< Jeremia 26 >
1 E chakruok mar loch Jehoyakim wuod Josia ruodh Juda, wachni nobiro koa ir Jehova Nyasaye:
౧యోషీయా కొడుకు యూదా రాజు యెహోయాకీము పరిపాలన మొదట్లో యెహోవా దగ్గర నుంచి సందేశం ఇలా వచ్చింది,
2 “Ma e gima Jehova Nyasaye wacho: Chungi e laru mar od Jehova Nyasaye kendo iwuo gi ji duto manie dala mar Juda ma lemoga e od Jehova Nyasaye. Nyisgi gik moko duto manyisi; kik iwe kata wach achiel.
౨“యెహోవా చెప్పేదేమిటంటే, నువ్వు యెహోవా మందిర ఆవరణంలో నిలబడి, నేను నీకు ఆజ్ఞాపించే మాటలన్నిటిని యెహోవా మందిరంలో ఆరాధించడానికి వచ్చే యూదా పౌరులందరికీ ప్రకటించు. వాటిలో ఒక మాట కూడా విడిచిపెట్టవద్దు.
3 Sa moro ginichik itgi kendo ngʼato ka ngʼato olokre owe yorene maricho. Eka analok pacha kendo ok anakel kuomgi masira mane achano nikech timbe maricho magisetimo.
౩ఒకవేళ వాళ్ళు విని తమ దుర్మార్గాన్ని విడిచిపెడితే వాళ్ల మీదికి రప్పిస్తానని చెప్పిన విపత్తును తప్పిస్తాను.”
4 Wachnegi ni, ‘Ma e gima Jehova Nyasaye wacho: Ka ok uwinja kendo uluwo chikena, ma aseketo e nyimu,
౪నువ్వు వారితో ఈ మాట చెప్పాలి. “యెహోవా చెప్పేదేమిటంటే,
5 kendo ka ok uwinjo weche mag jotichna ma jonabi, maseoronu pile ka pile (kata kamano pod ok uwinjo),
౫మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోతే, నేను ప్రతిసారీ పంపిస్తున్న నా సేవకులైన ప్రవక్తల మాటలు మీరు వినకపోతే
6 bangʼe anami odni obed ka Shilo kendo dala maduongʼni ka gima okwongʼ e dier ogendini duto mag piny.’”
౬నేను షిలోహుకు చేసినట్టు ఈ మందిరానికి కూడా చేస్తాను. ఈ పట్టణాన్ని భూమిపై ఉన్న రాజ్యాలన్నిటికీ శాపంగా చేస్తాను.”
7 Jodolo, jonabi kod ji duto nowinjo Jeremia kawacho wechegi e od Jehova Nyasaye.
౭యిర్మీయా యీ మాటలను యెహోవా మందిరంలో పలుకుతూ ఉంటే యాజకులూ ప్రవక్తలూ ప్రజలంతా విన్నారు.
8 To bangʼ ka Jeremia nosetieko nyiso ji duto gik moko duto mane Jehova Nyasaye ochike mondo owachi, jodolo, jonabi kod ji duto nomake kendo owachone niya, “Nyaka itho!
౮అయితే యిర్మీయా యెహోవా చెప్పమని తనకు ఆజ్ఞాపించిన మాటలన్నీ ప్రజలందరికీ చెప్పడం ముగించిన తరువాత యాజకులూ ప్రవక్తలూ ప్రజలంతా అతణ్ణి పట్టుకుని “నువ్వు తప్పకుండా చావాలి.
9 Angʼo ma omiyo ikoro e nying Jehova Nyasaye ni odni biro chalo ka Shilo kendo ni dala maduongʼni nojwangʼ kendo nokethi maonge ngʼama nodagie?” Kendo ji duto nochokore kolworo Jeremia e od Jehova Nyasaye.
౯ఈ మందిరం షిలోహులాగా అవుతుందనీ ఈ పట్టణంలో ఎవరూ నివసించరనీ, పట్టణం పాడైపోతుందనీ యెహోవా పేరున నువ్వు ఎందుకు ప్రకటిస్తున్నావు?” అన్నారు. ప్రజలంతా యెహోవా మందిరంలో యిర్మీయా చుట్టూ గుమికూడారు.
