwa, “angʼo momiyo nyaka anyisi tiende?”
౧౬సంసోను భార్య అతని ఎదుట ఏడవడం మొదలు పెట్టింది “నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు గానీ ప్రేమించడం లేదు. నువ్వు మా వాళ్లకు ఒక పొడుపు కథ చెప్పావు. కానీ దానినెలా విప్పాలో నాకు చెప్పలేదు” అంది. దానికతడు “నేను మా అమ్మానాన్నలకే చెప్పలేదు నీకెలా చెప్తాను” అన్నాడు. ఆమె విందు జరిగిన ఏడు రోజులూ అతని దగ్గర ఏడుస్తూనే ఉంది.
17 Noywak odiechienge abiriyo duto mar nyasi. Omiyo e odiechiengʼ mar abiriyo nonyise, nikech nosiko mana kokase. Bangʼe nonyiso joge tiend ngerono.
౧౭ఏడో రోజు ఆమె అతణ్ణి బాగా ఒత్తిడి చేయడం వల్ల ఆ పొడుపు కథ ఎలా విప్పాలో ఆమెకు చెప్పేశాడు. ఆమె తన వాళ్లకు పొడుపు కథ అర్థం తెలియచేసింది.
18 Kane chiengʼ pod ok opodho e odiechiengʼ mar abiriyo, jo-dalano nowachone niya, “En angʼo mamit moloyo mor kich? En angʼo maratego moloyo sibuor?” Samson nowachonegi niya, “Kane ok upuro gi nyarocha, to dine ok uyudo tiend ngeroni.”
౧౮ఏడో రోజున సూర్యాస్తమయం ముందే ఆ ఊరి వాళ్ళు సంసోనుతో “తేనె కన్నా తీపి అయినదేది? సింహం కన్నా బలమైనదేది?” అన్నారు. సంసోను వారితో ఇలా అన్నాడు “మీరు నా దూడతో దున్నకపోయి ఉంటే నా పొడుపుకథను విప్పగలిగేవారు కాదు” అన్నాడు.
19 Eka Roho mar Jehova Nyasaye nobiro kuome gi teko. Nodhi Ashkelon, monego ji piero adek ma omagi gigegi mi ochiwo kandhe ne jogo mane owacho tiend ngero. Nodhi e od wuon ka en gi mirima.
౧౯యెహోవా ఆత్మ అతని మీదికి మళ్ళీ బలంగా వచ్చాడు. అప్పుడు అతడు అష్కెలోనుకు వెళ్లి అక్కడివారిలో ముప్ఫై మందిని చంపి వారిని దోచుకున్నాడు. ఆ సొమ్ముతో తన పొడుపు కథను విప్పిన వారికి దుస్తులు ఇచ్చాడు. కోపంతో మండిపడుతూ తన తండ్రి ఇంటికి వెళ్లి పోయాడు.
20 Chi Samson nomi osiepne mane jachungʼne kokendo.
౨౦సంసోను భార్యను అతని స్నేహితుడికి ఇచ్చి వేశారు.