< Johana 20 >
1 To odiechiengʼ mokwongo mar juma, kogwen, kane piny pod olil, Maria ma aa Magdala nodhi e liel, mi noneno ka kidi osengʼiel oko e dho lielno.
౧ఆదివారం ఉదయాన్నే ఇంకా చీకటిగా ఉండగానే మగ్దలేనే మరియ సమాధి దగ్గరికి వచ్చింది. అక్కడ సమాధిపై ఉంచిన రాయి తీసి ఉండడం చూసింది.
2 Omiyo noringo modhi ir Simon Petro kod japuonjre machielo mane Yesu ohero, kendo nowachonegi niya, “Gisekawo ringre Ruoth gigolo e liel kama noyike, kendo koro wakia kama giketee!”
౨కాబట్టి ఆమె సీమోను పేతురు దగ్గరకూ, యేసు ప్రేమించిన మరో శిష్యుడి దగ్గరకూ పరుగెత్తుకుని వెళ్ళింది. వారితో, “ప్రభువును ఎవరో సమాధిలో నుండి తీసుకు పోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో తెలియడం లేదు” అని చెప్పింది.
3 Kuom mano, Petro gi japuonjre machielono nowuok modhi kama noyike.
౩కాబట్టి పేతురూ, ఆ మరో శిష్యుడూ వెంటనే బయలుదేరి సమాధి దగ్గరికి వచ్చారు.
4 Negiringo giduto, to japuonjre machielono noyombo Petro, mi nokuongone chopo e liel.
౪వారిద్దరూ కలసి వెళుతుండగా ఆ మరో శిష్యుడు పేతురు కంటే వేగంగా పరుగెత్తి మొదటగా సమాధి దగ్గరికి వచ్చాడు.
5 Nokulore mongʼicho, kendo noneno lewni mayom molir olir kod law ik ma nonalgo wi Yesu kani ei bur kanyo. To kata kamano, ne ok odonjo e iye.
౫అతడు ఆ సమాధిలోకి తొంగి చూశాడు. నార బట్టలు అతనికి కనిపించాయి. కానీ అతడు సమాధిలోకి ప్రవేశించలేదు.
6 Eka Simon Petro, mane ringo bangʼe bende notundo. En to nodonjo nyaka ei bur ik, mi noneno lewni mayom molir olir ka ni kanyo,
౬ఆ తరువాత సీమోను పేతురు అతని వెనకాలే వచ్చి నేరుగా సమాధిలోకి ప్రవేశించాడు.
7 kaachiel gi law ik mane onalgo wi Yesu. Nangano noban maber, kendo ne en kar kende, mopogore gi kama lewni mayom molir olir ne nitie.
౭అక్కడ నారబట్టలు పడి ఉండడమూ, ఆయన తలకు కట్టిన రుమాలు నార బట్టలతో కాకుండా వేరే చోట చక్కగా చుట్టి పెట్టి ఉండడమూ చూశాడు.
8 Mogik, japuonjre machielo, mane okwongo chopo e bur yikno, bende nodonjo ei bur mi noneno kendo noyie.
౮ఆ తరువాత మొదట సమాధిని చేరుకున్న శిష్యుడు కూడా లోపలి వెళ్ళి చూసి విశ్వసించాడు.
9 (Nyaka ae thuolono ne pok gingʼeyo, koa e Ndiko, ni nochuno ni Yesu nyaka ne chier mi aa kuom joma otho.)
౯అయితే ‘ఆయన చనిపోయిన వారి నుండి బతికి లేవడం తప్పనిసరి’ అన్న లేఖనం వారింకా గ్రహించలేదు.
10 Eka jopuonjre nodok e miechgi.
౧౦అప్పుడు ఆ శిష్యులు తిరిగి తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు.
11 Maria nochungʼ oko e dho bur kaywak. Kane oyudo oywak, nokulore mongʼiyo i bur,
౧౧కానీ మరియ సమాధి బయటే నిలబడి ఏడుస్తూ ఉంది. ఆమె సమాధిలోకి వంగి చూసింది.
12 kendo noneno malaike ariyo morwako lewni marochere, kobet piny kama ringre Yesu nopielie, ka moro ni yo ka wiye, to machielo ni yo ka tiende.
౧౨ఆమెకు ఇద్దరు దేవదూతలు కనిపించారు. వారు తెల్లని బట్టలు వేసుకుని ఉన్నారు. యేసు దేహం ఉంచిన చోట ఒకడు తల వైపునా మరొకడు కాళ్ళ వైపునా కూర్చుని ఉన్నారు.
