< Joshua 18 >

1 Kanyakla duto mag jo-Israel nochokore Shilo ma giguro Hemb Romo kanyo. Pinyno nobedo e bwo lochgi,
ఇశ్రాయేలీయులు ఆ దేశాన్ని స్వాధీనపరచుకున్న తరువాత వారంతా షిలోహులో సమావేశమై అక్కడ ప్రత్యక్షపు గుడారం వేశారు.
2 makmana ne pod nitiere dhout Israel abiriyo mane pod ok oyudo girkeni margi.
ఇశ్రాయేలీయుల్లో స్వాస్థ్యం యింకా దొరకని ఏడు గోత్రాలు మిగిలాయి.
3 Omiyo Joshua nowachone jo-Israel niya, “Ubiro rito nyaka karangʼo kapok uchako kawo mwandu mar piny mane Jehova Nyasaye, ma Nyasach wuoneu, asemiyou?
కాబట్టి యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు. “మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశాన్ని స్వాధీనం చేసుకోడానికి వెళ్లకుండా ఎంతకాలం వ్యర్థంగా గడుపుతారు?
4 Yieruru ji adek koa e dhoot ka dhoot. Abiro oorogi mondo gidhi ginon pinyno kendo gindik malongʼo kuom pinyno, kaluwore gi pok mar ngʼato ka ngʼato. Bangʼe, to gidwog ira.
ఒక్కొక్క గోత్రానికి ముగ్గుర్ని మీరు నియమించుకుంటే నేను వారిని పంపిస్తాను. వారు బయలుదేరి దేశం అంతటాతిరుగుతూ వివిధ స్వాస్థ్యాల ప్రకారం దాని వివరాలను రాసి నా దగ్గరికి తీసుకురావాలి.
5 Nyaka upog pinyni e migepe abiriyo. Jo-Juda nyaka dongʼ kargi man yo milambo kendo joka Josef bende odongʼ kargi man yo nyandwat.
వాళ్ళు దాన్ని ఏడు భాగాలుగా చేయాలి. యూదా వారు దక్షిణం వైపు వారి భూభాగంలో ఉండిపోవాలి. యోసేపు వంశం వాళ్ళు ఉత్తరం వైపు తమ భూభాగంలో ఉండిపోవాలి.
6 Bangʼ ka usendiko malongʼo kuom migepe abiriyo mar pinyno, to ukelnagiuru kae kendo abiro pogonugi gi ombulu e nyim Jehova Nyasaye ma Nyasachwa.
మీరు ఏడు వంతులుగా దేశ వివరాన్ని రాసి నా దగ్గరికి తీసుకురావాలి. నేనిక్కడ మన దేవుడైన యెహోవా సమక్షంలో మీకోసం చీట్లు వేస్తాను.
7 Kata kamano, jo-Lawi to ok noyud pok e dieru, nikech tichgi mar dolo ne Jehova Nyasaye e girkeni margi. To Gad, Reuben kod nus mar dhood Manase, to oseyudo girkeni margi e bath aora Jordan ma yo wuok chiengʼ nikech Musa jatich Jehova Nyasaye nosemiyogi.”
లేవీయులకు మీ మధ్య ఏ వాటా ఉండదు. యెహోవాకు యాజకత్వం చేయడమే వారి స్వాస్థ్యం. గాదు, రూబేను, మనష్షే అర్థగోత్రం, యొర్దాను అవతల తూర్పువైపున స్వాస్థ్యాన్ని పొందారు.”
8 E kinde mane jogi owuok mondo gidhi ginon piny, Joshua nomiyogi chik niya, “Dhiuru kendo utim nonro malongʼo mar pinyni kendo undik gik moko duto muyudo e iye. Bangʼe dwoguru ira kendo abiro miyou pok maru Shilo e nyim Jehova Nyasaye.”
ఆ మనుషులు బయలుదేరి వెళ్ళిపోయారు. దేశ వివరాలు రాయడానికి వెళ్తున్న వారితో యెహోషువ “మీరు వెళ్లి దేశమంతా తిరిగి దాని వివరం రాసి నా దగ్గరికి తిరిగి రండి, అప్పుడు నేను షిలోహులో యెహోవా సమక్షంలో మీకోసం చీట్లు వేస్తాను” అన్నాడు.
