< Ezra 10 >
1 Kane Ezra lemo kendo hulo richo, koywak kendo kongʼielore piny e nyim od Nyasaye, oganda maduongʼ mar jo-Israel; chwo, mon kod nyithindo nochokore kolwore. Gin bende ne giywak malit.
౧ఎజ్రా దేవుని మందిరం ముందు సాష్టాంగపడి విలపిస్తూ, పాపం ఒప్పుకొంటూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలు పురుషులు, స్త్రీలు, పిన్నలూ గుంపులు గుంపులుగా అతని దగ్గరికి వచ్చి గట్టిగా రోదించారు.
2 Eka Shekania wuod Jehiel, achiel kuom nyikwa Elam, nowachone Ezra niya, “Ok wasebedo jo-ratiro ni Nyasachwa kuom kendo nyiri ma ok jo-Yahudi. To kata ka wasetimo kamano, to jo-Israel pod nigi geno.
౨అప్పుడు ఏలాము మనుమడు, యెహీయేలు కొడుకు షెకన్యా ఎజ్రాతో ఇలా అన్నాడు. “మేము దేశంలో ఉన్న పరాయి దేశపు స్త్రీలను పెళ్లి చేసుకోవడం ద్వారా మా దేవుని దృష్టికి పాపం చేశాం. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీయులు తమ ప్రవర్తన మార్చుకొంటారన్న నిరీక్షణ ఉంది.
3 Koro we walos singo e nyim Nyasachwa mondo oriemb mon-gi kod nyithindgi duto, kaluwore gi ngʼado rieko mar Ruoth Nyasachwa kod jogo moluoro chike mag Nyasachwa. We time kaluwore gi Chik.
౩ఈ పని ధర్మశాస్త్ర నియమం ప్రకారం జరిగేలా నాయకుడవైన నువ్వు, దేవుడంటే భయపడేవారూ చెబుతున్నట్టు మేము పెళ్లి చేసుకొన్న భార్యలను, వారికి పుట్టిన పిల్లలను విడిచిపెట్టి, పంపివేస్తామని మన దేవుని పేరట ఒట్టు పెట్టుకుంటాం.
4 Chungʼ malo; wachni ni e lweti. Wabiro konyi; omiyo jiwri kendo itime.”
౪ఈ పని నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ధైర్యంగా ఈ పని మొదలు పెట్టు. మేమంతా నీతోనే ఉంటాం.”
5 Omiyo Ezra noa malo mi oketo jonabi gi jo-Lawi ma jotelo kod jo-Israel duto e bwo kwongʼruok mondo otim gima ne osepar. Omiyo negitimo kwongʼruokno.
౫ఎజ్రా లేచి, ముఖ్య యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలీయులంతా ఆ మాట ప్రకారమే నడుచుకొంటామని వారి చేత ప్రమాణం చేయించాడు. వారంతా ప్రమాణం చేసిన తరువాత,
6 Eka Ezra noa e nyim od Nyasaye mi odhi e agoch Jehohanan wuod Eliashib. E sa mane en kanyo, ne ok ochamo chiemo kendo ne ok omodho pi, nikech nodhi nyime kokuyo kuom bedo maonge ratiro mar joma noa e twech.
౬ఎజ్రా దేవుని మందిరం ఎదుట నుండి లేచి, ఎల్యాషీబు కొడుకు యోహానాను గదిలోకి వెళ్ళాడు. అక్కడ అతడు చెరకు లోనైన వారి అపరాధాలను బట్టి రోదిస్తూ, భోజనం చేయకుండా, నీళ్ళు తాగకుండా ఉండిపోయాడు.
7 Eka nogo milome e Juda kod Jerusalem ni jogo duto mane oa e twech mondo ochokre Jerusalem.
౭చెరనుండి తిరిగి వచ్చిన వారంతా యెరూషలేములో తప్పక సమకూడాలని యూదా దేశమంతటా, యెరూషలేము పట్టణంలో దండోరా వేశారు.
8 Ngʼato angʼata ma ok onenore e thuolo mar ndalo adek biro lalo gige duto, kaluwore gi gima jotelo kod jodongo ongʼado, kendo enodire oko mar chokruok mar joma noa e twech.
