< Isaya 51 >
1 Winjauru, un mumanyo tim makare kendo udwaro Jehova Nyasaye: Ngʼi aneuru lwanda mane ogolue, ranganeuru kama ne okuny mogolue;
౧నీతిని అనుసరిస్తూ యెహోవాను వెతుకుతూ ఉండే మీరు, నా మాట వినండి. ఏ బండ నుంచి మిమ్మల్ని చెక్కారో ఏ గని నుంచి మిమ్మల్ని తవ్వారో దాన్ని గమనించండి.
2 paruru Ibrahim wuonu kod Sara mane onywolou. Ne en mana ngʼat achiel kende kane aluonge kendo nagwedhe mi aloke oganda maduongʼ.
౨మీ తండ్రి అబ్రాహామును, మిమ్మల్ని కనిన శారాను గమనించండి. అతడు ఒంటరిగా ఉన్నప్పుడు నేను అతన్ని పిలిచాను. అతన్ని దీవించి అనేకమందిగా చేశాను.
3 Jehova Nyasaye biro hoyo chuny Sayun adier; kendo obiro bedo gi kech kuom kuondene mokethore; enolok kuondene motimo ongoro chal ka Eden, kendo kuondene modongʼ gunda chal ka puoth Jehova Nyasaye. Mor gi ilo kaachiel gi erokamano gi wer mamit noyud kuome.
౩యెహోవా సీయోనును ఆదరిస్తాడు. పాడైన దాని స్థలాలన్నిటినీ ఆయన ఆదరిస్తాడు. దాని అరణ్య ప్రదేశాన్ని ఏదెనులాగా చేశాడు. దాని ఎడారి భూములు యెహోవా తోటలాగా చేస్తున్నాడు. దానిలో ఆనందం, సంతోషం, కృతజ్ఞత, సంగీతనాదం, ఉంటాయి.
4 Winjauru un joga, chikuru itu un ogandana: Abiro golo chik kendo bucha makare nobed ler ne ogendini.
౪నా ప్రజలారా, నా మీద దృష్టి పెట్టండి. నా మాట వినండి! నేనొక ఆజ్ఞ జారీ చేస్తాను. రాజ్యాలకు వెలుగుగా నా న్యాయాన్ని ఉంచుతాను.
5 Adiera mara sudo machiegni piyo, warruokna chiegni, kendo abiro ngʼado bura makare ne ogendini. Joma odak e dho nembe biro ngʼiya ka gin gi geno ni abiro resogi gi tekona.
౫నా నీతి దగ్గరగా ఉంది. నా విడుదల బయలుదేరుతుంది. నా చెయ్యి రాజ్యాలను శిక్షిస్తుంది. ద్వీపాల్లో ఉండేవాళ్ళు నా కోసం ఎదురు చూస్తారు. వాళ్ళు నా చేతి వైపు ఆశతో చూస్తారు.
6 Tingʼ wangʼi malo ingʼi polo, bende rang piny gie polo, nikech polo nolal nono mana ka iro, to piny bende biro ti mana ka law kendo oganda modak e iye notho mana ka lwangʼni. To resruok makelo nosiki nyaka chiengʼ kendo adiera mara ok norum.
౬ఆకాశం వైపు మీ కళ్ళు ఎత్తండి. కిందున్న భూమిని చూడండి. అంతరిక్షం, పొగలాగా కనిపించకుండా పోతుంది. భూమి బట్టలాగా మాసిపోతుంది. దాని నివాసులు ఈగల్లాగా చస్తారు. అయితే నా రక్షణ ఎప్పటికీ ఉంటుంది. నా నీతికి అంతం ఉండదు.
7 Winjauru un joma ongʼeyo tim makare, un oganda mondiko chikena e chunyu: Kik uluor weche midiro mag dhano kata luoro ayany mag ji.
౭సరైనది అంటే ఏంటో తెలిసిన మీరు నా మాట వినండి. నా చట్టాన్ని మీ హృదయంలో ఉంచుకున్న మీరు, వినండి. మనుషుల నిందకు భయపడవద్దు. వారి దూషణకు దిగులుపడవద్దు.
