< Jeremia 29 >
1 Ma e baruwa mane janabi Jeremia ooro koa Jerusalem ne jodongo mane otony e dier jotwech kod ne jodolo, jonabi kod ji mamoko duto mane Nebukadneza notero e twech koa Jerusalem nyaka Babulon.
౧యెరూషలేము నుంచి నెబుకద్నెజరు బబులోనుకు చెరపట్టి తీసుకెళ్ళిన వాళ్ళలో ఉన్న యాజకులకూ, ప్రవక్తలకూ, ప్రజలందరికీ ప్రవక్త అయిన యిర్మీయా యెరూషలేము నుంచి పంపించిన వ్రాత చుట్ట లోని మాటలు ఇవి.
2 (Ma ne en bangʼ ka Ruoth Jehoyakin kod min ruoth, jotelo mag agola kod jotend Juda gi Jerusalem, jopecho gi jogoro osedhi e twech koa Jerusalem.)
౨రాజైన యెకొన్యా, రాజమాత, ఇంకా యూదాలో, యెరూషలేములో ఉన్న ఉన్నతాధికారులూ, శిల్పకారులూ, కంసాలులూ, యెరూషలేము నుంచి వెళ్ళిపోయిన తరువాత ఇది జరిగింది.
3 Nomiyo Elasa wuod Shafan kod Gemaria wuod Hilkia baruwa, jogo mane Zedekia ruodh Juda nooro Babulon ir Ruoth Nebukadneza. Kawacho niya:
౩అతడు ఈ పత్రాన్ని యూదా రాజైన సిద్కియా పంపిన షాఫాను కొడుకు ఎల్యాశా, హిల్కీయా కొడుకు గెమర్యాల చేత బబులోను రాజైన నెబుకద్నెజరుకు పంపాడు.
4 Ma e gima Jehova Nyasaye Maratego, ma Nyasach Israel, wacho ne jogo duto mane atero e twech koa Jerusalem nyaka Babulon:
౪అందులో ఇలా ఉంది “ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువూ అయిన యెహోవా తన ఉద్దేశం చొప్పున బబులోనుకు బందీలుగా వెళ్ళిన వాళ్ళందరికీ ఇలా చెబుతున్నాడు,
5 “Geruru udi kendo udag kanyo; pidhuru puothe kendo ucham gik ma ginyago.
౫‘ఇళ్ళు కట్టుకుని వాటిలో నివాసం ఉండండి. తోటలు నాటి వాటి ఫలాలు అనుభవించండి.
6 Nyomburu mondo onywol yawuowi kod nyiri; yuduru mon ne yawuotu kendo uchiw nyiu mondo onyuom, magin bende ginywol yawuotgi kod nyigi mondo kwanu omedre kendo kik udog chien.
౬పెళ్ళిళ్ళు చేసుకుని కొడుకులనూ కూతుళ్ళనూ కనండి. అక్కడ మీరు తక్కువ సంఖ్యలో ఉండకుండా అభివృద్ధి పొందడానికి మీ కొడుకులకూ, కూతుళ్ళకూ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళను కొడుకులూ కూతుళ్ళూ కననివ్వండి.
7 Bende, dwaruru kwe kod mwandu mar dala maduongʼ ma aseterou e twech. Lamuru Jehova Nyasaye, ndalono nikech kodhi maber to un bende unudhi maber.”
౭నేను మిమ్మల్ని బందీలుగా తీసుకెళ్ళిన పట్టణం క్షేమం కోరి దాని కోసం యెహోవాకు ప్రార్థన చేయండి. ఎందుకంటే, దానికి క్షేమం కలిగితే మీకు క్షేమం కలుగుతుంది.’
8 Ee, ma e gima Jehova Nyasaye Maratego, ma Nyasach Israel, wacho: “Kik iwe jonabi kod joma neno wach e lek manie dieru wuondu. Kik uchik itu ne lek ma gileko nikech mano miyo gimedo leko.
౮ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువూ అయిన యెహోవా ఇలా అంటున్నాడు, ‘మీ మధ్య ఉన్న ప్రవక్తలు, మంత్రగాళ్ళు మిమ్మల్ని మోసం చెయ్యనివ్వకుండా చూసుకోండి. మీలో కలలు కనే వాళ్ళు చెప్పే మాటలు వినకండి.