13 Negipenje niya, “Nyarwa, iywago angʼo?” Nowachonegi niya, “Gisekawo Ruodha gidhigo, to akia kama giketee.”
౧౩వారు మరియతో “ఎందుకు ఏడుస్తున్నావమ్మా?” అని అడిగారు. దానికి ఆమె, “ఎవరో నా ప్రభువును తీసుకు వెళ్ళిపోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో తెలియడం లేదు” అంది.
14 Bangʼ wacho kamano, nolokore ongʼiyo ngʼeye, kendo noneno Yesu kochungʼ kanyo, to ne ok ongʼeyo ni en Yesu.
౧౪ఆమె ఇలా పలికి వెనక్కి తిరిగి అక్కడ యేసు నిలబడి ఉండడం చూసింది. కానీ ఆయనను ఆమె గుర్తు పట్టలేదు.
15 Yesu nopenje niya, “Nyarwa, iywago angʼo? En ngʼa mimanyo?” En to noparo ni mano jarit puodho ema wuoyo kode, omiyo nopenje niya, “Jaduongʼ, ka dipo ni in ema ne ikawe idhi kode, to nyisa kama iseketee, mondo adhi akawe.”
౧౫యేసు, “అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు?” అని ఆమెను అడిగాడు. ఆమె ఆయనను తోటమాలి అనుకుంది. “అయ్యా, ఒకవేళ నువ్వు ఆయనను తీసుకు వెళ్తే ఆయనను ఎక్కడ ఉంచావో చెప్పు. నేను ఆయనను తీసుకుపోతాను” అంది.
16 Yesu noluonge niya, “Maria!” Nolokore mi ongʼiye koluonge matek gi dho jo-Hibrania niya, “Raboni!” (tiende ni “Japuonj”).
౧౬అప్పుడు యేసు ఆమెను చూసి, “మరియా” అని పిలిచాడు. ఆమె ఆయన వైపుకు తిరిగి, “రబ్బూనీ” అని పిలిచింది. రబ్బూనీ అనే మాటకు హీబ్రూ భాషలో ఉపదేశకుడు అని అర్థం.
17 Yesu nowachone niya, “Kik itweri kuoma, nimar pok adok ka Wuora, to dhi ir owetena mondo inyisgi ni, ‘Adok ir Wuora ma en Wuoru un bende, kendo Nyasacha ma en Nyasachu.’”
౧౭యేసు ఆమెతో, “నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కి పోలేదు. కాబట్టి నన్ను తాకవద్దు. కానీ నా సోదరుల దగ్గరికి వెళ్ళి నా తండ్రీ, మీ తండ్రీ, నా దేవుడూ, మీ దేవుడూ అయిన ఆయన దగ్గరికి ఆరోహణం అవుతున్నానని వారికి చెప్పు” అన్నాడు.
18 Maria nyar Magdala nodhi ir jopuonjre monyisogi Injili niya, “Aseneno Ruoth!” Kendo Ruoth ema osenyisa weche ma awachonugi.
౧౮మగ్దలేనే మరియ వచ్చి శిష్యులతో, “నేను ప్రభువును చూశాను. ఆయన నాతో ఈ మాటలు చెప్పాడు” అంటూ ఆయన మాటలన్నీ వారికి తెలియజెప్పింది.
19 Godhiambo mar odiechiengʼ mokwongo mar juma, jopuonjre nochokore kanyakla, kendo ne giloro dhoudi nikech negiluoro jo-Yahudi, Yesu nobiro mochungʼ e diergi kendo nowachonegi niya, “Kwe obed kodu!”
౧౯ఆదివారం సాయంకాలం యూదులకు భయపడి శిష్యులు తామున్న ఇంటి తలుపులు మూసుకుని ఉన్నారు. అప్పుడు యేసు వచ్చి వారి మధ్యలో నిలబడి, వారితో, “మీకు శాంతి కలుగు గాక” అన్నాడు.
20 Bangʼ kane osewacho ma, nonyisogi lwetene gi ngʼetne. Jopuonjre ne mor mokalo kane gineno Ruoth.
౨౦ఆయన అలా చెప్పిన తరువాత వారికి తన పక్కనూ చేతులనూ చూపించాడు. వారు ప్రభువును చూసి ఎంతో సంతోషించారు.
21 Yesu nochako owachonegi kendo niya, “Beduru gi kwe! Mana kaka Wuora oseora e kaka an bende aorou.”
౨౧అప్పుడు యేసు తిరిగి, “మీకు శాంతి కలుగు గాక! తండ్రి నన్ను పంపించిన విధంగానే నేనూ మిమ్మల్ని పంపుతున్నాను” అని వారితో చెప్పాడు.