౮ప్రధానులు, పెద్దలు నిర్ణయించినట్టుగా మూడు రోజుల్లోగా ఎవరైనా రాకపోతే వారి ఆస్తులు జప్తు చేసి, వాటిని దేవుని మందిరపు ఆస్తిగా ప్రకటించాలని, వాళ్ళను సమాజం నుండి బహిష్కరించాలని తీర్మానం చేశారు.
9 Kuom thuolo mar ndalo adek joma chwo moa Juda kod Benjamin duto nochokore Jerusalem. To e odiechiengʼ mar piero ariyo mar dwe mar ochiko, ji nobet e laru manie nyim od Nyasaye, ka gionge gi kwe nikech wachno kendo nikech koth ne goyogi.
౯యూదా, బెన్యామీను గోత్రాల వారంతా మూడు రోజుల్లోగా యెరూషలేము చేరుకున్నారు. తొమ్మిదో నెల 20 వ రోజున ప్రజలంతా దేవుని మందిరం వీధిలో వర్షంలో తడుస్తూ కూర్చున్నారు. జరగబోయేది తలంచుకుని భయంతో వణికిపోతున్నారు.
10 Eka Ezra ma jadolo noa malo kendo owachonegi niya, “Usebedo joma ok nikare; usekendo mond dhoudi mamoko, mumedo ketho mar jo-Israel.
౧౦అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇలా అన్నాడు. “మీరు ఆజ్ఞను అతిక్రమించి పరాయి దేశపు స్త్రీలను పెళ్లి చేసుకుని మన జాతి పాపాన్ని ఇంకా అధికం చేశారు.
11 Koro miuru Jehova Nyasaye, ma Nyasach kwereu duongʼ, kendo utim dwarone. Thegreuru gi joma ni butu kod mondeu mag dhoudi mamoko.”
౧౧కాబట్టి ఇప్పుడు మీ తండ్రుల దేవుడైన యెహోవా ముందు మీ పాపాలను ఒప్పుకుని, ఆయనకు నచ్చే విధంగా ప్రవర్తించడానికి సిద్ధపడి, పరాయి దేశపు స్త్రీలను విడిచిపెట్టి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకుని ఉండండి.”
12 Chokruok mar ogandani duto nodwoko gi dwol maduongʼ niya, “In kare! Nyaka watim kaka iwacho.
౧౨అప్పుడు అక్కడ సమకూడిన వారంతా బిగ్గరగా ఇలా అన్నారు. “నువ్వు చెప్పినట్టుగా మేము తప్పకుండా చేయవలసి ఉంది.
13 To nitiere ji mangʼeny kae kendo en kinde koth, omiyo ok wanyal chungʼ oko. Ewi mano wachni ok nyal losi gi ndalo achiel kata ariyo, nikech wasetimo richo maduongʼ e gini.
౧౩అయితే ఇక్కడ జనసమూహం ఎక్కువగా ఉంది. ఇప్పుడు విపరీతంగా వర్షం కురుస్తున్నందువల్ల మేము బయట నిలబడలేకపోతున్నాం. ఈ పని ఒకటి రెండు రోజుల్లో జరిగేది కాదు. ఈ విషయంలో మాలో చాలామందిమి పాపం చేశాం. కాబట్టి అన్ని సమాజాల్లోని పెద్దలందరికీ ఈ పని కేటాయించండి.
14 We jotendwa otime e lo chokruokni duto. Eka we ngʼato ka ngʼato mosekendo nyi joma ok jo-Yahudi obi e sa moketi, kaachiel gi jodongo kod jongʼad bura moa dala ka dala, nyaka mirima mager mar Nyasachwa kuom wachni ogol kuomwa.”
౧౪మన పట్టణాల్లో ఎవరెవరు పరాయి దేశపు స్త్రీలను పెళ్లి చేసుకొన్నారో వాళ్ళంతా గడువులోగా రావాలి. ఈ విషయంలో మాపై దేవునికి వచ్చిన తీవ్రమైన కోపం తొలగిపోయేలా ప్రతి పట్టణాల్లోని పెద్దలు, న్యాయాధిపతులు వాళ్ళతో ఉండాలి.”
15 Ji duto noyie timo kamano, makmana Jonathan wuod Asahel gi Jazeya wuod Tikva, koriwe lwedo gi Meshulam kod Shabethai ja-Lawi, ema notamore.