9 Gikoro miriambo gi nyinga. Ok aorogi,” Jehova Nyasaye owacho.
౯వాళ్ళు నా పేరట అబద్ధ ప్రవచనాలు మీతో చెప్తారు. నేను వాళ్ళను పంపలేదు.’ ఇదే యెహోవా వాక్కు.
10 Ma e gima Jehova Nyasaye wacho: “Bangʼ ka usetieko higni piero abiriyo e Babulon, to anabi iru kendo achop singo mara mar ngʼwono mondo aduogu ka.”
౧౦ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నాడు, ‘బబులోను మిమ్మల్ని డెబ్భై సంవత్సరాలు పాలించిన తరువాత, నేను మీకు సాయం చేసి, నేను మీకోసం పలికిన శుభ వచనం నెరవేర్చి, ఈ స్థలానికి మిమ్మల్ని తిరిగి తీసుకొస్తాను.
11 Nimar Jehova Nyasaye wacho niya, “Angʼeyo chenro ma an-go kodu. Chenro mar dhi maber to ok mar hinyou, chenro mar miyou geno kod ngima mabiro.
౧౧ఎందుకంటే, మీ కోసం నేను ఉద్దేశించిన ప్రణాళికలు నాకే తెలుసు,’ ఇది యెహోవా వాక్కు. ‘అవి మీకు ఒక భవిష్యత్తునూ, నిరీక్షణనూ కలిగించే సమాధానకరమైన ప్రణాళికలే. అవి హానికరమైనవి కావు.
12 Eka unuluonga mi anabi kendo ulama, to anawinju.
౧౨అప్పుడు మీరు నన్ను వెతికి, నాకు ప్రార్థన చేస్తారు. అప్పుడు నేను మీ మాట ఆలకిస్తాను.
13 Unudwara kendo unuyuda ka udwara gi chunyu duto.
౧౩మీరు పూర్ణమనస్సుతో నన్ను అన్వేషిస్తారు కాబట్టి, నన్ను కనుగొంటారు.
14 Ununwangʼa kendo anaduogu ka ua e twech. Anachoku ka ua e pinje duto kod kuonde ma asekeyoue kendo anaduogu kama ne uae ka aterou e twech,” Jehova Nyasaye owacho.
౧౪అప్పుడు నేను మీకు దొరుకుతాను,’ ఇది యెహోవా వాక్కు. ‘తరువాత, నేను మిమ్మల్ని నిర్బంధంలో నుంచి రప్పించి, మిమ్మల్ని చెదరగొట్టిన దేశాల్లోనుంచి, స్థలాల్లోనుంచి మిమ్మల్ని పోగు చేస్తాను.’ ఇది యెహోవా వాక్కు. ‘ఎక్కడినుంచి మిమ్మల్ని బందీలుగా పంపానో, అక్కడికే మిమ్మల్ని మళ్ళీ తీసుకొస్తాను,’
15 Unyalo wacho niya, “Jehova Nyasaye osemiyowa jonabi ei Babulon,”
౧౫బబులోనులో యెహోవా మాకు ప్రవక్తలను నియమించాడని మీరు అన్నారు గనుక,
16 to ma e gima Jehova Nyasaye wacho kuom ruoth mobet e kom duongʼ mar Daudi kod jogo duto modongʼ e dala maduongʼni, jopinyu mane ok odhi kodu e twech;
౧౬దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజుతో, మీతోబాటు బందీలుగా వెళ్ళకుండా ఈ పట్టణంలో నివాసం ఉన్న మీ సహోదరులతో, ప్రజలందరితో యెహోవా ఈ మాట అంటున్నాడు,
17 adiera, ma e gima Jehova Nyasaye Maratego wacho: “Anaor ligangla, kech kod masira kuomgi kendo analokgi ka ngʼope maricho ma ok nyal cham.
౧౭సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు, ‘నేను వాళ్ళ మీదికి ఖడ్గం, కరువు, తెగులు పంపబోతున్నాను. తినడానికి వీలు లేని కుళ్ళిపోయిన అంజూరు పళ్ళలా వాళ్ళను చేస్తాను.