8 Nimar olwenda biro chamogi duto ka law; kendo kudni nochamgi mana ka yie rombe. To adiera mara nosiki manyaka chiengʼ, kendo resruok makelo ok norum e kind tienge gi tienge.
౮చిమ్మెట బట్టలను కొరికేసినట్టు వారిని కొరికేస్తుంది. పురుగు, బొచ్చును కొరికేసినట్టు వారిని కొరికేస్తుంది. అయితే నా నీతి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. నా రక్షణ తరతరాలుంటుంది.
9 Aa malo, Aa malo! Jiw badi motegno, yaye Jehova Nyasaye; aa malo kendo ijiwri, mana kaka ne ijiwori chon e ndalo mokadho. Donge in ema nitieko ondiek nam miluongo ni Rahab, mingʼado matindo tindo?
౯యెహోవా హస్తమా లే! బలం ధరించుకో. పూర్వకాలంలో పురాతన తరాల్లో లేచినట్టు లే. భయంకరమైన సముద్ర జంతువును నరికివేసింది నువ్వే గదా? డ్రాగన్ను పొడిచేసింది నువ్వే గదా?
10 Donge in ema nomiyo nam oduono, ma gin pige mano chokore kuonde matut, kendo niloso yo e kind nam matut mondo joma ne ireso ongʼadi kadhi loka cha?
౧౦చాలా లోతైన నీళ్లున్న సముద్రాన్ని ఇంకిపోయేలా చేసింది నువ్వే గదా? విడుదల పొందినవాళ్ళు దాటిపోయేలా సముద్ర లోతుల్లో దారి చేసింది నువ్వే గదా?
11 Joma Jehova Nyasaye osereso nodwogi. Ginidonji e dala Sayun ka giwer; mor mochwere nobed kuomgi. Ginibed gi mor kod ilo, kendo kuyo gi parruok nolal nono kuomgi.
౧౧యెహోవా విమోచించినవారు సంగీతనాదంతో సీయోనుకు తిరిగి వస్తారు. వారి తలలమీద ఎప్పటికీ నిలిచే సంతోషం ఉంటుంది. సంతోషానందాలు వారికి నిండుగా ఉంటాయి. దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోతాయి.
12 “An, kendo en An e Jal mahoyo chunyu. Angʼo momiyo uluoro yawuot dhano adhana matho, kendo maner mana ka lum,
౧౨నేను, నేనే మిమ్మల్ని ఓదారుస్తాను. చనిపోయే మనుషులకు, గడ్డిలాంటి మనుషులకు మీరెందుకు భయపడతారు?
13 momiyo wiwu owil gi Jehova Nyasaye ma Jachwechu, Jal mane oyaro polo kendo oketo mise mar piny, momiyo udak gi kihondko pile, nikech kum muyudo kuom ngʼama sandou, kendo oikore mar tiekou. Jal masandouno, ere gima geroneno ditim?
౧౩ఆకాశాలను పరచి భూమి పునాదులు వేసిన మీ సృష్టికర్త అయిన యెహోవాను ఎందుకు మరచిపోతున్నారు? బాధించేవాడు ఎంతో కోపంతో మిమ్మల్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరు ప్రతిరోజూ నిరంతర భయంతో ఉన్నారు. బాధించేవాడి కోపం ఏమయింది?
14 Joma ni e twech ma luoro omako ibiro gony machiegni; ok ginitho e kuondegi mag twech kendo ok ginichand chiemo.
౧౪కుంగిపోయిన వారిని యెహోవా త్వరగా విడుదల చేస్తాడు. అతడు గోతిలోకి పోడు. చావడు. అతనికి తిండి లేకుండా పోదు.
15 Nimar an Jehova Nyasaye ma Nyasachi mamiyo Nam gingore mi apaka wuo, Jehova Nyasaye Maratego e nyinge.
౧౫నేను యెహోవాను. నీ దేవుణ్ణి. సముద్రపు అలలు ఘోషించేలా దాన్ని రేపుతాను. నేను సేనల ప్రభువు యెహోవాను.