10 Ka jotend jo-Juda nowinjo wechegi, negia kar dak mar ruoth ma gidhi nyaka e od Jehova Nyasaye kendo negikawo keregi e kar donjo mar Dhorangach Manyien mar od Jehova Nyasaye.
౧౦యూదా అధికారులు ఈ మాటలు విని రాజ భవనంలో నుంచి యెహోవా మందిరానికి వచ్చి, యెహోవా మందిరపు కొత్త ద్వారం ప్రవేశంలో కూర్చున్నారు.
11 Eka jodolo kod jonabi nowachone jotelo kod ji duto niya, “Ngʼatni onego ngʼadne buch nek nikech nokoro kuom dala maduongʼni. Usewinje gi itu uwegi!”
౧౧యాజకులతో, ప్రవక్తలతో, అధిపతులతో, ప్రజలందరితో వాళ్ళు ఇలా అన్నారు. “మీరు చెవులారా విన్నట్టుగా ఈ వ్యక్తి ఈ పట్టణానికి వ్యతిరేకంగా ప్రకటిస్తున్నాడు, కాబట్టి ఇతడు చావడం సమంజసమే.”
12 Eka Jeremia nowachone jotelo duto kod ji duto niya, “Jehova Nyasaye ne oora mondo akor kuom odni kod dala maduongʼni gigo duto musewinjo.
౧౨అప్పుడు యిర్మీయా అధికారులందరితో ప్రజలందరితో ఇలా చెప్పాడు “‘ఈ మందిరానికీ ఈ పట్టణానికీ వ్యతిరేకంగా మీరు విన్న మాటలన్నీ ప్రకటించు’ అని యెహోవా నన్ను పంపాడు.
13 Koro lokuru yoreu gi timbeu kendo uluor Nyasachu. Eka Jehova Nyasaye nolok pache kendo ok nokel masira kuomu mosechano timonu.
౧౩కాబట్టి మీరు ఇప్పుడైనా మీ మార్గాలనూ మీ ప్రవర్తననూ చక్కపరచుకుని మీ యెహోవా దేవుని మాట వినండి. యెహోవా మీమీదికి తేవాలనుకున్న ఆపద రాకుండా చేస్తాడు.
14 Anto an e lweti; timnauru gima uneno ka ber kendo nikare.
౧౪ఇదిగో నేను మీ చేతుల్లో ఉన్నాను. మీ దృష్టికేది మంచిదో ఏది సరైనదో అదే నాకు చేయండి.
15 To ngʼeuru gadieri ni, ka unega, to unukel ketho kuom chwero remo maonge ketho kuomu uwegi kendo kuom dala maduongʼni gi jogo modak e iye, nimar adiera Jehova Nyasaye oseora iru mondo awachnu wechegi duto ka uwinjo gi itu.”
౧౫అయితే ఈ మాటలన్నీ చెప్పడానికి నిజంగా యెహోవా మీ దగ్గరికి నన్ను పంపాడు. కాబట్టి, మీరు నన్ను చంపితే నిర్దోషి రక్తాపరాధం మీ మీదికీ ఈ పట్టణం మీదికీ దాని నివాసుల మీదికీ తెచ్చుకున్న వాళ్ళవుతారు. దీనిని మీరు కచ్చితంగా తెలుసుకోవాలి.”
16 Eka jotelo duto kod ji duto nowachone jodolo gi jonabi niya, “Ngʼatni ok onego ngʼadne buch tho! Osewuoyonwa e nying Jehova Nyasaye ma Nyasachwa.”
౧౬అప్పుడు అధిపతులు, ప్రజలంతా యాజకులతో ప్రవక్తలతో ఇలా అన్నారు. “ఈ వ్యక్తి మన యెహోవా దేవుని పేరున మనతో మాట్లాడాడు కాబట్టి ఇతడు చావడం సరి కాదు.”