18 Analawgi gi ligangla, kech kod masira kendo anami gibed joma bwogo gwenge duto manie piny kendo gir kwongʼ kod bwok, gima ok onego mi luor kendo ma jaricho, e dier ogendini duto mane aseriembogie.”
౧౮తరువాత ఖడ్గంతో, కరువుతో, తెగులుతో నేను వాళ్ళను తరుముతాను. భూమి మీద ఉన్న రాజ్యాలన్నిటి దృష్టిలో వాళ్లను ఒక అసహ్యంగా చేస్తాను. నేను వాళ్ళను చెదరగొట్టిన దేశాల్లో వాళ్ళను శాపానికీ, తృణీకారానికీ, ఎగతాళికీ ప్రతీకగా చేస్తాను.
19 Jehova Nyasaye wacho niya, “Nimar pok giwinjo wechena, ma gin weche mane aoronegi kuom jotichna ma jonabi. To kata mana un joma ne oter e twech pok uwinja,” Jehova Nyasaye owacho.
౧౯ఎందుకంటే వాళ్ళు నా మాట వినలేదు,’ ఇది యెహోవా వాక్కు. ‘నా సేవకులైన ప్రవక్తల ద్వారా నా వాక్కు పదేపదే పంపాను. కాని, మీరు వినలేదు’ ఇది యెహోవా వాక్కు.”
20 Emomiyo, winjuru wach Jehova Nyasaye, un joma ni e twech duto ma aseriembo koa Jerusalem nyaka Babulon.
౨౦“నేను యెరూషలేము నుంచి బబులోనుకు బందీలుగా పంపిన ప్రజలారా, మీరందరూ యెహోవా మాట వినండి.
21 Ma e gima Jehova Nyasaye Maratego, ma Nyasach Israel, wacho kuom Ahab wuod Kolaya kod Zedekia wuod Maseya, ma koronu miriambo e nyinga: “Anachiwgi ne Nebukadneza ruodh Babulon, kendo enoneg-gi e nyimu ka uneno.
౨౧నా పేరును బట్టి మీకు అబద్ధ ప్రవచనాలు ప్రకటించే కోలాయా కొడుకు అహాబు గురించి, మయశేయా కొడుకు సిద్కియా గురించి, ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు, చూడండి, బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి వాళ్ళను అప్పగించబోతున్నాను. మీ కళ్ళ ఎదుట అతడు వాళ్ళను చంపుతాడు.
22 Nikech gin, joma ni e twech duto moa Juda man Babulon noti gi kwongʼni kawacho ni: ‘Mad Jehova Nyasaye timnu mana kaka notimone Zedekia kod Ahab, mane ruodh Babulon owangʼo e mach.’
౨౨అప్పుడు వీళ్ళ గురించి బబులోనులో ఉన్న వాళ్ళందరూ శాపవచనాలు పలుకుతారు. ‘బబులోను రాజు అగ్నిలో కాల్పించిన సిద్కియాలాగా, అహాబులాగా యెహోవా నిన్ను చేస్తాడు గాక,’ అని శాపం పెడతారు.
23 Nimar gisetimo gik mamono ei Israel; giseterore gi monde jobathgi kendo e nyinga gisewacho miriambo, mane ok anyisogi mondo giwachi. Angʼeye kendo an janeno kuom wachno,” Jehova Nyasaye owacho.
౨౩ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, వాళ్ళు ఇశ్రాయేలీయుల్లో దుర్మార్గం జరిగిస్తూ, తమ పొరుగువాళ్ళ భార్యలతో వ్యభిచారం చేస్తూ, నేను వాళ్లకు ప్రకటించని అబద్ధపు మాటలు నా పేరట ప్రకటించారు. నేనే ఈ సంగతి తెలుసుకున్నాను, నేనే దానికి సాక్షం,” ఇదే యెహోవా వాక్కు.
24 Nyis Shemaya ja-Nehelam,
౨౪“నెహెలామీయుడైన షెమయా గురించి ఇలా చెప్పు.
