< Jo-Hibrania 6 >

1 Kuom mano koro waweuru puonj michakogo ngʼeyo wach Kristo, to wadhiuru nyime mondo wadok joma otegno. Ok owinjore mondo wachak puonjou manyien weche michakogo bedo ja-Kristo, kaka lokruok weyo timbe matero ji e tho to gi yie kuom Nyasaye;
కాబట్టి క్రీస్తు సందేశం గురించి ప్రారంభంలో మనం విన్న అంశాలను వదలి, మరింత పరిణతి సాధించే దిశగా సాగిపోదాం. నిర్జీవ క్రియల కోసం పశ్చాత్తాప పడటమూ, దేవునిపై విశ్వాసమూ,
2 kod puonj kuom kit batiso mopogore opogore, kata kuom keto lwedo ewi ji, kata kuom wach chier aa kuom joma otho, kata kuom bura mabiro. (aiōnios g166)
బాప్తీసాలూ, తలపై చేతులుంచడమూ, చనిపోయినవారు పునర్జీవితులు కావడమూ, నిత్య శిక్షా వంటి ప్రాథమిక అంశాలపై మళ్ళీ పునాది వేయకుండా ముందుకు సాగుదాం. (aiōnios g166)
3 To wabiro timo kamano, ka Nyasaye oyie.
ఒకవేళ దేవుడు అనుమతిస్తే అలా చేస్తాం.
4 Nikech jomaler mar Nyasaye oserienynegi mi obilo mich mar polo kendo obedo e lalruok achiel gi Roho Maler;
5 joma osebilo ber mar Wach Nyasaye, mi ongʼeyo teko mar piny mabiro, (aiōn g165)
తమ జీవితాల్లో ఒకసారి వెలుగును పొందిన వారు, పరలోక వరాన్ని అనుభవించినవారు, పరిశుద్ధాత్మలో భాగం పొందినవారు దేవుని శుభవాక్కునూ, రాబోయే కాలం తాలూకు శక్తులనూ రుచి చూసిన వారు ఒకవేళ మార్గం విడిచి తప్పిపోతే వారిని తిరిగి పశ్చాత్తాప పడేలా చేయడం అసాధ్యం. (aiōn g165)
6 kopodho moweyo yie margi, to ok nyal konygi mi gilokre kendo, nikech gikelo chandruok kuomgi giwegi kuom guro Wuod Nyasaye e msalaba nyadiriyo, ka gimiyo ji chaye ratiro.
ఎందుకంటే దేవుని కుమారుణ్ణి వారే మళ్ళీ సిలువ వేస్తూ ఆయనను బహిరంగంగా అపహాస్యం చేస్తున్నారు.
7 Lowo ma mwonyo pi koth mochwe kuome kendo machiego cham manyalo konyo joma opure, ema yudo gweth Nyasaye.
ఇది ఎలాగంటే, నేల తరచుగా తనపై కురిసే వాన నీటిలో తడిసి తనను దున్నిన రైతులకు ప్రయోజనకరమైన పంటలనిస్తూ దేవుని దీవెనలు పొందుతుంది.
8 To ka bangʼ yudo koth maber to ochiego mana kuthe gi buya to oonge tich, kendo ochiegni yudo kwongʼ. Giko ibiro wangʼe e mach.
అయితే ముళ్ళూ, ముళ్ళ పొదలూ ఆ నేలపై మొలిస్తే అది పనికిరానిదై శాపానికి గురి అవుతుంది. తగలబడిపోవడంతో అది అంతం అవుతుంది.
9 Kata wawuoyo kama, osiepewa mwageno, to wan gi gigeno kuomu kuom gik mabeyo moloyo, ma gin olembe mabeyo ma warruok nyago.
ప్రియమైన స్నేహితులారా, మేము ఇలా మాట్లాడుతున్నప్పటికీ మీరింతకంటే మంచి స్థితిలోనే ఉన్నారనీ, రక్షణకు సంబంధించిన విషయాల్లో మంచి స్థితిలోనే ఉన్నారనీ గట్టిగా నమ్ముతున్నాం.
10 Nyasaye en ja-adiera, omiyo wiye ok nyal wil gi tich maru kaachiel gihera musenyiso kukonyo joge, kendo ma pod udhi nyime kutimo.
౧౦దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. పరిశుద్ధులకు మీరు సేవలు చేశారు. చేస్తూనే ఉన్నారు. దేవుని నామాన్ని బట్టి మీరు చూపిన ప్రేమనూ మీ సేవలనూ ఆయన మర్చిపోడు.