17 Jodongo moko mag piny nosudo nyime e lela kendo owachone chokruok mangima mar ji ni,
౧౭దేశంలోని పెద్దల్లో కొంతమంది లేచి అక్కడ చేరిన ప్రజలతో,
18 “Mika maa Moresheth nokoro e ndalo Hezekia ruodh Juda. Nonyiso jo-Juda duto ni, ‘Ma e gima Jehova Nyasaye Maratego wacho: “‘Sayun ibiro pur ka puodho, Jerusalem biro dongʼ gunda, got matin mogerie hekalu nobed ka bungu motwere moyugno.’
౧౮“యూదా రాజు హిజ్కియా రోజుల్లో మోరషు ఊరివాడు మీకా ప్రవచిస్తూ ఉండేవాడు. అతడు యూదా ప్రజలందరితో ఇలా చెప్పాడు. సేనల అధిపతి యెహోవా చెప్పేదేమిటంటే, సీయోనును పొలంలాగా దున్నడం జరుగుతుంది. యెరూషలేము రాళ్ల కుప్ప అవుతుంది. మందిరమున్న పర్వతం అరణ్యంలోని కొండలాగా అవుతుంది.
19 Bende Hezekia ruodh Juda kata ngʼato angʼata man Juda nonegi? Donge Hezekia noluoro Jehova Nyasaye kendo omanyo ngʼwono mare? Kendo donge Jehova Nyasaye noloko pache, mi omiyo ne ok okelo masira kuomgi? Wachiegni kelo masira malich kuomwa wawegi!”
౧౯యూదా రాజు హిజ్కియా గానీ యూదా ప్రజలు గానీ అతణ్ణి చంపారా? రాజు యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఆయనను వేడుకుంటే వాళ్లకు చేస్తానన్న విపత్తు చేయలేదు కదా! అయితే మన మీదికి మనమే గొప్ప కీడు తెచ్చుకుంటున్నాము” అని చెప్పారు.
20 (Koro Uria wuod Shemaya moa Kiriath Jearim ne ngʼat machielo mane okoro e nying Jehova Nyasaye; nokoro mana gik machalre kuom dala maduongʼni kendo pinyni mana kaka Jeremia notimo.
౨౦కిర్యత్యారీము వాసి షెమయా కొడుకు ఊరియా అనే ఒకడు యెహోవా పేరున ప్రవచిస్తూ ఉండేవాడు. అతడు యిర్మీయా చెప్పిన మాటల్లాగే ఈ పట్టణానికీ ఈ దేశానికీ వ్యతిరేకంగా ప్రవచించాడు.
21 Ka Ruoth Jehoyakim kod jotende duto nowinjo wechege, ruoth ne dwaro mondo onege. To Uria nowinjo ma kendo oringo ka luoro omake nyaka Misri.
౨౧యెహోయాకీం రాజు, అతని శూరులంతా అధికారులంతా అతని మాటలు విన్నప్పుడు, రాజు అతణ్ణి చంపాలని చూశాడు. ఊరియా అది తెలుసుకుని భయపడి ఐగుప్తుకు పారిపోయాడు.
22 Ruoth Jehoyakim, kata kamano, nooro Elnathan wuod Akbor nyaka Misri, kaachiel gi chwo mamoko.
౨౨అయినప్పటికీ యెహోయాకీం రాజు, అక్బోరు కొడుకు ఎల్నాతానునూ అతనితో కూడా కొంతమందిని ఐగుప్తుకు పంపాడు.
23 Negigolo Uria Misri kendo gitere ne Ruoth Jehoyakim, mane omiyo onege gi ligangla kendo dende owiti e kar yiko mar ji ajiya.)
౨౩వాళ్ళు ఐగుప్తు నుంచి ఊరియాను యెహోయాకీం రాజు దగ్గరికి తెచ్చారు. రాజు కత్తితో అతణ్ణి చంపి సాధారణ ప్రజల సమాధుల్లో అతని శవాన్ని పాతిపెట్టాడు.
24 Bende, Ahikam wuod Shafan noriwo Jeremia lwedo, kendo omiyo ne ok ochiwe e lwet jogo mondo onege.
౨౪అయితే షాఫాను కొడుకు అహీకాము యిర్మీయాకు సాయపడ్డాడు. అతణ్ణి చంపడానికి ప్రజలకు అప్పగించలేదు.