< Jeremia 39 >

1 E higa mar ochiko mar Zedekia ruodh Juda, e dwe mar apar, Nebukadneza ruodh Babulon nodhi gi jolweny mage duto momonjo Jerusalem kendo ne gigoyone agengʼa.
యూదా రాజైన సిద్కియా పరిపాలనలో తొమ్మిదో సంవత్సరం పదో నెలలో బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యం అంతటితో యెరూషలేమును ముట్టడి వేశాడు.
2 To odiechiengʼ mar ochiko e dwe mar angʼwen e higa mar apar gachiel mar loch Zedekia, ohinga mar dala maduongʼno nomuki.
సిద్కియా పరిపాలనలో 11 వ సంవత్సరం నాలుగో నెల తొమ్మిదో రోజున ప్రాకారాలను కూల్చి పట్టణాన్ని ఆక్రమించారు.
3 Eka jotelo duto mag ruodh Babulon nobiro kendo obet e Dhorangach Madiere: Negal-Shareza ma ja-Samgar, Nebo-Sasekim jatelo maduongʼ, Negal-Shareza jatelo mamalo maduongʼ kod jotelo mamoko duto mag ruodh Babulon.
అప్పుడు బబులోను రాజు అధికారులు నేర్గల్‌ షరేజరు, సమ్గర్ నెబో, ముఖ్య అధికారి శర్సెకీము లోపలికి వచ్చి సింహద్వారంలో కూర్చున్నారు. నేర్గల్‌ షరేజరు ఒక ఉన్నత అధికారి. మిగిలిన వాళ్ళు బబులోను రాజుకు చెందిన అధికారులు.
4 Ka Zedekia ruodh Juda kod jolweny duto nonenogi, negiringo giwuok e dala maduongʼno gotieno ka gikalo e rangach man e kind ohinga ariyo man but puoth ruoth, kendo ka gichomo Araba.
యూదుల రాజైన సిద్కియా, అతని యోధులందరూ వాళ్ళను చూసి పారిపోయారు. వాళ్ళు రాత్రిపూట రాజు తోట మార్గంలో రెండు గోడల మధ్య ఉన్న గుమ్మపు దారిలో నుంచి పట్టణం బయటకు వెళ్ళిపోయారు. రాజు అరాబా మైదానం వైపుగా వెళ్ళాడు.
5 To jolwenj Babulon nolawogi kendo ojuko Zedekia e pewe mag Jeriko. Negimake mi gitere Ribla e piny Hamath ir Nebukadneza ruodh Babulon, kama nongʼadone bura.
అయితే కల్దీయుల సేన వాళ్ళను తరిమి, యెరికో దగ్గర ఉన్న మైదానాల్లో సిద్కియాను కలుసుకుని, అతన్ని పట్టుకుని, హమాతు దేశంలోని రిబ్లా పట్టణం దగ్గర ఉన్న బబులోను రాజైన నెబుకద్నెజరు దగ్గరికి తీసుకొచ్చారు. అక్కడ రాజు అతనికి శిక్ష విధించాడు.
6 E Ribla ruodh Babulon nonego yawuot Zedekia koneno bende nonego jo-Juda duto ma joka ruoth.
బబులోను రాజు రిబ్లా పట్టణంలో సిద్కియా కొడుకులను అతని కళ్ళముందే చంపాడు. అతడు యూదా ప్రధానులందరినీ చంపాడు.
7 Eka nogolo wenge Zedekia oko kendo notweye gi rateke mag mula mondo notere Babulon.
తరువాత అతడు సిద్కియా కళ్ళు పెరికించి అతన్ని బబులోనుకు తీసుకెళ్ళడానికి ఇత్తడి సంకెళ్లతో బంధించాడు.
8 Jo-Babulon nowangʼo kar dak ruoth kod ute ji kendo negimuko ohinga mag Jerusalem.
కల్దీయులు రాజమందిరాన్ని, ప్రజల ఇళ్ళను, అగ్నితో తగలబెట్టి, యెరూషలేము చుట్టూ ఉన్న గోడలు పడగొట్టారు.
9 Nebuzaradan ma jatend lweny mar piny nomako joma nodongʼ e dala maduongʼ moterogi e twech Babulon, kanyakla gi jogo mane osedhi ire, kod joma moko.