11 Wadwaro ni ngʼato ka ngʼato kuomu odhi nyime katimo maber nyaka giko, eka ubed gi ratiro mar yudo gik mugeno yudo.
౧౧మనం దేని కోసం ఎదురు చూస్తున్నామో దాని విషయంలో మీలో ప్రతివాడూ సంపూర్ణ నిశ్చయతతో, శ్రద్ధతో చివరి వరకూ సాగాలని మా అభిలాష.
12 Ok wadwar ni ubed jo-samuoyo to wadwaro ni ulu kit joma yudo gik mosingi nikech giyie kendo gitimo kinda.
౧౨మీరు మందకొడిగా ఉండాలని మేము కోరుకోవడం లేదు. విశ్వాసంతో, సహనంతో, వాగ్దానాలను వారసత్వంగా పొందిన వారిని అనుకరించాలని కోరుకుంటున్నాం.
13 Ka Nyasaye notimo singruok gi Ibrahim to nokwongʼore gi nyinge owuon, nikech ne onge ngʼat maduongʼ mohinge monyalo kwongʼore gi nyinge,
౧౩దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసినప్పుడు, ఆయన కంటే గొప్పవాడు ఎవడూ లేడు కాబట్టి, “నా తోడు” అంటూ ప్రమాణం చేశాడు.
14 nowacho niya, “Abiro gwedhi adier, kendo abiro miyi nyikwayo mangʼeny.”
౧౪“నిన్ను కచ్చితంగా ఆశీర్వదిస్తాను. నీ సంతతిని విస్తారం చేస్తాను” అన్నాడు.
15 Omiyo bangʼe Ibrahim noyudo gima Nyasaye nosingore ni nomiye bangʼ rito gi kinda.
౧౫ఈ విధంగా అబ్రాహాము సహనంతో వేచి ఉన్న తరువాత దేవుడు తనకు వాగ్దానం చేసిన భూమిని పొందాడు.
16 Joma timo singruok kwongʼore gi nying joma oloyogi gi duongʼ, kendo kwongʼruok ma gitimo golo kiawa moro amora e kind joma otimo winjruokgo.
౧౬సాధారణంగా మనుషులు తమ కంటే గొప్పవాడి తోడు అంటూ ప్రమాణం చేస్తారు. వారికున్న ప్రతి వివాదానికీ పరిష్కారం చూపేది ప్రమాణమే.
17 Emomiyo ka Nyasaye ne dwaro lero tiend chenroge ma ok lokre ne joma yudo gweth mag singruok mage, noguro singruokneno gi kwongʼruok.
౧౭వాగ్దానానికి వారసులైన వారికి తన సంకల్పం మార్పు లేనిదని స్పష్టం చేయడానికి దేవుడు ఒట్టు పెట్టుకోవడం ద్వారా తన వాగ్దానానికి హామీ ఇచ్చాడు.
18 Notimo kamano mondo, kuom gik moko ariyo, tiende ni singruok gi kwongʼruok, ma ok nyal lokore kendo ma ok nyal miyo Nyasaye bet ja-miriambo, wayud gweth mogundho, wan mwasetony koro wayudo jip motegno kwamako geno ma wan-go matek.
౧౮అందువల్ల వేటి విషయం దేవుడు అబద్ధం ఆడలేడో, మార్పు లేని ఆ రెండింటి ద్వారా ఆశ్రయం కోరి పరుగు తీసే మన ఎదుట ఉన్న ఆశాభావాన్ని మనం బలంగా పట్టుకోడానికి గట్టి ప్రోత్సాహం ఉండాలని అలా చేశాడు.
19 Genowano osiro chunywa ka loch mogur motegno ma ok yiengni kendo ma gimoro ok nyal donje mi kethi. Odonjo nyaka ei kama ler mar lemo manie tok pasia,
౧౯ఈ ఆశాభావం మన ఆత్మలకు చెక్కుచెదరని, స్థిరమైన లంగరు వలే ఉండి తెర లోపలికి ప్రవేశిస్తుంది.
20 kama Yesu ma nosetelonwa nosedonjoe. Osedoko jadolo maduongʼ manyaka chiengʼ, koluwo kit dolo mar Melkizedek. (aiōn g165)
౨౦మెల్కీసెదెకు క్రమంలో కలకాలం ప్రధాన యాజకుడైన యేసు మన తరపున మనకంటే ముందుగా దానిలో ప్రవేశించాడు. (aiōn g165)

< Jo-Hibrania 6 >