22 Bangʼ wachonegi wechego, nokudho muche kuomgi, kowachonegi niya, “Nwangʼuru Roho Maler.
౨౨ఈ మాట చెప్పిన తరువాత ఆయన వారి మీద ఊది, “పరిశుద్ధాత్మను పొందండి.
23 Ngʼato angʼata muweyone richone nowenegi, to ka ok uweyonegi, to ok nowenegi.”
౨౩మీరు ఎవరి పాపాలను క్షమిస్తారో వారి పాపాలకు క్షమాపణ ఉంటుంది. ఎవరి పాపాలు ఉండనిస్తారో అవి అలా నిలిచి ఉంటాయి” అని చెప్పాడు.
24 Thoma (ma bende iluongo ni Didimas), ma en achiel kuom jopuonjre apar gariyo, ne ok ni kodgi e kinde mane Yesu ofwenyorenigi.
౨౪పన్నెండుమంది శిష్యుల్లో ఒకడైన తోమా యేసు వచ్చినప్పుడు వారితో లేడు. ఇతణ్ణి “దిదుమ” అని పిలిచే వాళ్ళు.
25 Omiyo jopuonjre mamoko nokone niya, “Waseneno Ruoth!” To nowachonegi niya, “An to ka ok aneno lwete kuonde mane musmal ochwowo, mi aketo lith lweta kuondego, kendo asoyo lweta e ngʼetne, to ok abi yie wachno.”
౨౫మిగిలిన శిష్యులు, “మేము ప్రభువును చూశాం” అని అతడితో చెప్పారు. అప్పుడు అతడు, “నేను ఆయన మేకుల గుర్తును చూడాలి. నా వేలు ఆ గాయం రంధ్రంలో ఉంచాలి. అలాగే నేను నా చేతిని ఆయన పక్కలో ఉంచాలి. అప్పుడే నేను నమ్ముతాను” అన్నాడు.
26 Bangʼ juma achiel, jopuonjre ne ni ei ot kendo, to chiengʼno Thoma ne ni kodgi. Kata obedo ni dhoudi nolor, Yesu nobiro mochungʼ e diergi momosogi niya, “Okweuru!”
౨౬ఎనిమిది రోజులైన తరువాత మళ్ళీ ఆయన శిష్యులు లోపల ఉన్నారు. ఈసారి తోమా కూడా వారితో ఉన్నాడు. తలుపులు మూసి ఉన్నాయి. అప్పుడు యేసు వారి మధ్యకు వచ్చి, “మీకు శాంతి కలుగు గాక!” అన్నాడు.
27 Eka nowachone Thoma niya, “Ket lith lweti kae kendo nee lwetena. Chor lweti kuoma bangʼe iketi e ngʼetna. We bedo ngʼama riwo gi kiawa, bed ngʼama nigi yie!”
౨౭తరువాత ఆయన తోమాను చూసి, “నా చేతులు చూడు. నీ వేళ్ళతో వాటిని తాకు. అలాగే నీ చెయ్యి చాచి నా పక్కలో పెట్టు. విశ్వాసిగా ఉండు. అవిశ్వాసివి కావద్దు” అన్నాడు.
28 Thoma nodwoke niya, “Ruodha kendo Nyasacha!”
౨౮దానికి జవాబుగా తోమా, “నా ప్రభూ, నా దేవా” అన్నాడు.
29 Eka Yesu nowachone niya, “In iyie nikech isenena, to ogwedh joma pok onena, to oseyie.”
౨౯అప్పుడు యేసు, “నువ్వు నన్ను చూసి నమ్మావు. అయితే నన్ను చూడకుండానే నమ్మిన వారు ధన్యులు” అన్నాడు.
30 Yesu notimo ranyisi gi honni mamoko mangʼeny, ka jopuonjrene neno, ma ok ondiki e kitabuni.
౩౦యేసు క్రీస్తు ఇంకా అనేక అద్భుతాలను తన శిష్యుల ఎదుట చేశాడు. వాటన్నిటినీ ఈ పుస్తకంలో రాయలేదు.
31 To magi ondiki mondo uyie ni Yesu e Kristo ma Wuod Nyasaye, kendo mondo ka uyie kamano, to ubed gi ngima e nyinge.
౩౧కానీ యేసు దేవుని కుమారుడు క్రీస్తు అని మీరు నమ్మడానికీ నమ్మి ఆయన నామంలో జీవం పొందడానికీ ఇవన్నీ రాయడం జరిగింది.