< Chakruok 14 >
1 E kindeno Amrafel ruodh Shinar, Ariok ruodh Elasar, Kedorlaomer ruodh Elam kod Tidal ruodh Goyim
౧షీనారు రాజు అమ్రాపేలు, ఎల్లాసరు రాజు అర్యోకు, ఏలాము రాజు కదొర్లాయోమెరు, గోయీయుల రాజు తిదాలు అనేవారు పాలిస్తున్న రోజుల్లో
2 nodhi kedo gi Bera ruodh Sodom, Birsha ruodh Gomora, Shinab ruodh Adma, Shemeber ruodh Zeboim kod ruodh Bela (ma tiende ni Zoar).
౨ఆ రాజులు సొదొమ రాజు బెరాతో, గొమొర్రా రాజు బిర్షాతో, అద్మా రాజు షినాబుతో, సెబోయీయుల రాజు షెమేబెరుతో, బెల (దీన్ని సోయరు అని కూడా పిలుస్తారు) రాజుతో యుద్ధం చేశారు.
3 Ruodhi abichgi duto noriwo jolwenjgi ne kedo e Holo mar Sidim (miluongo ni Nam chumbi).
౩వీళ్ళందరూ కలిసి సిద్దీము (ఉప్పు సముద్రం) లోయలో ఏకంగా సమకూడారు.
4 Kuom higni apar gariyo negisebedo e bwo loch Kedorlaomer, to e higa mar apar gadek ne gingʼanyo.
౪ఈ రాజులు పన్నెండు సంవత్సరాలు కదొర్లాయోమెరుకు లొంగి ఉన్నారు. పదమూడో సంవత్సరంలో తిరుగుబాటు చేశారు.
5 E higa mar apar gangʼwen, Kedorlaomer kod ruodhi mane oriwore kode nodhi omonjo kendo oloyo jo-Refai man Ashteroth Karnaim, jo-Zuzim e Ham gi jo-Emi man Shave Kiriathaim,
౫పద్నాలుగో సంవత్సరంలో కదొర్లాయోమెరు, అతనితోపాటు ఉన్న రాజులు వచ్చి అష్తారోత్ కర్నాయిములో రెఫాయీయులపై, హాములో జూజీయులపై, షావే కిర్యతాయిము మైదానంలో ఏమీయులపై,
6 kendo jo-Hori manie gode mag Seir, mane ochwe nyaka El-Paran machiegni gi piny motimo ongoro.
౬శేయీరు పర్వత ప్రదేశంలో అరణ్యం వైపుగా ఉన్న ఏల్ పారాను వరకూ ఉన్న హోరీయులపై దాడి చేశారు.
7 Eka negidwogo chien kendo gidhi nyaka En Mishpat (ma tiende ni Kadesh), kendo negikawo piny jo-Amalek duto gi piny jo-Amor manodak Hazazon Tamar.
౭తరువాత మళ్ళీ ఏన్మిష్పతుకు (దీన్ని కాదేషు అనికూడా పిలుస్తారు) వచ్చి అమాలేకీయుల దేశమంతటినీ హససోను తామారులో కాపురం ఉన్న అమోరీయులను కూడా ఓడించారు.
8 Eka ruodh Sodom, ruodh Gomora, ruodh Adma, ruodh Zeboim kod ruodh Bela (ma tiende ni Zoar) nowuok kendo oikore kedo moriedo jolwenjgi e Holo mar Sidim,
౮అప్పుడు సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయీము, బెల (సోయరు) రాజులు బయలుదేరి సిద్దీము లోయలో
9 mondo oked gi Kedorlaomer ruodh Elam, Tidal ruodh Goyim, Amrafel ruodh Shinar kod Ariok ruodh Elasar mi ruodhi angʼwen-go nokedo gi ruodhi abich.
౯ఏలాము రాజు కదొర్లాయోమెరు, గోయీయుల రాజు తిదాలు, షీనారు రాజు అమ్రాపేలు, ఎల్లాసరు రాజు అర్యోకు అనే నలుగురితో ఈ ఐదుగురు రాజులు యుద్ధం చేశారు.
10 Holo mar Sidim nopongʼ gi buche mag chwodho, kendo kane ruodhi mag Sodom kod Gomora ringo, moko nopodho e buchego to moko noringo otony e gode.
౧౦ఆ సిద్దీము లోయలో తారు బంక గుంటలు ఎక్కువగా ఉన్నాయి. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడ్డారు. మిగిలిన వాళ్ళు కొండలకు పారిపోయారు.
11 Ruodhi angʼwen-go noyako gik moko duto mag Sodom kod Gomora kod chiembgi duto mi gidhi.
౧౧అప్పుడు వాళ్ళు సొదొమ గొమొర్రాల ఆస్తి అంతటినీ వాళ్ళ భోజన పదార్ధాలన్నిటినీ దోచుకున్నారు.
12 Bende negikawo Lut, wuod owadgi Abram kod mwandune duto nikech noyudo odak Sodom.
౧౨ఇంకా అబ్రాము సోదరుడి కొడుకు లోతు సొదొమలో కాపురం ఉన్నాడు గనుక అతణ్ణి, అతని ఆస్తిని కూడా దోచుకుని తీసుకుపోయారు.