అప్పుడు రాజదేహ సంరక్షకుల అధిపతి నెబూజరదాను, పట్టణంలో మిగిలి ఉన్న ప్రజలను, ద్రోహులై తమ రాజును విడిచి కల్దీయులతో చేరిన వాళ్ళను, ఇంకా మిగిలిన ప్రజలందరినీ బబులోనుకు తీసుకెళ్ళిపోయాడు.
10 To Nebuzaradan ma jatend lweny noweyo e piny Juda joma odhier, mane onge gi gimoro; kendo e ndalogo nomiyogi puothe mzabibu kod puothe mamoko.
౧౦అయితే నెబూజరదాను నిరుపేదలను యూదా దేశంలోనే ఉండనిచ్చి, వాళ్లకు ద్రాక్షతోటలు, పొలాలు ఇచ్చాడు.
11 Koro Nebukadneza ruodh Babulon nosechiwo chike kuom Jeremia kokalo kuom Nebuzaradan ma jatend lweny mar piny kowacho ni:
౧౧యిర్మీయా గురించి బబులోను రాజైన నెబుకద్నెజరు రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదానుకు ఇలా ఆజ్ఞాపించాడు,
12 “Kawe kendo irite; kik ihinye to timne gimoro amora mokwayo.”
౧౨“నువ్వు అతనికి హాని చెయ్యొద్దు. అతన్ని జాగ్రత్తగా చూసుకో. అతడు నీతో ఏది చెప్పినా అది అతని కోసం చెయ్యి.”
13 Omiyo Nebuzaradan ma jatend lweny, Nebushazban ma jatelo maduongʼ, Negal-Shareza ma jatelo mamalo kod jotelo duto mag ruodh Babulon
౧౩కాబట్టి రాజదేహసంరక్షకుల అధిపతి నెబూజరదాను, నపుంసకుల అధిపతి నేర్గల్‌ షరేజరు, ఉన్నత అధికారి నేర్గల్‌షరేజరు, ఇంకా బబులోను రాజు ప్రధానులందరూ మనుషులను పంపి,
14 nooro wach mondo ogol Jeremia oa e laru mar jarito. Ne gitere ir Gedalia wuod Ahikam, ma wuod Shafan, mondo odwoke dalane. Omiyo nodongʼ e dier jogi owuon.
౧౪చెరసాల ప్రాంగణంలో నుంచి యిర్మీయాను తెప్పించి, అతన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి షాఫాను కొడుకైన అహీకాము కొడుకు గెదల్యాకు అతన్ని అప్పగించారు. అప్పుడు యిర్మీయా ప్రజల మధ్య నివాసం చేశాడు.
15 Sa mane Jeremia nokan e laru mar jolweny, wach Jehova Nyasaye nobirone niya:
౧౫యిర్మీయా చెరసాల ప్రాంగణంలో ఉన్నప్పుడు యెహోవా వాక్కు అతనితో ఇలా చెప్పాడు,
16 “Dhiyo kendo inyis Ebed-Melek ja-Kush, ‘Ma e gima Jehova Nyasaye Maratego, ma Nyasach Israel, wacho: Achiegni timo gik mane awacho ni natim ne dala maduongʼni, ka akelo ne masiche to ok kwe. E kindeno notimgi ka ineno.
౧౬“నువ్వు వెళ్లి కూషీయుడైన ఎబెద్మెలెకుతో ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు, చూడు, మేలు చెయ్యడం కోసం కాకుండా కీడు చెయ్యడానికి నేను ఈ పట్టణం గురించి చెప్పిన మాటలు నెరవేరుస్తున్నాను. ఆ రోజున నీవు చూస్తూ ఉండగా ఆ మాటలు నెరవేరుతాయి.
17 Jehova Nyasaye wacho ni enoresi odiechiengʼno, ok nochiwi ne jogo miluoro.
౧౭ఆ రోజున నేను నిన్ను విడిపిస్తాను. నువ్వు భయపడే మనుషుల చేతికి నిన్ను అప్పగించడం జరగదు’ అని యెహోవా అంటున్నాడు,
18 Enoresi; ok nonegi gi ligangla to initony gi ngimani, nikech igeno kuoma,’” Jehova Nyasaye owacho.
౧౮‘కచ్చితంగా నేను నిన్ను తప్పిస్తాను. నువ్వు ఖడ్గంతో చనిపోవు. నువ్వు నన్ను నమ్మావు గనుక, నీ ప్రాణమే నీకు కొల్లసొమ్ము అవుతుంది.’ ఇదే యెహోవా వాక్కు.”

< Jeremia 39 >