16 Aseketo wechena e dhogi kendo aumi gi tipo mar lweta, an ema ne ayaro polo maketo kare, mi aketo mise mar piny kendo awachone jo-Sayun ni, ‘Un e joga.’”
౧౬నేను ఆకాశాలను పరచడానికీ భూమికి పునాదులు వేయడానికీ “నువ్వే నా ప్రజ” అని సీయోనుతో చెప్పడానికీ నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పాను.
17 Aa malo, Aa malo! Chiew, yaye Jerusalem, in misemetho e kikombe mar mirima mager, moa e lwet Jehova Nyasaye, kendo isemadho kikombe mamero ji milungʼo nyaka duro.
౧౭యెరూషలేమా! లే. లేచి నిలబడు. యెహోవా చేతినుంచి కోపంతో నిండిన పాత్రను తీసుకుని తాగినదానా! నువ్వు పాత్రలోనిదంతా తాగావు. తూలేలా తాగావు.
18 Kuom yawuowi duto mane onywolo onge moro amora mane nyalo taye kata mane nyalo telone komako lwete.
౧౮ఆమె కనిన కొడుకులందరిలో ఆమెకు దారి చూపేవాడు ఎవడూ లేడు. ఆమె పెంచిన కొడుకులందరిలో ఆమె చెయ్యి పట్టుకునే వాడెవడూ లేడు.
19 Masiche moluwore osemaki ma en kethruok kod tieki; kech kod ligangla, en ngʼa madihoyi kata duogo chunyi.
౧౯రెండు విపత్తులు నీ మీదికి వచ్చాయి. నీతో కలిసి ఎవరు ఏడుస్తారు? ధ్వంసం, నాశనం, కరువు, కత్తి నీ మీదికి వచ్చాయి. నిన్నెవరు ఓదారుస్తారు?
20 Yawuoti osepodho, giriere piny e yore mana ka mwanda mogengʼne ei obadho. Giyudo kum mager moa kuom Jehova Nyasaye kendo chwat mar Nyasache.
౨౦నీ కొడుకులు మూర్ఛపోయారు. దుప్పి వలలో చిక్కుపడినట్టు, ప్రతి వీధిలో పడియున్నారు. యెహోవా కోపంతో నీ దేవుని గద్దింపుతో వారు నిండిపోయారు.
21 Kuom mano winj ma, in miseyudo masira midoko ngʼama omer to ok gi kongʼo.
౨౧అయితే ద్రాక్షమద్యం లేకుండానే మత్తుగా ఉండి బాధపడినదానా, ఈ మాట విను.
22 Ma e gima Jehova Nyasaye ma Nyasachi Manyalo Gik Moko Duto, ma en Nyasachi machwako joge e bura wacho, Ne, asegolo oko e lweti kikombe mane miyo ithembo, bende ok inichak imethi e kikombe mar mirimba kendo.
౨౨నీ యెహోవా ప్రభువు తన ప్రజల పక్షాన వాదించే నీ దేవుడు ఇలా చెబుతున్నాడు, “ఇదిగో, నువ్వు తూలేలా చేసే పాత్రను నా కోపంతో నిండిన ఆ పాత్రను నీ చేతిలోనుంచి తీసివేశాను. నీవది మళ్ళీ తాగవు.
23 Anaket kikombe e lwet joma sandou mane wacho ni, “Nind piny mondo wawuoth kuomi. Kendo niloko die ngʼeyi ka yo miwuothoe.”
౨౩నిన్ను బాధించేవాళ్ళ చేతిలో దాన్ని పెడతాను. ‘మేము నీ మీద నడిచిపోతాం. సాష్టాంగ పడు’ అని వాళ్ళు నీతో చెబితే నువ్వు నీ వీపును దాటే వారికి దారిగా చేసి నేలకు దాన్ని వంచావు గదా.”