13 Ngʼat achiel mane oyudo otony nobiro kendo onyiso Abram ja-Hibrania wachni. E ndalogo Abram nodak e tiend yiende madongo mag Mamre ja-Amor mane omin Eshkol kod Aner, osiepe Abram.
౧౩ఒకడు తప్పించుకుని వచ్చి హెబ్రీయుడైన అబ్రాముకు ఆ సంగతి తెలియజేశాడు. ఆ సమయంలో అతడు ఎష్కోలు, ఆనేరుల సోదరుడు మమ్రే అనే అమోరీయునికి చెందిన సింధూర వృక్షాల దగ్గర కాపురం ఉన్నాడు. వీళ్ళు అబ్రాముతో పరస్పర సహాయం కోసం ఒప్పందం చేసుకున్నవాళ్ళు.
14 Kane Abram owinjo ni watne oseter e twech, noluongo jotichge machwo motiegore mia adek gapar gaboro kendo olawogi nyaka Dan.
౧౪తన బంధువు శత్రువుల స్వాధీనంలో ఉన్నాడని అబ్రాము విని, తన ఇంట్లో పుట్టి, సుశిక్షితులైన మూడువందల పద్దెనిమిది మందిని వెంటబెట్టుకుని వెళ్లి దాను వరకూ ఆ రాజులను తరిమాడు.
15 Gotieno Abram nopogo jotichnego e migepe mondo omonj ruodhigo kendo negiriembogi mi gilawogi nyaka Hoba, ma yo nyandwat mar Damaski.
౧౫రాత్రి సమయంలో అతడు తన సేవకులను గుంపులుగా చేశాక వాళ్ళంతా అ రాజులపై దాడి చేసి, దమస్కుకు ఎడమవైపు ఉన్న హోబా వరకూ తరిమాడు.
16 Abram nodhi moomo gik moko duto mane joka odhigo kendo noreso Lut wuod owadgi kod mwandune duto kaachiel gi mon kod ji mamoko.
౧౬అతడు ఆస్తి మొత్తాన్ని, అతని బంధువు లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను వెనక్కి తీసుకు వచ్చాడు.
17 Bangʼ ka Abram noduogo koseloyo Kedorlaomer kod ruodhi mane oriwore kode, ruodh Sodom nobiro mondo orom kode ei Holo mar Shave (ma tiende ni Holo mar Ruoth).
౧౭అతడు కదొర్లాయోమెరును, అతనితో ఉన్న రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు, సొదొమ రాజు అతన్ని ఎదుర్కోడానికి రాజు లోయ అనే షావే లోయ వరకూ బయలుదేరి వచ్చాడు.
18 Eka Melkizedek ruodh Salem nokelo makati gi divai. Ne en jadolo mar Nyasaye Man Malo Moloyo,
౧౮అంతేగాక షాలేము రాజు మెల్కీసెదెకు రొట్టె, ద్రాక్షారసం తీసుకువచ్చాడు. అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు.
19 kendo nogwedho Abram kowacho niya, “Nyasaye Man Malo Moloyo, Jachwech polo kod piny ogwedhi, in Abram.
౧౯అతడు అబ్రామును ఆశీర్వదించి “ఆకాశానికి భూమికి సృష్టికర్త, సర్వోన్నతుడు అయిన దేవుని వలన అబ్రాముకు ఆశీర్వాదం కలుగు గాక.
20 Kendo ogwedh Nying Nyasaye Man Malo Moloyo mane oketo wasiki e lweti.” Eka Abram nomiye achiel kuom apar mar gik moko duto.
౨౦నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవునికి స్తుతి కలుగు గాక” అని చెప్పాడు. అప్పుడు అబ్రాము అతనికి తనకున్న దానిలో పదవ వంతు ఇచ్చాడు.
21 Ruodh Sodom nowacho ne Abram niya, “Miya ji to idongʼ gi gik moko duto.”
౨౧సొదొమ రాజు “మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నువ్వే తీసుకో” అని అబ్రాముతో అన్నాడు.
22 To Abram nowacho ne ruodh Sodom, “Asetingʼo lweta ne Jehova Nyasaye, ma en Nyasaye Man Malo Moloyo, Jachwech polo gi piny kendo asekwongʼora
౨౨అబ్రాము “దేవుడైన యెహోవా అబ్రామును ధనవంతుణ్ణి చేశాను, అని నువ్వు చెప్పకుండా ఉండేలా, ఒక్క నూలు పోగైనా, చెప్పుల పట్టీ అయినా నీ వాటిలోనుండి తీసుకోను.
23 ni ok nakaw giri moro, kata mana tol kata pat kira, mondo kik chiengʼ moro iwachi ni, ‘An ema ne amiyo Abram obedo jamoko.’
౨౩ఆకాశానికి భూమికి సృష్టికర్త, సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా దగ్గర నా చెయ్యి ఎత్తి ఒట్టు పెట్టుకున్నాను.
24 Ok abi kawo gimoro to mana ma joga osechamo kod pok ma joga kaka Aner, Eshkol kod Mamre onego oyudi. Onego giyud pokgi.”
౨౪ఈ యువకులు తిన్నది గాక, నాతోపాటు వచ్చిన ఆనేరు, ఎష్కోలు, మమ్రే అనే వాళ్లకు ఏ వాటా రావాలో ఆ వాటాలు మాత్రం వాళ్ళను తీసుకోనివ్వు” అని సొదొమ రాజుతో చెప్పాడు.