౧౫ఈ పని జరిగించడానికి అశాహేలు కొడుకు యోనాతాను, తిక్వా కొడుకు యహజ్యా, వాళ్లకు సహాయకులుగా మెషుల్లాము, లేవీ గోత్రికుడు షబ్బెతైలను నియమించారు.
16 Omiyo joma noa e twech notimo kaka nochan. Ezra jadolo noyiero chwo mane jotend dhoudi, achiel koa e migawo mar dhoot ka dhoot, kendo giduto noluongogi gi nying-gi. E odiechiengʼ mokwongo mar dwe mar apar negibedo piny mondo ginon wechegi,
౧౬చెరనుంచి వచ్చినవారు ఆ క్రమం ప్రకారం చేశారు. యాజకుడైన ఎజ్రా పెద్దల్లో కొందరు ప్రధానులును వారి తండ్రుల ఇంటి పేర్ల ప్రకారం ఎన్నుకున్నాడు. పదవ నెల మొదటి రోజున ఈ విషయాన్ని గూర్చి పరిశీలించడం మొదలుపెట్టారు.
17 kendo kochopo odiechiengʼ mokwongo mar dwe mokwongo negitieko gi chwo mane okendo mon moa e dhoudi mamoko.
౧౭మొదటి నెల మొదటి రోజునాటికి పరాయి దేశపు స్త్రీలను పెళ్లి చేసికొన్న వారందరి వ్యవహారం పరిష్కారం చేశారు.
18 Kuom nyikwa jodolo, magi ema nokendo nyi joma ok jo-Yahudi. Koa e nyikwa Jeshua wuod Jozadak, kod owetene: Maseya, Eliezer, Jarib gi Gedalia.
౧౮యాజకుల వంశంలో పరాయి దేశపు స్త్రీలను పెళ్లి చేసుకొన్న వారు ఎవరంటే, యోజాదాకు కొడుకు యేషూవ వంశంలో, అతని సహోదరుల్లో మయశేయా, ఎలీయెజెరు, యారీబు, గెదల్యా.
19 Negitingʼo bedegi kaka singruok mar riembo mondegi, kendo kuom ketho mag-gi negichiwo im ngʼato ka ngʼato koa e kweth kaka misango mar pwodhruok e ketho.
౧౯వీరు తమ తమ భార్యలను పంపివేస్తామని ప్రమాణం చేశారు. వారు అపరాధులు కావడంవల్ల తమ అపరాధం విషయంలో మందలోనుండి ఒక పొట్టేలును సమర్పించారు.
20 Koa e nyikwa Imer: Hanani gi Zebadia.
౨౦ఇమ్మేరు వంశంలో హనానీ, జెబద్యా.
21 Koa e nyikwa Harim: Maseya, Elija, Shemaya, Jehiel gi Uzia.
౨౧హారీం వంశంలో మయశేయా, ఏలీయా, షెమయా, యెహీయేలు, ఉజ్జియా.
22 Koa e nyikwa Pashur: Elioenai, Maseya, Ishmael, Nethanel, Jozabad gi Elasa.
౨౨పషూరు వంశంలో ఎల్యో యేనై, మయశేయా, ఇష్మాయేలు, నెతనేలు, యోజాబాదు, ఎల్యాశా.
23 Kuom jo-Lawi ne gin: Jozabad, Shimei, Kelaya (tiende ni Kelita), Pethahia, Juda gi Eliezer.
౨౩లేవీ గోత్రం నుండి యోజాబాదు, షిమీ కెలిథా అనే పేరున్న కెలాయా, పెతహయా, యూదా, ఎలీయెజెరు.
24 Koa kuom jower: Eliashib. Koa kuom jorit dhorangach: Shalum, Telem gi Uri.
౨౪గాయక బృందానికి చెందిన ఎల్యాషీబు, ద్వారపాలకుల నుండి షల్లూము, తెలెము, ఊరి అనేవాళ్ళు.
25 To kuom jo-Israel mamoko: Koa kuom nyikwa Parosh: Ramia, Izia, Malkija, Mijamin, Eliazar, Malkija gi Benaya.
౨౫ఇశ్రాయేలీయుల్లో పరోషు వంశం నుండి రమ్యా, యిజ్జీయా, మల్కీయా, మీయామిను, ఎలియేజరు, మల్కీయా, బెనాయా.