9 Omiyo jogo nowuok modhi koluwo dier piny tir. Negindiko gigo duto mane giyudo e pinyno e kitabu, e dala ka dala, e migepe abiriyo kendo mi gidwogo ir Joshua e kambi man Shilo.
వారు వెళ్లి దేశమంతా తిరిగి ఏడు భాగాలుగా, పట్టణాల ప్రకారం వివరాలను పుస్తకంలో రాసి షిలోహు శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరికి వచ్చారు.
10 Bangʼe Joshua nomiyogo pok margi Shilo e nyim Jehova Nyasaye, kendo gikanyono nopogo jo-Israel pinyno kaluwore gi dhoutgi.
౧౦వారి కోసం యెహోషువ షిలోహులో యెహోవా సమక్షంలో చీట్లు వేశాడు. వారి వాటాల ప్రకారం ఇశ్రాయేలీయులకు ఆ దేశాన్ని పంచిపెట్టాడు.
11 Pok mar joka Benjamin, notimne anywola ka anywola. Kuonde mane opognigo ne ni e kind Juda gi Josef.
౧౧బెన్యామీనీయుల గోత్రానికి వారి వంశాల ప్రకారం, వాటా వచ్చింది. వారి వాటా సరిహద్దు యూదా వంశస్థుల సరిహద్దుకు, యోసేపు వంశస్థుల సరిహద్దుకు మధ్య ఉంది.
12 Tongʼ-gi ma yo nyandwat nochakore e aora Jordan, kochomo pewe man yo nyandwat mar Jeriko, mi oluwo piny godego kochomo yo podho chiengʼ nyaka ochomo e thim mar Beth Aven.
౧౨ఉత్తరంగా వారి సరిహద్దు యొర్దాను మొదలు యెరికోకు ఉత్తరంగా పోయి పడమటి వైపుకు కొండసీమ మీదుగా వెళ్లి బేతావెను అరణ్యం దగ్గర అంతం అయింది.
13 Koa kanyo nongʼado kodhi yo milambo mar pewe mag Luz (tiende ni, Bethel), modhi nyaka Ataroth Adar mantiere yo milambo mar Beth Horon Mamwalo.
౧౩అక్కడనుండి ఆ సరిహద్దు లూజు వైపున, అంటే బేతేలు అనే లూజు దక్షిణంగా సాగి కింది బెత్‌ హోరోనుకు దక్షిణంగా కొండమీది అతారోతు అద్దారు వరకూ వెళ్ళింది.
14 Koa e got momanyore gi Beth Horon mantiere yo milambo, tongʼno nogomo kochomo yo podho chiengʼ mar godno, mogik Kiriath Baal (tiende ni, Kiriath Jearim), ma en dala jo-Juda. Mano e tongʼ-gi ma yo podho chiengʼ.
౧౪అక్కడ నుండి దాని సరిహద్దు దక్షిణంగా బేత్‌హోరోనుకు ఎదురుగా ఉన్న కొండనుండి పడమరగా తిరిగి అక్కడ నుండి దక్షిణం వైపున యూదా వంశస్థుల పట్టణమైన కిర్యాత్బాలు అనే కిర్యత్యారీము వరకూ వెళ్ళింది, అది పడమటి సరిహద్దు.
15 Tongʼ ma yo milambo nochakore oko mar Kiriath Jearim mantiere yo podho chiengʼ, kendo tongʼno nochopo nyaka thidhna mar pi Neftoa.
౧౫దక్షిణం వైపు కిర్యత్యారీము కొననుండి దాని సరిహద్దు పడమరగా నెఫ్తోయ నీళ్ల ఊటవరకూ సాగి
16 Tongʼno nodhi nyaka e tiend got momanyore gi Holo mar Ben Hinom, kod yo nyandwat mar Holo mar Refaim. Nodhi nyime nyaka e Holo mar Hinom koluwo yo milambo mar pewe mar dala maduongʼ mar jo-Jebus kendo mochopo En Rogel.