25 “Ma e gima Jehova Nyasaye Maratego ma Nyasach Israel, wacho: Ne ioro barupe e nyingi iwuon ne ji duto man Jerusalem, ne Zefania wuod Maseya jadolo, kendo ne jodolo mamoko duto. Ne iwachone Zefania ni,
౨౫ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు, యెరూషలేములో ఉన్న ప్రజలందరికీ, యాజకుడైన మయశేయా కొడుకు జెఫన్యాకూ, యాజకులకందరికీ, నీ సొంత పేరుతో ఉత్తరాలు పంపి,
26 ‘Jehova Nyasaye oseyieri jadolo kar Jehoyada mondo ibed jarit od Jehova Nyasaye; omiyo koro ngʼato ma janeko mawuondore ni janabi onego itwe gi nyororo kod chuma molworo ngʼute.
౨౬‘యాజకుడైన యెహోయాదాకు బదులుగా యెహోవా మందిర విషయాల్లో విచారణకర్త అయిన యాజకునిగా యెహోవా నిన్ను నియమించాడు. వెర్రివాళ్లై తమను తాము ప్రవక్తలుగా ఏర్పరచుకున్న వాళ్ళను నువ్వు సంకెళ్లతో బంధించి బొండలో బిగించాలి’ అన్నావు.
27 Marangʼo pod ok imako Jeremia moa Anathoth, ma ketore ni janabi e dieru?
౨౭‘కాబట్టి ఇప్పుడు, నీకు ప్రత్యర్ధిగా, తనను తాను ప్రవక్తగా చేసుకున్న అనాతోతీయుడైన యిర్మీయాను నువ్వెందుకు చీవాట్లు పెట్టలేదు?
28 Oseoranwa wachni Babulon: Enobed kinde marabora. Emomiyo geruru udi kendo udagie eigi; pidhuru puothe kendo ucham gigo ma ginyago.’”
౨౮మీరు ఇక్కడ చాలాకాలం ఉంటారు. ఇళ్ళు కట్టుకుని వాటిలో నివాసం ఉండండి, తోటలు నాటి వాటి ఫలాలు తినండి,’ అని బబులోనులో ఉన్న మాకు అతడు వర్తమానం పంపాడు,”
29 Zefania jadolo, kata kamano, nosomo baruwani ne Jeremia janabi.
౨౯అప్పుడు యాజకుడైన జెఫన్యా, ప్రవక్త అయిన యిర్మీయా వింటూ ఉండగా ఆ పత్రికను చదివి వినిపించాడు.
30 Eka wach Jehova Nyasaye nobiro ne Jeremia ni,
౩౦అప్పుడు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు,
31 “Or wachni ne joma ni e twech duto: ‘Ma e gima Jehova Nyasaye wacho kuom Shemaya ja-Nehelam: Nikech Shemaya osekoronu, kata obedo ni ne ok aore, kendo osemiyo uyie gi miriambo,
౩౧“బందీలుగా ఉన్న వాళ్ళందరికీ నువ్వు కబురంపి ఇలా చెప్పు, ‘యెహోవా నెహెలామీయుడైన షెమయా గురించి ఇలా అంటున్నాడు, నేను అతణ్ణి పంపకపోయినా, షెమయా మీకు ప్రవచించి మీరు అబద్ధపు మాటలు నమ్మేలా చేశాడు కాబట్టి,
32 ma e gima Jehova Nyasaye wacho: Adier, anakum Shemaya ja-Nehelam kod gunde. Onge ngʼama nodongʼ kuom joge, kata neno gik mabeyo mabiro timo ne joga, nikech oselando mondo ji ongʼanyna. An Jehova Nyasaye ema awacho kamano.’”
౩౨నెహెలామీయుడైన షెమయా యెహోవాకు వ్యతిరేకంగా అబద్ధం ప్రకటించాడు కాబట్టి అతన్నీ, అతని సంతానాన్నీ నేను శిక్షించబోతున్నాను. ఈ ప్రజల్లో కాపురం ఉండేవాడు ఒక్కడూ అతనికి మిగిలి ఉండడు. నా ప్రజలకు నేను చేసే మేలు అతడు చూడడు.’ ఇది యెహోవా వాక్కు.”