26 Koa kuom nyikwa Elam: Matania, Zekaria, Jehiel, Abdi, Jeremoth gi Elija.
౨౬ఏలాము వంశంలో మత్తన్యా, జెకర్యా, యెహీయేలు, అబ్దీ, యెరేమోతు, ఏలీయా.
27 Koa kuom nyikwa Zatu: Elioenai, Eliashib, Matania, Jeremoth, Zabad gi Aziza.
౨౭జత్తూ వంశంలో ఎల్యోయేనై, ఎల్యాషీబు, మత్తన్యా, యెరేమోతు, జాబాదు, అజీజా.
28 Koa kuom nyikwa Bebai: Jehohanan, Hanania, Zabai gi Athlai.
౨౮బేబై వంశంలో యెహోహానాను, హనన్యా, జబ్బయి, అత్లాయి.
29 Koa kuom nyikwa Bani: Meshulam, Maluk, Adaya, Jashub, Shil gi Jeremoth.
౨౯బానీ వంశంలో మెషుల్లాము, మల్లూకు, అదాయా, యాషూబు, షెయాలు, రామోతు.
30 Koa kuom nyikwa Pahath-Moab: Adna, Kelal, Benaya, Maseya, Matania, Bezalel, Binui gi Manase.
౩౦పహత్మోయాబు వంశంలో అద్నా, కెలాలు, బెనాయా, మయశేయా, మత్తన్యా, బెసలేలు, బిన్నూయి, మనష్షే.
31 Koa kuom nyikwa Harim: Eliezer, Ishija, Malkija, Shemaya, Shimeon,
౩౧హారిము వంశంలో ఎలీయెజెరు, ఇష్షీయా, మల్కీయా, షెమయా.
32 Benjamin, Maluk gi Shemaria.
౩౨షిమ్యోను, బెన్యామీను, మల్లూకు, షెమర్యా,
33 Koa kuom nyikwa Hashum: Matenai, Matata, Zabad, Elifelet, Jeremai, Manase gi Shimei.
౩౩హాషుము వంశంలో మత్తెనై, మత్తత్తా, జాబాదు, ఎలీపేలెటు, యెరేమై, మనష్షే, షిమీ.
34 Koa kuom nyikwa Bani: Madai, Amram, Uel,
౩౪బానీ వంశంలో మయదై, అమ్రాము, ఊయేలు.
35 Benaya, Bedeya, Keluhi,
౩౫బెనాయా, బేద్యా, కెలూహు.
36 Vania, Meremoth, Eliashib,
౩౬వన్యా, మెరేమోతు, ఎల్యాషీబు.
37 Matania, Matenai gi Jasu.
౩౭మత్తన్యా, మత్తెనై, యహశావు.
38 Koa kuom nyikwa Binui: Shimei,
౩౮బానీ, బిన్నూయి, షిమీ.
39 Shelemia, Nathan, Adaya,
౩౯షిలెమ్యా, నాతాను, అదాయా.
40 Maknadebai, Shashai, Sharai,
౪౦మక్నద్బయి, షామై, షారాయి.
41 Azarel, Shelemia, Shemaria,
౪౧అజరేలు, షెలెమ్యా, షెమర్యా.
42 Shalum, Amaria gi Josef.
౪౨షల్లూము, అమర్యా, యోసేపు.
43 Koa kuom nyikwa Nebo: Jeyel, Matithia, Zabad, Zebina, Jadai, Joel gi Benaya.
౪౩నెబో వంశానికి చెందిన యెహీయేలు, మత్తిత్యా, జాబాదు, జెబీనా, యద్దయి, యోవేలు, బెనాయా అనేవాళ్ళు.
44 Magi duto nokendo nyi joma ok jo-Yahudi, kendo moko kuomgi nonywolo nyithindo gi mon-gi.
౪౪వీరంతా పరాయి దేశపు స్త్రీలను పెళ్లిళ్ళు చేసుకొన్నవారు. ఈ స్త్రీలలో కొందరు పిల్లలను కూడా కన్నారు. వీరంతా పరాయి దేశపు స్త్రీలను పెళ్లిళ్ళు చేసుకొన్నవారు.