౧౬ఉత్తరం వైపు రెఫాయీయుల లోయలో ఉన్న బెన్‌ హిన్నోము లోయ ఎదురుగా ఉన్న కొండప్రక్కనుండి దక్షిణంగా బెన్‌హిన్నోము లోయ గుండా యెబూసీయుల ప్రదేశం వరకూ సాగి ఏన్‌రోగేలు వరకూ వెళ్ళింది.
17 Bangʼe nogomo kochiko yo nyandwat, modhi nyaka En Shemesh, kendo nyaka Geliloth, momanyore gi Adumim, kendo oridore kadhi piny nyaka Kit Bohan ma wuod Reuben.
౧౭అది ఉత్తరంగా ఏన్‌షేమెషు వరకూ వ్యాపించి అదుమ్మీముకు ఎక్కుచోటికి ఎదురుగా ఉన్న గెలీలోతు వరకూ సాగి రూబేనీయుడైన బోహను రాతి దగ్గర దిగింది.
18 Nodhi nyime nyaka yo nyandwat mar pewe mag Beth Araba mochopo nyaka Araba.
౧౮అది ఉత్తరం వైపు మైదానానికి ఎదురుగా వ్యాపించి అరాబావరకూ దిగి అక్కడనుండి ఆ సరిహద్దు ఉత్తరంగా బేత్‌హోగ్లా వరకూ వెళ్ళింది.
19 Eka nodhi kendo yo nyandwat mar pewe mag Beth Hogla mi owuok koa yo nyandwat mar dho Nam Chumbi, kama aora Jordan ochakore godo mantiere yo milambo. Mano e tongʼ-gi ma yo milambo.
౧౯అక్కడనుండి ఆ సరిహద్దు యొర్దాను దక్షిణంగా ఉప్పు సముద్రం ఉత్తర అఖాతం దగ్గర అంతమయింది. ఇది దక్షిణ సరిహద్దు.
20 Aora Jordan ne en tongʼ mantiere yo wuok chiengʼ. Ma e kaka nopog ni anywola mar Benjamin pinygi.
౨౦తూర్పు వైపున యొర్దాను దానికి సరిహద్దు. దాని చుట్టూ ఉన్న సరిహద్దుల ప్రకారం బెన్యామీను ప్రజలకు వారి వంశాల ప్రకారం సంక్రమించిన స్వాస్థ్యం ఇది.
21 Mier madongo mane dhood Benjamin nitierego kaluwore gi anywolagi e magi: Jeriko, Beth Hogla, Emek Keziz,
౨౧బెన్యామీనీయుల గోత్రానికి వారి వంశాల ప్రకారం కలిగిన పట్టణాలు ఏవంటే యెరికో, బేత్‌హోగ్లా, యెమెక్కెసీసు,
22 Beth Araba, Zemaraim, Bethel,
౨౨బేత్ అరాబా, సెమరాయిము,
23 Avim, Para, Ofra,
౨౩బేతేలు, ఆవీము, పారా, ఒఫ్రా,
24 Kefa Amoni, Ofni kod Geba. Giduto ne gin mier kod gwenge apar gariyo.
౨౪కెఫార్ అమ్మోని, ఒప్ని, గెబా అనేవి, వాటి పల్లెలు కాక పన్నెండు పట్టణాలు.
25 Mier mamoko ne gin: Gibeon, Rama, Beeroth,
౨౫గిబియోను, రామా, బెయేరోతు, మిస్పే,
26 Mizpa, Kefira, Moza,
౨౬కెఫీరా, మోసా, రేకెము, ఇర్పెయేలు, తరలా,
27 Rekem, Irpil, Tarala,
౨౭సేలా, ఎలెపు, యెరూషలేము అనే ఎబూసు, గిబియా, కిర్యతు అనేవి. వాటి పల్లెలు పోతే పద్నాలుగు పట్టణాలు.
28 Zela, Haelef, jo-Jebus (tiende ni, Jerusalem), Gibea kod Kiriath. Giduto ne gin mier kod gwenge maromo apar gangʼwen. Magi e mier mane opog ni dhood Benjamin.
౨౮వారి వంశాల ప్రకారం ఇది బెన్యామీను ప్రజలకు కలిగిన స్వాస్థ్యం.

< Joshua 18 >